(అభీ) గుడ్ మార్నింగ్ ( good morning ) లీల,
(లీల) మార్నింగ్ ( morning ) అభీ,
(అభీ) లెగు స్కూల్ కి వెళ్లాలి కద టైం అవుతుంది,
(లీల) అ అభీ లేస్తున్న,
(అభీ) సరే ఐతే నేను వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ( break fast ) రెడీ చేస్తాను నువ్వు త్వరగా రా,
(లీల) సరే అభీ నేను రెడీ ఐ ఒస్తాను నువ్వు వేళ్ళు,
(అభీ) లీల బ్రేక్ ఫాస్ట్ ( break fast ) ఇంకా కాఫీ రెడీ ఒస్తున్నావా,
(లీల) హ అభీ ఒస్తున్న, ఒచ్చేసాను తినిపించు అభీ,
(అభీ) మన పెళ్లి జరిగి రెండు సంవత్సరలు అయింది, ఇంకా చిన్న పిల్లలగా చేస్తున్నావ్ లీల. సరే తిను టైం లేదు నిన్ను స్కూల్ దగ్గర వదిలేసి నేను ఆఫీస్ కి వెళ్తాను. సాయంత్రం త్వరగా ఒస్తాను ఒక స్పెషల్ ప్లేస్ కి వెళదాం స్కూల్ నుంచి ఒచ్చాక రెడీ ఐ ఉండు,
(లీల) అలాగే అభీ రెడీగా ఉంటాను.
పదిహేను నిమిషాల తర్వాత….
(అభీ) వెళదామా లీల బ్యాగ్ తీసుకున్నావా,
(లీల) అ తీసుకున్న నువ్వు నీ ( laptop ) తీసుకున్నావా,
(అభీ) అ తీసుకున్నాను వెళదాం పద,
(అభీ) స్కూల్ ఒచ్చేసింది, జాగ్రత సాయంత్రం ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, చెప్పాను కదా స్పెషల్ ప్లేస్ కి వెళదాం అని రెడీ గా ఉండు లీల సరే నా,
(లీల) సరే అభీ రెడీ గా ఉంటాను.
అభీ మాట్లాడుతూ " నా పేరు అభినవ్ నాతో ఉన్న అమ్మాయి పేరు లీల నా భార్య మాకు పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అయింది.
కానీ మాకు పిల్లలు లేరు డాక్టర్ దగ్గరకి వెళ్లి కలిసాము. డాక్టర్ చూసి లీల కి పిల్లలు పుట్టారు అని చెప్పారు. తనకు ఏదో మెడికల్ సమస్య వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పారు డాక్టర్.
ఈ విషయం లీల కి కూడ తెలుసు. మేము ఎవరినైనా పిల్లలని పెంచుకుందాం అని అనుకున్నాము.ఈరోజు సాయంత్రం అనాదశరణాలయానికి వెళ్తున్నాము.
నేను ఒక చిన్న కంపెనీ లో పనిచేస్తున్న.మా మేనేజర్ వెంకట్ గారు చాల మంచి మనిషి, నా స్నేహితుడు సామ్యూల్ (Sam). నా ప్రతి విషయం సామ్యూల్ కి తెలుసు నేను అంటే సామ్యూల్ కి చాల ఇష్టం"..
అదే సమయం లో లీల మాట్లాడుతూ
" నా పేరు లీల , నేను అంటే అభీ కి చాల ఇష్టం ,ఇష్టం అని చెప్పడం కంటే ప్రాణం అని చెపొచ్చు నా కోసం ఏమైనా చేస్తాడు.
నాకు పిల్లలు పుట్టారు అని తెలిసిన కుడా నన్నే తన పాప లాగా చూసుకుంటున్నాడు. అభీ కి నాకు పిల్లలు అంటే చాల ఇష్టం కానీ నాకు ఉన్న సమస్య వల్ల అభీ కి పిల్లలని ఇవ్వలేకపోతున్న అని చాల బాధ గా ఉంది, కానీ అభీ చెప్పాడు మనం ఎవరైనా పిల్లలని పెంచుకుందాం అని నేను కుడా సరే అని చెప్పాను.
నేను చిన్న పిల్లలకి కి టీచర్ గా స్కూల్ లో పని చేస్తున్న. అభీ కి తెలుసు నాకు పిల్లలు అంటే ఇష్టం అని, అభి చెప్పాడు స్కూల్ లో టీచర్ గా చేరు పిల్లలతో కొంచం సమయం గడపొచ్చు అని అందుకే స్కూల్ టీచర్ గా చేరాను.
సాయంత్రం…...
(అభీ) హలో లీల నేను ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతున్న నువ్వు ఎక్కడ ఉన్నావ్,
(లీల) అభీ నేను ఇంట్లో ఉన్నాను,
(అభీ) సరే నేను వస్తున్న రెడీ ఐ ఉండు లీల,
(లీల) సరే అభీ రెడీ గా ఉంటాను.
ఇంటిదగ్గర….
(అభీ)వెళదామా లీల రెడీ అ,
(లీల) అ అభీ నేను రెడీ,
(అభీ) లీల ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా,
(లీల) స్పెషల్ అన్నావ్ కదా అభీ నాకు ఎలా తెలుస్తుంది,
(అభి) నువ్వు ఎదో ఒకటి అలోచించి ఉంటావ్ కదా చెప్పు,
(లీల) ఏమో అభీ నాకు తెలియదు నువ్వే చెప్పు,
(అభీ) మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే,
అదే సమయం లో అభీ ఇంకా లీల వెళ్తున్న కార్ కి ఆక్సిడెంట్ ( accident ) అవుతుంది.
చుట్టూ ఉన్నవాళ్లు … అయ్యె భార్యాభర్తలు లాగా ఉన్నారే, ఈ లారీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేస్తూ wrong రూట్ లో వచ్చి కార్ నీ గుదేశాడు ఎవరైనా అంబులెన్సు కి ఫోన్ చేయండి.
కాసేపటికి హాస్పిటల్ లో….
(అభీ) లీల లీల డాక్టర్ నా లీల ఎక్కడ ఉంది నేను తనని చూడాలి లీల ఎక్కడ డాక్టర్,
(డాక్టర్) లీల న ఎవరు తను అంబులెన్స్ లో నిన్ను ఒక్కడినే తీసుకొచ్చారు కదా నీతో పాటు ఎవరైనా ఉన్నారా,
(అభీ) అవును డాక్టర్ నా భార్య లీల నేను కార్ లో వెళ్తున్నాము ఆక్సిడెంట్ అయింది నా లీల ఎక్కడ డాక్టర్,
(డాక్టర్) మీ పేరు,
(అభీ) నా పేరు అభీ అభినవ్.
(డాక్టర్) చుడండి అభీ మీకు జరిగింది ఆక్సిడెంట్ ఏ, మీరు బనే ఉన్నారు మీకు ఏం అవ్వలేదు మీ భార్య కి కుడా ఏం జరిగి ఉండదు టైం కి హాస్పిటల్ కి తీసురావడం తో నిన్ను కాపాడగలిగాం మీ వాళ్ళు ఎవరైనా ఉంటె ఇక్కడికి పిలవండి.
(అభీ) హలో సామ్ నేను అభీ,
(సామ్) రేయ్ అభీ ఎక్కడికి వెళ్ళావ్ రా ఏం అయిపోయావ్, రెండు రోజులు అవుతుంది ఇంటికి ఒచ్చాను అక్కడ లేవు నీ ఫోన్ కూడా కలవడం లేదు ఎక్కడ ఉన్నావ్.
(అభీ) చిన్న ఆక్సిడెంట్ రా హాస్పిటల్ లో ఉన్న నీ హెల్ప్ కావాలి హాస్పిటల్ కి ఒస్తావ,
(సామ్) అ హాస్పిటల్ ఎక్కడో చెప్పు ఇప్పుడే ఒస్తాను.
సామ్ హాస్పిటల్ కీ వెళ్లి అభీ నీ ఇంటికి తీసుకోసాతడు…..
అభీ ఇంటిదగ్గర…..
(సామ్) రేయ్ అభీ, లీల ఎక్కడ రా,
(అభీ) లీల కనిపించడంలేదు .నేను, లీల ఆర్ఫనేజ్ (orphanage) కి వెళదాం అని బయలుదేరాం దారిలో ఆక్సిడెంట్ అయింది.
నేను లేచి చూస్తే లీల లేదు డాక్టర్స్ నీ అడిగితే అంబులెన్సు లో నువ్వు మాత్రం ఏ ఉన్నవ్ నీతో పాటు ఎవరు లేరు అని చెప్పారు,
(సామ్) ఏం చెప్తున్నావ్ రా అసలు ఏం అయింది,
(అభీ) ఏమో రా అదే నాకు అర్ధం అవ్వడం లేదు,
(సామ్) రేయ్ అభీ నీ ఫోన్ ఇంకా లీల వస్తువులు తీసుకున్నావా,
(అభీ) ఇంకా లేదు రా పోలీస్ స్టేషన్ లో నే ఉన్నాయి,
(సామ్) మనం వెళ్లి అవి తీసుకుందాం మనకి ఏమైనా ఉపాయం దొరకొచ్చు. ఎక్కడ ఆక్సిడెంట్ అయింది,
(అభీ) అనాదశరణాలయం కి వెళ్లే దారిలొ wrong సైడ్ లో లారీ ఒచ్చింది ఆక్సిడెంట్ అయింది,
(సామ్) సరే వెళదాం పద. నేను మన బాస్ కి కాల్ చేసి ఇక్కడ జరిగింది చెప్తా మన బాస్ కి పోలీస్ కమీషనర్ తెలుసు మనకి ఏమైనా సహాయపడొచ్చు..
పోలీస్ స్టేషన్ దగ్గర…...
(అభీ) సర్ వెంకట్ గారు కాల్ చేసారు కదా నా పేరు అభీ.
(పోలీస్ ఆఫీసర్) అ అభీ వెంకట్ చెప్పారు మీ భార్య మిస్సింగ్ అంట కదా ఇదిగో కార్ లో ఉన్న వస్తువులు కార్ ఇప్పుడు గ్యారేజ్ లో ఉంది మీరు తీసుకెళ్లొచ్చు,
(అభీ) thank you sir.
(పోలీస్ ఆఫీసర్) మీ భార్య మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వండి, మేము చూసుకుంటాం ఏమైనా తెలుస్తే మీకు కాల్ చేస్తాను.
(అభీ) సరే సర్.
అదే రోజు సాయంత్రం అభీ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేస్తాడు…..
(అభీ) హలో ఎవరు ?
(ఫోన్ లో వ్యక్తి ) “ నీ ఆయుష్షు చాల గట్టిది అనుకుంట బతికేసావ్ . ఏంటి నీ భార్య కోసం వెతుకుతున్నావా మరిచిపో నీ భార్య కాదు తను నా భార్య నా ఒక్కడికే భార్య”,
(అభీ) రేయ్ ఎవరు నువ్వు , ఏం మాట్లాడుతున్నావ్ నా భార్య ఎక్కడ, ఎక్కడ ఉంది,
(ఫోన్ చేసిన వ్యక్తి) మరిచిపో అని చెప్పాను కదా తను నా భార్య.
అని చెప్పి అ వ్యక్తి కాల్ కట్ చేస్తాడు.
లీల ఉన్న చోటు …….
(లీల) ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావ్ నీకు ఏం కావాలి.
(లీల నీ తీసుకొచ్చిన వ్యక్తి ) నాకు నువ్వే కావాలి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకొని వాడితో ఉంటె నేను ఎలా తట్టుకుంటాను అని అనుకున్నావ్ అందుకే నిన్ను తీసుకొచ్చాను.
నన్ను ఇంకా గుర్తు పట్టలేదా "అహన" , నేను నీ ఉదయ్ నీ నువ్వు కాలేజీ లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నం, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం.
(లీల) నా పేరు లీల, అహన అంటున్నవ్ ఏంటి నన్ను వదిలేయ్ నా అభీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు .
అని చెప్తూ లీల అభి గురించి ఏడుస్తూ ఉంటుంది.
కొన్ని సంవత్సరాల క్రితం కాలేజీ లో…….
రేయ్ ఉదయ్ ఇప్పుడు మనం సీనియర్స్ రా ఈరోజు ఒచ్చే ఫ్రెషర్స్ ( freshers ) నీ రాగ్గింగ్ ( ragging ) తో పిచ్చెకించాలి ప్రిన్సిపాల్ కి షాక్ ఇవ్వాలి రా.
(ఉదయ్) రేయ్ రాగ్గింగ్ ( ragging ) చేయడం మనకి ఎందుకు రా సంతోషంగా ఫ్రెషర్స్ ( freshers )నీ ఆహ్వానిదం మన సీనియర్స్ చేసిందే మనం చేస్తే వాళ్లకి మనకు తేడా ఏం ఉంటది రా.
కాలేజీ కీ ఒస్తున్నం అంటే ఏదయినా మంచి నేర్చుకోడానికి అంతే కానీ ప్రతి ఒక్కరు చిరాకు పడేలా ఉండకూడదు పద క్లాస్ కి వెళదాం.
(ఉదయ్ స్నేహితుడు )రేయ్ ఉదయ్ అక్కడ చూడురా అమ్మాయిల గురించి కామెంట్స్ ( comments )చేస్తున్నారు అనుకుంట పద వెళ్లి చూదాం.
(ఉదయ్) ఏం చేస్తున్నారు ఇక్కడ.
(ఉదయ్ స్నేహితులు) ఏం లేదు మామ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు వస్తుంటే చుస్తునాం.
(ఉదయ్) మీరు చూసి ఏం చేస్తారులే కానీ క్లాస్ మొదలయింది ముందు క్లాస్ కి పదండి.
(ఉదయ్ స్నేహితుడు) రేయ్ ఉదయ్ అక్కడ చూడురా, అ అమ్మాయి నీకోసమే పుట్టినట్టు ఉంది.
(ఉదయ్) అవునా సరే ఉండని నువ్వు క్లాస్ కి పదా.
అదే రోజు సాయంత్రం…...
(ఉదయ్ స్నేహితులు) ఉదయ్ పొదుద్న చుసిన అదే అమ్మాయి రా.
(ఉదయ్) మీరు వెళ్ళండి నేను వెళ్లి కలిసి మాట్లాడి ఒస్తాను.
కాసేపటికి హాస్టల్లో ఉదయ్ రూమ్ లో…..
(ఉదయ్ స్నేహితుడు ) ఏంట్రా ఉదయ్ లేట్ అయింది లేడీస్ హాస్టల్ వార్డెన్ కుమ్మేసిందా.
(ఉదయ్) అల ఏం లేదు రా నువ్వు పొద్దున్న కాలేజీ లో చెప్పావ్ కదా అమ్మాయి అని అ అమ్మాయి నీ కాలేజీ గేట్ దగ్గరె చూసాను మన వాళ్ళు అమ్మాయిల గురించి ఏదో అంటుంటే క్లాస్ మొదలయింది అని అక్కడ నుంచి తీసుకెళ్ళాను అందుకే నువ్వు చెప్పిన నేను పటించుకోలేదు.
సాయంత్రం మాట్లాడుదాం అని వెళ్ళాను కానీ ఏం మాట్లాడలేక పోయాను రా.
(ఉదయ్ స్నేహితుడు) రేయ్ ఉదయ్ ఫణి వాళ్లు మన హాస్టల్ కి ఒచ్చి గొడవ చేస్తున్నారు రా.
అ రోజు రాత్రి హాస్టల్ లో గొడవ జరుగుతుంది.
తర్వాత రోజు కాలేజీ లో…...
(ఉదయ్ స్నేహితుడు) రేయ్ ఉదయ్ అ అమ్మాయి పేరు "అహన" అంట అ ఫణి గాడు వాళ్ళ స్నేహితులు అ అమ్మాయిని ఏడిపిస్తునారు త్వరగా ర రా.
(ఉదయ్) అ ఫణి గాడికి రాత్రి పడింది సరిపోలేదు అనుకుంటా పద వెళదాం.
(ఫణి స్నేహితుడు) రేయ్ ఫణి ఉదయ్ ఒస్తునాడు మనం వెళ్ళిపోదాం పదరా.
(ఫణి) హే వాడు వస్తే నాకు ఏంటి రా.
(ఉదయ్ స్నేహితులు) రాత్రి ఒక రౌండ్ అయింది మల్లి ఇంకో రౌండ్ కి మాకు ఓపిక లేదు వెళదాం ర రా.
ఫణి వాళ్ళు వెళ్ళిపోతారు……..
(ఉదయ్ స్నేహితుడు) హే హయ్ మా వాడి పేరు ఉదయ్ మీకు కాలేజీ లో ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే మాకు చెప్పండీ. ఏరా ఉదయ్ అంతే కదా .
(ఉదయ్) చాలు ఇంకా అపు. ఉదయ్ ,అహన తో మీరు క్లాస్ కి వెళ్ళండి అని అంటాడు .
ఉదయ్ ఇంకా అహన ఒకరిని ఒకరు చూసుకుంటూ క్లాస్ కి వెళ్తారు.
ఒక వారం తర్వాత…….
(ఉదయ్ స్నేహితుడు) ఇంత పొద్దునే ఎక్కడికి బయలుదేరావ్ రా.
(ఉదయ్) గుడి కి రా అహన పుట్టినరోజు ఈరోజు. గుడికి వెళదాం అని చెప్పింది వెళ్తున్న.
(ఉదయ్ స్నేహితుడు) ఇది ఎప్పటినుంచి రా.
(ఉదయ్) అ రోజు ఫణి గాడు అహనని రాగ్గింగ్ (ragging) చేసాడుకదా అప్పుడే , అదే రోజు సాయంత్రం కాఫీ షాప్ లో నేను అహన కలుసుకున్నాం , మాట్లాడుకున్నాము.
తన గురించి చెప్పింది రా వాళ్ళ అమ్మ నాన్న నీ ఆస్తి కోసం వాళ్ళ బాబాయి వాళ్ళు చంపేసారు అని అలంటి వారితో ఉండడం ఇష్టం లేక తను ఇంట్లో నుండి ఒచ్చేసింది.
సరే టైం అవుతుంది నేను ఇప్పుడు గుడికి వెళ్తున్న. నేను అక్కడినుండి కాలేజీ కి వస్తాను నా బ్యాగ్ కూడా తీసుకురా కాలేజీ లో కలుదాం.
ఉదయ్ ఇంకా అహన ప్రేమించుకుంటారు, అల వాళ్ళ చదువు కూడా పూర్తి చేస్తారు.ఉదయ్ కూడా చిన్న కంపెనీ లో జాబ్ లో చేరతాడు. ఒక రోజు ఉదయ్ అహన తో " హే కుట్టి పెళ్లి చేసుకుందామా అని అంటాడు.
ప్రస్తుతం (present day).....
(ఉదయ్) గుర్తుకొచ్చిందా అహన మనం ప్రేమించుకునం పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము. నువ్వు ఏం బయపడకు నేను నిన్ను మంచి గా చూసుకుంటాను నువ్వు అ అభి గాడిని మరిచిపో.
అభీ ఇంటి దగ్గర…..
(అభీ) హలో సామ్ నేను అభీ రా నాకు ఒక నెంబర్ నుంచి కాల్ ఒచ్చింది కదా అ నెంబర్ ఎవరిదో తెలుసుకుందాం అని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న నువ్వు ఒస్తావా వెళదాం.
పోలీస్ స్టేషన్ లో…..
(అభీ) హలో సర్ నేను అభినవ్ నా భార్య కనపడడం లేదు అని చెప్పను కదా నాకు ఒక నెంబర్ నుంచి కాల్ ఒచ్చింది అ నెంబర్ ఎవరిదీ ఎక్కడనుండి కాల్ చేసారు తెలుసుకుందాం అని వచ్చాను.
(పోలీస్ ఆఫీసర్) మీరు అల కూర్చోండి అ నెంబర్ ఇవ్వండి నేను చూసి చెప్తాను .
కాసేపటికి……..
(పోలీస్ ఆఫీసర్) అభీ అ నెంబర్ ఎక్కడ ఉందొ తెలిసింది.
(అభీ) సామ్ నేను అక్కడికి వెళ్తాను రా.
(సామ్) నేను కూడా వస్తాను.
(అభీ) ఒద్దు సామ్ నా గొడవ వాళ్ళ నీకు ఏమైనా జరిగితే మీ కుటుంబానికి ఇబ్బంది ఇంత వరకు నాకు తోడుగా ఉన్నావ్ చాలు మిగితా విషయం నేను చూసుకుంటాను సామ్.
(సామ్) సరే రా జాగ్రత్త.
అభీ పోలీస్ ఆఫీసర్ చెప్పిన చోటుకి వెళ్తాడు. అ చోటు లో పాడుబడిన ఇల్లు ఉంటుంది. అభీ అ ఇంటిలోపలికి కి వెళ్తాడు.
అక్కడికి ఎదో కార్ వస్తున్న శబ్దం వినపడుతుంది, అది గమనించిన అభీ మెల్లగా కిటికీ నుంచి బయటకు చూస్తాడు. అ కార్ నుంచి ఒక వ్యక్తి దిగుతాడు.
అ వ్యక్తి ఇంట్లోకి వస్తాడు. అభీ అ వ్యక్తి నీ తల పైన కర్ర తీసుకొని కొడతాడు అప్పుడు అ వ్యక్తి స్పృహ కోల్పోతాడు.
అ వ్యక్తి నీ అభీ కాటేస్తాడు, కాటేసిన తర్వాత అ వ్యక్తి నీ లేపి నాకు ఫోన్ చేసింది నువ్వే కదా నా లీల ఎక్కడ అని అభీ అ వ్యక్తి నీ అడుగుతాడు.
అప్పుడు అ వ్యక్తి తన పేరు ఉదయ్ అని తాను ప్రేమించిన అమ్మాయి విషయం అభీ కి చెప్తాడు. తనకు జరిగింది అభి కి ఇలా చెప్తాడు
(ఉదయ్) నేను, అహన పెళ్లి చేసుకుందాం అనుకున్నాము అ తర్వాత రోజు నేను రిజిస్టర్ ఆఫీస్ లో అహన కోసం ఎదురు చేస్తున్న తను ఎంతకీ రాలేదు, అక్కడే ఎదురు చేస్తున్న.
అప్పుడే నాకు ఫోన్ కాల్ ఒచ్చింది నీకు కాబోయే భార్య కోసం ఎదురు చేస్తున్నావా అది చచ్చి గంట అయింది దాన్ని చూడాలి అంటే స్టీల్ గోడౌన్ కి రా అని చెప్పి కాల్ కట్ చేసారు.
నేను వెంటనే స్టీల్ గౌడౌన్ కి బయలుదేరాను మధ్యలో నాకు ఆక్సిడెంట్ అయింది తర్వాత ఎం జరిగింది అనేది నాకు తెలియదు.
నేను లేచి చూసేసరికి హాస్పిటల్ లో ఉన్నాను డాక్టర్ నీ అడిగాను నాకు ఏమైంది అని, డాక్టర్ చెప్పారు ఆక్సిడెంట్ తర్వాత నేను కోమా ( coma ) లోకి వెళ్ళాను అని.
ఒక రోజు నేను అనుకోకుండా స్కూల్ లో అహన నీ చూసాను తాను కూడా నన్ను చూసింది కానీ నన్ను గుర్తుపట్టలేదు.
అప్పటినుండి తనని ఫాలో చేశాను. నీతో అహన ని చూసి ఆశ్ఛర్యపోయాను అప్పుడే నేను పథకం వేసి మీరు వస్తున్న కార్ కి ఆక్సిడెంట్ చేసాను అహన నీ ఇక్కడికి తీసుకొచ్చాను.
(అభీ) నువ్వు చెప్పే కథలు వినడానికి నేను ఇక్కడికి రాలేదు లీల ఎక్కడ ఉంది.
(ఉదయ్) పైన రూమ్ లో ఉంది.
అభీ పైన ఉన్న రూమ్ కి వెళ్లి లీల నీ చూస్తాడు.లీల ఇంకా అభీ ఉదయ్ దగ్గరికి వస్తారు.
అభీ , ఉదయ్ చూస్తూఉండగా లీల నీ ఇలా అడుగుతాడు " ఇతను నీకు తెలుసా లీల అని ".
నాకు ఇతను ఎవరో తెలియదు అభీ అని లీల చెపుతుంది.
అప్పుడు ఉదయ్ మాట్లాడుతూ " నేను నిజం నిరుపిస్తాను తన బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళదాం" అని చెప్తాడు. ఉదయ్, అభీ ఇంకా లీల ఉదయ్ చెప్పిన ఇంటికి వెళ్తారు .
ఉదయ్ చెప్పిన ఇంటి దగ్గర…….
(అభీ)నువ్వు కార్ లోనే ఉండు లీల నేను ఉదయ్ వెళ్లి ఒస్తాము.
(లీల) సరే అభీ నేను ఇక్కడే ఉంటాను.
అభీ ఇంకా ఉదయ్ ఇద్దర కలిసి ఇంటిలోపలికి వెళ్తారు .
అహన చనిపోయింది అని తెలుసుకుంటారు. లీల ఇంకా అహన ఇద్దరు వేరే అని ఉదయ్ కి అప్పుడు అర్ధం అవుతుంది.
తను చేసిన తప్పు తెలుసుకొని అభీ ఇంకా లీల కు క్షమాపణ చెప్పి అక్కడి నుండి ఉదయ్ వెళ్ళిపోతాడు.
ఉదయ్ వెళ్లే సమయం లో లీల ఉదయ్ తో ఇలా చెప్తుంది.
"మీరు ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు మీతో లేదు అని బాధపడకండి ఏ అమ్మాయి ఐనా ప్రేమించిన వారి సంతోషం కోరుకుంటుంది వాళ్ళు ఎప్పుడు బాగుండాలి అని అనుకుంటుంది. మీరు అహన నీ మరిచిపోయి ఒక కొత్త జీవితం మొదలు పెట్టండి. అహన మీతో లేకపోయినా మీరు సంతోషం గా ఉంటె తాను ఎక్కడ ఉన్న సంతోషంగా ఉంటుంది".
(ఉదయ్) సరే లీల గారు అహన కోసం నేను కొత్త జీవితం మొదలు పెడతాను నేను వెళ్తాను.
వారం రోజుల తర్వాత…...
(అభీ) లీల నిన్ను స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తాను అని చెప్పను కదా ఈరోజు వెళదామా.
(లీల) వెళదాం.
వెళ్లే దారిలో లీల ఇంకా అభి మాట్లాడుకుంటున్నారు….
(లీల) నన్ను క్షమించు అభీ నేను నీకు అబ్బదం చెప్పాను.
(అభీ) ఎ విషయం లో అబ్బదం చెప్పావు లీల.
(లీల) నాకు ఉదయ్ తెలియదు అని చెప్పాను కదా,కాని నాకు ఉదయ్ తెలుసు.
(అభీ) నీకు ఉదయ్ తెలుసు అని నాకు తెలుసు లీల.
(లీల) అది ఎలా అభి .
(అభీ) పోలీస్ ఆఫీసర్ చెప్పిన చోటుకి నిన్ను వెతుకుంటూ అ రోజు అ ఇంటికి ఒచ్చాను.అక్కడ ఉదయ్ బ్యాగ్ ఉంటె చూసా అందులో ఉదయ్ ఇంకా నువ్వు కలిసి ఉన్న ఫోటోలు ఇంకా నీ డైరీ నీ చూసా కానీ అ డైరీ లో పేరు అహన అని రాసి ఉంది.
ఉదయ్ నీ అడిగా నీకు ఈ డైరీ ఎక్కడిది అని " నువ్వు చదువుకో నే అప్పుడు హాస్టల్ ఉన్నావ్ అంటా కదా లీల, ఉదయ్ మీ హాస్టల్ కి వెళ్లాడు అంటా అక్కడ ఇందు అనే అమ్మాయి ఈ డైరీ ఉదయ్ కి ఇచ్చింది అంటా.
అందుకే అదే రోజు అడిగాను ఉదయ్ నీకు తెలుసా అని నువ్వు తెలియదు అన్నావ్. నువ్వు తెలియదు అని చెప్పావ్ అంటే ఏదో జరిగే ఉంటుంది అని అనుకున్న అందుకే నిన్ను మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లలేదు.
(లీల) Thank you అభీ నన్ను అర్ధం చేసుకునందుకు .ఉదయ్ పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు అ రోజు రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరాను, వెళ్లే దారిలో మా బాబాయి నన్ను ఇంకా ఉదయ్ నీ చంపుదాం అని పథకం వేసారు.
ఈ విషయం మా పిన్ని నాకు కాల్ చేసి చెప్పింది.ఉదయ్ నీ కాపాడుకోవాలి అని వెళ్లిన నన్ను మా బాబాయి మనుష్యులు నన్ను ఉదయ్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
నన్ను మా బాబాయ్ దగ్గరికి తీసుకెళ్లరు. మా బాబాయ్ నాతో మాట్లాడుతూ " నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఆస్థి మొత్తం నీకు నీ భర్తకి చెందుతుంది అదే నిన్ను ,వాడిని చంపేస్తే ఈ ఆస్థి మొత్తం నా దగ్గరే ఉంటది " అని చెప్పాడు.
నాకు ఆస్థి వద్దు నన్ను ఉదయ్ ని వదిలేయమని చెప్పను. మా బాబాయ్ నా మాట వినలేదు. ఉదయ్ ని కాపాడుకోవాలి అని నేను అక్కడినుండి తపించుకున్నాను.
అల తపించుకున్న నన్ను మా బాబాయ్ మనుష్యులు చూసి నన్ను లోయలోకి తోసేసారు దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాను. చాల రోజులు పట్టింది నేను కోలుకోడానికి
నేను కోలుకున్నాక ఉదయ్ కోసం వెళ్ళాను, వెళ్ళాక తెలిసింది మా బాబాయి చేయించిన ఆక్సిడెంట్ లో ఉదయ్ చనిపోయాడు అని.
అది విని నేను చనిపోదాం అనుకున్న కానీ చనిపోవాల్సిన నేను బ్రతికాను అంటే ఏదో చేయాలి అని రాసి పెట్టి ఉంది అందుకే అక్కడి నుండి ఇక్కడికి ఒచ్చి లీల గా పేరు మార్చుకున్న.
నా స్నేహితురాలు ప్రతిమ సహాయంతో లేడీస్ హాస్టల్ లో ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే దానిని.
అ తర్వాత నువ్వు నన్ను చూడడం, నేను నీకు నచ్చడం, మనం పెళ్లి చేసుకోడం జరిగింది. మన పెళ్లి తర్వాత ఒక కొత్త జీవితం మొదలు పెట్టాను అభీ.
నేను ఉదయ్ నీ, నన్ను తీసుకెళ్లిన రోజే గుర్తుపట్టాను. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఉదయ్ నేను చనిపోయాను అంటే తాను కూడా చనిపోతాడు అని తెలుసు అందుకే తాను వెళ్ళేటప్పుడు ఒక కొత్త జీవితం మొదలు పెట్టు అని చెప్పను.
ఉదయ్ మీద నాకు ఉన్న ప్రేమ అ లోయలో నే పోయింది.
నీతో ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నను.
నువ్వు ఉంటే చాలు అభీ నాకు. ఉదయ్ కూడా తన జీవితం తాను చూసుకుంటాడు మనకు ఏ ప్రాబ్లెమ్ ఉండదు.
(అభీ) సరే లీల నీ సంతోషమే నాకు ముఖ్యం. ఉదయ్ ఫోన్ నెంబర్ నేను తీసుకున్నాను. మనమే ఉదయ్ కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేదాం.
మనం ఇప్పుడు అనాదశరణాలయానికి వెళ్తునం నీకు నచ్చినా వారిని దత్తతు తీసుకుందాం.
(లీల) సరే అభీ.
ఒక సంవత్సరం తర్వాత.
అభీ ఇంకా లీల వాళ్ళ పాప తో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు .ఒక మంచి అమ్మాయిని చూసి ఉదయ్ పెళ్లి చేస్తారు.
No comments:
Post a Comment