News buliten.
ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి గా పోటీ చేస్తున్న గోవిందరాజులు హత్య చేయబడ్డారు.
పది రోజుల క్రితం:-
జన జీవన పార్టీ కార్యాలయంలో, పార్టీ పెద్ద గోవిందరాజులుతో మాట్లాడుతూ "ఈ సారి నువ్వు సీఎం పదవి కి పోటీ చెయ్ నీకు తోడుగా నేను ఉంటాను.. నువ్వు ఏం చేస్తావో, ఎంత డబ్బు ఖర్చు చేస్తావో నీ ఇష్టం కానీ ఈ సారి నువ్వే గెలవాలి".
గోవిందరాజులు, " అలాగే సర్ మీరు నాతో ఉండి నన్ను గెలిపిస్తాను అంటే నేను ఏదైనా చేసి గెలుస్తాను.. నేను వెళ్తాను సర్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ".
" సిద్ధ ఈ సారి నేను సీఎం కావాలి, నాకు పోటీ ఉండకూడదు. నాకు పోటీగా ఉన్నది అ ఆదికేశవులు, వాడిని ఏలయిన సరే సీఎం గా పోటీ చేయకుండా అపలి. నాకు వాడి గురించి అన్ని విషయాలు తెలియాలి " అని గోవిందరాజులు తన అనుచరుడితో అంటాడు.
శ్రీ కృష్ణ కాలనీ, హైదరాబాద్.
" శివ, రేయ్ శివ లెవర ఈరోజు గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదా, ఇంకా ఈ నిద్ర ఏంటి రా ". (అని అమ్మ)..
" అబ్బా, అమ్మ ఈసరికి గుడికి నువ్వే వెల్లమ నన్ను పడుకొని ప్లీస్ " (శివ)..
" పోనీ గుడి దగ్గర ఐన డ్రాప్ చేయరా లేట్ అవుతుంది " (అని అమ్మ)..
" చెప్తే విన్నావ్ కదా నువ్వు, సరే రెడి ఐ ఒస్తాను నువ్వు వేళ్ళు" (శివ)..
గుడి దగ్గర:-
శివ:- " అమ్మ దేవుడిని ఎక్కువ ఇబందీ పెట్టకుండ, తొందరగా రా నేను గిరి గాడి పార్టీ కి వెళ్ళాలి "..
అమ్మ:- " ఒచ్చింది ఇప్పుడే కదా రా అప్పుడే ఆర్డర్ వేస్తున్నావ్, తొందరగా గానే వస్తా లే "..
ఇంతలో గుడి నుండి ఆచారి గారు మాట్లాడుతూ " ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా దివ్యమైన రోజు, మీ మనసులో ఉన్న కోరికలను అ నారాయణునితో చెప్పుకోండి మీ కోరికను తప్పక తీరుస్తాడు "..
" ఎవరికి, ఎప్పుడు ఏది కావాలో ఆ దేవుడికి తెలియదా ఏంటి, మనం ఆడిగినవి అన్ని ఇస్తే ఇంకా మనుష్యులలో ఆశ పెరుగుతుంది. ఇప్పుడు నాకు girlfriend లేదు దేవుడా నాకు girlfriend కావాలి అనగానే ఇచ్చేస్తార " అని శివ మనసులో అనుకుంటాడు..
అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అ అమ్మాయి నీ చూస్తూ, శివ అ అమ్మాయి వెంటనే వెళ్తాడు..
అ అమ్మాయి, అర్చన చేయమని తన పెరు, గోత్రం ఆచారి గారికి చెప్తుండగా, అదే సమయంలో శివ కి తన స్నేహితుడి కాల్ రావడంతో అక్కడ నుండి వెల్లుపోతాడు.
కాల్ మాట్లాడి ఒచేసారికి అ అమ్మాయి అక్కడ నుండి వెళ్లిపోతుంది. అప్పుడు శివ తన మనసులో ఇలా అనుకుంటాడు " దేవుడా అడిగితేనే కోరికలు తిరుస్తావ్ అని అనుకున్న కానీ మనసులో అనుకున్న కోరికలను కూడా తిరుస్తావ్ అని అర్థం అయ్యింది. నువ్వు ఉన్నావ్ god is great " అని అనుకోని అక్కడ నుండి వెళ్ళిపోతాడు..
రెండు రోజుల తర్వాత:-
హైదరాబాద్ లో ఒక చోటు, గోవిందరాజులు తన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ముఖ్యమంత్రి పదవి కొసం ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా, ట్రాఫిక్ జామ్ అవ్వడంతో జనాలు అందరూ ట్రాఫిక్ లో ఉండిపోయారు. అ జనం లో శివ కూడా ఉంటాడు.
అదే సమయంలో గుడిలో చూసిన అమ్మాయి నీ చూస్తాడు శివ. అ అమ్మాయి దగ్గరకు వెళదాం అని ప్రయత్నం చేస్తాడు కానీ ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో అమ్మాయి నీ కలవలేకపోతాడు. మళ్ళీ మిస్ అయ్యింది అని అనుకోని అక్కడ నుండి వెళ్ళిపోతాడు శివ.
అక్కడే ప్రచారం లో ఉన్న గోవిందరాజులునీ ఎవరో గన్ తో షూట్ చేస్తారు, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడంతో గోవిందరాజులు బ్రతుకుతాడు.
పోలీసులు ఎవరిపైన మీకు అనుమానం ఉందా అని గోవిందరాజులునీ అడుగుతారు.
" నాకు ఎవరిపైన అనుమానం లేదు, ఇది నామీద జరిగిన ఎటాక్ నేనె చూసుకుంటాను మీరు వెళ్ళండి " అని గోవిందరాజులు పోలీసులతో అంటాడు..
గోవిందరాజులు మాట్లాడుతూ " రేయ్ సిద్ధ ఇది అ ఆదికేశవులు పనే అయిఉంటుంది, వాడు వాడి మనుష్యులు మన జోలికి రాకుండా మన పద్ధతిలో ఏదో ఒకటి చేయాలి. ఇది ఎన్నికల టైం వాడు చస్తే మనకే ప్రాబ్లెమ్. నేను ప్రచారం లో ఉన్నపుడు వాడు నన్ను చావుదాకా తీసుకెళ్ళడు కానీ వాడు ఎన్నికల ప్రచారం ఏ చేయకూడదు".
సిద్ధ:- " అలాగే అన్న ఏం చేయాలో చెప్పు "..
" రేపు వాడి మీటింగ్ ఉంది, వాడు మాట్లాడే సమయం లో స్టేజి కింద బాంబ్ ఉంది అని ఒక తప్పుడు సమాచారం ఇవ్వు, అ తర్వాత రోజు కార్ లో వెళ్తుండగా రాలతో కోటించు, ఇంట్లో నుండి కాలు బయట పెడుతుండగా ఇంటిపైకి బాంబ్ వేయు, వాడి social media accounts అన్ని hack చేయించు. వాడు ప్రచారం ఏ చేయకూడదు "..
అ తర్వాత రోజు రాత్రి శివ తన ఇంటి దగ్గర ఉన్న స్నేహితుడితో మాట్లాడుతూ..
" అబ్బాబ్బా ఏముంది రా అమ్మాయి, కనిపిస్తుంది కలుద్దాం అనుకునే లోపే కనుమారుగైపోతుంది. రేయ్ ఆది మళ్ళీ అ అమ్మాయి ఎప్పుడు కనిపిస్తుంది రా "..
శివ మాట్లాడుతూ ఉండగా, అక్కడికి ఒక packers & movers బండి ఇంకా ఒక కారు వస్తుంది. అ కార్ నుండి ఒక అమ్మాయి దిగుతుంది.
అది చూసిన శివ, " రేయ్ ఆది కలలో ఉన్న అమ్మాయి కళ్లముందుకు ఒచ్చింది ఏంట్రా, ఇది నిజమా కల పద వెళ్లి చూదాం. ఇది కల కాదురా నిజమే..
వేతకాబోయిన తీగ కాలికి తగిలినట్టు, నాకు నచ్చినా అమ్మాయి మన ఏరియా కి రావడం ఏంటి, అది కూడా నేను ఉన్న ఎదురింట్లోకి రావడం ఏంటి.. రేయ్ ఆది నేను ఫిక్స్ రా తానే నీ వదిన నా పెళ్ళాం నువ్వు కూడా ఫిక్స్ ఐపో అంతే. ఇంకా రేపటి నుండి ఈ శివగడి లవ్ స్టోరీ మొదలు"... అని అంటాడు శివ..
ప్రస్తుతం:-
శివ తన ఇంటి గేట్ దగ్గర నుండి అ అమ్మాయి బయటకి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు..
కాసేపటికి అ అమ్మాయి వాళ్ళ ఇంటి లోపల బయటకు వస్తుంది. బయట ఉన్న తన స్కూటీ దగ్గరకు వెళ్లి స్కూటీ స్టార్ట్ చేస్తుంది. కానీ స్కూటీ స్టార్ట్ అవ్వకపోవడంతో తన ఇంటి గేట్ దగ్గర ఉన్న శివ నీ సహాయం చేయమని అడుగుతుంది.
ఇదే మంచి అవకాశం అని శివ స్కూటీ స్టార్ట్ చేయడనికి వెళ్తాడు, కాని స్కూటీ స్టార్ట్ అవ్వదు.
అ అమ్మాయి మాట్లాడుతూ, "నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది మీరు ఏం అనుకోకపోతే నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీస్, మేము నిన్న రాత్రి ఇక్కడికి ఒచ్చం. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు, ఎంతయినా మనం ఎదురు ఎదురు ఇంట్లో ఉంటున్నాం కదా".
" అయ్యో పేర్లేదు అండి నేను కలిగానే ఉన్నాను, ఇక్కడే ఉండండి నా బైక్ తీసుకొస్తాను". అని శివ అంటాడు..
వెళ్లే దారిలో:-
శివ:- ఇంతకీ మీ పేరు చెప్పలేదు.
అమ్మాయి:- నా పేరు వృషాలి.
శివ:- వృషాలి అ అంటే మీరు బెంగాలీ అ.
వృషాలి:- లేదు అండి మేము ఢిల్లీ లో ఉంటాము. నాన్న కస్టమ్స్ ఆఫీసర్, హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది
అందుకే హైదరాబాద్ కి ఒచ్చం. పది రోజులు మా పిన్ని వల్ల దగ్గర ఉన్నాం, నాన్న ఆఫీస్ కి నా ఆఫీస్ కి ఇప్పుడు కొత్తగా ఒచ్చిన ఇల్లు దగ్గర గా ఉంటుంది.
శివ:- ఓహో, ఢిల్లీ అ మరి తెలుగు బాగానే మాట్లాడుతూనరే.
వృషాలి:- అమ్మ హైదరాబాద్, నాన్న ఢిల్లీ సో అమ్మ నాకు తెలుగు మాట్లాడం నేర్పింది.. నా గురించి సరే మీ పేరు ఇంకా మీరు ఏం చేస్తున్నారు అది చెప్పలేదు.
శివ:- నేను ఇంట్లో నే ఉంటాను అండి. ఇప్పుడు మొబైల్ లో అప్స్(apps) ఉంటాయి కదా వాటిపైన వర్క్ చేస్తూ ఉంటాను.
వృషాలి:- అంటే అప్ డిజైనర్ అ.
శివ:- అలాటిదే అనుకోండి.
వృషాలి:- ఇక్కడే ఇదే నేను పని చేస్తున్న ఆఫీస్. ఇక్కడ అపు శివ. థాంక్స్ శివ కరెక్ట్ టైం కి హెల్ప్ చేసావు.
శివ:- మళ్ళీ ఇంటికి ఎలా ఒస్తారు..
వృషాలి:- ఆటో లోనో, క్యాబ్ లోనో ఒస్తాను.
శివ:- నా నెంబర్ తీసుకోండి, చెప్పా కద ఇంట్లోనే ఉంటాను అని. మీరు సాయంత్రం కాల్ చేయండి నేను ఒస్తాను.
వృషాలి:- అయ్యో నీకు ఎందుకు ఇబంది నేను ఒస్తాను శివ.
శివ:- పేర్లేదు కాల్ చేయండి. నేను వెళ్తున్న.
సాయంత్రం:-
వృషాలి:- హలో శివ నేను ఆఫీస్ దగ్గర ఉన్న నువ్వు ఫ్రీ గా ఉన్నవా ఆఫీస్ దగ్గరకు వస్తావా.
శివ:- మీ ఆఫీస్ దగ్గర touchwood కాఫీ షాప్ ఉంది అక్కడ ఉండండి నేను ఒస్తాను.
వృషాలి:- సరే శివ కాఫీ షాప్ లో ఉంటాను.
కాఫీ షాప్ లో:-
శివ:- మీరు చాలా ఫ్రీ అండి పొద్దునే కలిసాము మనం, కానీ ఎన్నో రోజుల నుండి పరిచయం ఉన్నట్టు కలిసిపోయాం అంత ఏదో కల లాగా ఉంది నాకు.
వృషాలి:- నేను అంతే శివ ఎవరితో అయిన తొందరగా క్లోజ్ అవుతాను.
శివ:- మీకు ఒక విషయం చెప్పలి?
ఇంతలో బర్రెర్ వచ్చి ఆర్డర్ చెప్పండి సర్ అని అడుగుతారు. రెండు కాఫి తీసుకురా అని శివ చెప్తాడు. బర్రెర్ వెళ్ళిపోతాడు.
వృషాలి:- ఏదో చెప్పాలి అన్నావు ఏంటి శివ అది.
శివ:- అయ్యో! మీరు కాఫి తగుతారో లేదో తెలియదు, నేను కాఫి తీసుకుని రా అని చెప్పాను. మీరు కాఫి తగుతారు కదా.
వృషాలి:- నేను కాఫి తగుతాను శివ, నువ్వు ఏం చెప్పాలి అని అనుకుంటున్నావో అది చెప్పు.
శివ:- తడబడుతూ, అది ఏంటి ఆంటే. మిమ్మల్ని ఇంతకు ముందే గుడిలో చూసాను. చూడగానే మీరు నాకు నచేసారు. రెండో సారి ట్రాఫిక్ జామ్ లో చూసాను, మూడో సారి నిన్న రాత్రి చూసాను ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను.
మీరు ఢిల్లీ లో ఉంటారు, జాబ్ చేస్తున్నారు మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న అని మీకు తెలియాలి కదా అందుకే లేట్ అయితే అవకాశం పోతుంది అని ఇప్పుడే చెప్పేసాను.
వృషలి:- శివ, నేను ఢిల్లీ లో పెరిగాను, ఇప్పుడు జాబ్ చేస్తున్న, నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు కానీ నచ్చిన వాళ్ళని ప్రేమించాలి, పెళ్లి చూసుకోవాలి అని ఉండదు కదా. నాకు తెలుగు లో హీరో మహేష్ బాబు, ఇంకా జబర్దస్త్ సుధీర్ నచుతారు అంతెందుకు మా ఆఫీస్ లో కూడా నాకు నచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెళ్లి అందరికి మీరు ఆంటే నాకు ఇష్టం అని చెప్పలేను కదా.
నచ్చడం, ఒకరిని ఇష్ట పడడం కామన్. ఇష్ట పడినది, నచ్చింది అని అన్ని మనకే కావాలి అనుకోడం కరెక్ట్ కాదు కదా..
ఏంటి ఈ అమ్మాయి కి నువ్వు ఇష్టం అని చెపితే ఏదేదో మాట్లాడుతూ ఉంది అని అనుకుంటున్నవా.
శివ:- అది ఏం లేదు మీరు చాలా క్లారిటీ గా ఉన్నారు. మీ జీవితం లో ఏదో జరిగే ఉంటుంది అని ఆలోచిస్తున్న.
వృషాలి:- అంటే ఏంటి మన జీవితంలో జరిగితేనే మనకు గుణపాఠం అవుతుందా. మన అనుకున్న వారి జీవితాల్లో జరిగిన మనకు అది ఒక పాఠం ఏ అవుతుంది. అలా మనకు జరగకుండా మనం జాగ్రత్త పడాలి.
మాములుగా ఏ అమ్మయి అయినా, ఒక అబ్బాయి తెలియకుండా అ అబ్బాయితో ఎలా వస్తుంది శివ. మినిమం సెక్యురిటి లేకుండా మా అమ్మాయిలు ఎవరి బైక్ ఎక్కరు శివ.
నిన్ను నేను ముందే చూసాను, నువ్వు నాకు ఎప్పటినుండో తెలుసు. కరెక్ట్ టైం కి నా స్కూటీ స్టార్ట్ అవ్వలేదు. నిన్ను ముందే చూసాను ఇంకా మా ఎదురు ఇంట్లోనే ఉంటున్నావ్ కాబట్టి నీ బైక్ లో వచ్చాను.
ఇంకా చెప్పాలి అంటే నువ్వు కూడా నాకు నచ్చవ్ శివ, అందుకే పొద్దున నీతో ఒచ్చాను శివ లేకపోతే ఏ cab లో అయిన ఒచెదనిని. ఇప్పుడు కూడా నువ్వు నాకు నచ్చవ్ కాబట్టి నీకు కాల్ చేసాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శివ.
శివ:- మీరు నన్ను ప్రేమిస్తారు అని అనుకోలేదు అండి.
వృషాలి:- అధిర! ఇంకా నీ నాటకాలు చాలు. ఎంత ప్రేమిస్తే మాత్రం ఢిల్లీ నుండి ఫాలో చేస్తూ నేను ఎక్కడ ఉంటే అక్కడికి రావాలా ఏంటి. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలుసు మా అమ్మ నాన్న కూడా మన పెళ్లికి ఒకే చెప్పారు కదా. ఏదో నాన్న కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని నేను ఒచ్చాను, ఒక పది రోజుల్లో నేనె ఢిల్లీ కి ఒచెదనిని కదా..
శివ:- అధిర నా! అధిర ఎవరండి. ఏం మాట్లాడుతున్నారు మన పెళ్లి కి మీ అమ్మానాన్న ఒకే చెప్పారా. పది రోజుల ముందే మిమ్మల్ని నెను చూసాను..
వృషాలి:- జోక్ చేయకు అధిర. సినిమాలో హీరో అవ్వడం కోసం ప్రయత్నిస్తున్న, అప్పుడప్పుడు నీ దగ్గర నా యాక్టింగ్ టాలెంట్ చూపిస్తా అని చెప్పావ్ కదా నువ్వే.
శివ:- నేను ఎప్పుడు చెప్పాను అండి!
వృషాలి:- పొద్దున, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు అని నేను నీ దగ్గర నటించాను. నువ్వు నీ యాక్టింగ్ చేస్తున్నావ్ ఏమో అని అని నేన నీతో ఆఫీస్ వరకు ఒచ్చాను.
శివ:- నేను సినిమాలో హీరో అవ్వడం ఏంటి అండి..
వృషాలి:- ఏంట్రా బాబు ఇంకా నువ్వు నీ యాక్టింగ్ అపుతావ లేదు అంటే నన్ను ఇక్కడ నుండి వెళ్లిపోన.
శివ:- నిజం గా నా పేరు శివ అండి, పది రోజుల ముందే నేను మిమ్మల్ని చూసాను.ఈ అధిర ఎవరో నాకు తెలియదు అండి.
అలా శివ ఇంకా వృషాలి మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా పోలీసులు ఓస్తారు, శివ నీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.
పోలీస్ స్టేషన్ లో:-
శివ:- సర్! నను ఎందుకు అరెస్ట్ చేశారు.
పోలీస్ ఆఫీసర్ చక్ర:- సీఎం గా పోటీ చేస్తున్న గోవిందరాజులునీ చంపడానికి ప్రయత్నం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేసాం.
శివ:- సర్! నేను చంపడం కోసం ప్రయత్నాలు చేయడం ఏంటి సర్, నేను ఎవరిని చంపాలి అని అనుకోలేదు, నాకు ఏం తెలియదు సర్.
చక్ర(పోలీస్) :- గోవిందరాజులు ఎన్నికల ప్రచారంలో ఉండగా తనని నువ్వు షూట్ చేస్తుండగా నిన్ను చూసిన వాళ్ళు మాకు చెప్పారు. నువ్వే షూట్ చేశావ్ అని చెప్పడానికి మా దగ్గర బలమైన సాక్ష్యలు ఉన్నాయి శివ.
శివ ఇంకా చక్ర మాట్లాడుకుంటు ఉండగా కానిస్టేబుల్ ఒచ్చి, చక్ర సర్ తొందరగా న్యూస్ చూడండి. గోవిందరాజులు గారిని చంపేశారు అంట.
వార్తలు :- ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి గా పోటీ చేస్తున్న గోవిందరాజులు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆయనను హత్య చేసారు.
చక్ర:- కానిస్టేబుల్ పద వెళదాం, శివ నువ్వు మతోపాటు రా..
గోవిందరాజులు ఇంటి దగ్గర:-
శివ నీ చూసి గోవిందరాజులు భార్య ఏడుస్తూ " మా ఆయనను చంపింది వీడే సర్ వీడిని అరెస్ట్ చేయండి, నువ్వు మా ఇంటికి ఒచ్చావ్, మా ఆయనను షూట్ చేసి చంపేసావ్ ".
శివ:- నేను మీ ఆయనను చంపడం ఏంటి అండి.
చక్ర:- శివ! నువ్వు స్టేషన్ కి పద ఏదయినా సరే స్టేషన్ లో మాట్లాదం.
పోలీస్ స్టేషన్లో:-
చక్ర:- శివ హత్య చేయడానికి ప్రయతించవని నీ పైన కేస్ ఉంది. అయిన నువ్వు నాకు ఒక కేస్ లో సహాయం చేసావ్ అని నీ పై నాకు ఉన్న నమ్మకంతో నిన్ను ఇంటికి పంపిస్తాను. ఇప్పటికి అయితే నువ్వు ఇంటికి వేళ్ళు, కానీ నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్లకూడదు.
శివ:- ఒకే సర్ నేను వెళ్తాను.
ఇంటికి వెళ్ళాక శివ వృషాలి నీ కాలుస్తాడు.
శివ:- అధిర ఎవరు అండి. నన్ను మీరు అధిర అని ఎందుకు అనుకున్నారు.
వృషాలి:- అధిర నిన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారు. ఏం జరిగింది.
శివ:- అయ్యో! మీకు చెప్తే అర్ధం కదా నా పేరు శివ నేను చిన్నపాటి నుండి ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటున్నాను.
వృషాలి:- ఆటలు ఒద్దు అధిర. ఇంకా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావ్. నన్ను ఒదిలేదం అని అనుకుంటున్నవా.
శివ:- మీకు ఎలా చెప్పాలి. సరే అధిర అంటున్నారు కదా. ఒక్కసారి అధిర కి కాల్ చేయండి.
వృషాలి:- సాయంత్రం కాల్ చేసా switch off ఒచ్చింది. అందుకే పొద్దున నువ్వు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసాను.
శివ:- సరే అండి ఇప్పుడు ఒక్కసారి ప్రయతించండి ప్లీస్.
వృషాలి:- సరే చేస్తాను! రింగ్ అవుతుంది.. హలో అధిర.
శివ:- అధిర! ఎక్కడ ఉన్నావ్!.
అధిర:- ఎవరు మాట్లాడుతున్నారు.
శివ:- నా పేరు శివ. నువ్వు గోవిందరాజులు నీ చంపేసావ్ కదా, నిన్ను అనుకోని పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావ్ ఓ చెప్పు ప్లీస్.
అధిర:- మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి నేనె ఒస్తాను.
శివ:- సరే నేను చెప్పిన చోటికి రా.
శివ చెప్పిన చోటుకి అధిర ఒస్తాడు. శివ ఇంకా అధిర ఒకేలా ఉండడం చూసి వృషాలి ఆశ్చర్యపోతోంది.
శివ:- ఎందుకు గోవిందరాజులు నీ చంపేసావ్.
అధిర:- ఎందుకు అంటే వాడు మన నాన్నని చంపేసాడు కాబట్టి.
శివ:- మన నాన్న ఏంటి. అంటే నువ్వు నా..
అధిర:- అవును నేను నీ అన్నయ్య అధిర నే! మన నాన్న పోలీస్ ఆఫీసర్. అప్పట్లోఈ గోవిందరాజులు ఒక పెద్ద రౌడి. వాడు చేసిన తప్పుల్ని నాన్న కోర్ట్ లో నిరిపించడం తో వాడికి కోర్ట్ జైల్ శిక్ష విధించింది.
వాడు జైల్ నుండి బయటకు ఒచిన్న తర్వాత నాన్నని చంపడానికి చూసాడు. అదే టైం లో నాన్న కి ఢిల్లీ లో పని ఉండడం వలన ఢిల్లీ కి బయలుదేరారు. అప్పుడు అమ్మ ఇంకా మనల్ని కూడా తీసుకెళ్లారు.
వెళ్ళేదారిలో మనం వెళ్తున్న కార్ పై గోవిందరాజులు అటాక్ చేసాడు, దాంతో కార్ లోయలో పడిపోయింది. కార్ పడిపోతుండగా నేను కార్ నుండి దుకేసాను. స్పృహ కోల్పోయాను.
అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నన్ను హాస్పిటల్ లో చేర్చారు. నాకు స్పృహ ఒచ్చాక అమ్మ కోసం ఎడిచాను. నన్ను కాపాడిన వ్యక్తి కార్ లోయలో పడి కాలిపోయింది, ఎవరిని కపడలేకపోయాం అని చెప్పారు. అమ్మ, నాన్న నువ్వు చనిపోయారు అని అనుకున్నాను. నన్ను కాపాడిన వ్యక్తి నన్ను పెంచి పెద్ద చేసారు.
నేను వృషాలి నీ కాలేజీ లో చూసాను, తను నాకు, నేను తనకి నచ్చడం తో వాళ్ళ నాన్నని కలవడానికి వృషాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
వృషాలి వాళ్ళ ఇంట్లో నాన్న ఫోటో చూసాను. ఎవరు ఇతను అని వృషాలి నీ అడిగాను.
అప్పుడే అక్కడికి ఒచిన్న వృషాలి వాళ్ళ నాన్న మాట్లాడుతూ, వాడు నా స్నేహితుడు సిన్సియర్ పోలీసు ఆఫీసర్. తప్పు చేసిన వాళ్లని అస్సలు ఒదిలిపెట్టేవాడుకడు. అలానే గోవిందరాజులు అనే రౌడీ నీ జైలు కి పంపించాడు. అదే కోపం తో గోవిందరాజులు నా స్నేహితుడు నీ చంపించేసాడు.
వాడికి ఉన్న రాజకీయ నాయకుల సహకారంతో వాడిపైనా ఏ కేస్ రాకుండా తప్పించుకున్నాడు. వాడికి ఉన్న పలుకుబడికి నేను వాడిని ఏం చేయలేకపోయను.
అధిర:- అలా మన నాన్నని చంపింది వాడే అని తెలుసుకొని వాడిని చంపడానికి హైదరాబాద్ ఒచ్చాను. ఈ విషయం వృషాలి కి కూడా చెప్పలేదు. నేను అనుకున్న పని పూర్తి చేసాక చెప్పాలి అనుకున్న.
నువ్వు నాతో ఫోన్ లో మాట్లాడక తెలిసింది మీరు ఇంకా బ్రతికే ఉన్నారు అని. అమ్మ,నాన్న ఎక్కడ శివ.
శివ:- అ ఆక్సిడెంట్ లో నాన్న చనిపోయారు, నువ్వు కనపడక పోయే సరికి నువ్వు చనిపోయావ్ అని నేను అమ్మ అనుకున్నాం. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. పద అన్నయ్య అమ్మ దగ్గరకు వెళదాం.
శివ ఇంట్లో:-
శివ:- అమ్మ అమ్మ ఎక్కడ ఉన్నావ్ నీకోసం ఎవరు ఒచ్చారు చూడు.
అమ్మ:- ఎవరు ఒచ్చారు నాన్న!
శివ:- నువ్వు ఒచ్చి చూస్తే నీకే తెలుస్తుంది.
అమ్మ అధిర నీ చూసి చాలా సంతోషిస్తుంది.
శివ:- అధిర, మనం ఇద్దరం ఉన్నాం అని మనకు మాత్రం ఏ తెలుసు. ఈ కేస్ నుండి బయట పడాలి అంటే మనం ఒక పని చేయాల్సిఉంటుంది.
నా మీద పోలీసులకి అనుమానం ఉంది కాబట్టి, నేను పోలీసులకి ఈ హత్య చేసింది నేనె అని లొంగి పోతను.
అరెస్ట్ చేసాక కోర్ట్(court) కి తూసుకెళ్తారు. నాకు శిక్ష వేసే టైం లో నువ్వు రావాలి అన్నయ్య. నువ్వు ఒచ్చి హత్య నేనె చేసాను అని చెప్పు.
కాదు నేనె చేసాను అని నేను చెప్తాను. మన ఇద్దరం ఒకే లా ఉండడం చూసి అందరూ షాక్ లో ఉంటారు. జర్డ్జ్ గారు కూడా ఏం తీర్పు ఇవ్వలేకపోతారు. మన ఇద్దరం బయటే ఉండొచ్చు.
వృషాలి:- బాధ పడకు శివ, మీ అమ్మగారికి మీరు ఇద్దరు ఎలాగో మా అమ్మకి నేను ఇంకా మా చెల్లి పార్వతి ఉన్నాం.
నువ్వు ఏం కంగారు పడకు నీతో పెళ్లికి మా చెల్లిని ఓపించే బాధ్యత నాది నేను చూసుకుంటాను.
వృషాలి తన చెల్లి పార్వతి ననీ పెళ్లికి ఒపించడంతో.
వృషాలి వెడ్స్ అధిర ఇంకా శివ వెడ్స్ పార్వతి. రెండు పెళ్లిళ్లు పెద్దవాళ్ళు సంతోషంగా జరిపిస్తారు కథ సుఖాతం.
...హ్యాపీ ఎండింగ్…
No comments:
Post a Comment