Posts

Showing posts from 2020

నేను నిన్ను ప్రేమిస్తాను

నిన్ను చూసే కనులు చెప్పలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని,  నీతో మాట్లాడిన మాటాల్లో తెలియలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, నీతో ఉన్న క్షణం లో అనిపించలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. కానీ, నువ్వు నన్ను ఒదిలి వెళ్లిపోతుంటే నాకు అనిపిస్తుంది నువ్వు నన్ను ఏంత ప్రేమించవని , నీవు ఒదిలే శ్వాస నాకు తెలిసేలా చేసింది నన్ను నువ్వు ప్రేమించవని , నీ కన్నులో నుంచి ఓచే కన్నీరు చెప్తుంది నన్ను నువ్వు ప్రేమించవని .   ఇప్పుడు చెప్తున్నాను నా ఉపిరి ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను , ప్రేమిస్తూనే ఉంటాను . 

అమ్మాయిలు అబ్బాయిలు

అమ్మాయిలు తెరిచినా పుస్తకం లాంటి వారు, ఎక్కడినుండి చదవాలో తెలియక ఒక పేజీ చదవబోయి ఇంకో పేజీ చదివి గందరగోళం అవుతుంటారు, అమ్మాయిలను అర్ధం చేసుకోలేకపోతారు అబ్బాయిలు .

విద్వాన్ష్

               ప్రేమ ఎప్పుడు ఎందుకు మొదలవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి ని ప్రేమించడానికి ఇది కారణం అని ప్రేమించిన వ్యక్తి చెప్పలేరు.  అమ్మ నాన్న నీ ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఇది కారణం అని చెప్పలేం. కారణం లేకుండా పుట్టేదే ప్రేమ.  అల ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చుసిన, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చుసిన, చుసిన క్షణం లోనే నాలోన ప్రేమ పుట్టింది తను నా జీవితం అని అంటారు. అల ప్రేమించిన వ్యక్తి నీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ ప్రేమ నీ పెళ్లి వరకు తీసుకెళ్ళేది కొందరు మాత్రమే .  కొందరు తమ ప్రేమని, పెళ్లి వరకు తీసుకెళ్లలేక మధ్యలోనే ఒదులుకుంటారు. ఒదులుకోడానికి కారణాలు ఎన్ని ఉన్న ప్రేమించిన వ్యక్తి మాత్రం గుండెల్లోనే ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఎప్పటికి బ్రతికే ఉంటుంది.                            కొందరికి ఒక కోరిక ఉంటుంది జీవితం లో ఒక్కసారి అయినా సినిమాలో నట్టించాలి అని కానీ అందరిక...

భరత్ !

లక్ష్మి:- ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు భరత్? భరత్:- అబ్బే ఎవరికోసం లేదు వదిన ఊరికే అల చూస్తున్న . లక్ష్మి:- తెలుసులే నీ ఈ ఎదురు చూపులు ఎవరికోసమో. భరత్:- ఎవరికోసం చెప్పు చూదాం? లక్ష్మి:- నా చెల్లెలు వసు కోసమే కదా. భరత్:- అవును వదిన ఎప్పుడో నాలుగు సంవత్సరాల ముందు మీ పెళ్ళిలో చూసా మళ్ళీ ఇప్పటికీ దర్శనం కలుగుతుంది మీ చెల్లెలిది. లక్ష్మి:- ఏం చేయమంటావు మరి నీ కోసం ఇక్కడే ఉంటె బాగుండేది కదా. భరత్:- అల కాదు వదిన మీ చెల్లి నీ చూసి నాలుగు సంవత్సరాలు అయింది. మీ పెళ్లి అయ్యాక చదువుకోసం అని అమెరికా కి వెళ్ళింది. మీకు బాబు పుట్టిన ఇంటికి రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒస్తుంటే ఎదురు చూడకుండా ఎలా ఉండమంటావు . లక్ష్మి: - సరే భరత్ నీ బాధ అర్ధం అయింది  చెల్లి ఇంకా ఒక గంట లో ఒస్తుంది నువ్వు రెడీ గా ఉండు.  వసు:- అక్క ! లక్ష్మి:- వసు ఎలా ఉన్నావు . వసు:- నేను బాగున్నాను అక్క నువ్వు ఎలా ఉన్నావు. లక్ష్మి:- బాగున్నాను. నీ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో తెలుసా?  వసు:- ఎవరు అక్క? లక్ష్మి:- భరత్! వసు:- అవునా! భరత్ బావ ఎక్కడ ఉన్నాడు. లక్ష్మి:- లోపల గదిలో ఉన్నాడు. వసు:- సరే ఐతే న...