నీతోనే ఉంటాను .... ఎప్పటికైనా

                           
 ఒక రోజు ఆఫీస్ లో పని ఉండటం వల్ల కర్ణ ఇంటికి లేట్ గా బయలుదేరుతాడు . అప్పుడు సమయం తొమ్మిది (9). బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కర్ణ . 

బస్ రాకపోయేసరికి నడుచుకుంటూ ఇంటికి వెళదాం అని అనుకుంటున్నాడు . హఠాత్తుగా ఒక అమ్మాయి స్కూటీ లో ఒచ్చి కర్ణ ముందు ఆగుతుంది.

కర్ణ మాట్లాడుతూ " ఎవరండీ మీరు నా ముందు బండి ఎందుకు ఆపారు " అని అంటాడు .

అమ్మాయి మాట్లాడుతూ " నిన్ను చాల సేపటినుంచి గమనిస్తున్న బస్సు కోసం చూస్తున్నట్టు ఉన్నావ్ , ఎక్కడికి వెళ్లాలో చెప్పు నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను " అని అంటుంది.

కర్ణ మాట్లాడుతూ " నేను ఎవరో మీకు తెలియదు ,మీరు ఎవరో నాకు తెలియదు అయిన డ్రాప్ చేస్తాను అని  చెప్పినందుకు థాంక్స్ నేను నడుచుకుంటూ వెళ్తాను నాకు నడవడం అలవాటే " అని అంటాడు.

అమ్మాయి మాట్లాడుతూ " ఇప్పుడు టైం తొమ్మిది (9) అయింది. బస్ ఒస్తుందో రాదో తెలియదు రోజు నడుచుకుంటూ వెళ్తావ్ కదా ఈ రోజు నేను డ్రాప్ చేస్తాను. నువ్వు ఏం బయపడకు నేను మంచి అమ్మాయినే ఏదో ఒక్కడివే ఉన్నావ్ కదా అని ఒచ్చాను " అని అంటుంది .

కర్ణ కొంచం అలోచించి  ఒక్క రోజే కదా వెళదాం అని అనుకోని అ అమ్మాయితో వెళ్తాడు .

వెళ్లే దారిలో అమ్మాయి మాట్లాడుతూ కర్ణ నీ ఇలా అడుగుతుంది " నీ పేరు ఏంటి ? ఎక్కడ పని చేస్తున్నావ్ ?".

కర్ణ మాట్లాడుతూ " నా పేరు కర్ణ . నేను ఫైనాన్స్ కంపెనీ లో పని చేస్తున్న. రెండు సంవత్సరలు అయింది అ కంపెనీ లో చేయబట్టి ".

అమ్మాయి మాట్లాడుతూ " నీకు బైక్ లేదా ,రోజు బస్ లోనే వెళ్తావా " .

కర్ణ మాట్లాడుతూ " ఇంట్లో ఉన్నది ఒక్కటే బైక్ ,నాన్న కి బయటికి వెళ్లే పని ఉంటుంది, అందుకే నేను బస్ లోనే వెళ్తుంటాను ఎక్కడికైనా . నాకు  ఏదయినా పని ఉంటె అప్పుడు బైక్ తీసుకెళ్తాను ".

అమ్మాయి మాట్లాడుతూ " సర్దుకుపోవడం బాగా తెలిసినట్టుంది కదా నీకు ".

కర్ణ మాట్లాడుతూ " జీవితం అంటే నే సర్దుకుపోవడం ( compromise ) కదా. ఇక్కడ పక్కన ఆపండి నేను దిగుతాను".

అమ్మాయి మాట్లాడుతూ " ఇదే మీ ఇల్లు అ ".

కర్ణ మాట్లాడుతూ " కాదు ఇదే లైన్ లో మూడో ఇల్లు చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది.డ్రాప్ చేసినందుకు థాంక్స్, నేను వెళ్తాను మీరు జాగ్రత్తగా వెళ్లండి ".

అమ్మాయి మాట్లాడుతూ " రేపు ఏ టైం కి ఆఫీస్ కి వెళ్తావ్ ".

కర్ణ మాట్లాడుతూ " రోజు పొద్దున్న  (8) ఎనిమిది గంటలకు బయలుదేరుతాను "

అమ్మాయి మాట్లాడుతూ " సరే మరి నేను వెళ్తాను".

కర్ణ మాట్లాడుతూ " సరే అండి థాంక్స్ ".

అమ్మాయి వెళ్ళిపోతుంది . కర్ణ ఆలోచిస్తూ అమ్మాయి పేరు అడగడం మరిచిపోయానే మల్లి కనిపిస్తుందో లేదో అని అనుకుంటాడు.

తర్వాత రోజు కర్ణ నీ డ్రాప్ చేసిన అమ్మాయి ,కర్ణ కోసం తన ఇంటిదగ్గరకి ఒస్తుంది. 

అ అమ్మాయిని చుసిన కర్ణ అమ్మాయితో మాట్లాడుతూ " మీరేంటండి ఇక్కడ అని అడుగుతాడు ".

అమ్మాయి మాట్లాడుతూ " నిన్న రాత్రి చెప్పావ్ కదా ఈ టైం కి ఆఫీస్ కి వెళ్తాను అని ,నేను ఆఫీస్ కి వెళ్తున్న నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేదాం అని నీకోసం చూస్తున్న ".

కర్ణ మాట్లాడుతూ " అయ్యో రాత్రి బస్ లేదు అని మీతో ఒచ్చాను , ఇప్పుడు బస్సులు ఉంటాయి కదా బస్ లోనే వెళ్తాను ".

అమ్మాయి మాట్లాడుతూ " నేను వెళ్ళేది మీ ఆఫీస్ రూట్ లోనే ఏం పేర్లేదు నేను డ్రాప్ చేస్తా ".

కర్ణ మాట్లాడుతూ " సరే మీరు నన్ను డ్రాప్ చేసేదాకా ఒదిలేటట్టులేరు పదండి వెళ్దాం ".

ఆఫీస్ దగ్గర…….

అమ్మాయి మాట్లాడుతూ " ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది ".

కర్ణ మాట్లాడుతూ " 6 కి , ఇంతకీ మీ పేరు చెప్పలేదు ".

అమ్మాయి మాట్లాడుతూ " సాయంత్రం కాఫీ షాప్ కి రా అక్కడ చెప్తా నా పేరు , నీ ఫోన్ నెంబర్ ఏంటి ".

కర్ణ నెంబర్ తీసుకొని అమ్మాయి అక్కడనుండి వెళ్ళిపోతుంది .

సాయంత్రం కాఫీ షాప్ లో…..

అమ్మాయి మాట్లాడుతూ " ఈరోజు ఆఫీస్ లో పని చేసావా లేదా అమ్మాయి ఎవరు, నాకు ఎందుకు లిఫ్ట్ ఇచ్చింది అని ఆలోచించావా "

కర్ణ మాట్లాడుతూ " సాయంత్రం కాఫీ షాప్ కి రమ్మని చెప్పారు కదా అందుకే ఏం ఆలోచించలేదు , ఇప్పుడు అడుగుతున్న మీరు ఎవరు "

అమ్మాయి మాట్లాడుతూ " ముందు నాకు కాఫీ తాగాలని ఉంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం కాఫీ తీసుకొని రా  " 

కర్ణ కాఫీ తీసుకొస్తాడు..

కర్ణ మాట్లాడుతూ " తీసుకోండి కాఫీ ఇప్పటికైనా చెప్తారా".

అమ్మాయి మాట్లాడుతూ " చెప్తాను కానీ నన్ను మీరు అని అనకు నువ్వు అను చాలు"

కర్ణ మాట్లాడుతూ " సరే నువ్వు ఎవరు?"

అమ్మాయి మాట్లాడుతూ " మా ఇంట్లో నాకు పెళ్లి చేదాం అని అనుకుంటున్నారు ".

కర్ణ మాట్లాడుతూ " ఐతే నాకు ఏంటి , నాకు లిఫ్ట్ ఎందుకు ఇచ్చారో అది చెప్పండి ".

అమ్మాయి మాట్లాడుతూ " నేను చెప్పేది పూర్తి గా విను అబ్బాయి ".

కర్ణ మాట్లాడుతూ " సరే చెప్పు "

అమ్మాయి మాట్లాడుతూ " మా నాన్నగారి స్నేహితుడు ఒక సంబంధం తీసుకొచ్చారు , అబ్బాయి ఫోటో ఇచ్చారు , మా నాన్న అ ఫోటో నాకు చూపించారు , నేను అలోచించి చెప్తా అని చెప్పను "

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడు ఏంటి అ ఫోటోలో ఉన్న వాడి గురించి తెలుసుకొని  నీకు చెప్పాలా ".

అమ్మాయి మాట్లాడుతూ " అ అబ్బాయి గురించి తెలుసుకుందాం అని నీకు లిఫ్ట్ ఇచ్చాను , అ ఫోటో లో ఉన్న అబ్బాయి ఎవరో కాదు నువ్వే.

మా నాన్న స్నేహితుడు మీ నాన్న కి కూడా స్నేహితుడు అంటా నువ్వు మంచోడివి అని చెప్పి నీ ఫోటో ఇచ్చారు , నువ్వు మంచోడివో కాదో తెలిసుకుందాం అని నేను లిఫ్ట్ ఇచ్చాను ".

కర్ణ మాట్లాడుతూ " అయినా నేను బస్ స్టాప్ లో ఉన్న అని నీకు ఎలా తెలుసు ".

అమ్మాయి మాట్లాడుతూ " నిన్న రాత్రి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లొస్తుంటే బస్ స్టాప్ లో నిన్ను చూసా ని గురించి తెలిసుకుందాం ,కలిసి మాట్లాడుదాం అని లిఫ్ట్ ఇచ్చాను "

కర్ణ మాట్లాడుతూ " మరి ఏం తెలుసుకున్నావ్ నా గురించి "

అమ్మాయి మాట్లాడుతూ " పెళ్లి చేసుకోవచ్చు కానీ నా గురించి నువ్వు నీ గురించి నేను ఇంకా కొంచం తెలుసుకొని ఒక రెండు లేదా మూడు నెలల తర్వాత పెళ్లి చేసుకుందాం "

కర్ణ మాట్లాడుతూ " థాంక్స్ అమ్మ. నా జీవితం లో నేను చేయాలిఅనుకున్నవి కొన్ని ఉన్నాయి అ తర్వాతే పెళ్లి చేసుకుందాం అని అనుకున్న "

అమ్మాయి మాట్లాడుతూ " అయితే మనం కొన్ని రోజులు ఫ్రెండ్స్ లాగా ఉందాం , మనకు సెట్ అయినప్పుడు అమ్మ, నాన్నలకి చెపుదాం "

కర్ణ మాట్లాడుతూ " సరే అన్ని చెప్తున్నావ్ , మాట్లాడుతున్నావ్ కానీ నీ పేరేంటో ఇంకా చెప్పలేదు "

అమ్మాయి మాట్లాడుతూ " నా పేరు వృశాలి . నేను టీవీ రిపోర్టర్ గా పని చేస్తున్న , సరే  టైం అవుతుంది వెళ్దాం నిన్ను డ్రాప్ చేయాలా ,బస్ లో వెళ్తావా ".

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడే ఫ్రెండ్స్ అన్నావ్ , అప్పుడే మధ్యలో ఒదిలేస్తావా , నేను నీతోనే వస్తా పద ".

అల మూడు నేలలు గడిచాయి. ఒక రోజు అర్ధ రాత్రి వృశాలి ఇంటికి ఒకరు ఒస్తారు, అ వ్యక్తి నెమ్మదిగా వృశాలి గది వైపుకి వెళ్తాడు. వృశాలి నిద్ర లేస్తుంది.

అ వ్యక్తి వృశాలి ముందు నిల్చొని దీపం వెలిగిస్తాడు. అ దీపం వెలుగులో అ వ్యక్తి మొహం కనిపిస్తుంది. ఒచ్చింది కర్ణ అని తెలుస్తుంది.

అ రోజు వృశాలి పుట్టినరోజు అ దీపం వెలుగులో కర్ణ వృశాలి కి పుట్టినరోజు శుభాకంక్షాలు చెప్పి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. సంతోషంతో వృశాలి కర్ణ నీ కౌగిలించుకొని కర్ణ పై తనకు ఉన్న ప్రేమ వ్యక్తం చేస్తుంది.

వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్తారు . వృశాలి ఇంకా కర్ణ పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు ఇంట్లో వాళ్ళు.

పెళ్ళికి ఇంకా పది రోజులే ఉన్నాయి . వృశాలి ఆఫీస్ పని ఉంది అని ముంబై కి బయలుదేరుతుంది. 

రైల్వే స్టేషన్ లో....

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడు నువ్వు ముంబై వెళ్లడం అవసరమా మన పెళ్ళికి ఇంకా పది రోజులే ఉన్నాయి "

వృశాలి మాట్లాడుతూ " రిపోర్టర్ పని అంటే ఇలానే ఉంటుంది . మన పెళ్లి టైం కి ఒస్తాను "

కర్ణ " అయితే  నేను నీతో ఒస్తాను బంగారం "

వృశాలి " కర్ణ నేను ఆఫీస్ పని కోసం వెళ్తున్న పని అయిపోగానే  ఒస్తాను "

కర్ణ మాట్లాడుతూ " సరే జాగ్రత్త వెళ్ళాక ఫోన్ చేయి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను "

వృశాలి వెళ్లిన మూడు రోజుల తర్వాత , వృశాలి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న కర్ణ కి ముంబై లో ఉన్న ఒక హాస్పిటల్ నుండి ఫోన్ ఒస్తుంది .

ఫోన్ చేసిన వ్యక్తి కర్ణ తో ఇలా చెప్తారు " మేము ముంబై హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాము. ఇక్కడ ఒక అమ్మాయికి ఆక్సిడెంట్ అయింది , తన దగ్గర ఈ నెంబర్ ఉంది అందుకే మీకు కాల్ చేస్తున్నాము మీరు వెంటనే రండి ".

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడు తనకి ఎలా ఉంది ".

ఫోన్ చేసిన వ్యక్తి " మీరు త్వరగా బయలుదేరండి ఇక్కడికి వస్తే అన్ని వివరాలు తెలుస్తాయి"  అని చెప్పి కాల్ కట్ చేస్తారు .

కర్ణ వృశాలి వాళ్ళ నాన్నకి జరిగిన విషయం చెప్తాడు. ఇద్దరు కలిసి ముంబై కి వెళ్తారు.

ముంబై హాస్పిటల్ లో .....

కర్ణ మాట్లాడుతూ " మీ హాస్పిటల్ నుండి నాకు కాల్ ఒచ్చింది అమ్మాయికి ఆక్సిడెంట్ అయింది అని అమ్మాయి ఎక్కడ"

నర్స్ మాట్లాడుతూ " మీరు నాతో రండి అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తాను "

కర్ణ మాట్లాడుతూ " నర్స్ మార్చురీ ( mortuary ) కి తీసుకెళ్తున్నారు ఏంటి" .

నర్స్ మాట్లాడుతూ " జరిగిన ఆక్సిడెంట్ లో అమ్మాయి చనిపోయింది " .

నర్స్ చెప్పింది వినగానే వృశాలి వాళ్ళ నాన్న స్పృహ కోల్పోతాడు , కర్ణ ఎం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు ...

నర్స్ మాట్లాడుతూ " నిన్న రాత్రి మాకు ఆక్సిడెంట్ అయింది అని ఫోన్ ఒచ్చింది ,మేము వెళ్లి చూసేసరికి తను చనిపోయింది. 

తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయి అని తన బ్యాగ్ చూసాం బ్యాగ్ కాలిగా ఉంది కానీ తన చేతికి ఉన్న బ్రాస్లెట్ ( bracelet ) పైన ఫోన్ నెంబర్ ఉంది . ఫోన్ చేస్తే మీరు మాట్లాడారు ".

కర్ణ బ్రాస్లెట్ ( bracelet ) గురించి ఊహించుకుంటాడు.

వృశాలి " కర్ణ నీ చేయి చూపించు ".

కర్ణ  మాట్లాడుతూ " ఎందుకు బంగారం ".

వృశాలి మాట్లాడుతూ " చూపించు  .. ఈ బ్రాస్లెట్ ( bracelet ) నా చేతికి కట్టు అంత కంటే ముందు ఈ బ్రాస్లెట్ పైన ఏం ఉందొ చూడు ".

కర్ణ మాట్లాడుతూ" నా ఫోన్ నెంబర్ . బ్రాస్లెట్ పైన ఎందుకు నెంబర్ వేయించావ్ ".

వృశాలి మాట్లాడుతూ " ఎప్పుడైనా , ఎక్కడైనా  నువ్వు నాతో లేనప్పుడు నాకు ఏమైనా జరిగితే ఈ నెంబర్ చూసి నీకు ఫోన్ చేస్తారు.నువ్వు ఎక్కడ ఉన్న నా కోసం ఒస్తావ్ , నా కోసం ఒస్తావ్ కదా కర్ణ "

కర్ణ మాట్లాడుతూ" ఒస్తాను బంగారం , అయిన నన్ను ఒదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావ్ "

వృశాలి మాట్లాడుతూ" ఎక్కడికి వెళ్ళాను నేను నీతో, నీలోనే ఉంటాను కర్ణ" 

ప్రస్తుతం….

హాస్పిటల్ నుండి వృశాలి నీ ఇంటికి తీసుకొస్తారు . వృశాలి కి జరగాల్సిన కార్యక్రమాలు చేస్తారు .

కర్ణ ఒంటరివాడు అయిపోతాడు ప్రేమించిన అమ్మాయి ,పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న అమ్మాయి ఇప్పుడు చనిపోయింది , తన తోడు ఎవరు లేరు అని ఎప్పుడు బాధలో ఉండేవాడు . ఆఫీస్ కి కూడా వెళ్లడం మానేస్తాడు. 

అల ఒక నెల గడిచిపోతుంది . ఒకరోజు కర్ణ కి ఒక మెసేజ్ ( message ) ఒస్తుంది. అ మెసేజ్ లో " వృశాలి కి జరిగింది ఆక్సిడెంట్ కాదు తనని చంపేశారు . ఎవరు చంపారో తెలుసుకోవాలి అంటే రేపు ఉదయం 10 గంటలకు కాఫీ షాప్ కి రా " అని ఉంటుంది .

తర్వాత రోజు....

కర్ణ కాఫీ షాప్ కి వెళ్తాడు . కాఫీ షాప్ లొ పని చేస్తున్న ఉన్న వ్యక్తి కర్ణ నీ చూసి పైకి వెళ్ళమని చెప్తాడు.

కర్ణ పైకి వెళ్తాడు . పైన ఒక టేబుల్ దగ్గర ఒంటరిగా ఒక అమ్మాయి కూర్చొనివుంటుంది . 

కర్ణ అ అమ్మాయి దగ్గరికి వెళ్లి నాకు మెసేజ్ పంపించింది మీరేనా అని అడుగుతాడు .

అ అమ్మాయి మాట్లాడుతూ " అవును కర్ణ నేనే పంపించాను కూర్చో".

కర్ణ మాట్లాడుతూ " మీరు ఎవరు ? అసలు వృశాలి కి ఏం జరిగింది ?

అమ్మాయి మాట్లాడుతూ " నా పేరు ప్రసిద్ధ . నేను వృశాలి ఒకే ఆఫీస్ లో పని చేస్తున్నాం కానీ నేను ముంబై ఆఫీస్ లో పని చేస్తున్నాను.

ఒక నెల క్రితం వృశాలి ఒక కేసు పని పైన  ముంబై ఒచ్చింది . వృశాలి అ కేసు గురించి అన్ని వివరాలు సేకరించింది . అ విషయం తెలుసుకొని వృశాలి నీ చంపేసారు ".

కర్ణ మాట్లాడుతూ " ఎవరు చంపేశారు ? "

ప్రసిద్ధ మాట్లాడుతూ " అశోక్ రకా . ఐదు (5) సంవత్సరాలక్రితం ఒక రౌడీ ఇప్పుడు MLA . MLA అవ్వడం కోసం చాల దారుణాలు చేసాడు.

చిన్న పిల్లలు ,పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా వాడికి అడ్డం ఒచ్చిన్న వారందరిని చంపుకుంటూ MLA అయ్యాడు.

ఇప్పుడు వాడి పదవిని అడ్డు పెట్టుకొని  డబ్బు కోసం మత్తు పదార్దాల వ్యాపారం చేస్తున్న విదేశీ వాళ్ళతో చేతులు కలిపాడు . ఎంతో మందిని వాడి మత్తు పదార్దాలకు బానిస చేసాడు. 

ఆరు నెలల నుండి వృశాలి వాడి గురించి వివరాలు సేకరించింది . విదేశాలనుండి మత్తు పదార్దాలు ముంబై లో ఉన్న  వాడి స్థావరానికి ఒస్తున్నాయి అని తెలిసింది.

ఈ  విషయం నేను వృశాలి కి చెప్పను . అప్పుడే వృశాలి వాడిని  పోలీసులకు పటించాలని ముంబై కి ఒచ్చింది. 

ముంబై కి ఒచ్చాక వాడి స్థావరానికి వెళ్ళింది . అక్కడ జరిగింది మొత్తం వీడియో తీసింది .

అప్పుడే తాను నాకు కాల్ చేసి ఇలా చెప్పింది " నేను వాడి  మనుష్యులకి దొరికిపోయాను వాడి దగ్గరకు ఒచ్చిన్న విదేశీలను చంపేశాడు ఇక్కడ జరిగింది నేను వీడియో తీసాను , వాళ్ళు నన్ను చంపేస్తారు అని తెలుసు ఈ వీడియో కెమెరా నీ ఇక్కడే దాచిపెడుతున్న నువ్వు తీసుకొని పోలీసులకు అప్పచెప్పు " అని చెప్పి కాల్ కట్ చేసింది.

తర్వాత తెలిసింది నువ్వు ముంబై ఒచ్చావ్ అని. హాస్పిటల్ కి వెళ్లి నీ నెంబర్ తీసుకొని నీకు మెసేజ్ చేశాను. 

వృశాలి సేకరించిన వివరాలు నా దగ్గరే ఉన్నాయి అ వీడియో కూడా ఉంటె వాడికి శిక్షపడేలాగా చేయొచ్చు . అ కెమెరా ఎక్కడ పెట్టిందో వృశాలి నాతో చెప్పింది .

అక్కడికి వెళ్తే కెమెరా తీసుకోవచ్చు . వృశాలి నిన్ను ఎంత ప్రేమించిందో నాకు చెప్పింది నీకు కూడా తెలియాలి వృశాలి చావుకి న్యాయం చేయాలి ,నిజాన్ని కాపాడాలి అని నీ దగ్గరికి ఒచ్చాను ".

అని తనకు తెలిసింది చెప్తుంది ప్రసిద్ధ.

వృశాలి నీ ఊహించుకుంటూ బాధ పడతాడు కర్ణ .

కర్ణ ఇంకా ప్రసిద్ధ ముంబై లో ఉన్న అశోక్ రకా స్థావరానికి వెళ్తారు . వాళ్లని చుసిన అశోక్ రకా మనుష్యులు కర్ణ నీ ప్రసిద్ధ నీ బంధిస్తారు.

అశోక్ రకా కి ఫోన్ చేసి చెప్తారు , అశోక్ రకా కర్ణ నీ కూడా చంపుదాం అని వాడి స్థావరానికి ఒస్తాడు. 

అశోక్ రకా మాట్లాడుతూ " నా గురించి సేకరించిన వివరాలు నాకు ఇస్తే మిమల్ని వదిలేస్తా ".

కర్ణ మాట్లాడుతూ " నేను మీకు కావాలనే దొరికిపోయాను నా వృశాలి నీ చంపినా మిమల్ని వదిలిపెట్టను ".

అశోక్ రకా మాట్లాడుతూ" ఒ నువ్వు అ పిల్ల కోసం ఒచ్చావా , పాపం దానికి కూడా చెప్పను నా వివరాలు ఇచ్చేయ్ అని అసలు వినలేదు , రెండు రోజులు మస్తు హింసించినం అయినా చెప్పలేదు. ఇంకా లాభం లేదు అని దాన్ని చంపి రోడ్ మీద పడేసినం , ఆక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ రాయించిన "

అ మాటలు వినగానే అశోక్ రకా నీ కొడతాడు అప్పుడు కర్ణ కి వాళ్ళకి గొడవ జరుగుతుంది. అదే సమయం లో అక్కడికి పోలీసులు ఒచ్చి అశోక్ రకా నీ వాడి మనుష్యుల్ని తీసుకెళ్తారు.

కర్ణ  , అశోక్ రకా  స్థావరానికి ఒచ్చే ముందు కమిషనర్ కి జరిగింది చెప్పి ఒస్తాడు , కర్ణ వేసిన ప్లాన్ ప్రకారం ప్రసిద్ధ గొడవ మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తుంది అల అశోక్ రకా నీ పోలీసులకి పటించి , వృశాలి సేకరించిన వివరాలతో వాడికి శిక్ష పడేలా చేసి వృశాలి చావుకి న్యాయం చేస్తారు ప్రసిద్ధ ఇంకా కర్ణ. 

కర్ణ , వృశాలి ఊహలోనే ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు .

No comments:

Post a Comment