ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 1
ఎపిసోడ్ 1: కడియం కోసం వేట పూర్వకాలంలో కార్తవరాయ అనే మహారాజు ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవాడు. అలాగే ఆయన పాలనలో ప్రజలు నిజంగా సుఖంగా ఉండేవాళ్లు. అతనికి ఒక్కగానొక్క కుమారుడు " యువరాజు రణప్రతాప్ ". అతడు విద్యలో, ఆయుధ వినియోగంలో, ధైర్యసాహసాల్లో ఎంతో ప్రావీణ్యం సాధించినవాడు. ఒక రోజు మహారాజు తన రాజసభలో మంత్రులతో సమావేశంలో ఉన్నపుడు ఒక్కసారిగా నేలపై పడిపోతాడు. ఆయనలో ఊపిరి ఉన్నట్లే కనబడుతుంది కానీ, లెవలేని స్థితిలో ఉంటాడు. ఈ సంఘటనతో రాజ్యంలో కలకలం రేగుతుంది. ప్రజలు భయంతో, ఆశ్చర్యంతో ఉన్నారు “మహారాజుకి ఏం అయింది?”, “ఇది శాపమా?” అనే మాటలు చక్కర్లు కొడతాయి. రాజవైద్యులు, గురువులు విచారించినా అసలు కారణం కనిపించదు. అంతలో రాజ్యంలో వర్షాలు ఆగిపోతాయి. పొలాలు పొడి పడతాయి. కరువు పడుతుంది. ఇంకా ఆపదలు ఆగకముందే పొరుగు రాజ్యం రాజుకు ఈ సంగతి తెలిసి దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితుల్లో యువరాజు రణప్రతాప్ , తండ్రిని కాపాడాలన్న సంకల్పంతో మహాదేవుడి ఆలయంలో మహారాజు కోసం రాజ గురువులు సూచించినట్లు హోమం చేయిస్తాడు. హోమం జరుగుతున్న సమయంలో ఆకాశం బాగా చీకటిగా మారుతు...