బెంగళూరు రహస్యం
శంకర్ ఒక అదృష్టం లేని వ్యక్తి, ఏదైనా ఆశించాడంటే, జీవితం దానికి విరుద్ధంగా ఉందేది.
పోటీలో గెలవాలని అనుకున్నా 'ఓడిపోవడం', ప్రయాణం ప్లాన్ చేసినా క్యాన్సిల్ కావడం...
అలా ఎప్పుడూ దురదృష్టమే వెంటాడేది.
కానీ, శంకర్ ఒక్కసారైనా నిరశపదలేదు.
అతడు నమ్మకం పెంచుకున్నాడు, "ఏం జరిగినా అది నా మేలు కోసమే." జీవితం ఎంతగా పరీక్షించినా, అతని పాజిటివ్ ఆలోచన మారలేదు.
శంకర్ ప్రాజెక్ట్ పనిమీద వారం రోజులు బెంగళూరుకు వేలతాడు.
అతడు అంతగా ఉత్సాహంగా లేనప్పటికీ, చిరునవ్వుతో, "ఇది కూడా నా మేలు కోసమే అవుతుంది" అని అనుకున్నాడు.
బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, విచిత్రమైన మార్పులు మొదలయ్యాయి.
తొలిసారి, అతని జీవితం సరైన దిశలో వెల్తుంది .
ఆఫీసులో అతని ప్రతిభ గుర్తించబడింది, ప్రమోషన్ వచ్చింది.
అతని ప్రవర్తన, మనస్తత్వం, స్టైల్ అన్నీ మారిపోయాయి
ఆత్మవిశ్వాసంతో నిండిపోయి, ఓ కొత్త శంకర్‌గా మారాడు.
చుట్టూ ఉన్నవాళ్లు అతను "షో ఆఫ్" చేస్తున్నాడని మాట్లాడారు.
కానీ వాస్తవం ఏమిటంటే, శంకర్ దగ్గర ఎప్పుడో ఉన్న ప్రతిభకు ఇప్పుడు మోక్షం దొరికింది.
రోజులు గడుస్తుండగా, శుభవార్తలు వరుసగా వస్తూనే ఉన్నాయి.
తల్లిదండ్రులు ఒక మంచి పెళ్లి సంబంధం చూపించారు.
అతడు వెంటనే ఓకే చెప్పాడు.
కొద్దికాలంలోనే అందమైన, ఆకర్షణీయమైన ఈషా అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది .
అయితే, లోపల ప్రతి ఒక్కరికీ ఒకే సందేహం "అ వారం రోజులు బెంగళూరులో ఏం జరిగింది అని? "
బెంగళూరులో జరిగిన రహస్యం...
బెంగళూరులో మీటింగ్స్ ముగిసిన తర్వాత, శంకర్ హోటల్‌కు చేరుకుని, మంచంపై పడిపోయాడు.
ఇలా రోజులు సాధారణంగా పనితో నిండినవే అనుకున్నాడు.
కానీ... అదృష్టం అతడికో ప్రత్యేకమైన గమ్యాన్ని సిద్ధం చేసిందీ.
మరుసటి రోజు, ఆఫీసు పని ముగించుకుని హోటల్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు.
ఆ సాయంత్రం గాలి ఏదో విచిత్రంగా అనిపించింది. వాతావరణం బరువుగా మారింది.
ఎవరైనా వెంట వస్తున్నారేమో అనిపించింది. తిరిగి చూసినా ఎవ్వరు కనిపించలేదు.
హోటల్ గదిలోకి అడుగుపెట్టినప్పుడు, గోడపై ఉన్న పెద్ద అద్దంలోకి చూసాడు.
అక్కడ... తన వెనుక ఓ నీడ కనిపించింది.
ఒక పరాయి వ్యక్తి.
భయంతో వెనక్కి తిరిగాడు కాని ఎవరూ లేరు.
తడబడిన గొంతుతో అరవటం మొదలుపెట్టాడు, "ఎవరు అక్కడ?!"
అప్పుడే, ఎదురుగా ఒక అసాధారణ ఆకారం కనిపించింది.
అది మనిషి పోలికలో కూడా లేదు, భయంకరమైన శరీరంతో నిలుచుంది.
ఆ ఆకారం పలికింది, "భయపడొద్దు. నా పేరు పినాక."
పినాక తన విషాదకథను వివరించాడు.
ఒకప్పుడు అతడూ శంకర్ పని చేస్తున్న అదే కంపెనీలో ఉద్యోగిగా ఉన్నాడు.
ఒకరోజు, కంపెనీలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను తెలిసి, అన్నీ ఆధారాలతో కూడిన పేపర్స్, పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేశాడు.
అది Enforcement Directorate (ED)కి సమర్పించబోతున్న సమయంలో,
శంకర్ బాస్ జగపతి అతన్ని గమనించి, దుర్మార్గంగా హత్య చేశాడు.
పెండ్‌డ్రైవ్‌ని నాశనం చేశాడు.
పినాక ఆత్మకు శాంతి లభించలేదు.
తాను ప్రారంభించిన సత్య యుద్ధాన్ని పూర్తిచేయడానికి ఓ ధైర్యవంతుడు కావాలి.
అదే సమయం లో శంకర్ నీ చుస్తాడు. శంకర్ అంటే సరైన వ్యక్తి అని బావిస్తాడు.
పినాక కథ విని, శంకర్ కొంచెం భయపడినా, ధైర్యంగా ముందుకు వచ్చాడు.
"నేను నీకు న్యాయం తెస్తా," అని ప్రమాణం చేశాడు.
పినాక మార్గదర్శకత్వంలో, శంకర్ మళ్లీ కొత్త ఆధారాలను సేకరించాడు.
రోజూ రాత్రిపగలు కృషి చేసి, ఎవరికీ తెలిసేలా లేని విధంగా సాక్ష్యాల ఫైల్ సిద్ధం చేశాడు. నిశ్శబ్దంగా తన పని పూర్తి చేశాడు.
చివరికి, శంకర్ ఆ ఫైలును EDకి సమర్పించాడు.
కొద్ది రోజుల్లోనే, జగపతిని అరెస్ట్ చేసి జైలులోకి పంపించారు.
అతని నేరాలు వెలుగులోకి వచ్చాయి.
పినాక ఆత్మ, న్యాయం జరిగిన ఆనందంతో, శాంతిగా వెళ్లిపోయింది.
వెళ్లేముందు, చిరునవ్వుతో శంకర్‌ను చూసి అన్నాడు,
"ధన్యవాదాలు. న్యాయని కాపాడినందుకు."
ఆ సంఘటన తర్వాత, శంకర్ జీవితం మారిపోయింది.
అతడు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అదృష్టం అతడిని కౌగిలించుకుంది ప్రమోషన్, గౌరవం, ఆనందం... మరియు ప్రేమ రూపంలో ఈషా!
Comments