హాస్పిటల్ లో హరి సర్జికల్ నైఫ్ ( Sergical Knife ) తో తన గొంతు నీ కోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు.
ఫ్లాష్ బ్యాక్:-
తను ప్రేమించిన అమ్మయి పని చేస్తున్న ఆఫీసు బయట హరి తన కోసం ఎదురు చూస్తుంటాడు.
తన పని ముగించుకొని మీరా ఆఫీస్ నుండి బయటకి వస్తుంది.
అలా మీరా తన బండి తీసుకొని వెళుతుండగా ఎవరు లేని ప్లేస్ (place) లో హరి మీరా ని అపుతాడు.
హరి నీ చూసి మీరా ఆశ్చర్యపోయి అలానే చూస్తు ఉండిపోతుంది.
హరి, మీరా కి తను ప్రేమిస్తున్న విషయం చెప్తాడు.
హరి తన గురించి, ఇంకా మీరా నీ ఎక్కడ ఎలా చూసాడో వివరంగా చెప్తుంటాడు.
"మీరా, నా పేరు హరి, ఒక నేల నుండి నీ చుట్టూ తిరుగుతున్నాను.
మొదటి సారి గుడిలో నిన్ను చూసాను, అప్పుడే అక్కడ నువ్వు నాకు నచ్చావ్.
నువ్వు అలా పాట పడుతుంటే కోయిల పడుతుందా అని అనుకున్నా.
నీకు అప్పుడే చెబుతాం అని అనుకున్నా, కానీ ఇంత అందం అయినా అమ్మయి నన్ను ఎందుకు ప్రేమిస్తుంది, ఆల్రెడీ ఎవరో లవర్ ఉండీ ఉంటారు అని అక్కడ నుండి వెళ్ళిపోయాను.
రెండో సారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో బైక్ పైనా కనపడ్డావ్ తను నీ లవర్ ఏమో అని అనుకున్నా.
కాని మూడో సారి అనాధ శరణాలయంలో కనపడ్డావ్ నేను ఎక్కడకి వెళితే అక్కడ నువ్వు కనపడుతున్నావ్, ఎదో జరుగుతుంది అని అనుకోని అప్పటి నుండి నేను నిన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేసాను.
నిన్ను ఫాలో అయ్యాక తెలిసింది నాకు లాగే నువ్వు ఒక అనాథ అని, నీకు బాయ్ ఫ్రెండ్, లవర్ లేరు అని ఆ రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసిన అతను నీ ఆఫీసు కొలీగ్ అని. అప్పుడే ఫిక్స్ అయ్యాను నీకు నా ప్రేమ విషయం చెబుదాం అని.
ఒక్కపుడు ఒకరి గురించి తెలుసుకోవాలి అంటే, వారిని వీరిని అడగాలి లేదా మనం వారి చుట్టూ తిరిగి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా ఉంటె చాలు.
ఇ లెటర్ లో నా ఫేస్‌బుక్ ఐడి, ఇన్‌స్టాగ్రామ్ ఐడి, ట్విట్టర్ ఐడి, వాట్సాప్ నంబర్, కాలింగ్ నంబర్ ఉన్నాయ్.
నీ రిప్లై కోసం నేను రేపు నీ ఆఫీస్ దగ్గర ఉన్నా కాఫీ షాప్ లో వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను వెళుతున్నాను".
మీరా: ఓయ్ హరి అగు అని మీరా గట్టిగా అరుస్తుంది.
హరి మీరా అరుస్తున్న వినకుండ తన బైక్ స్టార్ట్ చేసి రేపు కాఫీ షాప్, సాయంత్రం 6 గంటలకు వేచి చూస్తు ఉంటానని అరుస్తూ హరి వెళ్లిపోతాడు.
తరవాత రోజు కాఫీ షాప్ లో:
"మీరా: నువ్వు నిజంగానే ఇడియట్ వి హరి, నిన్న పిలుస్తుంటే అలా వెళ్లిపోయావ్ ఏంటి. అప్పుడే కాల్ చేదాం అని అనుకున్నా ఎలాగో ఈరోజు కలుస్తాం కదా అని వెయిట్ చేసా.
నువ్వు అంటే నాకు కూడా ఇష్టం హరి. ఏ అనాథ శరణాలయంలో నన్ను నువ్వు చూశావో అదే అనాథ శరణాలయంలో నేను నిన్ను చూశాను. నువ్వు అక్కడ ఉన్నా వారికి చేస్తున్న సహాయం చూసి నువ్వు అంటే ఇష్టం కలిగింది.
కాని నువ్వు నా గురించి ఎలా అయితే అనుకున్నవో, నేను నీ గురించి అలానే అనుకోని అక్కడ నుండి వెళ్ళిపోయాను.
నిన్న నువ్వు నా ఎదురుగా ఒచ్చే సరికి కాల నిజమా అని తెలియలేదు. అలా ఆశ్చర్యపోయి నీ ముందు నిలుచున్నాను.
అదే విషయం నిన్న నీతో చెబుదాం అంటే నువ్వు ఏమో అరుస్తు నేను చెపేది వినకుండ వెళ్ళిపోయావ్.
నేను కుడా నిన్ను ప్రేమిస్తున్నాను హరి."
మీరా తన ప్రేమా నీ ఒప్పుకునే సరికి, హరి ఆనందానికి హద్దులు లేవు, తర్వాత రోజు గుడిలో హరి ఇంకా మీరా పెళ్లి చేసుకుంటారు.
2 సంవత్సరాల తర్వాత:-
మీరా 9 నెలల గర్భంతో ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి మీరాకి నొప్పులు మొదలవుతాయి అదే సమయం లో మీరా కి ఫిట్స్ ఒస్తాయ్.
హరి కంగారు పడుతూ అంబులెన్స్ కి కాల్ చేస్తాడు.
అంబులెన్స్ వస్తుంది.
మీరా నీ హాస్పిటల్ కి తిసుకెళ్తారు.
హాస్పిటల్ కి వెల్లే టైం లో మల్లి మీరా కీ ఫిట్స్ ఒస్తాయ్, హరికి టెన్షన్ మొదలవుతుంది.
హాస్పిటల్ లో:
అక్కడ ఉన్నా డాక్టర్లు, నర్సులు మీరాని ఆపరేషన్ థియేటర్ లోకీ తిసుకెళ్తారు.
20 నిమిషాల తర్వాత:
డాక్టర్ ఒచ్చి మీరా ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోయారని చెప్తారు.
ఫిట్స్ రావాడం వల్ల మీరా కంట్రోల్ అవ్వలేదు ఆక్సిజన్ అందక పోయేసరికి ఇద్దరు చనిపోయారని చెప్తారు.
ఆది విన్న హరి తట్టుకోలేక పోతాడు.
డాక్టర్: మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్తారు
మీరా నీ ఆ పరిస్థితిలో చూసి హరి తాటుకోలేకపోతాడు అక్కడ పక్కనే ఉన్న సర్జికల్ నైఫ్ (Sergical Knife) తో తన గోతుని కోసుకొని చనిపోతాడు.
నిజం అయిన ప్రేమ మనం ప్రేమించిన వారు చనిపోతే మనం కూడా చనిపోవడం లో లేదు.
ప్రేమించిన వారు చనిపోయినా వారు చేయలేక పోయిన పని మనం చేస్తూ అలా చేసిన పని వల్ల ఒచ్చే సంతోషంలో ఉంటుంది.
ప్రేమించండి ప్రేమించినా వారి కోసం బ్రతకండి.
...సాయినాథ్
No comments:
Post a Comment