Posts

Showing posts from July, 2020

ఏదురుచూపు

నీకోసమే నేను ఉన్న , నువ్వు లేక నేను లేనంటున్న . నీ మాటకోసమే నేను వేచి ఉన్న , నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేకున్నా . నీ ఊపిరి నాకు ప్రాణం, నీతో బ్రతకడం నాకు జీవితం. తిరిగొచ్చేయే నేస్తం , నువ్వు లేక ఉండలేనంటుంది నా హృదయం.

నీతోనే ఉంటాను .... ఎప్పటికైనా

ఒక రోజు ఆఫీస్ లో పని ఎక్కువ ఉండటం వల్ల 'కర్ణ' ఇంటికి లేట్ గా బయలుదేరుతాడు. అప్పుడు సమయం తొమ్మిది (9) అవుతుంది, బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు 'కర్ణ'.  బస్ రాకపోయేసరికి నడుచుకుంటూ ఇంటికి వెళదాం అని అనుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక అమ్మాయి స్కూటీ లో ఒచ్చి 'కర్ణ' ముందు ఆగుతుంది. కర్ణ :- ఎవరండీ మీరు నా ముందు బండి ఎందుకు బండి ఆపారు. అమ్మాయి :- నిన్ను చాల సేపటినుంచి గమనిస్తున్న బస్సు కోసం చూస్తున్నట్టు ఉన్నావ్, ఎక్కడికి వెళ్లాలో చెప్పు నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను. కర్ణ :- నేను ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు అయిన డ్రాప్ చేస్తాను అని చెప్పినందుకు థాంక్స్. నేను నడుచుకుంటూ వెళ్తాను నాకు నడవడం అలవాటే. అమ్మాయి :- ఇప్పుడు టైం తొమ్మిది (9) అయింది. బస్ ఒస్తుందో రాదో తెలియదు రోజు నడుచుకుంటు వెళ్తావ్ అనుకుంటా అందుకే సన్నగా ఉన్నటు ఉన్నావ్. పరవలేదు ఈ రోజు నేను డ్రాప్ చేస్తాను. నువ్వు ఏం బయపడకు నేను మంచి అమ్మాయినే ఏదో ఒక్కడివే ఉన్నావ్ కదా అని ఒచ్చాను. కర్ణ కొంచం అలోచించి ఒక్క రోజే కదా వెళదాం అని అనుకోని అ అమ్మాయితో వెళ...