పశ్చాత్తాపము


కథ పేరు :-    పశ్చాత్తాపము


ప్రతి మనిషి తమ జీవితంలో  తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తువుంటారు అవి తెలిసాక పశ్చాత్తాపము పడుతుంటారు .


కథ విశ్లేషణ


బ్రిటిష్ పరిపాలనలో ఉన్న రోజులవి ' వీర రాఘవులు ' అనే వ్యక్తి బ్రిటిష్ వారి విద్యుత్ మండలిలో లైన్ మాన్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు . రాఘవులు తల్లితండ్రులు చిన్నప్పుడే మరణించడంతో తన మామగారు ఐన చంద్రయ్య తో కలిసి ఉంటాడు .


ఒక రోజు రాఘవులు పనికి వెళ్ళేదారిలో కొండయ్య అనే వ్యక్తి ఆడవారితో అసభ్యగంగా ప్రవర్తించడంతో రాఘవులు కొండయ్య ని కొడతాడు . ఆ సంఘటనతో కొండయ్య రాఘవులు పైన పగ పెంచుకుంటాడు .


చంద్రయ్య కి ఒక్కగానొక్క కూతురు  తన పేరు లక్ష్మి . లక్ష్మి కి ఆమె బావ ఐన రాఘవులు అంటే ఇష్టం , ప్రేమ .. ఈ విషయం తెలిసి చంద్రయ్య, లక్ష్మి కి రాఘవులు కి వివాహం చేస్తాడు . చంద్రయ్య కి కొడుకులు లేకపోవడం తో తనకు ఉన్న ఇల్లు , పోలం రాఘవులు కి ఇస్తాడు చంద్రయ్య ..ఇలా ఆ చిన్న కుటుంభం ఎటువంటి బాధలు కష్టాలు లేక సంతోషంగ జీవిస్తుంటారు .


కొన్ని రోజులకు లక్ష్మి తల్లి కాబోతుందని తెలిసి వాళ్ళ సంతోషం ఇంకా రేటింపు అవుతుంది .. చంద్రయ్య , రాఘవులు లక్ష్మి శ్రీమంతం ని ఘనంగా జరిపిస్తారు .. 


ఒక రోజు యదావిధిగా రాఘవులు తన పనికి వెళ్తాడు , చంద్రయ్య కూడా పక్క ఊర్లో పని ఉంది అని చెప్పి బయటకి వెళ్తాడు .. 


రాఘవులు పై కోపం పెంచుకున్న కొండయ్య ఇదే మంచి సమయం అని రాఘవులుని జీవితం లో కోలుకొని దెబ్బ కొట్టాలి అని పథకం వేస్తాడు ,తను అనుకున్న పని మొదలు పెడతాడు కొండయ్య తన అనుచరులలో ఒకరిని రాఘవులు ఇంటికి పంపించి రాఘవులు కి ప్రమాదం జరిగింది అని తనతో వెంటరమ్మని ఆ అనుచరుడు లక్ష్మి ని తీసుకెళ్తాడు ..


ఆ అనుచరుడు లక్ష్మి ని కొండయ్య ఉండే చోటుకి తీసుకొస్తాడు . కొండయ్య లక్ష్మి ని చంపి రాఘవులు పై ఉన్న పగని తిరుచ్కుందామ్ అని లక్ష్మి ని చుట్టూ ముడతారు .. 


గర్భం తో ఉన్న లక్ష్మి తనని చుట్టు ముట్టినవారిని తోసేసి పరిగెడుతుంది .. తిరుగు ప్రయాణం లో ఉన్న చంద్రయ్య లక్ష్మి ని చూసి లక్ష్మి ఉన్న మార్గంలోకి వెళ్తాడు లక్ష్మి ని వెంటాడుతున్న వారిని కర్రతో కొట్టి లక్ష్మి ని తీసుకొని తన ఇంటి మార్గం వైపు వెళ్తూ ఉంటారు    …


అది చుసిన కొండయ్య వెనకనుండి ఒచ్చి చంద్రయ్య ని కర్ర తో కొడతాడు . చంద్రయ్య స్పృహతప్పి పడిపోతాడు .. కొండయ్య తన దగ్గర ఉన్న కత్తి తో గర్భం తో లక్ష్మి కడుపులో పొడుస్తాడు,పొడిచి అక్కడి నుండి పారిపోతాడు .. 


లక్ష్మి ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంటుంది ఆ అరుపులు విని అక్కడే ఉన్న గిరిజనావాసులు చంద్రయ్య ని లక్ష్మి ని వాళ్ళు ఉండే స్థావరానికి తీసుకువెళతారు..లక్ష్మి ఒక అడా బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూస్తుంది .


చంద్రయ్య స్పృహలోకి వచ్చి తన కూతురు మరణాన్ని చూసి కుంగిపోతాడు ఆ గిరిజనావాసుల సహాయంతో లక్ష్మి , పుట్టిన పాప తో తన ఇల్లు చేరుకుంటాడు . 


ఇది ఏమి తెలియని రాఘవులు పని ముగించుకొని ఇంటికి వస్తాడు వచ్చి రాగానే తన అర్ధాంగి మరణాన్ని చూసి ' అయ్యో న భార్య నన్ను విడి వెళ్ళిపొయిన్ది ఎం జరిగింది అని రాఘవులు చంద్రయ్య ని అడుగుతాడు '

చంద్రయ్య జరిగిన సంఘటన చెప్తాడు . 


అది వినగానే రాఘవులు కోపం తో కత్తి తీసుకొని కొండయ్య ని చంపడానికి వెళ్తాడు అది చుసిన చంద్రయ్య ఒద్దు రాఘవులు మనకి ఇంతే రాసి పెట్టి ఉంది నువ్వు వాడిని చంపడానికి వెళ్లి నీకు ఏమైనా జరగరానిది ఏదయినా జరిగితే పుట్టిన పాప అనాధ అవుతుంది. 


నేను ఎన్ని రోజులు ఊంటానో నాకే తెలియదు అని చెప్పి పాప ని రాఘవులు చేతికి ఇస్తాడు చంద్రయ్య .. లక్ష్మి కి చేయాలిసిన కార్యక్రమాలను చేసి ఇంటికి వస్తారు రాఘవులు, చంద్రయ్య .. పుట్టిన పాప కి రాఘవులు ' విశాలాక్షి ' అనే పేరు పెడతాడు ..


కాలగమనంలో చంద్రయ్య మరణిస్తాడు . ఇప్పుడు విశాలాక్షి కి పదహారేండ్లు ... విశాలాక్షి తన పేరుకు తగట్టే చాల విశాలాలంగ ఉంటుంది కానీ ఎవరైనా తప్పు చేసిన తనకి కోపం వచ్చినా భద్రకాళి ఐపోతుంది తన నవ్వు శాంతం తన కోపం ప్రళయం..


ఒక రోజు స్నానం చేయడానికి చెరువుగట్టుకి వెళ్ళినపుడు తన స్నేహితురాలిని ఏడిపించాడు అని ఒకడిని చితకబడుతుంది. .లక్ష్మి కోపాన్ని చూసి రాఘవులు కి తన కూతురు జీవితం ఎలా ఉంటుంది అని వాపోతూఉంటాడు.


ఒక రోజు రాత్రి వేళలో రాఘవులు గ్రామం వారు నిద్రిస్తుండగా హఠాతుగ్గా తుపాకులతో కలుస్తున్న శబ్దాలు వినిపించాయి.

ఆ శబ్దాలు విన్నవారు మేలుకొని బయటకి వచ్చి చూస్తారు.


కొంత మంది మనుష్యులు పరిగెడుతూ కనిపిస్తారు ఆ మనుష్యుల్ని బ్రిటిష్ వారు తరుముతుంటారు ఆ మనుష్యులు కనిపించిన ఇళ్లలోకి వెళ్లి దాకుంటారు.


బ్రిటిష్ వారు ప్రతి ఇల్లు శోధించి దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తూఉంటారు ఇలాగే రాఘవులు ఇంటికి ఒక వ్యక్తి వచ్చి దాకుంటాడు ఆ వ్యక్తి దాకొని ఉన్న గదిలో విశాలాక్షి ఉంటుంది.


విశాలాక్షి ఆ వ్యక్తి ని చూసి ఆ వ్యక్తి దాకోడానికి గదిని చూపిస్తుంది ఆ వ్యక్తి విశాలాక్షి చూపించిన గదిలో దాకుంటాడు ఆ రాత్రి ఆలా గడిచిపోతుంది ..


తెల్లవారాక రాఘవులు ఆ వ్యక్తి ని చూసి బాబు ఎవరు  నీవు వంటికి ఈ గాయాలు ఏంటి అని ప్రశ్నిస్తాడు ..


అప్పుడు ఆ వ్యక్తి నా పేరు అర్జున్ మాది పక్కనే ఉన్న వెలికొండ అనే గ్రామం నేను ఒక విప్లవకారుడిని నేను మా దళం వారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాం. 


బ్రిటిష్ వారికీ రైల్లో ఆయుధాలు వొస్తున్నాయి అని తెలుసుకొని ఆ ఆయుధాల రైల్ ను ఆడుకోడానికి మేము బయలుదేరాం , కానీ మా దళం లో ఒక్క నల్ల కుక్క బ్రిటిష్ వారికీ అమ్ముడుపోయి మేము వేసిన పథకాన్ని బ్రిటిష్ వారికీ చెప్పాడు.


మేము రైల్ వచ్చే చోటుకి వెళ్ళాం బ్రిటిష్ వారు మమల్ని చుట్టుముట్టారు  వారి నుండి బయటపడడానికి మా స్వాతంత్ర్యం లక్ష్యం నెరవేర్చుకోవాలి అని వారి నుంచి తపించుకుబోయి మీ గ్రామం లో మీ ఇళ్లలో తలదాచుకున్నాం.


నేను మీ ఇంటిలోకి వచ్చాను మీ ఇంటిలో ఉన్న అమ్మాయి నేను దకోడానికి చోటు చూపించి నా ప్రాణాలు రక్షించింది అని అర్జున్ చెప్పాడు ..తన వంటికి తగిలిన గాయాలకు మందు వేసుకొని అర్జున్ రాఘవులు ఇంట్లోనే ఉంటాడు .. 


అసలు ఎప్పుడు మగవారితో మాట్లాడని నా కూతురు ,మగవారి ఉస్సు ఎత్తగానే మాటమార్చే నా కూతురు అర్జున్ పై శ్రద్ధ ఎక్కవ చూపిస్తుంది ఏంటి అని రాఘవులు విశాలాక్షి ని అడుగుతాడు ..


అప్పుడు విశాలాక్షి మాట్లాడుతూ " మీకు ఇదివరకే చెపుదామనుకున్న నాన్నగారు నేను అర్జున్ ని ఇష్టపడుతున్న అని" అంటే మూడు నెలల క్రితం నా స్నేహితురాలిని ఒకడు ఏడిపిస్తుంటే వాడిని కొట్టాను వాడు నన్ను చంపడానికి వస్తే ఈ అర్జున్ ఏ నన్ను ఆ దుండగుడినుండి కాపాడాడు. 



అప్పటి నుండి అతను అంటే ఇష్టం పెరిగింది అందుకే రాత్రి తనని మన ఇంట్లో చూసి తాను ఏదో ఆపదలో ఉన్నాడు  అని గమనించి తనకు ఆశ్రయమిచ్చాను అని విశాలాక్షి రాఘవులు కి చెప్తుంది ..


ఇది విన్న తర్వాత రాఘవులు తన కూతురితో ఇలా  అన్నాడు ' అర్జున్ చుడానికి బాగానే ఉన్న , తాను ఎంచుకున్న దారి నాకు నచ్చలేదు అమ్మ తాను ఒక విప్లవకారుడు తనతో ని  పెళ్లి చేసి నీ గొంతు కోయలేను ని జీవితం న చేతులారా నేను పాడుచేయలేను అని అంటాడు '... 


ఈ మాటలను విన్న అర్జున్ రాఘవులు తో ఆ రోజు మీ అమ్మాయి ని చూడగానే ఇష్టపడ్డాను కానీ నేను ఉన్న సందర్భం లో తనని కలువలేకపోయాను నేను మల్లి వచ్చి చూసేసరికి మీ అమ్మాయి అక్కడ కనపడలేదు సరే అని నేను వెళ్లి పోయాను కానీ నా అదృష్టం తనని మళ్లీ ఇలా  చూసాను.


మా ఇద్దరికీ పెళ్లి జరగాలి అన్నది ఆ దేవుని నిర్ణయం ఏమో అన్ని ఇల్లు ఉన్న నేను మీ ఇంట్లో దకోవడం మీ కూతురు కి న పై ఇష్టం ఉండడం చూస్తూ ఉంటె ఈ సంఘటనలు మా పెళ్లి గురించి జరిగాయి అనిపిస్తుంది ' అని అర్జున్ రాఘవులు తో అంటాడు …


నేను ఒక విప్లవకారుడినే అదే మీకు ఇబ్బంది కదా అదే ఐతే స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసారు నేను కూడా స్వాతంత్ర్యం కోసం నా ఇష్టాలను త్యాగం చేశాను అవసరమైతే న ప్రాణాలు ఐన అర్పిస్తాను కానీ ఈ పెళ్లి కోసం స్వాతంత్ర్యం లక్ష్యం మాత్రం వదులుకోను అని స్ఫష్టంగాచెప్తాడు అర్జున్ ... 


ఇది విన్న రాఘవులు అర్జున్ కి దేశం పై ఉన్న భక్తి ని చూసి సంతోషిస్తాడు అర్జున్ ని తన తల్లితండ్రుల గురించి అడుగుతాడు.


అప్పుడు అర్జున్ నా తల్లి నాకు జన్మనిచ్చి చనిపోయిఇంది మా ఇంట్లో నేను నాన్న మాత్రం ఉంటాం .నాన్నకు కాళ్ళు లేని కారణంగా ఇంట్లోనే ఉంటారు .. 


చిన్నప్పుడే నేను దళం లో చేరాను అప్పుడప్పుడు వెళ్లి నాన్నని చూసి మల్లి మా స్థావరానికి వెళ్తాను అనిచెప్తాడు ... సరే మీ ఇంటికి వెళదాం మీ నాన్న గారికి కూడా ఈ విషయం చెప్పి మీ పెళ్లి చేస్తాను అని రాఘవులు, అర్జున్ ఇంకా విశాలాక్షి తో అంటాడు .. 


ఇక ముగ్గురు కలిసి అర్జున్ ఇంటికి వెళ్తారు ....అర్జున్ ఇంటికి వెళ్ళాక అర్జున్ తండ్రి చిత్ర పటాన్ని చూసి నేను ఈ పెళ్లి కి ఒప్పుకో లేనమ్మా ని తల్లి చంపినా వాడి కొడుకుతో ని పెళ్లి చేయలేను అని రాఘవులు విశాలాక్షి తో చెప్తాడు .


అప్పుడు విశాలాక్షి మీరు ఎం అంటున్నారు నాకు ఎం అర్ధం కావడం లేదు నాన్న అర్జున్ తండ్రి మా అమ్మ ని చంపడం ఏంటి అసలు ఎం జరిగింది నాన్న అని రాఘవులు ని అడుగుతుంది విశాలాక్షి ... 


రాఘవులు గతం లో జరిగిన విషయాలు అన్ని చెప్తాడు అది విన్న కొండయ్య గదిలోనుంచి బయటకి వస్తాడు .. కొండయ్య కి రెండు కాళ్ళు ఉండవు ఎం జరిగింది అని రాఘవులు అడుగుతాడు అప్పుడు కొండయ్య జరిగిన విషయం ఇలా వివరిస్తాడు.


'' ఆ రోజు ని భార్య లక్ష్మి ని పొడిచి వెళ్ళ్తు ఉండగా కాలు జారీ లోయలో పడిపోయాను ఆ లోయలో ఉన్న సింహం నాపై దడి చేసింది ఆ దడి లో న రెండు కళ్ళు పోగొట్టుకున్నాను గర్భవతి తో ఉన్న స్త్రీ ఆ గర్భ గుడిలో ఉన్న దేవతతో సమానం అని తెలియక గర్భం తో ఉన్న ని భార్య ని పొడిచాను నేను చేసిన తప్పు నాకు ఈ విదంగా శిక్ష అందించింది '' అని పశ్చాత్తాప పడతాడు .. 


పశ్చాత్తాపనికి మించిన ప్రాయశ్చితం లేదు పచ్యతాపం అంటే బాధ పాడడం తాను చేసిన తప్పు తెలుసుకొని బాధ పాడడం అంటే తప్పుని తొలిగించోకోవడమే అని రాఘవులు అంటాడు జరిగిన విషయాలు అన్ని మరిచి పోదాం సంతోషంగ పిల్లల పెళ్లి చేదాం అని పెద్దలు అందరు కలిసి విశాలాక్షి , అర్జున  ల వివాహం జరిపిస్తారు ...

ఒక్క క్షణం

              


                   " ఒక్క క్షణం చాలు ఏదైయినా  జరగడానికి ".


ఈ రోజు ఏమిటో అంత కొత్తగా ఉంది. 

రోజు తనని చూస్తున్న ,మాట్లాడుతున్న కానీ ఈరోజు తను కొత్తగా కనిపిస్తుంది, బహుశా ఈరోజు తను చీర కట్టడంవల్లేమో తెలియదు కానీ తన మాట, తన నవ్వు ,తన చూపు ,తన అలికిడి అంత కొత్తగా ఉంది. 


ఇన్ని రోజులు తను నాతో ఉంటె  స్నేహభావం కలిగేది కానీ ఈరోజు తనని చూస్తుంటే తనపై నాకున్న ప్రేమ తెలుస్తుంది , ఈ ప్రేమ అనే భావన ఏంటో కొత్తగా ఉంది .


అల తనని చూస్తూ నా ప్రేమ తనకి చెప్పడానికి  ఒక్కోఅడుగు ముందుకు వేస్తున్న , అదే సమయంలో అ ఒక్క క్షణం లో అంతా జరిగిపోయింది. 


నా ప్రేమ తనకి చెప్పకుండానే నన్ను ఒదిలి తను వెళ్ళిపోయింది.


ఒక్క క్షణం నేను కొంచం తొందరపడి ఉంటే  తను నన్ను ఒదిలి వెళ్ళిపోయిఉండేది కాదు.


ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసింది నా ప్రాణం తనతో తీసుకు వెళ్ళిపోయింది. 


ఒక్క క్షణం లో నా ప్రేమ పుట్టింది కానీ, 

అదే అ ఒక్క క్షణం లో నా ప్రేమ చనిపోయింది. 


ఈ  క్షణం నా ప్రేమ నాతో లేకపోయిఉండొచ్చు కానీ నా ఊపిరిలో, నా గుండెల్లో , నా అణువణువులో ఉంది.


తను ఇప్పుడు నాతో లేదు అనే మాట కంటే , తాను నాలో ఉంది అనే మాట నాకు ఆనందాన్నిస్తుంది.


తాను గురుతుకుఒచ్చే ఈ ఒక్క క్షణం చాలు ఇంకా వేయి జన్మలైనా బ్రతకాలనిపిస్తుంది.

విజయం (Success)

 ✔️ డబ్బు ( Money )


సమయం "అనుకూలమైన  సమయం లేదా కాలి సమయం" ( Good time or Free time )


మద్దతు లేదా తోడు ( Support or Accompany )


ఈ మూడు ఒకే చోట ఉండవు .


➡️ డబ్బు ఉన్న చోట సమయం , మద్దతు దొరకవు .


➡ సమయం ఉన్న చోట డబ్బు , మద్దతు దొరకవు ,


➡ మద్దతు లేదా తోడు ఉన్న చోట డబ్బు , సమయం ఉండదు.


" 🌹 🌹 ఈ మూడు ఒకే దగ్గర ఉంటె విజయం తప్పక ఉంటుంది 🌹 🌹 ".


ఉదాహరణకు :- 


👉 కొందరి దగ్గర డబ్బు చాల ఉంటుంది , వాళ్ళకి తోడుగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కానీ అనుకూలమైన  సమయం లేదా కాలి సమయం ఉండదు . ఒకోసారి తోడుగా కూడా ఎవరు ఉండకపోవచ్చు (" ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి ఉంటుంది ").


👉 కొందరి దగ్గర అనుకూలమైన  సమయం ఉంటుంది , మద్దతుగా తోడుగా దగ్గర వాళ్ళు ఉంటారు కానీ డబ్బు ఉండదు.

ఒకోసారి అనుకూలమైన సమయం కూడా ఉండకపోవచ్చు.


👉 కొందరి దగ్గర డబ్బు చాల ఉంటుంది, అనుకూలమైన సమయం ఉంటుంది కానీ మద్దతుగా తోడుగా ఎవరు ఉండరు . " ఈ పరిస్థితి ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి ఉంటుంది ".


✍ మరిన్ని కథలు చదవడానికి ఈ కింద ఉన్న లింక్ ( link ) నీ చుడండి.


https://manakathalu1.blogspot.com/?m=1


ధన్యవాదములు.

జీవితం

                          ఏమిటో ఈ జీవితం ,
           డబ్బు మీద ఎందుకో ఈ వ్యామోహం ,
           ఎంత ఇచ్చిన సరిపోదు కదా బంగారం,
        ఒక చిన్న చిరునవ్వు ఇస్తుంది కదా సంతోషం,
        నిన్ను మోసం చేసేవారిని నమ్మితే పతనం 
                                    ఖాయం ,
        నిన్ను నువ్వు నమ్ముకుంటే జయం తథ్యం.

A Suprise Wedding

An accident happens while Shekar and Deepika are going on a bike in a desolate place. At the same time, Shekar's parents and Deepika...