ఏదురుచూపు



నీకోసమే నేను ఉన్న ,
నువ్వు లేక నేను లేనంటున్న .

నీ మాటకోసమే నేను వేచి ఉన్న ,
నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేకున్నా .

నీ ఊపిరి నాకు ప్రాణం,
నీతో బ్రతకడం నాకు జీవితం.

తిరిగొచ్చేయే నేస్తం ,
నువ్వు లేక ఉండలేనంటుంది నా హృదయం.

నీతోనే ఉంటాను .... ఎప్పటికైనా

                           
 ఒక రోజు ఆఫీస్ లో పని ఉండటం వల్ల కర్ణ ఇంటికి లేట్ గా బయలుదేరుతాడు . అప్పుడు సమయం తొమ్మిది (9). బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కర్ణ . 

బస్ రాకపోయేసరికి నడుచుకుంటూ ఇంటికి వెళదాం అని అనుకుంటున్నాడు . హఠాత్తుగా ఒక అమ్మాయి స్కూటీ లో ఒచ్చి కర్ణ ముందు ఆగుతుంది.

కర్ణ మాట్లాడుతూ " ఎవరండీ మీరు నా ముందు బండి ఎందుకు ఆపారు " అని అంటాడు .

అమ్మాయి మాట్లాడుతూ " నిన్ను చాల సేపటినుంచి గమనిస్తున్న బస్సు కోసం చూస్తున్నట్టు ఉన్నావ్ , ఎక్కడికి వెళ్లాలో చెప్పు నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను " అని అంటుంది.

కర్ణ మాట్లాడుతూ " నేను ఎవరో మీకు తెలియదు ,మీరు ఎవరో నాకు తెలియదు అయిన డ్రాప్ చేస్తాను అని  చెప్పినందుకు థాంక్స్ నేను నడుచుకుంటూ వెళ్తాను నాకు నడవడం అలవాటే " అని అంటాడు.

అమ్మాయి మాట్లాడుతూ " ఇప్పుడు టైం తొమ్మిది (9) అయింది. బస్ ఒస్తుందో రాదో తెలియదు రోజు నడుచుకుంటూ వెళ్తావ్ కదా ఈ రోజు నేను డ్రాప్ చేస్తాను. నువ్వు ఏం బయపడకు నేను మంచి అమ్మాయినే ఏదో ఒక్కడివే ఉన్నావ్ కదా అని ఒచ్చాను " అని అంటుంది .

కర్ణ కొంచం అలోచించి  ఒక్క రోజే కదా వెళదాం అని అనుకోని అ అమ్మాయితో వెళ్తాడు .

వెళ్లే దారిలో అమ్మాయి మాట్లాడుతూ కర్ణ నీ ఇలా అడుగుతుంది " నీ పేరు ఏంటి ? ఎక్కడ పని చేస్తున్నావ్ ?".

కర్ణ మాట్లాడుతూ " నా పేరు కర్ణ . నేను ఫైనాన్స్ కంపెనీ లో పని చేస్తున్న. రెండు సంవత్సరలు అయింది అ కంపెనీ లో చేయబట్టి ".

అమ్మాయి మాట్లాడుతూ " నీకు బైక్ లేదా ,రోజు బస్ లోనే వెళ్తావా " .

కర్ణ మాట్లాడుతూ " ఇంట్లో ఉన్నది ఒక్కటే బైక్ ,నాన్న కి బయటికి వెళ్లే పని ఉంటుంది, అందుకే నేను బస్ లోనే వెళ్తుంటాను ఎక్కడికైనా . నాకు  ఏదయినా పని ఉంటె అప్పుడు బైక్ తీసుకెళ్తాను ".

అమ్మాయి మాట్లాడుతూ " సర్దుకుపోవడం బాగా తెలిసినట్టుంది కదా నీకు ".

కర్ణ మాట్లాడుతూ " జీవితం అంటే నే సర్దుకుపోవడం ( compromise ) కదా. ఇక్కడ పక్కన ఆపండి నేను దిగుతాను".

అమ్మాయి మాట్లాడుతూ " ఇదే మీ ఇల్లు అ ".

కర్ణ మాట్లాడుతూ " కాదు ఇదే లైన్ లో మూడో ఇల్లు చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది.డ్రాప్ చేసినందుకు థాంక్స్, నేను వెళ్తాను మీరు జాగ్రత్తగా వెళ్లండి ".

అమ్మాయి మాట్లాడుతూ " రేపు ఏ టైం కి ఆఫీస్ కి వెళ్తావ్ ".

కర్ణ మాట్లాడుతూ " రోజు పొద్దున్న  (8) ఎనిమిది గంటలకు బయలుదేరుతాను "

అమ్మాయి మాట్లాడుతూ " సరే మరి నేను వెళ్తాను".

కర్ణ మాట్లాడుతూ " సరే అండి థాంక్స్ ".

అమ్మాయి వెళ్ళిపోతుంది . కర్ణ ఆలోచిస్తూ అమ్మాయి పేరు అడగడం మరిచిపోయానే మల్లి కనిపిస్తుందో లేదో అని అనుకుంటాడు.

తర్వాత రోజు కర్ణ నీ డ్రాప్ చేసిన అమ్మాయి ,కర్ణ కోసం తన ఇంటిదగ్గరకి ఒస్తుంది. 

అ అమ్మాయిని చుసిన కర్ణ అమ్మాయితో మాట్లాడుతూ " మీరేంటండి ఇక్కడ అని అడుగుతాడు ".

అమ్మాయి మాట్లాడుతూ " నిన్న రాత్రి చెప్పావ్ కదా ఈ టైం కి ఆఫీస్ కి వెళ్తాను అని ,నేను ఆఫీస్ కి వెళ్తున్న నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేదాం అని నీకోసం చూస్తున్న ".

కర్ణ మాట్లాడుతూ " అయ్యో రాత్రి బస్ లేదు అని మీతో ఒచ్చాను , ఇప్పుడు బస్సులు ఉంటాయి కదా బస్ లోనే వెళ్తాను ".

అమ్మాయి మాట్లాడుతూ " నేను వెళ్ళేది మీ ఆఫీస్ రూట్ లోనే ఏం పేర్లేదు నేను డ్రాప్ చేస్తా ".

కర్ణ మాట్లాడుతూ " సరే మీరు నన్ను డ్రాప్ చేసేదాకా ఒదిలేటట్టులేరు పదండి వెళ్దాం ".

ఆఫీస్ దగ్గర…….

అమ్మాయి మాట్లాడుతూ " ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది ".

కర్ణ మాట్లాడుతూ " 6 కి , ఇంతకీ మీ పేరు చెప్పలేదు ".

అమ్మాయి మాట్లాడుతూ " సాయంత్రం కాఫీ షాప్ కి రా అక్కడ చెప్తా నా పేరు , నీ ఫోన్ నెంబర్ ఏంటి ".

కర్ణ నెంబర్ తీసుకొని అమ్మాయి అక్కడనుండి వెళ్ళిపోతుంది .

సాయంత్రం కాఫీ షాప్ లో…..

అమ్మాయి మాట్లాడుతూ " ఈరోజు ఆఫీస్ లో పని చేసావా లేదా అమ్మాయి ఎవరు, నాకు ఎందుకు లిఫ్ట్ ఇచ్చింది అని ఆలోచించావా "

కర్ణ మాట్లాడుతూ " సాయంత్రం కాఫీ షాప్ కి రమ్మని చెప్పారు కదా అందుకే ఏం ఆలోచించలేదు , ఇప్పుడు అడుగుతున్న మీరు ఎవరు "

అమ్మాయి మాట్లాడుతూ " ముందు నాకు కాఫీ తాగాలని ఉంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం కాఫీ తీసుకొని రా  " 

కర్ణ కాఫీ తీసుకొస్తాడు..

కర్ణ మాట్లాడుతూ " తీసుకోండి కాఫీ ఇప్పటికైనా చెప్తారా".

అమ్మాయి మాట్లాడుతూ " చెప్తాను కానీ నన్ను మీరు అని అనకు నువ్వు అను చాలు"

కర్ణ మాట్లాడుతూ " సరే నువ్వు ఎవరు?"

అమ్మాయి మాట్లాడుతూ " మా ఇంట్లో నాకు పెళ్లి చేదాం అని అనుకుంటున్నారు ".

కర్ణ మాట్లాడుతూ " ఐతే నాకు ఏంటి , నాకు లిఫ్ట్ ఎందుకు ఇచ్చారో అది చెప్పండి ".

అమ్మాయి మాట్లాడుతూ " నేను చెప్పేది పూర్తి గా విను అబ్బాయి ".

కర్ణ మాట్లాడుతూ " సరే చెప్పు "

అమ్మాయి మాట్లాడుతూ " మా నాన్నగారి స్నేహితుడు ఒక సంబంధం తీసుకొచ్చారు , అబ్బాయి ఫోటో ఇచ్చారు , మా నాన్న అ ఫోటో నాకు చూపించారు , నేను అలోచించి చెప్తా అని చెప్పను "

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడు ఏంటి అ ఫోటోలో ఉన్న వాడి గురించి తెలుసుకొని  నీకు చెప్పాలా ".

అమ్మాయి మాట్లాడుతూ " అ అబ్బాయి గురించి తెలుసుకుందాం అని నీకు లిఫ్ట్ ఇచ్చాను , అ ఫోటో లో ఉన్న అబ్బాయి ఎవరో కాదు నువ్వే.

మా నాన్న స్నేహితుడు మీ నాన్న కి కూడా స్నేహితుడు అంటా నువ్వు మంచోడివి అని చెప్పి నీ ఫోటో ఇచ్చారు , నువ్వు మంచోడివో కాదో తెలిసుకుందాం అని నేను లిఫ్ట్ ఇచ్చాను ".

కర్ణ మాట్లాడుతూ " అయినా నేను బస్ స్టాప్ లో ఉన్న అని నీకు ఎలా తెలుసు ".

అమ్మాయి మాట్లాడుతూ " నిన్న రాత్రి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లొస్తుంటే బస్ స్టాప్ లో నిన్ను చూసా ని గురించి తెలిసుకుందాం ,కలిసి మాట్లాడుదాం అని లిఫ్ట్ ఇచ్చాను "

కర్ణ మాట్లాడుతూ " మరి ఏం తెలుసుకున్నావ్ నా గురించి "

అమ్మాయి మాట్లాడుతూ " పెళ్లి చేసుకోవచ్చు కానీ నా గురించి నువ్వు నీ గురించి నేను ఇంకా కొంచం తెలుసుకొని ఒక రెండు లేదా మూడు నెలల తర్వాత పెళ్లి చేసుకుందాం "

కర్ణ మాట్లాడుతూ " థాంక్స్ అమ్మ. నా జీవితం లో నేను చేయాలిఅనుకున్నవి కొన్ని ఉన్నాయి అ తర్వాతే పెళ్లి చేసుకుందాం అని అనుకున్న "

అమ్మాయి మాట్లాడుతూ " అయితే మనం కొన్ని రోజులు ఫ్రెండ్స్ లాగా ఉందాం , మనకు సెట్ అయినప్పుడు అమ్మ, నాన్నలకి చెపుదాం "

కర్ణ మాట్లాడుతూ " సరే అన్ని చెప్తున్నావ్ , మాట్లాడుతున్నావ్ కానీ నీ పేరేంటో ఇంకా చెప్పలేదు "

అమ్మాయి మాట్లాడుతూ " నా పేరు వృశాలి . నేను టీవీ రిపోర్టర్ గా పని చేస్తున్న , సరే  టైం అవుతుంది వెళ్దాం నిన్ను డ్రాప్ చేయాలా ,బస్ లో వెళ్తావా ".

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడే ఫ్రెండ్స్ అన్నావ్ , అప్పుడే మధ్యలో ఒదిలేస్తావా , నేను నీతోనే వస్తా పద ".

అల మూడు నేలలు గడిచాయి. ఒక రోజు అర్ధ రాత్రి వృశాలి ఇంటికి ఒకరు ఒస్తారు, అ వ్యక్తి నెమ్మదిగా వృశాలి గది వైపుకి వెళ్తాడు. వృశాలి నిద్ర లేస్తుంది.

అ వ్యక్తి వృశాలి ముందు నిల్చొని దీపం వెలిగిస్తాడు. అ దీపం వెలుగులో అ వ్యక్తి మొహం కనిపిస్తుంది. ఒచ్చింది కర్ణ అని తెలుస్తుంది.

అ రోజు వృశాలి పుట్టినరోజు అ దీపం వెలుగులో కర్ణ వృశాలి కి పుట్టినరోజు శుభాకంక్షాలు చెప్పి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. సంతోషంతో వృశాలి కర్ణ నీ కౌగిలించుకొని కర్ణ పై తనకు ఉన్న ప్రేమ వ్యక్తం చేస్తుంది.

వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్తారు . వృశాలి ఇంకా కర్ణ పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు ఇంట్లో వాళ్ళు.

పెళ్ళికి ఇంకా పది రోజులే ఉన్నాయి . వృశాలి ఆఫీస్ పని ఉంది అని ముంబై కి బయలుదేరుతుంది. 

రైల్వే స్టేషన్ లో....

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడు నువ్వు ముంబై వెళ్లడం అవసరమా మన పెళ్ళికి ఇంకా పది రోజులే ఉన్నాయి "

వృశాలి మాట్లాడుతూ " రిపోర్టర్ పని అంటే ఇలానే ఉంటుంది . మన పెళ్లి టైం కి ఒస్తాను "

కర్ణ " అయితే  నేను నీతో ఒస్తాను బంగారం "

వృశాలి " కర్ణ నేను ఆఫీస్ పని కోసం వెళ్తున్న పని అయిపోగానే  ఒస్తాను "

కర్ణ మాట్లాడుతూ " సరే జాగ్రత్త వెళ్ళాక ఫోన్ చేయి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను "

వృశాలి వెళ్లిన మూడు రోజుల తర్వాత , వృశాలి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న కర్ణ కి ముంబై లో ఉన్న ఒక హాస్పిటల్ నుండి ఫోన్ ఒస్తుంది .

ఫోన్ చేసిన వ్యక్తి కర్ణ తో ఇలా చెప్తారు " మేము ముంబై హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాము. ఇక్కడ ఒక అమ్మాయికి ఆక్సిడెంట్ అయింది , తన దగ్గర ఈ నెంబర్ ఉంది అందుకే మీకు కాల్ చేస్తున్నాము మీరు వెంటనే రండి ".

కర్ణ మాట్లాడుతూ " ఇప్పుడు తనకి ఎలా ఉంది ".

ఫోన్ చేసిన వ్యక్తి " మీరు త్వరగా బయలుదేరండి ఇక్కడికి వస్తే అన్ని వివరాలు తెలుస్తాయి"  అని చెప్పి కాల్ కట్ చేస్తారు .

కర్ణ వృశాలి వాళ్ళ నాన్నకి జరిగిన విషయం చెప్తాడు. ఇద్దరు కలిసి ముంబై కి వెళ్తారు.

ముంబై హాస్పిటల్ లో .....

కర్ణ మాట్లాడుతూ " మీ హాస్పిటల్ నుండి నాకు కాల్ ఒచ్చింది అమ్మాయికి ఆక్సిడెంట్ అయింది అని అమ్మాయి ఎక్కడ"

నర్స్ మాట్లాడుతూ " మీరు నాతో రండి అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తాను "

కర్ణ మాట్లాడుతూ " నర్స్ మార్చురీ ( mortuary ) కి తీసుకెళ్తున్నారు ఏంటి" .

నర్స్ మాట్లాడుతూ " జరిగిన ఆక్సిడెంట్ లో అమ్మాయి చనిపోయింది " .

నర్స్ చెప్పింది వినగానే వృశాలి వాళ్ళ నాన్న స్పృహ కోల్పోతాడు , కర్ణ ఎం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు ...

నర్స్ మాట్లాడుతూ " నిన్న రాత్రి మాకు ఆక్సిడెంట్ అయింది అని ఫోన్ ఒచ్చింది ,మేము వెళ్లి చూసేసరికి తను చనిపోయింది. 

తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయి అని తన బ్యాగ్ చూసాం బ్యాగ్ కాలిగా ఉంది కానీ తన చేతికి ఉన్న బ్రాస్లెట్ ( bracelet ) పైన ఫోన్ నెంబర్ ఉంది . ఫోన్ చేస్తే మీరు మాట్లాడారు ".

కర్ణ బ్రాస్లెట్ ( bracelet ) గురించి ఊహించుకుంటాడు.

వృశాలి " కర్ణ నీ చేయి చూపించు ".

కర్ణ  మాట్లాడుతూ " ఎందుకు బంగారం ".

వృశాలి మాట్లాడుతూ " చూపించు  .. ఈ బ్రాస్లెట్ ( bracelet ) నా చేతికి కట్టు అంత కంటే ముందు ఈ బ్రాస్లెట్ పైన ఏం ఉందొ చూడు ".

కర్ణ మాట్లాడుతూ" నా ఫోన్ నెంబర్ . బ్రాస్లెట్ పైన ఎందుకు నెంబర్ వేయించావ్ ".

వృశాలి మాట్లాడుతూ " ఎప్పుడైనా , ఎక్కడైనా  నువ్వు నాతో లేనప్పుడు నాకు ఏమైనా జరిగితే ఈ నెంబర్ చూసి నీకు ఫోన్ చేస్తారు.నువ్వు ఎక్కడ ఉన్న నా కోసం ఒస్తావ్ , నా కోసం ఒస్తావ్ కదా కర్ణ "

కర్ణ మాట్లాడుతూ" ఒస్తాను బంగారం , అయిన నన్ను ఒదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావ్ "

వృశాలి మాట్లాడుతూ" ఎక్కడికి వెళ్ళాను నేను నీతో, నీలోనే ఉంటాను కర్ణ" 

ప్రస్తుతం….

హాస్పిటల్ నుండి వృశాలి నీ ఇంటికి తీసుకొస్తారు . వృశాలి కి జరగాల్సిన కార్యక్రమాలు చేస్తారు .

కర్ణ ఒంటరివాడు అయిపోతాడు ప్రేమించిన అమ్మాయి ,పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న అమ్మాయి ఇప్పుడు చనిపోయింది , తన తోడు ఎవరు లేరు అని ఎప్పుడు బాధలో ఉండేవాడు . ఆఫీస్ కి కూడా వెళ్లడం మానేస్తాడు. 

అల ఒక నెల గడిచిపోతుంది . ఒకరోజు కర్ణ కి ఒక మెసేజ్ ( message ) ఒస్తుంది. అ మెసేజ్ లో " వృశాలి కి జరిగింది ఆక్సిడెంట్ కాదు తనని చంపేశారు . ఎవరు చంపారో తెలుసుకోవాలి అంటే రేపు ఉదయం 10 గంటలకు కాఫీ షాప్ కి రా " అని ఉంటుంది .

తర్వాత రోజు....

కర్ణ కాఫీ షాప్ కి వెళ్తాడు . కాఫీ షాప్ లొ పని చేస్తున్న ఉన్న వ్యక్తి కర్ణ నీ చూసి పైకి వెళ్ళమని చెప్తాడు.

కర్ణ పైకి వెళ్తాడు . పైన ఒక టేబుల్ దగ్గర ఒంటరిగా ఒక అమ్మాయి కూర్చొనివుంటుంది . 

కర్ణ అ అమ్మాయి దగ్గరికి వెళ్లి నాకు మెసేజ్ పంపించింది మీరేనా అని అడుగుతాడు .

అ అమ్మాయి మాట్లాడుతూ " అవును కర్ణ నేనే పంపించాను కూర్చో".

కర్ణ మాట్లాడుతూ " మీరు ఎవరు ? అసలు వృశాలి కి ఏం జరిగింది ?

అమ్మాయి మాట్లాడుతూ " నా పేరు ప్రసిద్ధ . నేను వృశాలి ఒకే ఆఫీస్ లో పని చేస్తున్నాం కానీ నేను ముంబై ఆఫీస్ లో పని చేస్తున్నాను.

ఒక నెల క్రితం వృశాలి ఒక కేసు పని పైన  ముంబై ఒచ్చింది . వృశాలి అ కేసు గురించి అన్ని వివరాలు సేకరించింది . అ విషయం తెలుసుకొని వృశాలి నీ చంపేసారు ".

కర్ణ మాట్లాడుతూ " ఎవరు చంపేశారు ? "

ప్రసిద్ధ మాట్లాడుతూ " అశోక్ రకా . ఐదు (5) సంవత్సరాలక్రితం ఒక రౌడీ ఇప్పుడు MLA . MLA అవ్వడం కోసం చాల దారుణాలు చేసాడు.

చిన్న పిల్లలు ,పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా వాడికి అడ్డం ఒచ్చిన్న వారందరిని చంపుకుంటూ MLA అయ్యాడు.

ఇప్పుడు వాడి పదవిని అడ్డు పెట్టుకొని  డబ్బు కోసం మత్తు పదార్దాల వ్యాపారం చేస్తున్న విదేశీ వాళ్ళతో చేతులు కలిపాడు . ఎంతో మందిని వాడి మత్తు పదార్దాలకు బానిస చేసాడు. 

ఆరు నెలల నుండి వృశాలి వాడి గురించి వివరాలు సేకరించింది . విదేశాలనుండి మత్తు పదార్దాలు ముంబై లో ఉన్న  వాడి స్థావరానికి ఒస్తున్నాయి అని తెలిసింది.

ఈ  విషయం నేను వృశాలి కి చెప్పను . అప్పుడే వృశాలి వాడిని  పోలీసులకు పటించాలని ముంబై కి ఒచ్చింది. 

ముంబై కి ఒచ్చాక వాడి స్థావరానికి వెళ్ళింది . అక్కడ జరిగింది మొత్తం వీడియో తీసింది .

అప్పుడే తాను నాకు కాల్ చేసి ఇలా చెప్పింది " నేను వాడి  మనుష్యులకి దొరికిపోయాను వాడి దగ్గరకు ఒచ్చిన్న విదేశీలను చంపేశాడు ఇక్కడ జరిగింది నేను వీడియో తీసాను , వాళ్ళు నన్ను చంపేస్తారు అని తెలుసు ఈ వీడియో కెమెరా నీ ఇక్కడే దాచిపెడుతున్న నువ్వు తీసుకొని పోలీసులకు అప్పచెప్పు " అని చెప్పి కాల్ కట్ చేసింది.

తర్వాత తెలిసింది నువ్వు ముంబై ఒచ్చావ్ అని. హాస్పిటల్ కి వెళ్లి నీ నెంబర్ తీసుకొని నీకు మెసేజ్ చేశాను. 

వృశాలి సేకరించిన వివరాలు నా దగ్గరే ఉన్నాయి అ వీడియో కూడా ఉంటె వాడికి శిక్షపడేలాగా చేయొచ్చు . అ కెమెరా ఎక్కడ పెట్టిందో వృశాలి నాతో చెప్పింది .

అక్కడికి వెళ్తే కెమెరా తీసుకోవచ్చు . వృశాలి నిన్ను ఎంత ప్రేమించిందో నాకు చెప్పింది నీకు కూడా తెలియాలి వృశాలి చావుకి న్యాయం చేయాలి ,నిజాన్ని కాపాడాలి అని నీ దగ్గరికి ఒచ్చాను ".

అని తనకు తెలిసింది చెప్తుంది ప్రసిద్ధ.

వృశాలి నీ ఊహించుకుంటూ బాధ పడతాడు కర్ణ .

కర్ణ ఇంకా ప్రసిద్ధ ముంబై లో ఉన్న అశోక్ రకా స్థావరానికి వెళ్తారు . వాళ్లని చుసిన అశోక్ రకా మనుష్యులు కర్ణ నీ ప్రసిద్ధ నీ బంధిస్తారు.

అశోక్ రకా కి ఫోన్ చేసి చెప్తారు , అశోక్ రకా కర్ణ నీ కూడా చంపుదాం అని వాడి స్థావరానికి ఒస్తాడు. 

అశోక్ రకా మాట్లాడుతూ " నా గురించి సేకరించిన వివరాలు నాకు ఇస్తే మిమల్ని వదిలేస్తా ".

కర్ణ మాట్లాడుతూ " నేను మీకు కావాలనే దొరికిపోయాను నా వృశాలి నీ చంపినా మిమల్ని వదిలిపెట్టను ".

అశోక్ రకా మాట్లాడుతూ" ఒ నువ్వు అ పిల్ల కోసం ఒచ్చావా , పాపం దానికి కూడా చెప్పను నా వివరాలు ఇచ్చేయ్ అని అసలు వినలేదు , రెండు రోజులు మస్తు హింసించినం అయినా చెప్పలేదు. ఇంకా లాభం లేదు అని దాన్ని చంపి రోడ్ మీద పడేసినం , ఆక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ రాయించిన "

అ మాటలు వినగానే అశోక్ రకా నీ కొడతాడు అప్పుడు కర్ణ కి వాళ్ళకి గొడవ జరుగుతుంది. అదే సమయం లో అక్కడికి పోలీసులు ఒచ్చి అశోక్ రకా నీ వాడి మనుష్యుల్ని తీసుకెళ్తారు.

కర్ణ  , అశోక్ రకా  స్థావరానికి ఒచ్చే ముందు కమిషనర్ కి జరిగింది చెప్పి ఒస్తాడు , కర్ణ వేసిన ప్లాన్ ప్రకారం ప్రసిద్ధ గొడవ మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తుంది అల అశోక్ రకా నీ పోలీసులకి పటించి , వృశాలి సేకరించిన వివరాలతో వాడికి శిక్ష పడేలా చేసి వృశాలి చావుకి న్యాయం చేస్తారు ప్రసిద్ధ ఇంకా కర్ణ. 

కర్ణ , వృశాలి ఊహలోనే ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు .

లీలాభినయా


(అభీ) గుడ్ మార్నింగ్ ( good morning ) లీల,

(లీల) మార్నింగ్ ( morning ) అభీ,

(అభీ) లెగు స్కూల్ కి వెళ్లాలి కద  టైం అవుతుంది,

(లీల) అ అభీ  లేస్తున్న,

(అభీ) సరే  ఐతే నేను వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ( break fast ) రెడీ చేస్తాను నువ్వు త్వరగా  రా,

(లీల) సరే  అభీ నేను రెడీ ఐ ఒస్తాను నువ్వు వేళ్ళు,

(అభీ) లీల బ్రేక్ ఫాస్ట్ ( break fast ) ఇంకా కాఫీ రెడీ ఒస్తున్నావా,

(లీల) హ అభీ ఒస్తున్న, ఒచ్చేసాను తినిపించు అభీ,

(అభీ) మన పెళ్లి జరిగి రెండు సంవత్సరలు అయింది, ఇంకా చిన్న పిల్లలగా చేస్తున్నావ్ లీల. సరే తిను టైం లేదు నిన్ను స్కూల్ దగ్గర వదిలేసి నేను ఆఫీస్ కి వెళ్తాను. సాయంత్రం  త్వరగా ఒస్తాను ఒక స్పెషల్ ప్లేస్ కి వెళదాం స్కూల్ నుంచి ఒచ్చాక రెడీ ఐ ఉండు,

(లీల) అలాగే అభీ రెడీగా ఉంటాను. 

పదిహేను నిమిషాల తర్వాత….

(అభీ) వెళదామా లీల బ్యాగ్ తీసుకున్నావా,

(లీల) అ తీసుకున్న నువ్వు నీ ( laptop ) తీసుకున్నావా,

(అభీ) అ తీసుకున్నాను వెళదాం పద,

(అభీ) స్కూల్ ఒచ్చేసింది, జాగ్రత సాయంత్రం ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, చెప్పాను కదా స్పెషల్ ప్లేస్ కి వెళదాం అని రెడీ గా ఉండు లీల సరే నా,

(లీల) సరే అభీ రెడీ గా ఉంటాను.

అభీ మాట్లాడుతూ " నా పేరు అభినవ్ నాతో ఉన్న అమ్మాయి పేరు లీల నా భార్య  మాకు పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అయింది. 

కానీ మాకు పిల్లలు లేరు డాక్టర్ దగ్గరకి వెళ్లి కలిసాము. డాక్టర్ చూసి లీల కి పిల్లలు పుట్టారు అని చెప్పారు. తనకు ఏదో మెడికల్ సమస్య వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పారు డాక్టర్.

ఈ  విషయం లీల కి కూడ తెలుసు. మేము ఎవరినైనా పిల్లలని పెంచుకుందాం అని అనుకున్నాము.ఈరోజు సాయంత్రం అనాదశరణాలయానికి  వెళ్తున్నాము.

నేను ఒక చిన్న కంపెనీ లో పనిచేస్తున్న.మా మేనేజర్ వెంకట్ గారు చాల మంచి మనిషి, నా స్నేహితుడు సామ్యూల్ (Sam). నా ప్రతి విషయం సామ్యూల్ కి తెలుసు నేను అంటే సామ్యూల్ కి చాల ఇష్టం"..

అదే సమయం లో లీల మాట్లాడుతూ 

" నా పేరు లీల , నేను అంటే అభీ కి చాల ఇష్టం ,ఇష్టం అని చెప్పడం కంటే ప్రాణం అని చెపొచ్చు నా కోసం ఏమైనా చేస్తాడు.

నాకు పిల్లలు పుట్టారు అని తెలిసిన కుడా నన్నే తన పాప లాగా చూసుకుంటున్నాడు. అభీ కి నాకు పిల్లలు అంటే చాల ఇష్టం కానీ నాకు ఉన్న సమస్య  వల్ల అభీ కి పిల్లలని ఇవ్వలేకపోతున్న అని చాల బాధ గా ఉంది, కానీ అభీ చెప్పాడు మనం ఎవరైనా పిల్లలని పెంచుకుందాం అని నేను కుడా సరే అని చెప్పాను. 

నేను చిన్న పిల్లలకి కి టీచర్ గా స్కూల్ లో పని చేస్తున్న. అభీ కి తెలుసు నాకు పిల్లలు అంటే ఇష్టం అని, అభి చెప్పాడు స్కూల్ లో టీచర్ గా చేరు పిల్లలతో కొంచం సమయం గడపొచ్చు అని  అందుకే స్కూల్ టీచర్ గా చేరాను.

సాయంత్రం…...

(అభీ) హలో లీల నేను ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతున్న నువ్వు ఎక్కడ ఉన్నావ్,

(లీల) అభీ నేను ఇంట్లో ఉన్నాను,

(అభీ) సరే  నేను వస్తున్న రెడీ ఐ ఉండు లీల,

(లీల) సరే అభీ రెడీ గా ఉంటాను.

ఇంటిదగ్గర….

(అభీ)వెళదామా లీల రెడీ అ,

(లీల) అ  అభీ నేను రెడీ,

(అభీ) లీల ఇప్పుడు మనం ఎక్కడికి  వెళ్తున్నామో తెలుసా,

(లీల) స్పెషల్ అన్నావ్ కదా అభీ నాకు ఎలా తెలుస్తుంది,

(అభి) నువ్వు ఎదో ఒకటి అలోచించి ఉంటావ్ కదా చెప్పు,

(లీల) ఏమో అభీ నాకు తెలియదు నువ్వే చెప్పు,

(అభీ) మనం ఇప్పుడు ఎక్కడికి  వెళ్తున్నాము అంటే,

అదే సమయం లో అభీ ఇంకా లీల వెళ్తున్న కార్ కి ఆక్సిడెంట్ ( accident ) అవుతుంది.

చుట్టూ ఉన్నవాళ్లు … అయ్యె భార్యాభర్తలు లాగా ఉన్నారే, ఈ  లారీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేస్తూ wrong రూట్ లో వచ్చి కార్ నీ గుదేశాడు ఎవరైనా అంబులెన్సు కి ఫోన్ చేయండి.

కాసేపటికి హాస్పిటల్ లో….

(అభీ) లీల లీల డాక్టర్ నా లీల ఎక్కడ ఉంది నేను తనని చూడాలి లీల ఎక్కడ డాక్టర్,

(డాక్టర్) లీల న ఎవరు తను అంబులెన్స్ లో నిన్ను ఒక్కడినే తీసుకొచ్చారు కదా నీతో పాటు ఎవరైనా ఉన్నారా,

(అభీ) అవును డాక్టర్ నా భార్య లీల నేను కార్ లో వెళ్తున్నాము ఆక్సిడెంట్ అయింది నా లీల ఎక్కడ డాక్టర్,

(డాక్టర్) మీ పేరు,

(అభీ) నా పేరు అభీ అభినవ్.

(డాక్టర్) చుడండి అభీ మీకు జరిగింది ఆక్సిడెంట్ ఏ, మీరు బనే ఉన్నారు మీకు  ఏం అవ్వలేదు మీ భార్య కి కుడా ఏం జరిగి ఉండదు టైం కి హాస్పిటల్ కి తీసురావడం తో నిన్ను కాపాడగలిగాం మీ వాళ్ళు ఎవరైనా ఉంటె ఇక్కడికి పిలవండి.

(అభీ) హలో సామ్ నేను అభీ,

(సామ్) రేయ్ అభీ ఎక్కడికి వెళ్ళావ్ రా ఏం అయిపోయావ్, రెండు రోజులు అవుతుంది ఇంటికి ఒచ్చాను అక్కడ లేవు నీ ఫోన్ కూడా కలవడం లేదు ఎక్కడ ఉన్నావ్.

(అభీ) చిన్న ఆక్సిడెంట్ రా హాస్పిటల్ లో ఉన్న నీ హెల్ప్ కావాలి హాస్పిటల్ కి ఒస్తావ,

(సామ్) అ హాస్పిటల్ ఎక్కడో చెప్పు ఇప్పుడే ఒస్తాను.

సామ్ హాస్పిటల్ కీ వెళ్లి అభీ నీ ఇంటికి తీసుకోసాతడు…..

అభీ ఇంటిదగ్గర…..

(సామ్) రేయ్ అభీ, లీల ఎక్కడ రా,

(అభీ) లీల కనిపించడంలేదు .నేను, లీల ఆర్ఫనేజ్ (orphanage) కి వెళదాం అని బయలుదేరాం దారిలో ఆక్సిడెంట్ అయింది.

నేను లేచి చూస్తే లీల లేదు డాక్టర్స్ నీ అడిగితే అంబులెన్సు లో నువ్వు మాత్రం ఏ ఉన్నవ్ నీతో పాటు ఎవరు లేరు అని చెప్పారు,

(సామ్) ఏం చెప్తున్నావ్ రా అసలు ఏం అయింది,

(అభీ) ఏమో రా అదే నాకు అర్ధం అవ్వడం లేదు,

(సామ్) రేయ్ అభీ నీ ఫోన్ ఇంకా లీల వస్తువులు తీసుకున్నావా,

(అభీ) ఇంకా లేదు రా పోలీస్ స్టేషన్ లో నే ఉన్నాయి,

(సామ్) మనం వెళ్లి అవి తీసుకుందాం మనకి ఏమైనా ఉపాయం  దొరకొచ్చు. ఎక్కడ ఆక్సిడెంట్ అయింది,

(అభీ) అనాదశరణాలయం కి  వెళ్లే దారిలొ wrong సైడ్ లో లారీ ఒచ్చింది ఆక్సిడెంట్ అయింది,

(సామ్) సరే  వెళదాం పద. నేను మన బాస్ కి కాల్ చేసి ఇక్కడ జరిగింది చెప్తా మన బాస్ కి పోలీస్ కమీషనర్  తెలుసు మనకి ఏమైనా సహాయపడొచ్చు..

పోలీస్ స్టేషన్ దగ్గర…...

(అభీ) సర్ వెంకట్ గారు కాల్ చేసారు కదా నా పేరు అభీ.

(పోలీస్ ఆఫీసర్) అ అభీ వెంకట్ చెప్పారు మీ భార్య మిస్సింగ్ అంట కదా ఇదిగో కార్ లో ఉన్న వస్తువులు కార్ ఇప్పుడు గ్యారేజ్ లో ఉంది మీరు తీసుకెళ్లొచ్చు,

(అభీ) thank you sir.

(పోలీస్ ఆఫీసర్) మీ భార్య మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వండి,  మేము చూసుకుంటాం ఏమైనా తెలుస్తే మీకు కాల్ చేస్తాను.

(అభీ)  సరే సర్.

అదే రోజు సాయంత్రం అభీ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేస్తాడు…..

(అభీ) హలో ఎవరు ?

(ఫోన్ లో వ్యక్తి ) “ నీ ఆయుష్షు  చాల గట్టిది అనుకుంట బతికేసావ్ . ఏంటి నీ భార్య కోసం వెతుకుతున్నావా  మరిచిపో నీ భార్య కాదు తను నా భార్య నా ఒక్కడికే భార్య”,

(అభీ) రేయ్ ఎవరు నువ్వు , ఏం మాట్లాడుతున్నావ్ నా భార్య  ఎక్కడ, ఎక్కడ ఉంది,

(ఫోన్ చేసిన వ్యక్తి) మరిచిపో అని చెప్పాను కదా తను నా భార్య.

అని చెప్పి అ వ్యక్తి కాల్ కట్ చేస్తాడు.

లీల ఉన్న చోటు …….
(లీల) ఎవరు నువ్వు నన్ను ఎందుకు  ఇక్కడికి తీసుకొచ్చావ్ నీకు ఏం కావాలి.

(లీల నీ తీసుకొచ్చిన వ్యక్తి ) నాకు నువ్వే కావాలి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకొని వాడితో  ఉంటె నేను ఎలా తట్టుకుంటాను అని అనుకున్నావ్ అందుకే నిన్ను తీసుకొచ్చాను. 

నన్ను ఇంకా గుర్తు పట్టలేదా "అహన" , నేను నీ ఉదయ్ నీ నువ్వు కాలేజీ లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నం, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం.

(లీల) నా పేరు లీల, అహన అంటున్నవ్ ఏంటి  నన్ను వదిలేయ్ నా అభీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు .
అని చెప్తూ లీల అభి గురించి ఏడుస్తూ ఉంటుంది.


కొన్ని సంవత్సరాల క్రితం కాలేజీ లో…….

                         రేయ్ ఉదయ్ ఇప్పుడు మనం సీనియర్స్ రా ఈరోజు ఒచ్చే ఫ్రెషర్స్ ( freshers ) నీ రాగ్గింగ్ ( ragging  ) తో పిచ్చెకించాలి ప్రిన్సిపాల్ కి షాక్ ఇవ్వాలి రా.

(ఉదయ్) రేయ్ రాగ్గింగ్ ( ragging ) చేయడం మనకి ఎందుకు రా సంతోషంగా ఫ్రెషర్స్ ( freshers )నీ ఆహ్వానిదం మన సీనియర్స్ చేసిందే మనం చేస్తే వాళ్లకి మనకు తేడా ఏం ఉంటది రా.

కాలేజీ కీ ఒస్తున్నం అంటే ఏదయినా మంచి నేర్చుకోడానికి అంతే కానీ ప్రతి ఒక్కరు చిరాకు పడేలా ఉండకూడదు పద క్లాస్ కి వెళదాం.

(ఉదయ్ స్నేహితుడు )రేయ్ ఉదయ్ అక్కడ చూడురా అమ్మాయిల గురించి  కామెంట్స్ ( comments )చేస్తున్నారు అనుకుంట పద వెళ్లి చూదాం.

(ఉదయ్) ఏం చేస్తున్నారు ఇక్కడ.

(ఉదయ్ స్నేహితులు) ఏం లేదు మామ ఫస్ట్ ఇయర్  అమ్మాయిలు వస్తుంటే చుస్తునాం.

(ఉదయ్) మీరు చూసి ఏం చేస్తారులే కానీ క్లాస్ మొదలయింది  ముందు క్లాస్ కి పదండి.

(ఉదయ్ స్నేహితుడు) రేయ్ ఉదయ్ అక్కడ చూడురా, అ అమ్మాయి నీకోసమే పుట్టినట్టు ఉంది.

(ఉదయ్) అవునా సరే ఉండని నువ్వు క్లాస్ కి పదా.

అదే రోజు సాయంత్రం…...

(ఉదయ్ స్నేహితులు) ఉదయ్ పొదుద్న చుసిన అదే అమ్మాయి రా.

(ఉదయ్) మీరు వెళ్ళండి నేను వెళ్లి కలిసి మాట్లాడి ఒస్తాను.

కాసేపటికి హాస్టల్లో ఉదయ్ రూమ్ లో…..

(ఉదయ్ స్నేహితుడు ) ఏంట్రా ఉదయ్ లేట్ అయింది లేడీస్ హాస్టల్ వార్డెన్ కుమ్మేసిందా.

(ఉదయ్) అల ఏం లేదు రా నువ్వు పొద్దున్న కాలేజీ లో  చెప్పావ్ కదా అమ్మాయి అని అ అమ్మాయి నీ కాలేజీ గేట్ దగ్గరె చూసాను మన వాళ్ళు అమ్మాయిల గురించి ఏదో అంటుంటే  క్లాస్ మొదలయింది అని అక్కడ నుంచి తీసుకెళ్ళాను అందుకే నువ్వు చెప్పిన నేను పటించుకోలేదు.

సాయంత్రం మాట్లాడుదాం అని వెళ్ళాను కానీ ఏం మాట్లాడలేక పోయాను రా.

(ఉదయ్ స్నేహితుడు) రేయ్ ఉదయ్ ఫణి వాళ్లు మన హాస్టల్ కి ఒచ్చి గొడవ చేస్తున్నారు రా. 
అ రోజు రాత్రి హాస్టల్ లో గొడవ జరుగుతుంది.

తర్వాత రోజు కాలేజీ లో…...

(ఉదయ్ స్నేహితుడు) రేయ్ ఉదయ్ అ అమ్మాయి పేరు "అహన"  అంట అ ఫణి గాడు వాళ్ళ స్నేహితులు అ అమ్మాయిని ఏడిపిస్తునారు త్వరగా ర రా.

(ఉదయ్) అ ఫణి గాడికి రాత్రి పడింది సరిపోలేదు అనుకుంటా పద వెళదాం.

(ఫణి స్నేహితుడు) రేయ్ ఫణి ఉదయ్ ఒస్తునాడు మనం వెళ్ళిపోదాం పదరా.

(ఫణి) హే వాడు వస్తే నాకు ఏంటి రా.

(ఉదయ్ స్నేహితులు) రాత్రి ఒక రౌండ్ అయింది మల్లి ఇంకో రౌండ్ కి మాకు ఓపిక లేదు వెళదాం ర రా.

ఫణి వాళ్ళు వెళ్ళిపోతారు……..

(ఉదయ్ స్నేహితుడు) హే హయ్ మా వాడి పేరు ఉదయ్ మీకు కాలేజీ లో ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే మాకు  చెప్పండీ. ఏరా ఉదయ్ అంతే కదా .

(ఉదయ్) చాలు ఇంకా అపు. ఉదయ్  ,అహన తో మీరు క్లాస్ కి వెళ్ళండి అని అంటాడు  .
ఉదయ్ ఇంకా అహన  ఒకరిని ఒకరు చూసుకుంటూ క్లాస్ కి వెళ్తారు.

ఒక వారం తర్వాత…….

(ఉదయ్ స్నేహితుడు) ఇంత పొద్దునే ఎక్కడికి బయలుదేరావ్ రా.

(ఉదయ్) గుడి కి రా అహన పుట్టినరోజు ఈరోజు. గుడికి వెళదాం అని చెప్పింది వెళ్తున్న.

(ఉదయ్ స్నేహితుడు) ఇది ఎప్పటినుంచి రా.

(ఉదయ్) అ రోజు ఫణి గాడు అహనని రాగ్గింగ్ (ragging) చేసాడుకదా అప్పుడే , అదే రోజు సాయంత్రం కాఫీ షాప్ లో నేను అహన కలుసుకున్నాం , మాట్లాడుకున్నాము.

తన గురించి చెప్పింది రా వాళ్ళ అమ్మ నాన్న నీ ఆస్తి కోసం వాళ్ళ బాబాయి వాళ్ళు చంపేసారు అని అలంటి వారితో ఉండడం ఇష్టం లేక తను ఇంట్లో నుండి ఒచ్చేసింది.

సరే టైం అవుతుంది నేను ఇప్పుడు గుడికి వెళ్తున్న. నేను అక్కడినుండి కాలేజీ కి వస్తాను నా బ్యాగ్ కూడా తీసుకురా కాలేజీ లో కలుదాం.

ఉదయ్ ఇంకా అహన ప్రేమించుకుంటారు, అల వాళ్ళ చదువు కూడా పూర్తి చేస్తారు.ఉదయ్ కూడా చిన్న కంపెనీ లో జాబ్ లో చేరతాడు. ఒక రోజు ఉదయ్ అహన తో " హే కుట్టి పెళ్లి చేసుకుందామా అని అంటాడు.

ప్రస్తుతం (present day).....

(ఉదయ్) గుర్తుకొచ్చిందా అహన మనం ప్రేమించుకునం పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము. నువ్వు ఏం బయపడకు నేను నిన్ను మంచి గా చూసుకుంటాను నువ్వు అ అభి గాడిని మరిచిపో.

అభీ ఇంటి దగ్గర…..

(అభీ) హలో సామ్ నేను అభీ రా నాకు ఒక  నెంబర్ నుంచి కాల్ ఒచ్చింది కదా అ నెంబర్ ఎవరిదో తెలుసుకుందాం అని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న నువ్వు ఒస్తావా వెళదాం.

పోలీస్ స్టేషన్ లో…..

(అభీ) హలో సర్ నేను అభినవ్ నా భార్య కనపడడం లేదు అని చెప్పను కదా నాకు ఒక నెంబర్ నుంచి కాల్ ఒచ్చింది అ నెంబర్ ఎవరిదీ ఎక్కడనుండి కాల్ చేసారు తెలుసుకుందాం అని  వచ్చాను.

(పోలీస్ ఆఫీసర్) మీరు అల కూర్చోండి అ నెంబర్ ఇవ్వండి నేను చూసి చెప్తాను .

కాసేపటికి……..

(పోలీస్ ఆఫీసర్) అభీ  అ నెంబర్ ఎక్కడ ఉందొ తెలిసింది.

(అభీ)  సామ్ నేను అక్కడికి వెళ్తాను రా.

(సామ్) నేను కూడా వస్తాను.

(అభీ) ఒద్దు సామ్ నా గొడవ వాళ్ళ నీకు ఏమైనా జరిగితే మీ కుటుంబానికి ఇబ్బంది ఇంత వరకు నాకు తోడుగా ఉన్నావ్ చాలు  మిగితా విషయం నేను చూసుకుంటాను సామ్.

(సామ్) సరే రా జాగ్రత్త.

అభీ పోలీస్ ఆఫీసర్ చెప్పిన చోటుకి వెళ్తాడు. అ చోటు లో పాడుబడిన ఇల్లు ఉంటుంది. అభీ అ ఇంటిలోపలికి  కి వెళ్తాడు.

అక్కడికి ఎదో కార్ వస్తున్న శబ్దం వినపడుతుంది, అది గమనించిన అభీ మెల్లగా కిటికీ నుంచి బయటకు చూస్తాడు. అ కార్ నుంచి ఒక వ్యక్తి దిగుతాడు.

అ వ్యక్తి ఇంట్లోకి వస్తాడు. అభీ అ వ్యక్తి నీ తల పైన కర్ర తీసుకొని కొడతాడు అప్పుడు అ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. 

అ వ్యక్తి నీ అభీ కాటేస్తాడు, కాటేసిన తర్వాత అ వ్యక్తి నీ లేపి నాకు ఫోన్ చేసింది నువ్వే కదా నా లీల ఎక్కడ అని అభీ అ  వ్యక్తి నీ అడుగుతాడు. 

అప్పుడు అ  వ్యక్తి తన పేరు ఉదయ్ అని తాను ప్రేమించిన అమ్మాయి విషయం అభీ కి చెప్తాడు. తనకు జరిగింది అభి కి ఇలా చెప్తాడు 

(ఉదయ్) నేను, అహన పెళ్లి చేసుకుందాం అనుకున్నాము అ తర్వాత రోజు నేను రిజిస్టర్ ఆఫీస్ లో అహన  కోసం ఎదురు చేస్తున్న తను ఎంతకీ రాలేదు, అక్కడే ఎదురు చేస్తున్న.

అప్పుడే  నాకు ఫోన్ కాల్ ఒచ్చింది నీకు కాబోయే భార్య కోసం ఎదురు  చేస్తున్నావా అది చచ్చి గంట అయింది దాన్ని చూడాలి అంటే స్టీల్ గోడౌన్ కి రా అని చెప్పి కాల్ కట్ చేసారు.

నేను వెంటనే స్టీల్ గౌడౌన్ కి బయలుదేరాను మధ్యలో నాకు ఆక్సిడెంట్ అయింది తర్వాత ఎం జరిగింది అనేది నాకు తెలియదు. 

నేను లేచి చూసేసరికి హాస్పిటల్ లో ఉన్నాను డాక్టర్ నీ అడిగాను నాకు ఏమైంది అని, డాక్టర్ చెప్పారు ఆక్సిడెంట్ తర్వాత నేను కోమా ( coma ) లోకి వెళ్ళాను అని.

ఒక రోజు నేను అనుకోకుండా స్కూల్ లో అహన నీ చూసాను తాను కూడా నన్ను చూసింది కానీ నన్ను గుర్తుపట్టలేదు.

అప్పటినుండి తనని ఫాలో చేశాను. నీతో అహన ని చూసి ఆశ్ఛర్యపోయాను అప్పుడే నేను పథకం వేసి మీరు వస్తున్న కార్ కి ఆక్సిడెంట్ చేసాను అహన నీ ఇక్కడికి  తీసుకొచ్చాను.

(అభీ) నువ్వు చెప్పే కథలు వినడానికి నేను ఇక్కడికి రాలేదు లీల ఎక్కడ ఉంది.

(ఉదయ్) పైన రూమ్ లో ఉంది.

అభీ పైన ఉన్న రూమ్ కి  వెళ్లి లీల నీ చూస్తాడు.లీల ఇంకా అభీ ఉదయ్ దగ్గరికి వస్తారు. 

అభీ , ఉదయ్ చూస్తూఉండగా లీల నీ ఇలా  అడుగుతాడు " ఇతను నీకు తెలుసా లీల అని ".

నాకు ఇతను ఎవరో తెలియదు అభీ అని లీల చెపుతుంది.

అప్పుడు ఉదయ్ మాట్లాడుతూ "  నేను నిజం నిరుపిస్తాను తన బాబాయ్ వాళ్ళ  ఇంటికి వెళదాం" అని చెప్తాడు. ఉదయ్, అభీ ఇంకా లీల ఉదయ్ చెప్పిన ఇంటికి వెళ్తారు . 

ఉదయ్ చెప్పిన ఇంటి దగ్గర…….

(అభీ)నువ్వు కార్ లోనే ఉండు లీల నేను ఉదయ్ వెళ్లి ఒస్తాము.

(లీల) సరే అభీ నేను ఇక్కడే ఉంటాను.

అభీ ఇంకా ఉదయ్ ఇద్దర కలిసి ఇంటిలోపలికి వెళ్తారు .
అహన చనిపోయింది అని తెలుసుకుంటారు. లీల ఇంకా అహన ఇద్దరు వేరే  అని ఉదయ్ కి అప్పుడు అర్ధం అవుతుంది.

తను చేసిన తప్పు తెలుసుకొని అభీ ఇంకా లీల కు క్షమాపణ చెప్పి అక్కడి నుండి ఉదయ్ వెళ్ళిపోతాడు.

ఉదయ్ వెళ్లే సమయం లో లీల ఉదయ్ తో ఇలా చెప్తుంది.

"మీరు ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు మీతో లేదు అని బాధపడకండి ఏ అమ్మాయి ఐనా ప్రేమించిన వారి సంతోషం కోరుకుంటుంది వాళ్ళు ఎప్పుడు బాగుండాలి అని అనుకుంటుంది. మీరు అహన నీ మరిచిపోయి ఒక కొత్త జీవితం మొదలు పెట్టండి. అహన మీతో లేకపోయినా మీరు సంతోషం గా ఉంటె తాను ఎక్కడ ఉన్న సంతోషంగా ఉంటుంది".

(ఉదయ్) సరే లీల గారు అహన కోసం నేను కొత్త జీవితం మొదలు పెడతాను నేను వెళ్తాను.

వారం రోజుల తర్వాత…...

(అభీ) లీల నిన్ను స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తాను అని చెప్పను కదా ఈరోజు వెళదామా.

(లీల) వెళదాం.

వెళ్లే దారిలో లీల ఇంకా అభి మాట్లాడుకుంటున్నారు….

(లీల) నన్ను క్షమించు అభీ నేను నీకు అబ్బదం చెప్పాను.

(అభీ) ఎ విషయం లో అబ్బదం చెప్పావు లీల.

(లీల) నాకు ఉదయ్ తెలియదు అని చెప్పాను కదా,కాని నాకు ఉదయ్ తెలుసు.

(అభీ) నీకు ఉదయ్ తెలుసు అని నాకు తెలుసు లీల.

(లీల) అది ఎలా అభి .

(అభీ) పోలీస్ ఆఫీసర్ చెప్పిన చోటుకి నిన్ను వెతుకుంటూ అ రోజు అ ఇంటికి ఒచ్చాను.అక్కడ ఉదయ్ బ్యాగ్ ఉంటె చూసా అందులో ఉదయ్ ఇంకా నువ్వు కలిసి ఉన్న ఫోటోలు ఇంకా నీ డైరీ నీ చూసా కానీ అ డైరీ లో పేరు అహన అని రాసి ఉంది.

ఉదయ్ నీ అడిగా నీకు ఈ డైరీ ఎక్కడిది అని " నువ్వు చదువుకో నే అప్పుడు హాస్టల్ ఉన్నావ్ అంటా కదా లీల, ఉదయ్ మీ హాస్టల్ కి వెళ్లాడు అంటా అక్కడ ఇందు అనే అమ్మాయి ఈ డైరీ ఉదయ్ కి ఇచ్చింది అంటా. 

అందుకే అదే రోజు అడిగాను ఉదయ్ నీకు తెలుసా అని నువ్వు తెలియదు అన్నావ్. నువ్వు తెలియదు అని చెప్పావ్ అంటే ఏదో జరిగే ఉంటుంది అని అనుకున్న అందుకే నిన్ను మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి  తీసుకెళ్లలేదు. 

(లీల) Thank you  అభీ నన్ను అర్ధం చేసుకునందుకు .ఉదయ్ పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు అ రోజు రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరాను, వెళ్లే దారిలో మా బాబాయి నన్ను ఇంకా ఉదయ్ నీ చంపుదాం అని పథకం వేసారు.

ఈ విషయం మా పిన్ని నాకు కాల్ చేసి చెప్పింది.ఉదయ్ నీ కాపాడుకోవాలి అని వెళ్లిన నన్ను మా బాబాయి మనుష్యులు నన్ను ఉదయ్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 

నన్ను మా బాబాయ్ దగ్గరికి తీసుకెళ్లరు. మా బాబాయ్ నాతో మాట్లాడుతూ " నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఆస్థి మొత్తం నీకు నీ భర్తకి చెందుతుంది అదే నిన్ను ,వాడిని చంపేస్తే ఈ ఆస్థి మొత్తం నా దగ్గరే ఉంటది " అని చెప్పాడు. 

నాకు ఆస్థి వద్దు నన్ను ఉదయ్ ని వదిలేయమని చెప్పను. మా బాబాయ్ నా మాట వినలేదు. ఉదయ్ ని కాపాడుకోవాలి అని నేను అక్కడినుండి తపించుకున్నాను. 

అల తపించుకున్న నన్ను మా బాబాయ్ మనుష్యులు చూసి నన్ను  లోయలోకి తోసేసారు దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాను. చాల రోజులు పట్టింది నేను కోలుకోడానికి

నేను కోలుకున్నాక  ఉదయ్ కోసం వెళ్ళాను, వెళ్ళాక తెలిసింది మా బాబాయి చేయించిన ఆక్సిడెంట్ లో ఉదయ్ చనిపోయాడు అని. 

అది విని నేను చనిపోదాం అనుకున్న కానీ చనిపోవాల్సిన నేను బ్రతికాను అంటే ఏదో చేయాలి అని రాసి పెట్టి ఉంది అందుకే అక్కడి నుండి ఇక్కడికి ఒచ్చి లీల గా పేరు మార్చుకున్న. 

నా స్నేహితురాలు ప్రతిమ సహాయంతో లేడీస్ హాస్టల్ లో ఉంటూ ఏదో ఒక పని  చేసుకుంటూ ఉండే దానిని.

అ తర్వాత నువ్వు నన్ను చూడడం,  నేను నీకు నచ్చడం, మనం పెళ్లి చేసుకోడం జరిగింది. మన పెళ్లి తర్వాత  ఒక కొత్త జీవితం మొదలు పెట్టాను అభీ. 

నేను ఉదయ్ నీ, నన్ను తీసుకెళ్లిన రోజే గుర్తుపట్టాను. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఉదయ్ నేను చనిపోయాను అంటే తాను కూడా చనిపోతాడు అని తెలుసు అందుకే తాను వెళ్ళేటప్పుడు ఒక కొత్త జీవితం మొదలు పెట్టు అని చెప్పను.

ఉదయ్ మీద నాకు ఉన్న ప్రేమ అ లోయలో నే పోయింది.
నీతో ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నను.

నువ్వు ఉంటే చాలు అభీ నాకు. ఉదయ్ కూడా తన జీవితం తాను చూసుకుంటాడు మనకు ఏ ప్రాబ్లెమ్ ఉండదు.

(అభీ)  సరే లీల నీ సంతోషమే నాకు ముఖ్యం. ఉదయ్ ఫోన్ నెంబర్ నేను తీసుకున్నాను. మనమే ఉదయ్ కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేదాం.

మనం ఇప్పుడు అనాదశరణాలయానికి వెళ్తునం నీకు నచ్చినా వారిని దత్తతు తీసుకుందాం.

(లీల) సరే అభీ.

ఒక సంవత్సరం తర్వాత.

అభీ ఇంకా లీల వాళ్ళ పాప తో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు .ఒక మంచి అమ్మాయిని చూసి ఉదయ్ పెళ్లి చేస్తారు.

A Suprise Wedding

An accident happens while Shekar and Deepika are going on a bike in a desolate place. At the same time, Shekar's parents and Deepika'...