UNKNOWN : Two Faces ~ One Truth
News buliten. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి గా పోటీ చేస్తున్న గోవిందరాజులు హత్య చేయబడ్డారు. పది రోజుల క్రితం:- జన జీవన పార్టీ కార్యాలయంలో, పార్టీ పెద్ద గోవిందరాజులుతో మాట్లాడుతూ " ఈ సారి నువ్వు సీఎం పదవి కి పోటీ చెయ్ నీకు తోడుగా నేను ఉంటాను.. నువ్వు ఏం చేస్తావో, ఎంత డబ్బు ఖర్చు చేస్తావో నీ ఇష్టం, కానీ ఈ సారి నువ్వే గెలవాలి ". గోవిందరాజులు, " అలాగే సర్ మీరు నాతో ఉండి నన్ను గెలిపిస్తాను అంటే నేను ఏదైనా చేసి గెలుస్తాను.. నేను వెళ్తాను సర్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ". " సిద్ధ ఈ సారి నేను సీఎం కావాలి, నాకు పోటీ ఉండకూడదు. నాకు పోటీగా ఉన్నది అ ఆదికేశవులు, వాడిని ఎలా అయిన సరే సీఎం గా పోటీ చేయకుండా అపలి. నాకు వాడి గురించి అన్ని విషయాలు తెలియాలి " అని గోవిందరాజులు తన అనుచరుడితో అంటాడు. శ్రీ కృష్ణ కాలనీ, విశాఖపట్నం: అమ్మ :" రుద్ర, రేయ్ రుద్ర లెవర ఈరోజు గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదా, ఇంకా ఈ నిద్ర ఏంటి రా ". (అని అమ్మ).. రుద్ర : "అబ్బా, అమ్మ ఈసరికి గుడికి నువ్వే వెళ్ళు, నన్ను పడుకొని ప్లీస్". అమ్మ : "పోనీ గుడి దగ్గర అయిన డ్రాప్ ...