శంకర్ ఒక అదృష్టం లేని వ్యక్తి, ఏదైనా ఆశించాడంటే, జీవితం దానికి విరుద్ధంగా ఉందేది. పోటీలో గెలవాలని అనుకున్నా 'ఓడిపోవడం', ప్రయాణం ప్లాన్ చేసినా క్యాన్సిల్ కావడం... అలా ఎప్పుడూ దురదృష్టమే వెంటాడేది. కానీ, శంకర్ ఒక్కసారైనా నిరశపద లేదు. అతడు నమ్మకం పెంచుకున్నాడు, "ఏం జరిగినా అది నా మేలు కోసమే." జీవితం ఎంతగా పరీక్షించినా, అతని పాజిటివ్ ఆలోచన మారలేదు. శంకర్ ప్రాజెక్ట్ పనిమీద వారం రోజులు బెంగళూరుకు వేలతాడు. అతడు అంతగా ఉత్సాహంగా లేనప్పటికీ, చిరునవ్వుతో, "ఇది కూడా నా మేలు కోసమే అవుతుంది" అని అనుకున్నాడు. బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, విచిత్రమైన మార్పులు మొదలయ్యాయి. తొలిసారి, అతని జీవితం సరైన దిశలో వెల్తుంది . ఆఫీసులో అతని ప్రతిభ గుర్తించబడింది, ప్రమోషన్ వచ్చింది. అతని ప్రవర్తన, మనస్తత్వం, స్టైల్ అన్నీ మారిపోయాయి ఆత్మవిశ్వాసంతో నిండిపోయి, ఓ కొత్త శంకర్‌గా మారాడు. చుట్టూ ఉన్నవాళ్లు అతను "షో ఆఫ్" చేస్తున్నాడని మాట్లాడారు. కానీ వాస్తవం ఏమిటంటే, శంకర్ దగ్గర ఎప్పుడో ఉన్న ప్రతిభకు ఇప్పుడు మోక్షం దొరికింది. రోజులు గడుస్తుండగా, శుభవార్తలు వరుసగా వస్తూనే ఉన...
Hi This is Sainath Dawath... I will write 'Suspence', 'Thrilling', 'Mysterious', 'Love' stories in Telugu and English.. Hope you like my stories.