ఒక్క క్షణం

              


                   " ఒక్క క్షణం చాలు ఏదైయినా  జరగడానికి ".


ఈ రోజు ఏమిటో అంత కొత్తగా ఉంది. 

రోజు తనని చూస్తున్న ,మాట్లాడుతున్న కానీ ఈరోజు తను కొత్తగా కనిపిస్తుంది, బహుశా ఈరోజు తను చీర కట్టడంవల్లేమో తెలియదు కానీ తన మాట, తన నవ్వు ,తన చూపు ,తన అలికిడి అంత కొత్తగా ఉంది. 


ఇన్ని రోజులు తను నాతో ఉంటె  స్నేహభావం కలిగేది కానీ ఈరోజు తనని చూస్తుంటే తనపై నాకున్న ప్రేమ తెలుస్తుంది , ఈ ప్రేమ అనే భావన ఏంటో కొత్తగా ఉంది .


అల తనని చూస్తూ నా ప్రేమ తనకి చెప్పడానికి  ఒక్కోఅడుగు ముందుకు వేస్తున్న , అదే సమయంలో అ ఒక్క క్షణం లో అంతా జరిగిపోయింది. 


నా ప్రేమ తనకి చెప్పకుండానే నన్ను ఒదిలి తను వెళ్ళిపోయింది.


ఒక్క క్షణం నేను కొంచం తొందరపడి ఉంటే  తను నన్ను ఒదిలి వెళ్ళిపోయిఉండేది కాదు.


ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసింది నా ప్రాణం తనతో తీసుకు వెళ్ళిపోయింది. 


ఒక్క క్షణం లో నా ప్రేమ పుట్టింది కానీ, 

అదే అ ఒక్క క్షణం లో నా ప్రేమ చనిపోయింది. 


ఈ  క్షణం నా ప్రేమ నాతో లేకపోయిఉండొచ్చు కానీ నా ఊపిరిలో, నా గుండెల్లో , నా అణువణువులో ఉంది.


తను ఇప్పుడు నాతో లేదు అనే మాట కంటే , తాను నాలో ఉంది అనే మాట నాకు ఆనందాన్నిస్తుంది.


తాను గురుతుకుఒచ్చే ఈ ఒక్క క్షణం చాలు ఇంకా వేయి జన్మలైనా బ్రతకాలనిపిస్తుంది.

No comments:

Post a Comment