శివకైలాష్

                 ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళనుండి తపించుకొని ఒక చోటకి చేరుకున్నాను. అ చోటు అంత చీకటిగా ఉంది ఏవేవో శబ్దాలు వినబడుతున్నాయి.


నేను అ శబ్దాలు పటించుకోకుండా ముందుకు వెళ్తున్న అప్పుడే వెనకనుండి నా భుజంపైన ఎవరో చేయివేసినట్టు అనిపించింది.


భయంతో వెనక్కి తిరిగి చూసా అక్కడ ఎవరు లేరు అలాగే ముందుకు వెళ్తుండగా ఒక గది కనిపించింది అ గది తలుపు తెరిచ అప్పుడే నాకు మెలుకువ ఒచ్చింది చూస్తే అది నాకు ఒచ్చిన కల .


ఇంట్లో తిని కూర్చుంటే ఇలంటి  పిచ్చి ఆలోచనలు ,కలలు ఒస్తాయి .


ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా నా పేరు శివ, నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ . కంప్యూటర్ స్పెల్లింగ్ తప్ప అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు. 


ఏదో చదవాలి నాకు ఒక డిగ్రీ ఉండాలి అని  ఇంజనీరింగ్ చదివాను. నేను రాత్రి పడుకున్నాను అంటే ఏదో ఒక కల తప్పక ఒస్తుంది .


అసలు కలలు ఎందుకు ఒస్తాయి అని ఇంటర్నెట్ లో చూసా


 " మనం చేయాలిఅనుకున్నవి చేయలేనప్పుడు అ బాధ మనలో ఉండిపోతుంది . మన దృష్టి ,ఆలోచన అంత మనం చేయాలి అనుకున్న పనిపైన ఉండిపోతుంది . అదే ఆలోచనలతో పడుకుంటాం అల అ ఆలోచన కలలో వివిధరకాలుగా కనిపిస్తుంది " 


ఇలా చాల మంది చాలానే చెప్పారు కానీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కాలేదు. 


చదివింది ఇంజనీరింగ్ అయినా కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా తెలియని నేను ఒకానొక టైం లో ఆవారాగా స్నేహితులతో తిరుగుతు ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని తినమ్మా  పడుకున్నామా తెల్లారిందా ఇదే జరుగుతూ ఉండేది నా జీవితం లో.


కానీ ఒక చిన్న గొడవలో నేను పోలీస్ స్టేషన్ కి వేలాలిసొచ్చింది నా స్నేహితులకి తెలిసిన వారికీ సహాయం కోసం  ఫోన్ చేసా కానీ ఎవరు సహాయపడలేదు అ తర్వాత తెలిసిన లాయర్ ఉంటె అతనకి ఫోన్ చేసి ఎలాగోలా పోలీస్ స్టేషన్ నుండి బయటపడ్డాను అప్పుడు తెలిసింది కష్టం ఒచిన్నపుడు మనకు తోడుగా ఎవరు ఉండరు అని.


అ తర్వాత నేను చిన్న కంపెనీ లో ఉద్యోగం చేస్తూ అందరికి దూరంగా  నా జీవితానికి దగ్గరగా బ్రతుకుతున్న.


రోజు లగే ఈరోజు రోజు కూడా ఆఫీస్ కి బయలుదేరాను బస్ కోసం చూస్తున్న అప్పుడే ఒక పెద్దయిన నా దగ్గరకి ఒచ్చి ఏరా బాగున్నావా అని నన్ను పలకరించారు.


నేను ఆశ్ఛర్యపోయాను ఎవరు మీరు నేను మీకు తెలుసా అని అడిగాను.


నువ్వు మా సూరిగాడి కొడుకు కదా అని అన్నారు.


అప్పుడు నేను నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి నేను ఒక అనాధ నా పేరు శివ అని చెప్పను.


అ పెద్దయిన  అలాగే నన్ను చూస్తూ నువ్వు సూరి కొడుకే అని చెప్పారు నేను కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను.


మళ్ళి అదే కల నాకు ఒచ్చింది నన్ను ఎవరో చంపుతునట్టు నేను తప్పించుకుంటు చీకటి ప్రదేశానికి వెళ్లినట్టు.


నేను అది పట్టించుకోలేదు ఒచ్చింది కల కదా అని ఆఫీస్ కి బయలుదేరాను వెళ్ళేదారిలో నిజంగానే నన్ను చంపడానికి కొందరు నా వెంటపడ్డారు.


నేను వాళ్ళ నుండి తపించుకొని పరిగెడుతుండగా నాకు ఆక్సిడెంట్ అయింది. చుట్టూ ఉన్న వాళ్ళు అంబులెన్సు కి ఫోన్ చేసారు. 


కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ లో ఉన్నాను. వారం రోజుల తర్వాత ఇంటికి ఒచ్చాను . నన్ను చంపడానికి కొందరు ప్రయతించారు అని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. 


ఇన్స్పెక్టర్ నన్ను చూసి నువ్వు ఏంటి  కైలాష్ ఇక్కడ అని అడిగారు. 


నా పేరు కైలాష్ కాదు సర్ నా పేరు శివ నన్ను ఎవరో చంపడానికి ప్రయతించారు కంప్లైంట్ ఇవ్వడానికి ఒచ్చాను సర్. 


మీ నాన్న పేరు సూరి కదా అని ఇన్స్పెక్టర్ నన్ను అడిగారు.


లేదు సర్ నేను అనాధ అని చెప్పను . సరే రైటర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చి వేళ్ళు నేను చూస్తా అని చెప్పారు ఇన్స్పెక్టర్

కంప్లైంట్ ఇచ్చి నేను ఇంటికి వెళ్ళాను .


ఇంటికి వెళ్ళాక గుర్తుకొచ్చింది అ రోజు బస్టాప్ లో కూడా పెద్దయిన నువ్వు సూరి కొడుకు కదా అని అన్నారు వెంటనే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ ని కలిసాను. 


సూరి ఎవరు ఎక్కడ ఉంటారు అని అడిగాను . సూరి మా ఊరివాడే . మా ఊర్లో సూరి అంటే తెలియనివారు ఎవ్వరు ఉండరు . 


కానీ పోయిన సంవత్సరం పొలం లో షాక్ కొట్టి చనిపోయాడు . సూరి కి ఒక్కడే కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఏదో కంపెనీ లో జాబ్ చేసెవాడు.


సూరి కొడుకు కైలాష్. కైలాష్ కి అమ్మ లేదు అమ్మ,నాన్న  అన్ని సూరి నే కైలాష్ కి . 


నేను సూరి చనిపోయినప్పుడు ఊరికి వెళ్ళాను అప్పుడే కైలాష్ ని చూసా .


సూరి చనిపోవడంతో కైలాష్ ఇల్లు ఇంకా పొలం వాళ్ళ మావయ్య ని చూసుకోమని తను  హైదరాబాద్ కి వెళ్ళిపోయాడు. 


నిన్ను చూస్తుంటే కైలాష్ ని చూస్తున్నట్టు ఉంది అని ఇన్స్పెక్టర్ చెప్పారు.


హైదరాబాద్ లో కైలాష్ ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా అని ఇన్స్పెక్టర్ ని అడిగాను.


తెలియదు కానీ వాళ్ళ మావయ్య ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేసి అడుగుతాను అని  ఇన్స్పెక్టర్ చెప్పారు.


హైదరాబాద్ లో కైలాష్ గూగుల్ లో పని చేస్తాడు అంట  కూకట్పల్లి లో ఉంటాడు కైలాష్ నెంబర్ ఇచ్చాడు వాళ్ళ మావయ్య  కైలాష్ కి ఫోన్ చేదాం. 


నెంబర్ కలవడం లేదు.


కైలాష్ నెంబర్ నాకు ఇస్తారా ఇన్స్పెక్టర్ నేను ఒక్కసారి కైలాష్ ని కలవాలి ,ఒకరోజు బస్టాప్ లో కూడా ఒక పెద్దయన నన్ను సూరి కొడుకువి కదా అని అన్నారు.


ఒక్కసారి కైలాష్ ని కలిస్తే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి తీరిపోతాయి అని చెప్పి కైలాష్ నెంబర్ తీసుకొని హైదరాబాద్ కి వెళ్ళాను .


అ తర్వాత రోజు నేను హైదరాబాద్ కి చేరుకున్న హోటల్ లో రూమ్ తీసుకొని రాత్రి హోటల్ లో ఉండి పొద్దునే కైలాష్ ఆఫీస్ కి వెళ్దాం అని అనుకున్న . 


రాత్రి పడుకున్న తర్వాత ఉన్నట్టుఉండి మెలుకువ ఒచ్చింది కళ్ళు తెరిచి చూసా నాకు నేనే  కనిపించాను భయం వేసింది అద్దం అయిఉంటుంది అని లేచి భయం తో ముందుకు వెళ్లి చూసాను అద్దం కాదు అ రూపం నా లగే ఉంది నన్ను నేను చూసుకున్నట్టు ఉంది .


ఎవరు నువ్వు అని అడిగాను . నేను కైలాష్ అని చెప్పారు . కైలాష్ ని ముట్టుకుందాం అని ప్రయతించాను కానీ నాకు కనిపించింది కైలాష్ ఆత్మ.


 నేను కైలాష్ ని ముట్టుకోలేకపోయాను .అసలు ఏం జరిగింది నువ్వు ఏలా చనిపోయావు అని అడిగాను అప్పుడు కైలాష్ మాట్లాడుతూ.


నాకు అమ్మ లేదు చిన్నపటినుంచి నాన్న అన్ని తానే అయి నన్ను పెంచారు . నేను కష్టపడి చదివి ఇప్పుడు  గూగుల్ లో జాబ్ చేస్తున్న . 


పోయిన సంవత్సరం నాన్న చనిపోవడంతో ఇల్లు, పొలం మావయ్యా ని చూసుకోమని నేను హైదరాబాద్ కి ఒచ్చేసాను.


నేను కాలేజీ లో ఉన్నపుడు ఒక అమ్మాయి ని ప్రేమించాను తన పేరు ప్రత్యక్ష . అప్పుడు ఒకే కాలేజీ లో చదివం ఇప్పుడు ఒకే ఆఫీస్ లో పని చేస్తున్నాం . 


నేను చనిపోయినట్టు తనకు తెలియదు . నేను చనిపోయాక తాను ఎంత బాధపడిందో చూసాను . తనకి నేను చనిపోయాను అని చెప్పాలి అనుకున్న కానీ నేను చనిపోయాను అని తెలుస్తే తను కూడా చనిపోతుంది అది నాకు ఇష్టం లేదు . 


వాళ్ళ ఇంట్లో కూడా మా ప్రేమ విషయం తెలుసు ఒచ్చే సంవత్సరం మేము పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం కానీ 


ఆరు నెలల క్రితం నా స్నేహితుడి పుట్టినరోజు సెలబ్రేషన్ అని పబ్ (Pub)  వెళ్ళాను అ రోజు రాత్రి చాల లేట్ అయింది . 


నా కార్ సెల్లర్ లో ఉంది అని అక్కడికి వెళ్ళాను అప్పుడు ఎవరు ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తి ని చంపడం చూసాను . అ వ్యక్తి చంపుతుండగా వీడియో తీసాను.


అప్పుడే వాళ్ళ మనుష్యులు నన్ను చూసి నన్ను కూడా చంపడానికి వెంటపడ్డారు నేను వాళ్ళనుండి తపించుకొని వెళ్ళిపోయాను.


అ తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్లి అ వీడియో నా ఆఫీస్ కంప్యూటర్ లో కాపీ చేసి ,పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను తీసిన వీడియో ని ఇన్స్పెక్టర్ కి చూపించాను.


పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నేను నా రూమ్ వెళ్తుండగా అ చంపినా వ్యక్తి వాళ్ళ మనుష్యులు నన్ను కిడ్నప్ చేసి వాళ్ళ స్థావరానికి తీసుకెళ్లారు.


అక్కడికి వెళ్ళాక తెలిసింది అ ఇన్స్పెక్టర్ వాళ్ళ మనిషి అని. అ వీడియో ఉన్న ఫోన్ ని నా కాళ్ళ ముందే కాల్చేసి నన్ను కూడా చంపేశారు.


అప్పుడే నేను నిజాన్ని కాపాడడానికి ఒక ఆత్మనై ఈ ఆరు నెలలుగా వాడు చేసిన నేరాలు అన్ని తెలుసుకున్న.


వాడికి శిక్ష పడేలా చేసే ఒక్క అవకాశం అయిన దొరకకపోదా అని వాడి చుట్టూ తిరుగుతున్న . 


వాడికి గుంటూరు లో రైసుమిల్ ఉంది అ రైసుమిల్ ని అడ్డు పెట్టుకొని వాడు మత్తు పదార్దాలు తయారీ చేసి విదేశాలకు , క్లబ్ కి,పబ్ కి ఎగుమతి చేస్తున్నాడు.


అ గుంటూరు లోనే నిన్ను నేను చూసాను .చూసి ఆశ్ఛర్యపోయాను నువ్వు అచ్చం నాలగే ఉన్నావ్.


వాడికి శిక్ష ఎలా వేయాలో అనే నా ప్రశ్న కి నువ్వు సమాధానం గా కనిపించవు.


నిన్ను ఎలా  అయిన హైదరాబాద్ కి రపించాలని " నిన్ను ఎవరో చంపుతున్నట్టు నీకు కల ఓచేలాగా చేసింది నేను , బస్టాప్ లో పెద్దాయన తో అల మాట్లాడించింది నేను , నిన్ను చంపడానికి మనుష్యులు వచ్చే లాగా చేసింది నేను".


అప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లవు ,నా గురించి తెలుసుకున్నావు , హైదరాబాద్ కి ఒచ్చావు .


నిజాన్ని కాపాడానికి నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను కైలాష్ . అని నేను కైలాష్ తో చెప్పను.


ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు.


మనం నా రూమ్ కి వెళదాం , రేపు ఆఫీస్ కి వెళ్లి వీడియో తీసుకొని ఇంకా వాడు చేసిన నేరాలకు, వాడి అక్రమ ఆస్తులు వివరాలు నేను సేకరించాను వాటిని మనం కానక గవర్నర్ గారికి ఇస్తే వాడికి శిక్ష తప్పకుండ పడుతుంది.


నేను తలుచుకుంటే వాడిని చంపొచ్చు కానీ చావు వాడికి శిక్ష కాదు వాడు నేను ఎందుకు బ్రతికున్న అని బాధపడాలి అని కైలాష్ అన్నాడు.


సరే  కైలాష్ నేను ఏం చేయాలో చెప్పు ఆది నేను చేస్తా.


తర్వాత రోజు కైలాష్ ఆఫీస్ కి వెళ్ళాను , వీడియో తీసుకొని నేను, కైలాష్ బయటికి వస్తుండగా కైలాష్ బాధలో ఉన్న ప్రత్యక్ష ని చూసి అక్కడే ఆగిపోయాడు.


నేను వెళ్లి ప్రత్యక్ష తో నిజం చెప్తాను అని కైలాష్ తో చెప్పను.


కానీ కైలాష్ తనకి నిజం తెలియకూడదు నేను చనిపోయాను అని తెలిస్తే తను కూడా చనిపోతుంది ఆది నాకు ఇష్టం లేదు.


ముందు వాడికి శిక్ష పడాలి అ తర్వాత నువ్వు ప్రత్యక్షని పెళ్లి చేసుకోవాలి . 


నిన్ను నేను చూసాను నువ్వు ఎలాంటి వాడివో , నువ్వు ఎలాంటి పరిస్థిలో ఒంటరివాడివి అయ్యావో  నాకు తెలుసు . నా కంటే నువ్వే ప్రత్యక్ష కి సరైన జోడి.


నా ఈ రెండు కోరికలు తీరాయి అంటే నేను సంతోషంగా ఈ భూమి నుండి వెళ్తాను అని కైలాష్ అన్నాడు.


కైలాష్ చెప్పినట్టుగా వీడియో తో పాటు వాడు చేసిన నేరాలు వాడి అక్రమ ఆస్తుల వివరాలు అన్ని రెడీ చేసి గవర్నర్ గారి అప్పోయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారిని కలిసి నిజం చెప్పి సేకరించిన వివరాలు గవర్నర్ గారికి ఇచ్చాను.


 కైలాష్ అనుకున్నట్టుగానే వాడికి శిక్ష పడింది .

తర్వాత కైలాష్ కోరుకున్న విధంగా నేను ప్రత్యక్ష ని పెళ్లి చేసుకున్నాను.


పెళ్లి తర్వాత ప్రత్యక్ష ని మోసం చేస్తున్న అనే భావన నన్ను ఒక ప్రశ్న ల వేదిస్తుండేది .


ఉండబట్టలేక జరిగిన నిజాన్ని , కైలాష్ లేడు అనే నిజాన్ని ప్రత్యక్ష కి చెప్పను .


ప్రత్యక్ష కి నిజం చెప్పిన తర్వాతే  అసలు నిజం ప్రత్యక్ష నాకు చెప్పింది. 


ప్రత్యక్ష మాట్లాడుతూ


"కైలాష్ ని చంపింది ఎవరో కాదు మా నాన్న .

మా నాన్న పబ్ లో ఎవరినో చంపడం నేను చూసాను వీడియో నేనే తీసాను . 


నన్ను కాపాడడానికి కైలాష్ మా నాన్న మనుష్యులకు కనిపించి వాళ్ళని కైలాష్ వెంటపడేలాగా చేసి  నన్ను కాపాడాడు . 


అ తర్వాత నేను వీడియో ని కైలాష్ కి ఇచ్చాను కానీ నా దురదుష్టం నేను కైలాష్ ని కోల్పోయాను .


అ తర్వాత కైలాష్ ని మరచిపోలేక , చంపింది  మా నాన్న అని తెలిసిన నేను ఏమి చేయలేక బాధపడుతూ ఉండేదానిని .


ఒక రోజు కైలాష్ నాకు కనిపించాడు ,

మా నాన్నకి ఎలా అయిన  శిక్ష పడాలి అని నాతో చెప్పాడు .


అప్పటినుండి మా నాన్న చేసిన నేరాలు అన్ని కైలాష్ కి చెప్పేదానిని .


ఒకరోజు కైలాష్ ని గురించి చెప్పాడు ,నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు ముందు నేను ఒప్పుకోలేదు కానీ కైలాష్ నన్ను ఒప్పించాడు .


కైలాష్ కోసం ఏ నిన్ను పెళ్లి చేసుకున్నాను శివ కానీ నువ్వు నా పై చూపించిన అభిమానం , ప్రేమ నిన్ను ప్రేమించే లా చేసింది ఐ లవ్ యు శివ.


కైలాష్ ఇప్పుడు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉంటాడు" అని ప్రత్యక్ష అసలు నిజం చెప్పింది.


ఒక సంవత్సరం తర్వాత మాకు  బాబు పుట్టాడు .

జీవితం ఇప్పుడు సంతోషంగా సాగిపోతుంది. 

2 comments: