Life with Wife

Chapter 1



ఆదివారం

అమ్మాయి ఇంట్లో.





మాధవ్, మాధవ్ ఎక్కడ ఉన్నావ్,


మాధవ్:- పెరట్లో ఉన్నాను నాన్న వస్తున్నాను.  చెప్పండి నాన్న పిలిచారు.


ప్రతాప్ రావు(నాన్న):- పెళ్లిళ్ల పెరయా ఒక సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయి డిగ్రీ పూర్తి దచేసింది.. ఒక్కతే కూతురు, సొంత ఇల్లు ఉంది.. నువ్వు సరే అంటే ఈ ఆదివారం  అమ్మాయిని చూడడానికి వెళదాం.


మాధవ్:- సరే నాన్న వెళదాం.


ఆదివారం రోజు:-


ఫోన్ లో:- హలో చంద్రశేఖర్ గారు, ఇందిర నగర్ రెండో వీధిలో ఉన్నాము ఎక్కడికి రమంటారు.


చంద్రశేఖర్(అమ్మాయి వాళ్ళ నాన్న) :- అలాగే వీధి చివరికి రండి రావు గారు నేను బయటే ఉంటాను.


ప్రతాప్ రావు:- సరే అండి.


అమ్మాయి ఇంటి దగ్గర:-


నమస్కారం చంద్రశేఖర్ గారు.. తను నా భార్య లక్ష్మీ, వీడు నా కొడుకు మాధవ్.


చంద్రశేఖర్:- నమస్కారం అండి, పదండి లోపలికి వెళదాం.


ఇంట్లొ:-


చంద్రశేఖర్ మాట్లాడుతూ,

భాగ్యం, అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు.


భాగ్యం( చంద్రశేఖర్ భార్య):- నమస్కారం రండి కూర్చోండి.. ఒక పది నిమిషాలు అమ్మాయి రెడి అవుతుంది.


కాసేపటికి అమ్మాయి వచ్చాక:-


చంద్రశేఖర్:- అమ్మాయి తో మాట్లాడాలి అంటే, డాబా పైకి వెళ్ళండి బాబు. అమ్మ బాబు నీ తీసుకెళ్లు.


మాధవ్:- సరే అండి.


డాబా పైన:-


అమ్మాయి:- మిమ్మల్ని ఒకటి అడగొచ్చా.


మాధవ్:- అడగండి.


అమ్మాయి:- మీకు ఇది ఎన్నో పెళ్లిచూపులు.


మాధవ్:- నాకు ఇది మొదటి పెళ్లిచూపులు, మరి మీకు.


అమ్మాయి:- మీ నెంబర్ నాలుగు.


మాధవ్:- అవునా.. ఇంతకి మీ పేరు చేప్పలేదు.


అమ్మాయి:- నా పేరు సహస్ర.


మాధవ్:- సహస్ర బాగుంది అండి.. ఇంకా చెప్పండి.


సహస్ర:- నేను డిగ్రీ లో ఉన్నపుడు, రెండు సంవత్సరాలు ఒక అబ్బాయి నీ ప్రేమించాను. ఇప్పుడు ప్రేమించడం లేదు. ఆ అబ్బాయి నన్ను వదిలేసాడు.


మాధవ్:- ఎందుకు వదిలేసారు. ఆ అబ్బాయి పేరు ఏంటి?


సహస్ర:- ఉదయ్ తన పేరు. రెండు సంవత్సరాలు వాడితోనే ఉన్నాను. ఎక్కడికి అంటే అక్కడికి, ఎప్పుడు అంటే అప్పుడు వాడితో వెళ్లే దానిని. నేను అంటే ఇష్టం పోయింది అంటా, నన్నువదిలేసాడు.


మాధవ్:- మీరు ఇంకా ఆ అబ్బాయి నీ ప్రేమిస్తుంటే చెప్పండి నేను మీ నాన్నతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాను, ఉదయ్ తో కూడా మాట్లాడుతాను.


సహస్ర:- అయ్యో, నాన్న కి ఈ విషయం తెలియదు అండి. దయచేసి నాన్న వరకు తీసుకెళ్లకండి.


మాధవ్:- ఐతే ఇప్పుడు ఏం చేదం అండి.


సహస్ర:- ఇదే విషయం మొదట పెళ్లిచూపులకి ఒచిన్న అబ్బాయితో చెప్పాను. ఎవరో శంకుస్థాపన చేసిన వాటిని నేను ఎందుకు చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయారు.


రెండో అతను ఏం చెప్పకుండా, పెట్టింది తిని వెళ్లిపోయారు.


మూడో అతను నాకు నచ్చలేదు.


మాధవ్:- ఎందుకు అండి.


సహస్ర:- మూడో అతను చూడడానికి దొంగ లాగా ఉన్నారు.


మాధవ్:- సహస్ర గారు మీరు, అబద్ధం భలే చెప్పారు, అబద్ధం నీ నిజం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు.


సహస్ర:- అబద్ధం ఏంటి, నేను నిజం ఏ చెప్తున్న.


మాధవ్:- మీకు పెళ్లి అంటే ఇష్టం లేదో, లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకోడం ఇష్టం లేదో ఏదో ఉంది.. మొత్తానికి మీరు నిజం దాస్తున్నారు.


సహస్ర:- నేను చెప్పింది అబద్ధం అని ఏల కనిపెట్టారు. అంత సరిగానే చేసానే.


మాధవ్:- మీరు చెప్పిన దాంట్లో నిజం కనపడలేదు కానీ మీకు పెళ్లి ఇష్టం లేదు అని మాత్రం అర్ధం అయింది.


మీరు నిజం గా ప్రేమించి ఉంటే మీ కళ్ళలో, మీ మాటల్లో ప్రేమని కోల్పోయిన బాధ కనిపించేది. కానీ మీరు చెప్తున్నపుడు అది కనపడలేదు, ఇంక మీ నాన్నతో మాట్లాడుతాను అనగానే మీరు కంగారు పడ్డారు అక్కడే అర్థం అయింది మీరు చెప్పేది అబద్ధం అని.


మీరు ఏదో దాస్తున్నారు, చెప్పండి నా వల్ల అయిన సహాయం నేను చేస్తాను.


సహస్ర:- నాకు ఇంకా చదుకోవలి అని ఉంది. IAS కోర్స్ చేయాలి అని ఉంది. నాన్నతో చెప్పాను వినడం లేదు. పెళ్లి తర్వాత చదుకుంటాను అంటే ఒప్పుకోరు. ప్రేమించాను, అబ్బాయి తో తిరిగాను అంటే ఎవరు ఒప్పుకోరు. మెల్లిగా నాన్నతో మాట్లాడి హైదరాబాద్ కి వెళ్లి IAS కోర్స్ లో జాయిన్ అవుదం అని అనుకున్న.. కానీ మీరు కనిపెట్టేశారు.


మాధవ్:- సరే మీరు నాకు నచ్చారు. నేను హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నను. మీకు నేను నచ్చితే. పెళ్లి చేసుకుందాం. హైదరాబాద్ కి వెళదాం. నేను మీతో ఉంటాను. నేను కోర్స్ లో జాయిన్ చేయిస్తాను. పెళ్లి తర్వాత కూడా మీరు సంతోషంగా చదుకోవచ్చు.


సహస్ర:- నవ్వుతూ సరే అండి నాకు మీరు నచ్చారు.


                                To be continued…

                                   ఇక కధ మొదలు...


2 comments: