అమ్మాయిలు తెరిచినా పుస్తకం లాంటి వారు, ఎక్కడినుండి చదవాలో తెలియక ఒక పేజీ చదవబోయి ఇంకో పేజీ చదివి గందరగోళం అవుతుంటారు, అమ్మాయిలను అర్ధం చేసుకోలేకపోతారు అబ్బాయిలు.
శివ ఉదయం ఉత్సాహంగా నాన్న వద్దకు వచ్చాడు. శివ : నాన్నా! ఈరోజు నా పదో తరగతి ఫలితాలు వస్తున్నాయి. నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న! నాన్న : ఓహ్! మంచి వార్త చెప్పావు శివ. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఫస్ట్ క్లాస్ రావాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎప్పుడూ బాగా చదువుకో, తెలివి పెంచుకో అన్నాను. శివ : అది ఎందుకు నాన్న? నాన్న : ఫస్ట్ క్లాస్ అన్నది మార్కులతో వస్తుంది. కానీ నిజమైన విజయం తెలివితేటలతో వస్తుంది. మార్కులు ఒకసారి రాకపోయినా, తెలివిని పెంపొందించుకోవడం ముఖ్యం. శివ : సరే నాన్న! నాన్న : నీ చదువు విషయంలో నాకు నమ్మకముంది, కానీ నీ రన్నింగ్ రేస్ సంగతేంటి? ఎంత వరకు వచ్చావు? శివ : వచ్చే నెలలో ఒక ముఖ్యమైన రేస్ ఉంది నాన్న. దాన్ని గెలిస్తే… ఇంటర్ స్టేట్ రన్నింగ్ కాంపిటీషన్‌కు సెలెక్ట్ అవుతాను. నాన్న : బాగుంది నాన్నా… నీ లక్ష్యం దేశం కోసం పరిగెత్తడం! శివ : తప్పకుండా నాన్న, మీ కోరిక నెరవేర్చుతాను. 8 సంవత్సరాల తర్వాత... స్టేట్ లెవెల్ రన్నింగ్ కాంపిటిషన్. గ్రౌండ్‌లో వేడి వాతావరణం. అందరూ సిద్ధంగా ఉన్నారు. కోచ్ : శివా! ఈ రేస్ గెలిస్తే నేషనల్ లెవెల్ కి నీ అడుగు పడుతుంది. గత మూడు రేసుల్లో నువ్వే గెల...
Comments