మైత్రి

రాము ఒక ప్రైవేట్ కంపెనీ లో పని చేస్తు ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ తన చుట్టు ఉన్న వారికి సహాయం చేస్తు అందరితో మంచిగా స్నేహబావం తో ఉంటాడు.

చూడడానికి రాము నవ్వుతూ సరదాగా ఉంటాడు. కని రాము చాల భయస్థుడు.

రాము ఉంటున్న ఇంటి దగ్గర ఒక రౌడీ ఉంటాడు. తను చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తు ఉంటాడు.

ఒకరోజు రాము ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుండగా కొంతమంది రౌడీ లు రాము నీ అపి తనని బెదిరించి తన దగ్గర నుండి డబ్బులు లాగేసుకుంటారు.

రాము అసలే భయస్థుడు అవ్వడం వల్ల వాళ్ళు బెదిరించేసరికి తన దగ్గర ఉన్న డబ్బుని రౌడీ లాకు ఇచేస్తాడు.

మరిసాటి రోజు తనకి జరిగిన విషయం ఆ రౌడీలా పెద్దతో చెప్పాలి అని తన దగ్గరకు వెళతాడు.

రాము: నమస్కారం అండి నా పేరు రాము. నేను ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పని చేస్తు ఉంటాను.

రౌడీ:  ఇవ్వానీ నాకు ఎందుకు చెప్తునావు బే.

రాము: నిన్న రాత్రి మీ మనుషులు నన్ను బెదిరించి నా దగ్గర ఉన్నా డబ్బుని తీసుకున్నారు. ఆ డబ్బు లేకపోతె నేనూ ఉన్నా గది అద్దె కట్టాలేను ఇంకా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు ఎలా అయిన ఆ డబ్బుని తిరిగి ఇప్పించాలి.

రౌడీ: ఒక్కసారి నా దగ్గరకు డబ్బు వచ్చింది అంటే హుండీలో వేసినట్టే. డబ్బులు తిరిగి ఇచ్చేదే లేదు ఇక్కడ నుండి దొబ్బేయే.

రాము: సార్ దయచేసి కొంచెం నా పరిస్థితి గురించి ఆలోచించండి. 

రౌడీ: నీకు మాటలో చెప్తే అర్దం కాదు, రేయ్ విడిని నా ముందు నుండి తరిమేయండి రా.

రౌడీ అనుచరులు ఒచ్చి రాము ని కొట్టి రోడ్డు పక్కనే ఉన్నా చేతకుప్ప దగ్గర పడేస్తారు. చాల సేపు రాము అలా పడిపోయే ఉంటాడు. కొంత సేపటికి అటు పక్కా వెళుతున్న ఒక వ్యక్తి రాము ని చూసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు.

అంబులెన్స్ వస్తుంది రాముని హాస్పిటల్ కి తీసుకెళ్తారు.

ఈ సంగటన జరిగిన నేల రోజుల తరవాత.

ఢిల్లీ లో ఆఫీసు పని ఉంది అని రాము తన రూమ్ లో బట్టలు సర్ధుతూ ఉంటాడు.

అదే సమయంలో దెబ్బలతో, కత్తి పొట్లతో సోమేష్ అనే వ్యక్తి రాము గదికి ఒస్తాడు. సోమేష్ వెంటపడుతు రౌడీలు కుడా ఒస్తారు.

సోమేష్ పరిస్థితి చూసి రాము తనకి సహాయం చేస్తాడు .

ఆ రౌడీలా కళ్ళుగప్పి సోమేష్ నీ హాస్పిటల్ కి తీసుకొని వెళతాడు రాము. సోమేష్ కు వైద్యులు చికిత్స చేస్తారు.

చికిత్స పూర్తి అయిన కొంత సమయానికి సోమేష్ కు మేలుకువ వస్తుంది. 

అసలు ఏం జరిగింది, ఎవరు మీరు అని సోమేష్ నీ అడుగుతాడు రాము.

Flashback (గతం)

సోమేష్ నాన్న: ఎక్కడ ఆ వేదవా సనాసి సంబందం లేని విషయం లో తలదూర్చడం గొడవలు పెట్టుకోడం ఇదేపని ఐపోయింది వాడికి.

సోమేష్ అమ్మ: ఎవరండీ ఎందుకు అలా తిడుతున్నారు,

సోమేష్ నాన్న: ఇంకా ఎవరు ఉంటారు మన పుత్రరత్నం. ఈరోజు మల్లి గొడవ పడ్డాడు అంట పోలీస్ స్టేషన్ వరకు వెల్లాడు. అందరి ముందు నా తల తీసేసినట్లు అయింది.

అదే సమయంలో సోమేష్ ఇంటికి ఒస్తాడు:

వచ్చారా సార్ రండి మీ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు మల్లి గొడవ పడ్డారు అంట. మమల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా సార్ మీరు.

సోమేష్: నాన్న నా తప్పు ఎమీ లేదు వాడు నా ఫ్రెండ్ చెల్లిని ఏడిపించాడు అందుకే కొట్టాను.

సోమేష్ నాన్న: వాడు ఎవడో చెల్లిని ఏడిపిస్తే నీకు ఎందుకు రా, నీ పని నువ్వు చూసుకోవాలి కదా.

సోమేష్: నాన్న నా కళ్ళముందు తప్పు జరుగుతుంటే నేను చూడలేను ఆ స్థానంలో నా సొంత చెల్లి ఉన్నా నేను అదే పని చేసే వాడిని. నా స్నేహితుడు చెల్లి నాకు కుడా చెల్లి లాంటిది అందుకే వాడిని కొట్టాను. కరణం లేకుడా నేను ఎ పని చేయను అది నీకు కూడా తెలుసు నాన్నా.

సోమేష్ నాన్న: సరే సార్ మిమ్మల్ని మేము ఎం అడగము మీకు నచ్చింది మీరు చేసుకోండి.

ఒక వారం రోజుల తర్వత ఇంటికి ఒక పోస్ట్ వస్తుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ లో సెలెక్ట్ అయ్యరు అని ఆ లెటర్ లో ఉంటుంది.

ఆ లెటర్ చూసినా నాన్న, సోమేష్ ని తిడతాడు. తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలి అని సోమేష్ తండ్రి అనుకుంటున్నారు.

సోమేష్ నాన్న: నాకు నచ్చని పని చేసే వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు అని సోమేష్ ని ఇంటి నుండి వెళ్లిపోమని చెప్తాడు.

ఆ మాట విన్న తర్వాత సోమేష్ ఇంటి నుండి వెళ్లిపోతాడు.

తను ఇంటి నుండి వెళ్ళిపోయిన తన బాద్యతను మరిచిపోడు సోమేష్. తను ఎంత దూరం లో ఉన్నా తన తల్లి తండ్రుల క్షేమ సమాచరలు తెలుసుకుంటూ ఉంటాడు.

ఒకరోజు సోమేష్ వాలా ఏరియా కార్పొరేటర్ సోమేష్ వాలా ఇల్లు తనా పేరు పైనా రాసివ్వమని సోమేష్ వల్ల అమ్మ నాన్నని బెదిరిస్తాడు.

సోమేష్ వల్ల నాన్న తన ఇల్లు ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోడు.

దాంతో ఆ ఇల్లు ఎలా అయిన సంపాదించడికి కార్పొరేటర్ సోమేష్ వాలా అమ్మ నాన్న ని ప్రమాదం (accident) చేసి చంపేస్తాడు.

ఆ విషయం తెలిసి సోమేష్, కార్పొరేటర్ ని చంపడానికి బయలు దేరుతాడు.

ఆ క్రమంలో లో సోమేష్ కి కత్తి పొట్లతో గాయాలు అవుతాయీ. ఆ సమయంలోనే సోమేష్, రాము నీ కలుస్తాడు. 

Present day (ప్రస్తుతం).

కార్పొరేటర్ చేసిన తప్పుకి శిక్ష పడాలి అని సోమేష్ కి సహాయం చేస్తాడు రాము.

రాము కి తెలిసిన మీడియా వారితో మాట్లాడి ఆ కార్పొరేటర్ చేసిన తప్పులని సేకరించి కోర్టుకి అందిస్తాడు.

కోర్ట్ లో కార్పొరేటర్ చేసిన తప్పుకు శిక్ష వేస్తారు. కథా సమాప్తం.

చివరగా ఒక్క విషయం, ఆ రోజు రాము దెబ్బతో ఉన్నపుడు ఒక వ్యక్తి రాము ని చూసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు . అని చెప్పాను కదా ఆ వ్యక్తి ఎవరో కాదు తను సోమేష్.

ఆ రోజు సోమేష్ చేసిన మంచిపని తను ఆపదలో ఉన్నప్పుడు కాపాడింది. 

మనం చేసే మంచి మనకు ఎప్పుడు మంచే చేస్తుంది.


No comments:

Post a Comment

A Suprise Wedding

An accident happens while Shekar and Deepika are going on a bike in a desolate place. At the same time, Shekar's parents and Deepika'...