Posts

Showing posts from April, 2022

Life with Wife - Chapter 2

Chapter 2   కళ్యాణం  వైభోగం ప్రతాప్ రావు(నాన్న): - లక్ష్మీ ముహూర్త సమయం దగ్గర పడుతుంది, ఇంకా మనం ఇక్కడే ఉన్నాం, తొందరగా బయలుదేరండి. మన పుత్రరత్నం రెడి అయ్యాడా. లక్ష్మీ(అమ్మ):- పూర్తి అయ్యింది అండి ఒక ఐదు నిమిషాల్లో బయలుదేరుదాం. మాధవ్ వాడి రూమ్ లో ఉన్నాడు వెళ్లి పిలవండి. మాధవ్:- ఫోన్ లో! మేము ఇంకో అరగంటలో ఓచేస్తాం అండి. మీరు రెడిగా ఉన్నారా. నాన్న:- మాధవ్ మాధవ్ తలుపు తెరువు, మనం వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. మాధవ్:- నాన్న ఒచ్చారు! పెళ్లి పిటలపైన కలుదాం అండి. నాన్న:- ఈ టైం లో ఫోన్ ఏంటి రా, పద వెలదం టైం అయింది. మాధవ్:- ఫ్రెండ్ నాన్న అడ్రస్ అడుగుతున్నారు, చెప్తున్న. నాన్న :- సరే సరే పద వెలదం. దేవతలందరి ఆశిష్యులతో, పెద్దలాందరి సమక్షంలో మాధవ్, సహస్ర ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత మాధవ్, సహస్ర హైదరాబాద్ కీ ఒస్తారు. హైదరాబాద్ మాధవ్ ఉండే అపార్ట్మెంట్ లో: - మాధవ్:- ఇదేనండి మనం ఉండే పాలస్, ఇదే మన రూమ్ ఇంకా పక్కన చిన్న గార్డెన్ ఉంది, మనం సాయంత్రం డిన్నర్(dinner) అయ్యాక, మన ఈ చిన్ని గార్డెన్ లో కూర్చొని హ్యాపీ గా కబుర్లు చెప్పుకువచ్చు. ఎలా ఉం...

అహం

చిన్న పిల్లలు ప్రశ్నలు ఎక్కువ వేస్తారు అలానే దేవన్ష్ కూడా తన అమ్మ నీ ఒక ప్రశ్న అడిగాడు. దేవన్ష్ :- అమ్మ! ఈరోజు నేను స్కూల్ కీ వెళ్ళేటప్పుడు వీధి చివర్లో ఉన్న పూజ అక్క వాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది కదా ఎందుకు అమ్మ ఏం గొడవ జరిగింది, పూజ అక్క నీకు అహం! ఎక్కువ అని గట్టిగా అరిచింది. అహం అంటే ఏంటి అమ్మ? అమ్మ తనకు తెలిసింది దేవన్ష్ తో ఇలా చెపుతుంది. "అహం" అంటే నేనె గొప్ప, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు, నా మాటకి ఎవ్వరు ఎదురు చెప్పకూడదు, నేను చెప్పేది ఎదుటివారు వినాలి, మన అనుకునే వారికి మర్యాద ఇవ్వకపోవడం, వాళ్ళ మాటలని పాటించుకోకపోవడం. ఈ లక్షణాలు ఆహంకారనికి సంకేతాలు దేవన్ష్. కానీ అహంకారం అనేది మనుష్యులో ఉండకూడదు దేవన్ష్, అహం మనలో ఉంటే మనుష్యుల నుండి దూరం అవుతాం, ప్రేమ కీ దూరం అవుతాం, అన్ని ఉన్న ఎవరు మనకి లేరు అనే బాధ నీ తట్టుకోలేం దేవన్ష్. మన అని అనుకున్న వారితో ప్రేమ గా ఉండాలి, ప్రేమ గా మాట్లాడాలి. వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పుల్ని మనం సమానంగా చూడాలి. తప్పు చేసినపుడు ఒకలగా, ఒప్పు చేసినపుడు ఒకలగా ఉండకూడదు. మన అనుకునే వారికి ఎప్పుడు తోడుగా ఉండాలి ఇంకా ఎ...