అమ్మ: “సూర్య, ఈ రోజు నీ జాబ్ కి ఫస్ట్ డే కద… తొందరగా లేచి రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి”
కొద్ది సేపటికి సూర్య రెడీ అయ్యాడు, “అమ్మా, నేను రెడీ అయ్యా. వెళ్దాం” అని అన్నాడు.
అమ్మ చిరునవ్వుతో, “ముందు నాన్న ఫోటోకి నమస్కారం చేసి రా బాబు” అని చెప్పింది.
సూర్య: సరే అమ్మా.
ఫోటో ముందు చేతులు జోడించి నిలబడ్డాడు సూర్య. ఆ క్షణంలో అమ్మ మనసులో మట్లాడుతు - “ఏవండీ… మన బాబు ఈ రోజు ఉద్యోగంలో అడుగుపెడుతున్నాడు. మీరు లేనప్పుడు నేను ఒక అమ్మగానే కాకుండా, ఒక నాన్నలా, స్నేహితుడిలా, గురువులా మన బాబు ని నడిపించాను. మీరు పైనుండి చూస్తున్నారు కదా? మీకు సంతోషం అని నేను బవిస్తున్నాను.”
తర్వాత అమ్మ, సూర్య కలిసి గుడికి వెల్లారు.
గుడి దగ్గర:
“బాబు, నువ్వు లోపలికి వెళ్లు. నేను పూలు, కొబ్బరికాయ తీసుకువస్తాను” అని అమ్మ అన్నది.
“నేను కూడా వస్తాను అమ్మ” అని సూర్య అన్నాడు.
అలా పక్కనే ఉన్న పూజా స్టోర్ కి వెళ్తూ ఉండగా, అకస్మాత్తుగా ఒక పిచ్చివాడు ఎదురై, గట్టిగా అరుస్తూ - “జాగ్రత్త బాబు… జాగ్రత్త! అమ్మా, నీ కొడుకును జాగ్రత్తగా చూసుకో!”అని అన్నాడు.
అమ్మ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. కానీ పక్కనే ఉన్న దుకాణ యజమాని - “అమ్మగారు, వాడు ఒక పిచ్చివాడు. డబ్బుల కోసం అలానే అంటుంటాడు. వాడి మాటలు పట్టించుకోకండి. మీరు పూలు, కొబ్బరికాయ తీసుకుని గుడిలో అర్చన చేయించండి” అని అన్నాడు.
అయిన అమ్మ మనసులో భయం తొలగలేదు. గుడిలోపలికి వెళ్ళగానే పూజారి గారికి జరిగిన సంగతిని వివరించింది.
"లక్ష్మి గారు, మీరు కంగారు పడవద్దు. మీ అబ్బాయి జాతకం నేను చూసి మీకు ఫోన్ చేస్తాను. ఏం చేయాలో చెబుతాను. ఈ పూలు, కొబ్బరికాయ ఇక్కడ పెట్టండి. మీ ఇద్దరి పేర్లపై అర్చన చేస్తాను. అంతా శుభమే జరుగుతుంది" అని పూజారి నమ్మకం ఇచ్చారు.
అమ్మను గుడి నుండీ ఇంటి వద్ద వదిలి, సూర్య తన ఉద్యోగం కి బయలుదేరాడు.
ఆఫీసు లో:
కొత్త ప్రపంచం అతని ముందుంది… కొత్త ఆశలు, కొత్త పరిచయాలు. ఆఫీస్ లో తన చుట్టూ చూసుకుంటూ ఉన్నప్పుడు రాహుల్, సరణ్యు అనే ఇద్దరు కొత్త ఉద్యోగులను కలిశాడు. వారితో స్నేహం మొదలైంది.
అలా ఒక వారం గడిచిపోయింది.
సరణ్యుకి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఒక రోజు ముగ్గురు కలిసి సిటీ లైబ్రరీకి వెళ్ళారు.
లైబ్రరీ దగ్గర:
“అయ్యో! ఇక్కడ ఉన్న పుస్తకాలన్నీ చూస్తుంటే భయంగా ఉంది” అని రాహుల్ అన్నాడు.
“పుస్తకాలకి భయపడితే ఇంజినీరింగ్ ఎలా పూర్తి చేస్తావ్?” అని సరణ్యు సరదాగా చమత్కరించింది.
వాళ్ల ముగ్గురు నవ్వుకుంటూ బుక్ షెల్ఫ్ దగ్గర పుస్తకాలు చుస్తు ఉండగా, సూర్య కి అక్కడ ఉన్నా మొల గుచ్చుకుని రక్తం వస్తుంది. తన రక్తపు చుక్కలు ఒక బుక్ పై పడుతాయి, అప్పుడు ఆ బుక్ ప్రకాశిస్తు లోపల నుండి ఒక పాత పేపర్ బయటికి వస్తుంది .
“ఇది ఏంటి?.. పేపర్ లా ఉంది” అని ఆశ్చర్యపోయి సూర్య చూస్తు ఉంటాడు.
సరణ్యు ఆసక్తిగా దగ్గరకు వచ్చి “ఏంటి చుస్తునావు సూర్య?” అని అడిగింది.
సూర్య ఆ పేపర్ నీ తెరిచి చూసాడు. అందులో “నువ్వు ఆపదలో ఉన్నావు… జాగ్రత్త” అని రాసి ఉంది.
సరణ్యు ఆ పేపర్ నీ తన చేతిలోకి తీసుకుంది. కానీ ఆమె చూసినప్పుడు మాత్రం వాక్యం మారింది"నీ కోరిక తొందరలోనే నేరవేరుతుంది" అని కనిపిస్తుంది.
సూర్య మళ్ళీ ఆ పేపర్ చూసాడు. కానీ క్షణాల్లోనే అది మాయమైపోయింది. అప్పుడే పక్కనే ఉన్న బుక్ షెల్ఫ్ ఒక్కసారిగా కూలిపడి సూర్య మీద పడబోతుంది. అదృష్టవశాత్తు రాహుల్ సమయానికి సూర్య ని పక్కాకి లాగేసి కాపాడాడు.
సూర్యకి ఏమీ అర్థం కాలేదు. బుక్ ని మళ్ళీ ఓపెన్ చేశాడు. అప్పుడు కొత్తగా మరొక పేపర్ దొరికింది. అందులో “ఈ సారి తపించుకున్నావు కనుక… రాబోయే రోజులు నీకు అద్భుతం గా ఆశ్చర్యం గా ఉంటాయి.” అని కనిపిస్తుంది.
ఆ బుక్ ని అక్కడే షెల్ఫ్ లో పెట్టేసి ముగ్గురు అక్కడ నుండి ఇంటికి వెళ్లిపోతారు.
ఆ రాత్రి సూర్య నిద్రపోలేకపోయాడు. ఆ పుస్తకంలో కనిపించిన మాటలు అతని మనసుని కలవరపరిచాయి. “నిజమా? ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమేనా… లేక ఎవరైనా నన్ను వెంబడిస్తున్నారా?” అనే ఆలోచనలతో గడియారాన్ని చూస్తూ గడిపాడు.
మరుసటి రోజు:
ఆఫీస్ కి వెళ్లిన సూర్యకి రాహుల్, సరణ్యు కళ్లలోనూ అదే ఆందోళన కనిపించింది. ముఖ్యంగా సరణ్యు ఆమె ఆ పేపర్ మీద చూసిన మాటలు ఇంకా మదిలో తిరుగుతున్నాయి.
సూర్య ఇంక సరణ్యు మళ్లీ లైబ్రరీకి వెళ్లారు. ఆ బుక్ కోసం షెల్ఫ్ దగ్గర వెతుకుతారు కానీ ఆ బుక్ కనిపించలేదు.
“ఎవరైనా దాచారా? లేక అది మాయ బుక్ ఆ?” అని సరణ్యు అనుమానం వ్యక్తం చెస్తుంది.
అప్పుడే లైబ్రరీ లోపల ఒక ముసలివాడు దగ్గరికి వచ్చి వారిని జాగ్రత్తగా గమనిస్తూ - “మీరు ఆ పుస్తకం తాకకపోతే బాగుండేది. ఇప్పుడు మీ మీద ఒక నీడ పడింది” అని చెప్పి వెల్లిపోతాడు.
సూర్య ఇంక సరణ్యు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశారు.
ఆ రాత్రి:
సూర్య ఇంట్లో లైట్స్ ఒక్కసారిగా ఆరిపోయాయి. అమ్మ వంటగదిలో ఉండగా, సూర్యకి తన గదిలో ఒక చలిగాలి తాకింది. టేబుల్ పై ఆ బుక్ మళ్లీ కనిపించింది. అతను దగ్గరగా వెళ్లి చూసేలోపే… బుక్ పేజీలు తిరుగుతున్నాయి. చివరగా ఒక వాక్యం కనిపించింది “నిన్ను కాపాడేవాడురు నీ పక్కనే ఉంటారు, నీకు దగ్గర వ్యక్తే”అని కనిపిస్తుంది.
సూర్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అప్పుడే అతని ఫోన్ మోగింది.
రాహుల్ కాల్ చేసి, “సూర్య ! వెంటానే లైబ్రరీ కి రా. మాకు ఒకటి దొరికింది, అది నికు సంబంధం ఉన్నా విషయం లగా ఉంది” అని అన్నాడు.
సూర్య కి ఏమీ అర్థం కాక, బుక్ ని తిసుకోని అమ్మకి చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరాడు.
లైబ్రరీ వద్ద:
చీకటిలో లైబ్రరీ దగ్గర రాహుల్, సరణ్యు వేచి ఉన్నారు. వాళ్లని చూసి సూర్య దగ్గరికి వెళ్ళాడు. “ఏమైంది?” అని అడిగాడు.
"నాకు భయం వేసింది సూర్య అసలు ఎం జరుగుతుందో అని తెలుసుసుకోవాలి అని రాహుల్, నేను లైబ్రరీ కి ఒచ్చము. మకు ఒక ఫోటో దొరికింది." అని సరణ్యు అంటుంది
సరణ్యు చేతిలో ఒక ఫోటో - “సూర్య, ఈ ఫోటో ఇక్కడ బుక్ షెల్ఫ్ వెనక దాచబడి ఉంది చూడూ…”
సూర్య ఫోటో చూసాడు. ఫోటోలో సూర్య నే ఉన్నాడు… కానీ ఒక రాజు లా ఉన్నాడు. “ఇది ఎలా సాధ్యం?" అని సూర్య ఆశ్చర్యపోయాడు.
లైబ్రరీలో కనిపించిన ఆ పాత ఫోటో సూర్య మనసులో అనేక ప్రశ్నలు రేకెత్తించింది “ఇ ఫోటో ఎవరిది? నా లాగే ఎందుకూ ఉన్నారు?” అని ఆలోచిస్తూ నిలబడ్డాడు.
రాహుల్, సరణ్యు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడే లైబ్రరీ నుండి ఓ నవ్వు వినిపించింది. ముగ్గురు వెనక్కి తిరిగి చూడగా… ఎవరో అక్కడ నిలబడి ఉన్నారు. మెల్లగా అడుగుల చప్పుడు వినిపించాయి. ఒక వృద్ధుడు వెలుతురులోకి వచ్చాడు. కళ్లలో ఒక విచిత్రమైన కాంతి.
వృద్ధుడు మట్లాడుతు:
“సూర్య… ఈ ప్రశ్నలన్నీ నీ జీవితానికి సమాధానం ఇస్తాయి. కానీ నువ్వు విని భరించగలవా?” అని అడిగాడు వృధుడు.
"ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. ఇది ఏమిటి?” అని సూర్య అన్నాడు
వృద్ధుడు మెల్లగా ఫోటో చూపిస్తూ అన్నాడు - “ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి నువ్వే. నీకు తెలియని ఒక రహస్యం ఉంది. నీ కుటుంబం మీద ఒక శాపం ఉంది.”
సూర్య గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది. “ఏమిటి… శాపమా?” అని ఆశ్చర్యపోయాడు.
వృద్ధుడు మట్లాడుతు పుస్తకాన్ని చూపించాడు - “ఈ పుస్తకం సాధారణ పుస్తకం కాదు. నీ కుటుంబం శాపం నుండి బయటికి తెచ్చే దారి. దీనిని తాకిన వాడికి నిజాలూ… సమాధానాలు కనిపిస్తాయి. ఎప్పుడు అయితే శాపాగ్రస్థమైన వంశానికీ చెందిన వారి రక్తం ఈ పుస్తకం మీద పడుతుందో అప్పుడూ శాప విముక్తి సంబందిచినా దారి తెలుస్తుంది.” అని వృధుడు అన్నాడు.
సూర్య ఆశ్చర్యపోయాడు - “అంటే నేను… నా కుటుంబం శాపంలో ఉన్నామా? దాన్నుంచి తప్పించుకోవడానికి మార్గం లేదా?” అని అడిగాడు.
వృద్ధుడు మెల్లగా నవ్వాడు “ఉంది… కానీ అది సులభం కాదు. నీకు తోడుగా ఉన్నవాళ్లలో ఒకరు నీకు రక్షణ."
ఆ మాటలతో వృద్ధుడు వెనక్కి అడుగులు వేసి చీకట్లో కలిసిపోయాడు.
ముగ్గురు ఒక్కసారిగా నిలిచిపోయారు. సూర్య మనసులో ఒక్కటే ఆలోచన “ఆ రక్షణ ఎవరు?"
అదే రోజు రాత్రి సూర్య ఇంట్లో:
సూర్య ఇంక సరణ్యు ఆ రాత్రి మళ్లీ పుస్తకాన్ని తెరిచారు. అందులో ఇలా రాసి ఉంది “ఈ శాపం మూలం వివాహం లోనే ఉంది… పరిష్కారం కూడా వివాహం ద్వారానే వస్తుంది.”
సూర్య గుండెలో మరింత గందరగోళం మొదలైంది.“వివాహం? ఎవరి వివాహం?” అని తనలోనే ప్రశ్నించుకున్నాడు.
అప్పుడే సరణ్యు దగ్గరకు వచ్చి - "శాపం నీకు కద మారి అ బుక్ లో వాక్యాలు నాకు ఎందుకు కనిపిస్తుంది. నాకు ఇ బుక్ కి ఎదో సంబంధం ఉంది, ఆ బుక్ ని నాకు ఒక్కసారి ఇవ్వు సూర్య” అని అంటుంది.
సూర్య ఆశ్చర్యపోయి, బుక్ ని ఆమెకు ఇచ్చాడు. సరణ్యు బుక్ ని చూస్తునప్పుడు పేజీలు ఒక్కసారిగా చెదిరి కొన్ని పేపర్లు కనిపిస్తాయి వాటిలో ఒక కథ దగి ఉంటుంది.
ఫ్లాష్‌బ్యాక్ – కొన్నీ దశబ్దలా క్రీతం:
ఛాయ చిన్నపుడు తల్లిని కోల్పోయిన అమ్మాయి. తండ్రే ప్రపంచం. ఆయన ఒక శాస్త్రవేత్త. పరిశోధనల కోసం తరచూ అడవుల్లో తిరుగుతుంటాడు.
ఒక రోజు, ఛాయ తండ్రితో కలసి అడవిలోకి వెళ్లినప్పుడు ఒక తాంత్రికుడు స్పృహ కోల్పోయి ఉంటాడు. దయతో ఆయనను రక్షించినది ఛాయ తండ్రే. ఆ తాంత్రికుడు కళ్ళు తెరిచి చూసి, నిశ్శబ్దంగా చెప్పాడు “నీకు ఎ సహాయం కావాలి అన్నా, నా దగ్గరికి రా. నేను నీకు తోడుగా ఉంటాను అని.”
కానీ ఆ సంఘటనను ఎవరో ఒక ఊరి వారు తప్పుగా అర్థం చేసుకొని ఊరిలో “ఛాయ తండ్రి తాంత్రికుడు” అని ప్రచారం చేస్తారు.
ఈ వార్త ఊరి పెద్దయిన రాజ భూపతి (సూర్య కుటుంబం కి చెందిన వారు, సూర్య లాగే ఉంటారు) చెవిలో పడుతుంది. అతను కోపంతో “ఛాయ తండ్రి మంత్రగాడు… ఈ ఊరికి ముప్పు చంపేయాలి” అని ఆజ్ఞ ఇస్తాడు. అలా ఛాయ తండ్రి చంపబడతాడు.
ఛాయ ఒక్కసారిగా అనాథ అవుతుంది. తన తండ్రిని చంపించిన రాజ భూపతి కుటుంబం పట్ల మండిపోతుంది.
తండ్రి మృతదేహం ముందు కూర్చోని ఉన్నా ఛాయ హృదయం ప్రతీకారంతో రగులుతుంది. కన్నీళ్లు తుడుచుకుని అడవిలో ఉన్నా తాంత్రికుడి దగ్గరికి వెళ్తుంది.
“నన్ను అనాథ చేసిన ఆ కుటుంబం…రాజ భూపతి కుటుంబం మొత్తం అనాధలు కావాలి. వారి వంశం అంతం కావాలి. వారిపై శాపం వేయాలి.” అని తాంత్రికుడు తో అంటుంది.
తాంత్రికుడు ఓదారుస్తూ:
“నీ కోపం అర్థమైంది తల్లి. కని మన స్వర్ధం, కోపం కోసం ఒకరి నాశనం కోరవద్దు. ఒక రోజు నీ ద్వారానే భూపతి కుటుంబనికి సంతోషం వస్తుంది. అప్పుడే నీ బాధ పోతుంది. శాపం ఉంటే విమోచనం కూడా ఉండాలి”
అతను తన చేతులతో ఒక శాపం తో కుడిన మాయ పుస్తకం(బుక్) ని సృష్టిస్తాడు.
“ఈ మాయ పుస్తకం(బుక్) ని భావోద్వేగాల ప్రతిరూపం ఛాయ. సమయం వచ్చినప్పుడు ఈ పుస్తకం(బుక్) సరియిన వారికి చేరుతుంది, తిరిగి జీవం పొందుతుంది. మల్లి నువ్వు కొన్నీ దశబ్దలా తర్వాత జన్మిస్తావు, ఎ కుటుంబం వల్ల నీకు బాధ కలిగిందో ఆ కుటుంబం లోని ఒక వ్యక్తి నీ నువ్వు పెళ్లి చేసుకుంటావు. నీకు జన్మించే సంతానం నీ నాన్న గారి ప్రతిరూపం. అప్పుడే ఈ శాపం తొలగించబడుంది. సరైన సమయం లో నేను సరైన వ్యక్తి కి ఈ పుస్తకం(బుక్) ఇస్తాను" అని చెప్పి ఆ తాంత్రికుడు ఛాయ కొప్పని శాంత పరుస్తాడు.
కానీ ఛాయ హృదయంలో ప్రతీకారం, కన్నీటిలో వేదన, లోతులో ఒక ప్రశ్న మిగిలింది “ఆ రోజు ఎప్పుడొస్తుంది?” అని...
తరవాత ఛాయ, వల్ల మవ్వయ తో కలిసి ఆ చోటు వదిలి వెలిపోతుంది.
ప్రస్తుతం:
ఆ కథ చదివిన సరణ్యు కన్నీటి కళ్లతో మెల్లగా ఇలా చెబుతుంది -“సూర్య… నాకు ఇప్పుడే అంతా అర్దం అవుతుంది". అ రోజు లైబ్రరీ లో పేపర్ పైనా “నీ కోరిక నెరవేరుతుంది" అని ఎందుకూ కనిపించిందో. ఆ మాటలకి అర్థం అప్పుడు నాకు తెలియలేదు కానీ ఈ కథ చదివాకా నాకు అంత అర్దం అవుతుంది.
ఆ కథలో ఉన్న ఛాయ నా ఫ్యామిలీకి సంబంధంచిన వారు అందుకే నాకు పేపర్ లో "నీ కోరిక తొందరగా నేరవేరుతుంది" అని చూపించింది. ఆ ఛాయ రూపం లో నేను మళ్ళీ జన్మించాను అనుకుంట. అందుకే ఈ బుక్ నాతో కలిసినపుడు నిజం బయటపడింది.
సూర్య హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది “అంటే… ఈ శాపం తొలగాలంటే… మనిద్దరం…” అని మాట ఆపేశాడు.
సరణ్యు “అవును సూర్య … నువ్వు నన్ను వివాహం చేసుకుంటే ఈ శాపం ముగుస్తుంది. అ జన్మ లో మా నాన్న గా ఉన్నవారు మన బిడ్డ గా పుడతారు. మన కుటుంబాలు శాంతిని పొందుతాయి."
అసలు ఇది విధి అ లేకపోతే, శాపం ఓ తెలియదు కానీ నేను నిన్ను ఇంతకముందే చుసాను ఇష్టపడ్డాను. నీ కోసమే జాబ్ లో జాయిన్ అయ్యను. అని సరణ్యు అంటుంది.
సరణ్యు సూర్యా నీ మొదటి చుసిన సంఘటన:
కొన్ని నెలల క్రితం… ఒక రాత్రి సరణ్యు తన స్నేహితురాలి ఇంట్లో పార్టీ ముగించుకుని ఒంటరిగా ఇంటికి వస్తోంది. రోడ్డుపై చీకటిగా ఉంది.
అకస్మాత్తుగా, ఆమె కాలేజ్ సీనియర్ ముందుకొచ్చాడు. మద్యం తాగిన కళ్ళతో అడ్డుకొని, “ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు” అని దురుసుగా అన్నాడు.
సరణ్యు భయంతో కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఆ క్షణంలోనే ఎదురుగా ఒక అబ్బాయి వచ్చాడు తను ఎవరు కాదు సూర్య.
అదె టైం లో సూర్య ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెల్తు ఉంటాడు, అతను ధైర్యంగా ఆమె ముందుకొచ్చి, ఆ సీనియర్ ను తోసి పడేసి, సరణ్యును కాపాడాడు.
సీనియర్ పారిపోతుంటే తనని వెంబడిస్తు సూర్య కూడా వెళ్తాడు
అప్పుడు సూర్య కి తెలియదు తను కాపాడిన అమ్మాయి సరణ్యు అని. తన ముఖాన్ని చూడకుండా, ఒక మాట కూడా చెప్పకుండా సూర్య అక్కడ నుండి వెళ్లిపోతాడు. కానీ సరణ్యు మాత్రం అతని ముఖాన్ని స్పష్టంగా చూసింది.
ఆ తర్వత సూర్య గురించి తెలుసుకోవడానికి సరణ్యు రోజులు గడిపింది. సోషల్ మీడియా లో వెతికింది. చివరకు లింక్డ్ఇన్ (LinkedIn) లో సూర్య పోస్ట్ కనిపించింది "నా మొదటి ఇంటర్వ్యూకి హాజరై అయాను, అతిపెద్ద MNC కంపెనీలో ఎంపికయ్యాను (Attended my first interview and got selected in biggest MNC company).”
ఆ పోస్ట్ చదివినప్పుడు సరణ్యు గుండెలో ఆనందం పొంగిపోయింది. సరణ్యుకి ఇది విధి ఇచ్చిన అవకాశం అనిపించింది. అదే కంపెనీకి జాబ్ అప్లై చేసి సెలెక్ట్ అవుతుంది. అలా సూర్య, సరణ్యు ఇద్దరూ ఒకే ఆఫీస్ లో కలుస్తారు.
క్లైమాక్స్:
జరిగిన విషయం అంతా సూర్య తన అమ్మ కి చెప్తాడు. అమ్మకి ఆ నిజం చెప్పినప్పుడు ఆమె కన్నీళ్లు ఆగలేదు.
“నాన్న లేని లోటు తేలియకుండా నేను నిన్ను పెంచాను బాబు… కానీ ఈ రోజు తెలిసింది మన కుటుంబం గతం నీ మీద ఎంత భారంగా ఉందో. నీకీ భారాన్ని మోయనివ్వను. మీ వివాహం ఈ శాపాన్ని తుడిచేస్తుంది అంటే నువ్వు ఈ వివాహం చేసుకో” అని చెబుతుంది.
అల 2 నేలల తర్వాత పెద్దల సమాక్ష్యంలో సూర్య, సరణ్యు పెళ్లి జరిగింది. ఆ క్షణంలో ఆ బుక్ మెల్లగా వెలుగులు వెదజల్లుతూ భస్మమైపోయింది. ఆ శాపం తొలగిపోయింది. సూర్య గుండె తేలిక అనిపించింది.
“ఇప్పటిదాకా హెచ్చరికలు, భయాలు… కానీ చివరికి ప్రేమే శాపాన్ని జయించింది."
సూర్య గుండెల్లో ఒక్కటే భావన, - "గతం తప్పులను సరిచేసేది ప్రతీకారం కాదు… ప్రేమే.
ప్రేమ శక్తి శాపాలను కూడా జయిస్తుంది. మన హృదయాల్లో ద్వేషం కాకుండా ప్రేమ పెంచితే… తరతరాలకు శాంతి దొరుకుతుంది.”
సూర్య, సరణ్యు చేతులు కలిపి ప్రేమతో, సంతోషంతో ఒక కొత్త జీవితాన్ని ఆరంభించారు.
1 సంవత్సరం తర్వాత:
సూర్య ఇంకా సరణ్యు కి బాబు పుడతాడు, అందరు సంతోషం గా కలిసి ఉంటారు.
***శుభం***
Comments