పెళ్లిగోల


దామోదర్ (నాన్న) తన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి అవ్వడంలేదు, ఎన్ని సంబంధాలు చూసిన ఏ ఒక్క సంబంధం కుదరడంలేదు అని బాధ పడుతుంటారు, అదే సమయంలో తన స్నేహితుడు తనకు తెలిసిన శాస్త్రి గారి గురించి చెప్తారు. తన అబ్బాయి పెళ్లి గురించి తెలుసుకుందాం అని దామోదర్ గారు శాస్త్రి గారి దగ్గరకు వెళ్తారు.


శాస్త్రి గారి తో దామోదర్ మాట్లాడుతూ:-


దామోదర్:- గత రెండు సంవత్సరాలుగా మా అబ్బాయి కీ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం శాస్త్రిగారు కానీ ఏది కుదరడం లేదు, మా అబ్బాయి జాతకం చూసి ఎప్పుడు పెళ్లి అవుతుంది అనేది చెప్పండి శాస్త్రిగారు.


శాస్త్రి గారు:- దేనికైనా సమయం రావాలి అండి. మీ అబ్బాయి జాతకంలో ఏ దోషం లెదు 30 సంవత్సరాలు దాటినా తర్వాతే మీ అబ్బాయి కీ పెళ్లి గడియాలు ఉన్నాయి. ఇంకా రెండు నెలల్లో మీ అబ్బాయి కి 30 సంవత్సరాలు నిండుతాయి, ఆ తర్వాత ఒక అందమైన తెలివైన అమ్మాయి తో వివాహం జరుగుతుంది. మీరు ఏం కంగారు పడకండి మీ ప్రయత్నాలు మీరు చేయండి. అంతా మంచే జరుగుతుంది.


దామోదర్:- అలాగే శాస్త్రిగారు మంచి మాట చెప్పారు. మరి నేనీ వెళ్లొస్తాను.


సాయంత్రం ఇంటి దగ్గర:-


దామోదర్:- నాన్న శివ!


శివ:- చెప్పండి నాన్న!


దామోదర్:- ఉదయం శాస్త్రిగారిని కలిసాను, నీకు 30 సంవత్సరాలు దాటినా తర్వాతే పెళ్లి జరుగుతుంది అని చెప్పారు ఇంకో రెండు నెలల్లో నీ పుట్టినరోజు ఉంది తర్వాత నీకు 30 సంవత్సరాలు నిండుతాయి కదా.


శివ:- అవును నాన్న.


దామోదర్:- పోయిన వారం మాట్లాడిన సంబంధం వాళ్లు ఫోన్ చేశారు, ఈ అదివారం ఒచ్చి అమ్మాయి నీ చూడమని చెప్పారు మరి ఈ ఆదివారం వెళ్లి చూద్దామా.


శివ:- సరే నాన్న వెళదాం.


దామోదర్:- సరే వెళ్లి పడుకో మరి, రేపు ఆఫీస్ కి వెళ్ళాలి కదా.


తరువాత రోజు ఆఫీస్ లో:-


బాస్:- హాయ్ శివ,  ముంబై కీ పంపల్సిన ప్రొడక్ట్ రెడీ గా ఉంది కదా.


శివ:- రెడీగా ఉంది రిపోర్ట్ రెడీ చేసి మీకు మెయిల్ చేస్తాను.


బాస్:-  ఒకే గుడ్. ఇంకా ఏంటి విశేషాలు పెళ్లి ఎప్పుడు మరి.


శివ:- ఈ అదివారం అమ్మాయి నీ చూడడానికి వెళ్లాలి, అంతా ఒకే అనుకుంటే తర్వాత పెళ్లి.


బాస్:- ఒహ్! సూపర్ మంచి విషయం చెప్పావ్ శివ.


అదివారం రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో:-


ప్రభాకర్(అమ్మాయి తండ్రి):-  బాబు శివ అమ్మాయి రిధ్విక మీరు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే అలా పైకి వెళ్లి మాట్లాడుకోండి. రిధ్విక అబ్బాయి నీ తీసుకెళ్ళామా.


ఒక పదిహేను నిమిషాల తర్వాత అంటే రిధ్విక ఇంకా శివ మాట్లాడుకుని ఒచిన్న తర్వాత.


దామోదర్:- అమ్మాయి కి అబ్బాయి నచ్చాడు, అబ్బయ్ కి అమ్మాయి నచ్చింది ఇంకా పెళ్లి ఎప్పుడు అనేది మనం మాట్లాడుకుందాం బావగారు.


ప్రభాకర్:- సరే బావగారు పంతులు గారు ఒచ్చే నెల నిశ్చితార్థం కీ ముహూర్తం బాగుంది అని చెప్పారు. మనం అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం.


దామోదర్:- సరే బావగారు టైం ఇంకా తేదీ, పంతులు గారిని అడిగి చెప్పండి మేము అ టైం కి ఒచేస్తాం. ఇంకా మేము బయలుదేరుతం బావగారు


నిశ్చితార్థం అవ్వడానికి కొన్ని రోజుల ముందు శివ కి చిన్న ఆక్సిడెంట్ జరుగుతుంది. ఒక రోజు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది.


ఆ తరువాత కొన్ని రోజులకి శివ ఇంకా రిధ్విక కు నిశ్చితార్థం జరుగుతుంది.


నిశ్చితార్థం జరిగిన రాత్రి:-


రిధ్విక:- నాన్న నిజం చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం నాకు నచ్చడం లేదు. నేను ఎక్కువ రోజులు బ్రతకను, పెళ్లి తర్వాత నేను చనిపోతే శివ ఒంటరివారు అవుతారు శివ నీ మోసం చేసిన వాళ్ళం అవుతాం.


శివ చాలా మంచివారు, నేను ఎలా అయినా బ్రతకను నా బదులుగా చెల్లికి ఇంకా శివ కి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళ పెళ్లి చూసి నేను సంతోషంగా ఉంటాను. చెల్లిని నేను ఓపిస్తాను నాన్న శివ నీ పెళ్లి చేసుకోమని. నేను అంటే చెల్లి కి ఇష్టం నా మాట చెల్లి వింటుంది.


ఇప్పుడు నిశ్చితార్థం మాత్రమే జరిగింది, ఇదే విషయం శివ వాళ్లుకి కూడా చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు.


ప్రభాకర్:- సరే అమ్మ ముందు చెల్లి తో మాట్లాడు. చెల్లి ఒప్పుకుంటే తర్వాత శివ వాళ్ళతో మాట్లాడుదాం.


రిధ్విక:- హలో రితిక ఎక్కడ ఉన్నావ్. కలిగానే ఉన్నావ్ కదా నీతో ఒక విషయం మాట్లాడాలి.


రితిక:- అ అక్క కలిగానే ఉన్నాను చెప్పు.


రిధ్విక:- నా ఆరోగ్యం పరిస్థితి నీకు తెలుసు కదా నేను ఎక్కువ రోజులు బ్రతకనని, నాన్న ఈ విషయం పెళ్లి కొడుకు వాళ్ళకి చెప్పలేదు. నాకు ఇది అంతా మంచిగా అనిపించడం లేదు వాళ్ళకి నిజం చెప్పేదం అని నాన్నతో చెప్పాను, అలాగే పెళ్లి కూతురు నేను కాదు మా చెల్లి అని చెపుదాం అని అనుకుంటున్న.


అబ్బాయ్ చాలా మంచోడు నేను చూసాను మాట్లాడను కదా తాను చాలా పద్ధతి గా ఉంటారు ఇంకా ఏ చెడు అలవాట్లు లేవు. నేను ఎక్కువ రోజులు ఉండను నన్ను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయ్ కొన్ని రోజులు మాత్రమే సంతోషం గా ఉంటారు అదే నిన్ను చేసుకుంటే జీవితం మొత్తం సంతోషం గా ఉంటారు.


నాన్న అబ్బాయ్ ఫోటో నీకు పంపించారు కదా,నువ్వు కూడా చూసావ్ కదా నీకు నచ్చితే పెళ్లి గురించి మాట్లాడుదాం. ఇలాంటి మంచి అబ్బాయి మనం వెతికిన దొరకరు అందుకే ఇంతగా చెప్తున్నను రితిక. నువ్వు సరే అంటే పెల్లుకొడుకు వాళ్ళతో మాట్లాడుదాం లేదు అంటే నిజం చెప్పి ఈ పెళ్లి ఒద్దు అని చెప్పేదం.


మీ పెళ్లి జరిగితే నేను ఉన్న ఈ కొన్ని రోజులు సంతోషం గా ఉంటాను.


రితిక:- సరే అక్క నీ సంతోషం కోసం నేను ఒప్పుకుంటాను మరి నా సంతోషం కోసం నువ్వు కూడా ఒకటి చేయాలి.


రిధ్విక:- చెప్పు రితిక ఏం చేయాలో నీ సంతోషం కోసం నేను ఏదయినా చేస్తాను.


రితిక:- మన ఇద్దరం శివ నీ పెళ్లి చేసుకుందాం.


రిధ్విక:- మతి ఉండే మాట్లాడుతూనావ రితిక. మన ఇద్దరం పెళ్లి చేసుకోడం ఏంటి.


రితిక:- అవును అక్క నా సంతోషం నీకు ఎంత ముఖ్యం అని నువ్వు అంటున్నావో అలాగే నీ సంతోషం కూడా నాకు అంతే ముఖ్యం.


నువ్వు ఎక్కువ రోజులు బ్రతకను అని చెప్తున్నావ్ కదా ఉన్నన్ని రోజులు నాతో పాటు నా దగ్గరే ఉండు, చిన్నపాటి నుండి దూరం గానే పెరిగం ఇలా అయిన కొన్ని రోజులు కలిసి ఉందాం. కావాలి అంటే నాన్నతో పెళ్లి వాళ్లతో నేను మాట్లాడుతను.


ఇలా చెప్పడం లో నా స్వార్థం కూడా ఉంది అక్క. నీకు పెళ్లి చూపులు అయ్యాక నాన్న శివ ఫోటో నాకు పంపించారు. నాన్న శివ ఫోటో పంపించక ముందే నేను శివ నీ ఇష్ట పడ్డాను.


రిధ్విక:- ఇది ఎప్పుడు జరిగింది రితిక నాకు చెప్పనే లేదు.


రితిక:- నీకు తెలుసు కదా అక్క నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ (interview) కి వెళ్తున్న అని. అలా ఒకరోజు ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాను అక్కడ శివ నీ చూసాను. శివ నీ చూడగానే నాకు నచేసారు. అదే సమయం లో నాన్న ఫోన్ చేస్తారు.


ప్రభాకర్:- అమ్మాయి రితిక ఎలా ఉన్నావ్.


రితిక:- నేను బాగానే ఉన్నా నాన్న, ఇంటర్వ్యూ ఉంటే వచ్చాను. మీరు ఎలా ఉన్నారు నాన్న.


ప్రభాకర్:- నేను చాలా సంతోషంగా ఉన్నాను. అక్క కి పెళ్లి సంబంధం కుదిరింది నువ్వు అబ్బాయి ని చూడలేదు కదా అని నీకు ఫోటో పంపించను చూడు అమ్మ.


రితిక:- సరే నాన్న ఫోటో చూసి మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను.


ప్రభాకర్:- సరే అమ్మ ఉంటాను జాగ్రత.


నాన్న పంప్పించిన ఫోటో చూడగానే తెలిసింది నాకు మొదటి చూపులోనే నచిన్న అబ్బాయి నా అక్క కి కాబోయే భర్త అని. ఇంకా నేను అక్కడ నుండి ఒచేసాను అక్క.


కానీ ఇప్పుడు నువ్వు నన్ను శివ నీ పెళ్లి చూసుకోమని చెవుతున్నావ్. పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను కానీ నువ్వు ఒంటరిగా మిగిలిపోతావ్ అలా నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు.


అందుకే మనం ఇద్దరం శివ నే పెళ్లి చేసుకుందాం.


ప్రభాకర్:-  చెల్లి చెప్పిన దానికి నాకు ఏ అభ్యతరం లేదు అమ్మ, శివ వాళ్ళతో నేను మాట్లాడుతాను ఎలా అయినా పెళ్లి కి ఓపిస్తాను.


తర్వాత రోజు ఫోన్ లో ప్రభాకర్ గారు దామోదర్ గారి తో మాట్లాడుతూ:- 


ప్రభాకర్:- నమస్కారం బావగారు ఎలా ఉన్నారు.


దామోదర్:- నమస్కారం బావగారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు.


ప్రభాకర్:- బాగున్నాను. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి బావగారు. మీరు ఇంకా మీ అబ్బాయి శివ ఇంట్లో ఎప్పుడు ఉంటారు.


దామోదర్:- శనివారం ఉదయం అయితే ఇంట్లో నే ఉంటాము బావగారు.


ప్రభాకర్:- సరే మరి శనివారం ఉదయం ఒస్తాను ఉంటాను బావగారు.


దామోదర్:- సరే బావగారు మంచిది.


శనివారం రోజు శివ వాళ్ళ ఇంట్లో:-


ప్రభాకర్:- బావగారు మీ దగ్గర ఒక విషయం దచి పెట్టాను, పెళ్లికి ముందే అన్ని విషయాలు చెప్తే మంచిది కాదా అని మీతో చెప్పడానికి ఒచ్చాను.


దామోదర్:- మీరు చెప్పింది కరెక్ట్ ఏ బావగారు అన్ని విషయాలు ముందే మాట్లాడుకుంటే మీకు మంచిది మాకు మంచిది. చెప్పండి ఏ విషయం మీరు చెప్పాలి అని అనుకుంటున్నారు.


ప్రభాకర్:- మా పెద్ద అమ్మాయి రిధ్విక ఎక్కువ రోజులు బ్రతకాదు. ఇంత పెద్ద విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోడం నాకు నచ్చలేదు అని మా అమ్మాయి చెప్పింది దాని కోసం ఒక పరిష్కారం కూడా ఆలోచించింది.


దామోదర్:- మీకు ఇద్దరు అమ్మాయిలు అనే విషయం నాకు తెలియదు బావగారు. మీ చిన్న అమ్మాయి పెరు ఇంకా ఏం చేస్తు ఉంటుంది బావగారు. నిశ్చితార్థం రోజు కూడా తను లేదు అనుకుంటా.


ప్రభాకర్:- అమ్మాయి పేరు రితిక, తాను చదువు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నలో ఉంది. తాను మా తమ్ముడు ఇంట్లో ఉంటుంది, మా తమ్ముడు కి పిల్లలు లేరు ఇంకా చిన్నప్పటి నుండి తమ్ముడు దగ్గర పెరిగింది.


నిశ్చితార్థం రోజు హైదరాబాద్ లో తనకి ఏదో ఎక్సమ్(exam) ఉంది అని అక్కడికి వెళ్ళింది అందుకే మీకు కనిపించలేదు. పెళ్లికి తప్పకుండా ఉంటాను అని చెప్పింది.


మాములుగా అయితే పెద్ద అమ్మాయి పెళ్లి చేసాక చిన్న అమ్మాయి పెళ్లి చేదం అని అనుకున్నను బావగారు. కానీ మా పెద్ద అమ్మాయి ఆరోగ్య పరిస్థితి రిత్యా తనకి బదులుగా మా చిన్న అమ్మాయినీ పెళ్లి చేసుకోమని అడిగింది.


మా చిన్న అమ్మాయి తో కూడా పెద్ద అమ్మాయే మాట్లాడింది. దానికి మా చిన్న అమ్మాయి రితక ఇద్దరం శివ నే పెళ్లి చేసుకుందాం అక్క అని చెప్పింది.


ఎందుకు అలా అని అడిగితే. అక్క నా సంతోషం నీకు ఎంత ముఖ్యం ఓ, నీ సంతోషం కూడా నాకు అంతే ముఖ్యం. నాకు తెలుసు అక్క నువ్వు ఎక్కువ రోజులు బ్రతకను అని చెప్తున్నావ్ కదా ఉన్నన్ని రోజులు నాతో పాటు నా దగ్గరే ఉండు, చిన్నపాటి నుండి దూరం గానే పెరిగం ఇలా అయిన కొన్ని రోజులు కలిసి ఉంటాం అని మా చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి తో చెప్పింది.


ఇంకా శివ వాళ్ళ ఆఫీస్ లో ఏదో ఇంటర్వ్యూ ఉంటే మా చిన్న అమ్మాయి వెళ్ళింది, అక్కడ శివ నీ చూసి ఇష్ట పడింది. అదే సమయంలో నేను శివ ఫోటో మా చిన్న అమ్మాయి కి పంపించను. తన అక్కకి కాబోయే భర్త అని తెలిసాక మా చిన్న అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోయింది.


ఇది బావగారు విషయం. మీకు మీ అబ్బాయి కి ఏ ఇబ్బంది లేకపోతే మా ఇద్దరు అమ్మాయిలు మీ ఇంటి కొడళ్లు అవుతారు. మాకు మా అమ్మాయి లకు ఏ అభ్యతరం లేదు. మీరు సరే అంటేనే పెళ్లి చేదం.


ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేయొచ్చు కానీ అది కరెక్ట్ కాదు. మా చిన్న అమ్మాయి ఆలోచన కరెక్ట్ ఏ అనిపించింది ఇటు మా అమ్మాయికి పెళ్లి అవుతుంది అలాగే మీ అబ్బాయి కూడా ఒక ఇంటి వాడు అవుతాడు.


మీకు ఇలా జరగడం ఒద్దు అనుకుంటే పెళ్లి అపేదము, నిశ్చితార్థం ఏ అయ్యింది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మీరు మా చిన్న అమ్మాయి నీ చూడలేదు అని తెలుసు అందుకే నాతో పాటు అమ్మాయిలను కుడా తీసుకోచ్చను.


దామోదర్:-  సరే బావగారు పెళ్లి చేసుకోవాల్సింది మా అబ్బాయి. ఒక్కసారి పెళ్లి చేసుకునే వాళ్ళు మాట్లాడుకుని వాళ్ల నిర్ణయం చెపితే తర్వాత విషయం మనం మాట్లాడుకుందాం.


రిద్విక శివ రితిక మాట్లాడుకుంటున్నారు:-


రిధ్విక:- క్షమించండి శివ ముందుగానే మీకు ఈ విషయం చెప్పాలి ఇప్పుడు చెప్తునందుకు తప్పుగా అనుకోకండి. మీరు నాకు నచ్చారు కానీ నా దురదృష్టం నేను మీతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేను. మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంటే నా స్థానం లో నా చెల్లి రితిక మీకు తోడుగా ఉంటుంది. నాకు ఎటువంటి అభ్యతరం లేదు ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఈ భూమి మీద ఉండను, ఇంకా మీరు నా చెల్లి రితిక, నేను ఉన్నత వరకు నా కళ్ళముందు సంతోషం గా ఉండండి నాకు అది చాలు. ఈ పెళ్లి గురించి చెప్పింది నా చెల్లి కాబట్టి తనకు మిమ్మల్ని పెళ్లి చేసుకోడం ఇష్టం. ఇంకా మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి.


శివ:- మీకు ఏ ఇబ్బంది లేకపోతే నాకు ఈ పెళ్లి చేసుకోడానికి ఏ అభ్యతరం లేదు. నేను ఒకటే అనుకున్న నా భార్య నీ సంతోషంగా చూసుకోవాలి అని నేను అలాగే ఉంటాను.


కాసేపటి తర్వాత శివ మాట్లాడుతూ:- 


నాన్ననాకు అసలు పెళ్లి కాదు అని అన్నారు కానీ ఇప్పుడు చూసావా నాన్న నా పెళ్లి ఎలా జరుగుతుందో నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు శివ.


డాక్టర్:- హలో Mr Mr Mr లేవండి ఏం అయ్యింది ఎందుకు అంత పెద్దగా నవ్వుతూన్నారు.


శివ:- నేను ఎక్కడ ఉన్నాను డాక్టర్ నాకు ఏం అయ్యింది. 


డాక్టర్:- మీకు ఆక్సిడెంట్ అయ్యింది తలకి దెబ్బ తగలడంతో మీరు ఒకరోజు మొత్తం నిద్ర లొనే ఉన్నారు. 


శివ తనలో తానే మాట్లాడుకుంటూ:-


శివ:- అది ఏంటి అంత అయోమయంగా ఉంది నేను ఇంట్లో కదా ఉండాలి ఇక్కడ ఉన్నాను ఏంటి. ఒక్కసారి రిధ్విక కి ఫోన్ చేదం. హలో రిధ్విక  ఒక్కసారి మనం కలుదాం అ.


రిధ్విక:- సరే శివ ఎక్కడ కలుద్దాం.


శివ:- మీ ఇంటి దగ్గర ఉన్న కాఫీ షాప్ లో కలుద్దాం, నేను ఒక 30 నిమిషాల్లో ఒస్తాను.


కాఫీ షాప్ లో:-


రిధ్విక:- అయ్యో శివ ఏం అయ్యింది తలకి ఆ కట్టు ఏంటి.


శివ:- చిన్న ఆక్సిడెంట్. నిన్ను ఒక విషయం అడగాలి నువ్వు తప్పుగా అనుకోవద్దు.


రిధ్విక:- అలా ఏం అనుకోను నువ్వు అడుగు శివ.


శివ:- నీకు ఏం ఆయిన హెల్త్ ఇష్యూస్ (ఆరోగ్య సమస్యలు) ఉన్నాయా.


రిధ్విక:- ఏం లేదు నేను బనే ఉన్నాను.


శివ:- నీకు రితిక అని చెల్లి ఉందా. నాకు చెల్లి లేదు మా నాన్నకు నేను ఒకే అమ్మాయి నీ.


రిధ్విక:- ఏం అయ్యింది శివ ఎందుకు ఇలా అడుగుతున్నావ్.


శివ:- ఏం లేదు ఏదో బాడ్ డ్రీమ్(bad dream). సరే ఒదిలేయ్ ఆర్డర్ చేసావా ఏం అయినా.


అదే రోజు రాత్రి శివ ఆలోచిస్తూ:-


రిధ్విక ఏమో ఆరోగ్యం బనే ఉంది, తనకి చెల్లి ఎవరు లేరు అని చెప్తుంది. అంటే నాకు ఒచ్చింది కల లేదా జరగబోయేది ఇదే నా!


కాలే అయిఉంటుంది ఈ సినిమాల ప్రభావం నా పైన ఎక్కువ అయ్యింది. పెళ్లి అనగానే ఏవేవో ఆలోచనలు ఒస్తున్నాయి. అంత మరిచిపోవాలి. రితిక అనే వారు ఎవరు లేరు రిధ్విక మాత్రమె ఉంది.


ఈ అయోమయ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత రిధ్విక ఇంకా శివ పెళ్లి జరుగుతుంది ఇద్దరు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.


శుభం.

A Suprise Wedding

An accident happens while Shekar and Deepika are going on a bike in a desolate place. At the same time, Shekar's parents and Deepika...