లక్ష్మి:- ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు భరత్?
భరత్:- అబ్బే ఎవరికోసం లేదు వదిన ఊరికే అల చూస్తున్న .
లక్ష్మి:- తెలుసులే నీ ఈ ఎదురు చూపులు ఎవరికోసమో.
భరత్:- ఎవరికోసం చెప్పు చూదాం?
లక్ష్మి:- నా చెల్లెలు వసు కోసమే కదా.
భరత్:- అవును వదిన ఎప్పుడో నాలుగు సంవత్సరాల ముందు మీ పెళ్ళిలో చూసా మళ్ళీ ఇప్పటికీ దర్శనం కలుగుతుంది మీ చెల్లెలిది.
లక్ష్మి:- ఏం చేయమంటావు మరి నీ కోసం ఇక్కడే ఉంటె బాగుండేది కదా.
భరత్:- అల కాదు వదిన మీ చెల్లి నీ చూసి నాలుగు సంవత్సరాలు అయింది. మీ పెళ్లి అయ్యాక చదువుకోసం అని అమెరికా కి వెళ్ళింది. మీకు బాబు పుట్టిన ఇంటికి రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒస్తుంటే ఎదురు చూడకుండా ఎలా ఉండమంటావు .
లక్ష్మి:- సరే భరత్ నీ బాధ అర్ధం అయింది చెల్లి ఇంకా ఒక గంట లో ఒస్తుంది నువ్వు రెడీ గా ఉండు.
వసు:- అక్క !
లక్ష్మి:- వసు ఎలా ఉన్నావు .
వసు:- నేను బాగున్నాను అక్క నువ్వు ఎలా ఉన్నావు.
లక్ష్మి:- బాగున్నాను. నీ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో తెలుసా?
వసు:- ఎవరు అక్క?
లక్ష్మి:- భరత్!
వసు:- అవునా! భరత్ బావ ఎక్కడ ఉన్నాడు.
లక్ష్మి:- లోపల గదిలో ఉన్నాడు.
వసు:- సరే ఐతే నేను వెళ్లి కలుస్తాను.
వసు:- బావ ఎలా ఉన్నావు.
భరత్:- బాగున్నా వసు. నువ్వు ఎలా ఉన్నావు.
వసు:- బాగున్నాను, నీ గురించి అక్క చెప్పింది నేను అంటే నీకు ఇష్టం అని. నువ్వు అంటే కూడా నాకు ఇష్టం బావ ' ఐ లవ్ యు బావ'. మనం పెళ్లి చేసుకుందాం, ఎలాగో నువ్వు జాబ్ కోసం చూస్తున్నావ్, పెళ్లి చేసుకొని అమెరికా వెళదాం.
అక్కడే మనం జాబ్ చూసుకొని అక్కడే ఉండిపోడం ఎం అంటావ్ బావ నీకు సరే న.
భరత్:- నీ సంతోషమే నాకు కావాలి, నీకోసం ఏదైనా చేస్తాను వసు ఐ లవ్ యు…
లక్ష్మి:- భరత్ వసు ఒచ్చింది.
భరత్:- ఇప్పుడు రావడం ఏంటి? అంటే ఇప్పటిదాకా జరిగింది జరగలేదా, అంటే నేను ఉహించుకున్నానా అయ్యో.
లక్ష్మి:- వస్తున్నావా భారత్?
భరత్:- వస్తున్న వదిన. వదిన వసు తో పటు ఉన్న వ్యక్తి ఎవరు.
లక్ష్మి:- ఏమో భరత్ నేను వసు నీ తర్వాత అడుగుతా. వసు పద నీ రూమ్ చూపిస్తాను.
వసు:- అ అక్క ఇతను నా ఫ్రెండ్ అమెరికా లో కలిసి చదువుకున్నాం తన పేరు రాకేష్.
లక్ష్మి:- సరే సరే తర్వాత మాట్లాడుకుందం. ముందు వెళ్లి రెస్ట్ తీసుకోండి నేను వంట అయ్యాక పిలుస్తా . భరత్ రాకేష్ ని, నీ గదికి తీసుకెళ్ళు.
భరత్:- అ వదిన, రాకేష్ వెళ్దాం పదండి .
భోజనాలు అయ్యాక:-
భరత్:- వదిన వసు ని అడిగావా?
లక్ష్మి:- లేదు.
వసు:- అక్క , బావ మీతో ఒక విషయం చెప్పాలి.
నేను, రాకేష్ ప్రేమించుకుంటున్నం.
రాకేష్ వాళ్ళ కుటుంబానికి నేను నచ్చాను.
అమ్మ నాన్నలతో మీరే మాట్లాడాలి అక్క, నేను రాకేష్ పెళ్లి చేసుకొని అమెరికా లోనే ఉండిపోదం అని అనుకుంటున్నాము.
లక్ష్మి:- అదేంటి వసు భరత్.
భరత్:- వదిన నేను మాట్లాడుతాను. వసు, రాకేష్ నీకు సరైన జోడి. నేను మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను మీ పెళ్ళికి ఓపిస్తాను.
వసు:- థాంక్యూ భరత్ బావ.
కాసేపటి తర్వాత:-
లక్ష్మి:- భరత్ నువ్వు వసు ని ప్రేమించావు కదా?
భరత్:- అవును వదిన ప్రేమించాను ఎన్నో ఉహించుకున్నాను కానీ వసు కి నాకు రాసిపెట్టలేదు. " ప్రేమ అనే రైల్ లో ఎక్కడం వరకు మనవంతు, అ రైల్ ని ఏ గమ్యం కి చేర్చాలో అది దేవుడి వంతు మన చేతిలో ఏమి ఉండదు ". నన్ను కొంచం సేపు ఒంటరిగా ఒదిలెయ్ వదిన నేను మాములుగా మారడానికి టైం పడుతుంది.
వసు రాకేష్ పెళ్లైన సంవత్సరం తర్వాత భరత్ ఇంట్లో :-
రేయ్ జనార్దన్ బయటికి రరా అవసరానికి డబ్బులు తీసుకొని తిరిగివ్వమంటే రేపు ఇస్తా మాపు ఇస్తా అని తీపించుకుంటున్నావ్ .
జనార్దన్:- సదానంద్ గారు మీ డబ్బు వచ్చే నెల తప్పకుండ ఇస్తాను ఇప్పుడు గొడవ చేయకండి.
సదానంద్:- ఏం భరత్! మీ అన్నయ మాటలు నేను నమ్మలేను నువ్వు ఈ శూరిటి పేపర్ పైన సంతకం పెట్టు నెల కాదు రెండు నెలలు టైం ఇస్తాను లేదు అంటే చెప్పు ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం.
భరత్:- అది ఏం వద్దు సదానంద్ గారు మీకు ఎంత డబ్బు ఇవ్వాలి.
సదానంద్:- మూడు లక్షలు.
భరత్:- నాకు వారం రోజులు టైం ఇవ్వండి నేనే మీ ఇంటికి వచ్చి ఇస్తాను.
జనార్దన్:- భరత్ నువ్వు ఇవ్వడం ఏంటి రా?
భరత్:- నీ సంతోషాన్ని పంచుకోవడమే నా హక్కు కాదు అన్నయ, నీ బాధ కూడా పంచుకోవడంలో నాకు హక్కు ఉంది. అన్నయ నేను బ్యాంకు లోన్ తీసుకుంటా. ఇప్పుడు జాబ్ చేస్తున్న నెల నెల నేను బ్యాంకు లో కాటేస్తా. సదానంద్ గారు మీరు వెళ్ళండి నేనే వచ్చి డబ్బులు ఇస్తాను.
సదానంద్:- నీ మాట నమ్మి వెళ్తున్న రెండు రోజులు చూస్తా ఇవ్వకపోతే అప్పుడు చెప్తా .
భరత్:- వదిన అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళు నేను బ్యాంకు కి వెళ్లి వస్తాను.
జనార్దన్:- అమ్మ నాన్న చనిపోయాక తమ్ముడిని నేనే పెంచాను లక్ష్మి. వాడికి కష్టం కలుగకుండా పెంచుదాం అనుకున్న కానీ వ్యాపారం లో నష్టం వచ్చి డబ్బు మొత్తం పోయింది. అప్పు తీసుకొని కొత్త వ్యాపారం పెట్టాను ఇంటికి సరిపడా డబ్బులు ఒస్తున్నాయి ఖర్చులు తక్కువ చేశాను అయిన డబ్బులు మిగలడంలేదు ఇప్పుడు తమ్ముడిని కష్టపెట్టాల్సివస్తుంది .
లక్ష్మి:- ఉరుకోండి మన భరత్ కి ఇప్పుడు ఉద్యోగం ఒచ్చింది మనకి కూడా మంచి రోజులు ఒస్తాయి.
రాజీ:- లక్ష్మి అక్క ఇంట్లో ఉన్నావా? ( రాజీ భారత్ వాళ్ళ ఎదురు ఇంట్లో ఉంటుంది ).
లక్ష్మి:- అ రాజీ ఇక్కడే ఉన్నాను చెప్పు ఏంటి పని!
రాజీ:- ఏదో గొడవ జరిగింది అంట?
లక్ష్మి:- ఎప్పుడు ఉండే గొడవలే రాజీ. కాలేజీ కి వెళ్లలేదా ఈరోజు.
రాజీ:- లేదు అక్క.
భరత్:- వదిన నాలుగు రోజులలో డబ్బు వస్తుంది.
బాగా ఆకలిగా ఉంది ఏం వంట చేసావు.
లక్ష్మి:- నీకు ఇష్టం అని గుత్తివంకాయ చేసాను.
రాజీ:- అక్క నేను వెళ్తున్న.
లక్ష్మి:- ఎక్కడికి రాజీ తినేసి వేళ్ళు, భరత్ అన్నయ్యని పిలుచుకొని రా అలాగే సిద్దు నీ కూడా.
భరత్:- అన్నయ తినడానికి రా!
సిద్దు:- బాబాయ్ నేను రెడీ.
భరత్:- సిద్దు ఇక్కడే ఉన్నావా పద, అన్నయ రా.
కొన్ని రోజుల తర్వాత భారత్ ఆఫీస్ కి వెళ్లే టైం లో:-
రాజీ వాళ్ళ అమ్మ:- భరత్ !
భరత్:- అ అంటి
రాజీ వాళ్ళ అమ్మ:- రాజీ కాలేజీ కి వెళ్ళాలి, బస్సులు ఈరోజు బంద్ అంట టైం కి అంకుల్ కూడా ఇంట్లో లేరు కొంచం రాజి ని కాలేజీ దగ్గర ఒదిలేస్తావా, సాయంత్రం అంకుల్ తీసుకొస్తారు ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళావా .
భరత్:- సరే అంటి నేను ఆఫీస్ కి వెళ్తున్న వదిలేస్తాను.
రాజీ వాళ్ళ అమ్మ:- రాజీ!
రాజీ:- అ అమ్మ.
రాజీ వాళ్ళ అమ్మ:- భారత్ వదిలేస్తాడు నువ్వు కాలేజీ కి వేళ్ళు సాయంత్రం నాన్న వస్తారు.
రాజీ:- సరే అమ్మ.
రాజీ , భరత్ వెళ్తుండగా:-
రాజీ:- భరత్ నీతో ఒక విషయం చెప్పాలి. ఏదయినా కాఫీ షాప్ కి తీసుకెళ్ళు. ఈరోజు కాలేజీ లో ముఖ్యమైన క్లాస్ ఏమి లేదు , నువ్వు కూడా ఆఫీస్ కి కొంచం లేట్ గా వేళ్ళు .
భరత్:- సరే వెళదాం.
కాఫీ షాప్ లో :-
భరత్:- చెప్పు రాజీ ఏదో మాట్లాడాలి అని అన్నావ్ .
రాజీ:- నువ్వు అంటే నాకు ఇష్టం భారత్. నీకు నేను ఇష్టం అయితే ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. వెంటనే కాదు నా చదువు అయ్యాక .
భరత్:- ఏం మాట్లాడుతున్నావు రాజీ.
రాజీ:- నువ్వు నాకు ఇష్టం నీకు ఇష్టం ఉన్న లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా .
భరత్:- నా గురించి నీకు ఏం తెలుసు?
రాజీ:- నీ వయస్సు 25 సంవత్సరాలు. నీకు మీ వదిన చెల్లి వసు అంటే ఇష్టం ఉండే కానీ వసు వేరేవాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత నువ్వు మాములు మనిషి అవ్వడానికి మూడు నెలలు పట్టింది. అ తర్వాత జాబ్ కోసం వెతికావు నీకు జాబ్ వచ్చి రెండు నెలలు అయింది. మీ అన్నయ చేసిన అప్పు తీర్చడానికి బ్యాంకు లోన్ తీసుకున్నావ్. నీకు నచ్చిన కలర్ ఎరుపు. నచ్చిన వంట బిర్యానీ ఇంకా గుత్తివంకాయ. నెలలో కనీసం రెండు సార్లు అయినా మందు కొడతావ్ అది కూడా సగం గ్లాస్ మీ ఫ్రెండ్స్ కోసం. సిగరెట్ తగవు ప్రతి శనివారం గుడికి వెళ్తావు. బయట ఏ అమ్మాయిని చూడవు, మీ ఆఫీస్ లో ప్రతిమ అనే అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం కానీ నీకు అ అమ్మాయి అంటే ఇష్టం లేదు. అమ్మాయిలు పద్దతిగా ఉండాలి అని అనుకుంటావ్. అమ్మాయిలు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటే నీకు నచ్చదు. వేరే వాళ్ళ విషయాల్లో నువ్వు తలదూర్చావు , గొడవలకి వెళ్లవు. అమ్మాయిలు అంటే గౌరవం. కోపం నేను ఎప్పుడు చూడలేదు.బయటికి వస్తే నీ పని నువ్వు చూసుకుంటావ్ నిన్ను నేను చూస్తూ ఉంటాను.
నీ డ్రెస్ సైజ్ కూడా తెలుసు.చాల ఇంకా ఏం అయినా చెప్పాలా
నీ గురించి నీకంటే ఎక్కువ నాకే ఎక్కువ తెలుసు భరత్.
భరత్:- అన్ని కరెక్ట్ గా చెప్పావ్ కానీ ఒకటి మరిచిపోయావు రాజీ .
రాజీ:- ఏంటి?
భరత్:- రోజు రాత్రి కిటికీ లో నుండి నువ్వు ఎక్కడ ఉన్నావు చూసి, నిన్ను చూసి పడుకుంటాను. నువ్వు అంటే కూడా నాకు ఇష్టం. ఈ విషయం వదిన కూడా తెలుసు. మీ ఇంటికి ఒకసారి ఒచ్చాను నీకు గుర్తు ఉందా. అప్పుడు మీ నాన్న అన్నారు " రాజీ చదువు అయిపోయాక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయాలి" అని. అప్పుడే నేను వదినకి చెప్పను నిన్ను ఇష్టపడుతున్నాను అని.
వదిన చెప్పింది నువ్వు జాబ్ చేయి కొంచం డబ్బులు కూడబెట్టు, నీ పెళ్లి గురించి నేను మాట్లాడతాను అని.
వదిన ఏం చెప్పిన కరెక్ట్ గా ఉంటుంది. అన్నావదినాలే నాకు అమ్మానాన్నలు.
రాజీ:- నాకు తెలుసు భరత్ అక్క అంటే నీకు ఎంత గౌరవమో
ఐ లవ్ యు భరత్.
భరత్:- ఐ లవ్ యు రాజీ ..
రెండు సంవత్సరాల తర్వాత రాజీ , భారత్ పెళ్లి చేసుకున్నారు.
No comments:
Post a Comment