ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 1

ఎపిసోడ్ 1: కడియం కోసం వేట 

పూర్వకాలంలో కార్తవరాయ అనే మహారాజు ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవాడు. అలాగే ఆయన పాలనలో ప్రజలు నిజంగా సుఖంగా ఉండేవాళ్లు.



అతనికి ఒక్కగానొక్క కుమారుడు "యువరాజు రణప్రతాప్". అతడు విద్యలో, ఆయుధ వినియోగంలో, ధైర్యసాహసాల్లో ఎంతో ప్రావీణ్యం సాధించినవాడు.


ఒక రోజు మహారాజు తన రాజసభలో మంత్రులతో సమావేశంలో ఉన్నపుడు ఒక్కసారిగా నేలపై పడిపోతాడు. ఆయనలో ఊపిరి ఉన్నట్లే కనబడుతుంది కానీ, లెవలేని స్థితిలో ఉంటాడు.

ఈ సంఘటనతో రాజ్యంలో కలకలం రేగుతుంది. ప్రజలు భయంతో, ఆశ్చర్యంతో ఉన్నారు “మహారాజుకి ఏం అయింది?”, “ఇది శాపమా?” అనే మాటలు చక్కర్లు కొడతాయి.

రాజవైద్యులు, గురువులు విచారించినా అసలు కారణం కనిపించదు. అంతలో రాజ్యంలో వర్షాలు ఆగిపోతాయి. పొలాలు పొడి పడతాయి. కరువు పడుతుంది. ఇంకా ఆపదలు ఆగకముందే పొరుగు రాజ్యం రాజుకు ఈ సంగతి తెలిసి దండయాత్రకు సిద్ధమయ్యాడు.

ఈ పరిస్థితుల్లో యువరాజు రణప్రతాప్, తండ్రిని కాపాడాలన్న సంకల్పంతో మహాదేవుడి ఆలయంలో మహారాజు కోసం రాజ గురువులు సూచించినట్లు హోమం చేయిస్తాడు.


హోమం జరుగుతున్న సమయంలో ఆకాశం బాగా చీకటిగా మారుతుంది. గాలిలో అద్భుత శబ్దాలు వినిపిస్తాయి. ఆ సమయంలో ఒక సన్యాసి వచ్చి యువరాజుతో ఇలా చెబుతాడు:

“తూర్పు కొండల్లో శివుడి గుడిలో ఒక మహిమ కలిగిన కడియం ఉంది. అది మహారాజు గారికి దరిస్తే, దాని శక్తితో మహారాజు మళ్లీ పూర్వస్థితికి వస్తాడని ఆ సన్యాసి తెలియజేస్తాడు.”


ఇలా చెప్పి ఆ సన్యాసి అదృశ్యమవుతాడు!

యువరాజు ఆ కడియం కోసం ప్రయాణం మొదలు పెడతాడు.

మార్గం అంతా అడవులు, లోయలు, ప్రమాదకరమైన ప్రదేశాలు. ఒక నలుపు పొగల మడుగులోకి ప్రవేశించిన యువరాజు పై, ఒక్కసారిగా అడివి మనుషులు చుట్టు ముట్టారు..

వారంతా ఆక్రోశంతో, ఆయుధాలతో, ముఖం నిండా ముసుగుతో ఎదిరిస్తారు. రక్తపాతం లాంటి యుద్ధం మొదలవుతుంది. రణప్రతాప్ తన ఖడ్గాన్ని ఉపయోగించి వారిని తిప్పికొడతాడు. ఒకరిని గాయపరుస్తాడు. మరొకరిని నేలకొరుగజేస్తాడు. 

తర్వాత యువరాజు ఓ చిన్న గుహలో చిక్కుకుపోతాడు. ఎదురుగా పెద్ద పెద్ద బండలు, పాములు...

అతడు తన ధైర్యంతో, యుద్ధ నైపుణ్యంతో దానిని ఎదుర్కొంటూ చివరికి శివాలయం దాకా చేరుతాడు...



👉 అక్కడ ఏమైంది? కడియం దొరికిందా? శివుడి గుడిలో ఇంకెన్ని రహస్యాలు దాగున్నాయి?

ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం!

Comments

Popular posts from this blog

Love Beyond Time...

ఒక తండ్రి కన్న కల

The Love Story of Kittu...