Life with Wife
Chapter 1 ఆదివారం అమ్మాయి ఇంట్లో. మాధవ్, మాధవ్ ఎక్కడ ఉన్నావ్, మాధవ్ :- పెరట్లో ఉన్నాను నాన్న వస్తున్నాను. చెప్పండి నాన్న పిలిచారు. ప్రతాప్ రావు(నాన్న): - పెళ్లిళ్ల పెరయా ఒక సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయి డిగ్రీ పూర్తి దచేసింది.. ఒక్కతే కూతురు, సొంత ఇల్లు ఉంది.. నువ్వు సరే అంటే ఈ ఆదివారం అమ్మాయిని చూడడానికి వెళదాం. మాధవ్ :- సరే నాన్న వెళదాం. ఆదివారం రోజు :- ఫోన్ లో :- హలో చంద్రశేఖర్ గారు, ఇందిర నగర్ రెండో వీధిలో ఉన్నాము ఎక్కడికి రమంటారు. చంద్రశేఖర్(అమ్మాయి వాళ్ళ నాన్న) :- అలాగే వీధి చివరికి రండి రావు గారు నేను బయటే ఉంటాను. ప్రతాప్ రావు :- సరే అండి. అమ్మాయి ఇంటి దగ్గర:- నమస్కారం చంద్రశేఖర్ గారు.. తను నా భార్య లక్ష్మీ, వీడు నా కొడుకు మాధవ్. చంద్రశేఖర్ :- నమస్కారం అండి, పదండి లోపలికి వెళదాం. ఇంట్లొ:- చంద్రశేఖర్ మాట్లాడుతూ, భాగ్యం, అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు. భాగ్యం( చంద్రశేఖర్ భార్య):- నమస్కారం రండి కూర్చోండి.. ఒక పది నిమిషాలు అమ్మాయి రెడి అవుతుంది. కాసేపటికి అమ్మాయి వచ్చాక:- చంద్రశేఖర్ :- అమ్మాయి తో మాట్లాడాలి అంటే, డాబా పైకి వెళ్ళండి బాబు. అమ్మ బాబు నీ తీసుకెళ్లు. మాధవ్ :-...