భరత్ !
లక్ష్మి:- ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు భరత్? భరత్:- అబ్బే ఎవరికోసం లేదు వదిన ఊరికే అల చూస్తున్న . లక్ష్మి:- తెలుసులే నీ ఈ ఎదురు చూపులు ఎవరికోసమో. భరత్:- ఎవరికోసం చెప్పు చూదాం? లక్ష్మి:- నా చెల్లెలు వసు కోసమే కదా. భరత్:- అవును వదిన ఎప్పుడో నాలుగు సంవత్సరాల ముందు మీ పెళ్ళిలో చూసా మళ్ళీ ఇప్పటికీ దర్శనం కలుగుతుంది మీ చెల్లెలిది. లక్ష్మి:- ఏం చేయమంటావు మరి నీ కోసం ఇక్కడే ఉంటె బాగుండేది కదా. భరత్:- అల కాదు వదిన మీ చెల్లి నీ చూసి నాలుగు సంవత్సరాలు అయింది. మీ పెళ్లి అయ్యాక చదువుకోసం అని అమెరికా కి వెళ్ళింది. మీకు బాబు పుట్టిన ఇంటికి రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒస్తుంటే ఎదురు చూడకుండా ఎలా ఉండమంటావు . లక్ష్మి: - సరే భరత్ నీ బాధ అర్ధం అయింది చెల్లి ఇంకా ఒక గంట లో ఒస్తుంది నువ్వు రెడీ గా ఉండు. వసు:- అక్క ! లక్ష్మి:- వసు ఎలా ఉన్నావు . వసు:- నేను బాగున్నాను అక్క నువ్వు ఎలా ఉన్నావు. లక్ష్మి:- బాగున్నాను. నీ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో తెలుసా? వసు:- ఎవరు అక్క? లక్ష్మి:- భరత్! వసు:- అవునా! భరత్ బావ ఎక్కడ ఉన్నాడు. లక్ష్మి:- లోపల గదిలో ఉన్నాడు. వసు:- సరే ఐతే న...