అమ్మ: శంభూ! శంభూ! లేవురా. గుడికి వెల్లాలి అని చెప్పానుగా!
శంభూ: అవునమ్మా… లేస్తున్నా. అరగంటలో రెడీ అయిపోతా, మనం గుడికి వెళ్దాం.
గుడి వద్ద...
అమ్మ: నీవు చెప్పావుగా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. నీ కోరిక నెరవేరాలని దేవుడికి దండం పెట్టుకో.
శంభూ: దండం పెట్టుకుంటే ఉద్యోగం వస్తుంది, పూజ చేస్తే మిరాకిల్ జరుగుతుంది అనేది నాకు నమ్మకం లేదు అమ్మా. నాకు నాపైనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు చాలు.
అమ్మ: నువ్వు ఎప్పుడూ అలానే అంటావు కానీ... పంతులు గారు, మా అబ్బాయి పేరు మీద అర్చన చేయండి.
శంభూ అనుకున్నట్టుగానే అతను కోరుకున్న జాబ్ వస్తుంది.
ఫస్ట్ డే ఆఫీస్‌లో:
ఇది శంభూ మొదటి జాబ్. కొత్త ఆఫీస్, కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు.
అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తన డెస్క్ దగ్గర కూర్చుని మేనేజర్ చెప్పిన పనిని ఇష్టంగా చేస్తాడు.
కొన్ని రోజులకే శంభూ పని త్వరగా నేర్చుకొని అందరి మనసు గెలుచుకుంటాడు.
ఒక రోజు ఆఫీస్ వారందరూ వీకెండ్ పార్టీకి పబ్‌కి వెళ్తారు.
అక్కడ పల్లవి అనే అమ్మాయితో కొంతమంది మిస్బీహేవ్ చేస్తారు.
అది చూసిన శంభూ, ఆమెను అక్కడనుండి తీసుకెళ్తాడు. అప్పటికే పల్లవి డ్రింక్ చేసి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది.
అదీ చూసిన శంభు మేనేజర్, పల్లవి నీ తన ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యు అని అంటారు.
శంభు సరే అని పల్లవి నీ తన ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడానికి వెళతాడు.
దారిలో పల్లవి శంభూకి ప్రపోజ్ చేస్తుంది. కానీ శంభూ అది తాగిన మత్తులో మాట్లాడుతుంది అని అనుకుంటాడు
తరువాత రోజు ఆఫీస్ కాంటీన్‌లో మళ్ళీ పల్లవి ప్రపోజ్ చేస్తుంది.
ఈసారి శంభూ క్లియర్ గా చెప్పేస్తాడు నిన్ను ఫ్రెండ్ లా చూస్తున్నాను అని. పల్లవి నిరాశ చెందుతుంది.
ఆ సమయంలో కాంటీన్‌కు అంబికా వస్తుంది.
శంభూ, అంబికా ఇద్దరూ ఒక్కరిని చూసి ఒకరు షాక్ అవుతారు.
ఫ్లాష్‌బ్యాక్ - కాలేజీ రోజులు
అంబికా డిల్లీలో MBA చదువుతూఉంటుంది, వల్ల నాన్నగారి ట్రాన్స్‌ఫర్ వలన హైదరాబాద్ కి వస్తుంది.
శంభూ చదువుతున్న కాలేజీలో చేరుతుంది. మొదట్లో జూనియర్ అనుకుని శంభూ ర్యాగింగ్ చేస్తాడు. తనకి తెలుగు రాదని చెప్పిన అంబికను తెలుగులో పాట పాడమని చెబుతాడు.
అంబిక తనకు తెలిసిన తెలుగు పాట పాడగా అందరూ నవ్వుతారు. అంబికా కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పటి నుండి ఆమె శంభూపై కోపంగా ఉంటుంది. ఈ గొడవ ప్రిన్సిపాల్ దాకా వెళుతుంది.
ఒకోజు కాలేజ్ లో కల్చరల్ ఫెస్టివల్ జరుగుతూంది.
ఫెస్టివల్ రోజున అంబికా వాష్‌రూమ్‌లో లాక్ అవుతుంది. శంభు తన గిటార్ కోసం అని వెళతాడు. అంబికా అరుస్తు ఉండడం విని శంభూ సాయంగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు.
కానీ అంబికా, శంభు నీ డోర్ లాక్ చేసాడేమో అని మిస్ అండర్స్టాండ్ చేసుకోని అతనిని కొడుతుంది.
అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి పోతుంది. వెళ్లి చూసే సరికి తానా బస్సు వెళ్లిపోతుంది.
అక్క ఉన్న వాచ్ మన్ తో జరిగిన విషయం చెప్తుంది.
అప్పుడూ ఆ వాచ్‌మెన్ "వాష్‌రూమ్ తలుపు పనిచెయ్యడం లేదు వాష్ రూమ్ క్లీనర్ నాకు చెప్పింది. నేనూ అక్కడ నోటీసు రాసి పెట్టాను పోయింది అనుకుంట" అని వాచ్‌మెన్ అంబికా తో అంటరు.
తానా తప్పు తెలుసుకుని శంభూకి సారీ చెబుతుంది అంబిక. అలా వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుంది.
ప్రస్తుతం ఆఫీస్‌లో:
శంభూ ఇలా అనుకుంటుంటాడు- "అంబికా ఎలా ఇక్కడికి వచ్చిందీ? డిల్లీ వెళ్లిపోయిన ఆమె మళ్ళీ హైదరాబాదుకి ఎలా వచ్చిందీ? అదే కాకుండా నేను పని చేస్తున్న ఆఫీసులో ఎలా చేరింది?"
అప్పుడే శంభూని మేనేజర్ పిలుస్తారు.
మేనేజర్:- అంబికా కొత్తగా జాయిన్ అయిందని, ఆమెకి పని నేర్పించు అని మేనేజర్ అంటరు.
మొదట ఒప్పుకోకపోయినా, మేనేజర్ చెప్పడంతో అంబికా ని డెస్క్ దగ్గరకు తీసుకెళ్తాడు.
అంబికా, శంభుని కోపంగా చూస్తుంది.
ఫ్లాష్‌బ్యాక్:
శంభూ ఇంకా అంబికా ప్రేమలో ఉన్న రోజులు:
అంబికా శంభు నీ తన కుటుంబం కి పరిచయం చేస్తుంది. శంభు మంచి వాడు అని టాపర్ అని క్యాంపస్ ఇంటర్వ్యూ కుడా క్లియర్ చేసాడు అని చెప్తుంది.
కానీ అంబికా వల్ల అక్కకు ఇది నచ్చదు. "మధ్య తరగతి వాడు అని, డబ్బు లెదు అని" అంటూ తిరస్కరిస్తుంది. దాంతో శంభూ కోపంగా వెళ్లిపోతాడు.
అంబికాను వదిలేస్తాడు. అంబికా కూడా అక్కతో డిల్లీకి వెళుతుంది.
ప్రస్తుతం:
శంభూ తన తప్పు తెలుసుకొని అంబిక నీ కోల్పోవడం తప్పేనని సారీ చెప్పాలనుకుంటాడు. కానీ అంబికా మాత్రం కోపంగా ఉంటుంది.
ఇదంతా చూసిన పల్లవి, శంభూ అంబికకు సారీ చెప్పడానికి చేసే ప్రయత్నంలో విఫలం చేస్తుంది.
దీంతో శంభూ అయోమయంలో పడిపోతాడు.
ఒకరోజు అంబికా ఫ్లాట్‌కి వెళ్లి తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటాడు.
ఫ్లాట్‌లో అడుగు పెట్టగానే చీకటి. అంబికా అంబికా అని పిలుస్తాడు. లైట్స్ అన్నీ ఆన్ అవుతయీ.
టేబుల్ మీద కేక్ ఉంటుంది దాని పైనా "I Love You Shambhu" అని ఉంటుంది. వెనుక నుండి అంబిక వచ్చి శంభు నీ హగ్ చేసుకుంటుంది.
అప్పుడే ఫ్రెండ్స్ అందరూ రూమ్ నుండి బయటకి వస్తారు. పల్లవి కూడా అక్కడే ఉంటుంది.
అంబికా అసలు విషయం చెబుతుంది:
"ఆ రోజు పబ్‌లో నేను నిన్ను చుసాను. పల్లవి నా ఫ్రెండ్. నీ ప్రేమ నిజమైనదేనా, లేకపోతె ఇంకా ఎవరినైనా ప్రేమిస్తానవో అని తెలుసుకోవడానికే ఆమెను ప్రపోజ్ చేయమని చెప్పాను.
నీవు పల్లవి తో ‘నో’ అన్నప్పుడు నాకు తెలుసింది నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు అని.
అబ్బాయిలు అమ్మాయిల వెనక తిరుగుతుంటే ఆనందం గా ఉంటుంది.
నువ్వు నాకు సారీ చెప్పడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని నేను ఎంజాయ్ చేసాను.
నేను మా ఇంట్లో మాట్లాడాను, మా అక్క కూడా మన పెళ్లికి ఒప్పుకుంది."
అంబిక చెప్పింది విని శంభు అయోమయం గా అయ్యాడు. కని చివరికీ నిజం తెలిసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు.
కొన్ని రోజుల తరువాత శంభూ – అంబికా పెళ్లి చేసుకుంటారు.
ముగింపు...