Chapter 2
కళ్యాణం వైభోగం
ప్రతాప్ రావు(నాన్న):- లక్ష్మీ ముహూర్త సమయం దగ్గర పడుతుంది, ఇంకా మనం ఇక్కడే ఉన్నాం, తొందరగా బయలుదేరండి. మన పుత్రరత్నం రెడి అయ్యాడా.
లక్ష్మీ(అమ్మ):- పూర్తి అయ్యింది అండి ఒక ఐదు నిమిషాల్లో బయలుదేరుదాం. మాధవ్ వాడి రూమ్ లో ఉన్నాడు వెళ్లి పిలవండి.
మాధవ్:- ఫోన్ లో! మేము ఇంకో అరగంటలో ఓచేస్తాం అండి. మీరు రెడిగా ఉన్నారా.
నాన్న:- మాధవ్ మాధవ్ తలుపు తెరువు, మనం వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది.
మాధవ్:- నాన్న ఒచ్చారు! పెళ్లి పిటలపైన కలుదాం అండి.
నాన్న:- ఈ టైం లో ఫోన్ ఏంటి రా, పద వెలదం టైం అయింది.
మాధవ్:- ఫ్రెండ్ నాన్న అడ్రస్ అడుగుతున్నారు, చెప్తున్న.
నాన్న:- సరే సరే పద వెలదం.
దేవతలందరి ఆశిష్యులతో, పెద్దలాందరి సమక్షంలో మాధవ్, సహస్ర ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత మాధవ్, సహస్ర హైదరాబాద్ కీ ఒస్తారు.
హైదరాబాద్ మాధవ్ ఉండే అపార్ట్మెంట్ లో:-
మాధవ్:- ఇదేనండి మనం ఉండే పాలస్, ఇదే మన రూమ్ ఇంకా పక్కన చిన్న గార్డెన్ ఉంది, మనం సాయంత్రం డిన్నర్(dinner) అయ్యాక, మన ఈ చిన్ని గార్డెన్ లో కూర్చొని హ్యాపీ గా కబుర్లు చెప్పుకువచ్చు.
ఎలా ఉంది అండి మనం ఉండే ఈ ఇల్లు.
సహస్ర:- బాగుంది అండి కానీ ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏం అయిన ఉందా.
మాధవ్:- అయ్యో సారి అండి, అమ్మ పిండి వంటలు చేసింది, మనం ఒచెప్పుడు ఇచ్చింది మీరు అవి తింటూ టీవీ చూస్తూ ఉండండి, ఇంకా మీకు ఏం తోచకపోతే అలా బాల్కనీకి వెళ్ళండి, ఇల్లు మొత్తం చూడండి. అప్పటిలోగా నేను వంట రెడి చేస్తాను. భయపడకండి మీరు తినేల మంచిగానే చేస్తాను.
మీరు ఎగ్(egg) తింటారు కదా.
సహస్ర:- అ తింటాను.
మాధవ్:- ఫ్రై(fry) చేయమంటారా లేదా కరి చేయమంటారా.
సహస్ర:- నేను మీకు సహాయం, కరి ఏ చేదం.
మాధవ్:- అయ్యో వద్దు, మీరు ఆకలితో ఉన్నారు ఇంకా ప్రయాణం చేసి ఒచ్చాం కదా మీరు కొంచం విశ్రాంతి తీసుకోండి నేను చేస్తాను కదా.
సహస్ర:- సరే అండి మీ ఇష్టం.
కొంత సమయం తర్వాత:-
మాధవ్:- ఏవండోయ్ సహస్ర గారు వంట రెడి అండి, రండి భోజనం చేదం.
(మాధవ్ తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నారు) ఎక్కడ ఉన్నారు సహస్ర, బాల్కనీ లో ఉన్నారా ఇక్కడ లేరు, పోనీ గార్డెన్ లో, గార్డెన్ లో కూడా లేరే, పోనీ రూమ్ లో చూదాం.
ఒహ్ రూమ్ లో ఉన్నారా. సహస్ర గారు రండి భోజనం చేదం.
అయ్యో సహస్ర గారు ఏం అయ్యింది అండి ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి.
మీ అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చారా, ఏం అయ్యింది అండి ఇలా ఏడిస్తే నాకు ఎలా అర్థం అవుతుంది మీ సమస్య. ఏం అయ్యింది చెప్పండి ప్లీస్.
సహస్ర:- పెళ్లి అంటే చాలా భయంగా ఉండేది అండి, ఒచ్చే భర్త ఎలా ఉంటారో నాకు నచ్చిన IAS చదివిస్తారో లేదో అని చాలా భయంగా బాధగా ఉండేది కానీ మిమ్మల్ని మీ ప్రవర్తనని చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవతురలినో నాకు తెలుస్తుంది, నాకు తెలియకుండానే కాన్నీలు వస్తున్నాయి.
మాధవ్:- అయ్యే! దానికి ఎవరైనా కాన్నీలు పెట్టుకుంటారా, నేను ఎప్పుడు మీకు తోడు గా ఉంటాను మీ IAS కల నా బాధ్యత.
ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి లో బయటికి ఏం వస్తారు, ఇక్కడికే భోజనం తీసుకొస్తాను. ముందు మీరు అ కాన్నీలు తుడుచుకోండి.
సహస్ర:- సరే అండి.
మాధవ్:- ఈరోజు నేనె మీకు తినిపిస్తాను మీరు తినాలి అంతే.
కొంచం కారం ఎక్కువైనా, ఉప్పు తక్కువైనా ఏం అనుకోకండి తొందర తొందరగా చేసాను కదా కొంచం సర్దుకొండి.
సహస్ర:- సరే ఐతే నేను మీకు తినిపిస్తాను.
మాధవ్:- నవ్వుతూ! సరే అండి.
To be continued…
Please click on below link for chapter 1.
No comments:
Post a Comment