నీలాకాశంలో మెరిసే చంద్రుడు

మధు ఒక అభివృద్ధి చెందుతున్న ఫోటోగ్రాఫర్. అతని కల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్గా స్థిరపడటం. జీవితాన్ని కెమెరా లెన్స్ ద్వారా చూడటం అతని ఆరాధన. కానీ అతని జీవితంలో నిజమైన కదలిక "నీరా" రూపంలో వచ్చింది.


నీరాను అతడు మొదట చూసింది ఒక వాన కురిసిన సాయంత్రం. ఆమె తన తమ్ముడిని జాగ్రత్తగా వర్షం నుంచి కాపాడుతూ నిలబడి ఉండగా… ఆమె కళ్లు అలసటగా ఉన్నా, ఆ కళ్లలో అజేయమైన ధైర్యం కనిపించింది. ఆ దృశ్యం అతనికి జీవితాంతం గుర్తుండిపోయింది—ఫోటో తియకపోయీన, అ దృశ్యం అతని మనసులో అలానే ఉండిపోయింది.


అప్పట్నుంచి మధు నీరా ను ఇష్టపడతాడు. 


కానీ "నీరా" మాత్రం ప్రేమకి దూరంగా ఉంటుంది. ఆ నిర్ణయానికి కారణం గర్వం కాదు—ఆమె జీవితం ఓ భారంగా మారింది. తండ్రి ప్రమాదంలో చనిపోవడం, తల్లి ఆరోగ్య సమస్యలు, తమ్ముడి చదువు—అవన్నీ ఆమె భుజాల మీదే. ప్రేమ అనే భావన ఆమెకి భారంగా అనిపించింది.


మధు అర్థం చేసుకున్నాడు. అయినా, వెనక్కి తగ్గలేదు.


నీరా కు తెలియకుండా ఆమెను సహాయం చేసేవాడు. కానీ తన పేరు ఎక్కడా చెప్పలేదు. మధు సహాయం చేసే విషయం నీరా తమ్ముడికి తెలుసు. ఈ విషయం నీరా కి చెప్పకూడదు అని మధు నీరా తమ్ముడితో చెప్తాడు.


నీరా కు జీవితం తేలికగా మారిందని అనిపించింది. కానీ ఆమెకి తెలియదు… ఆ వెనక ఉన్న కాంతి పేరు మధు అని.


మధు తన స్నేహితుడు, కిరణ్‌తో కలిసి చిన్న గదిలో ఉండేవాడు. అనాథగా పెరిగిన అతని ప్రపంచం—కెమేరా, కలలు, మరియు నీరా తో నిండిపోయింది.


మధు ఒకసారి నీరా కు తన ప్రేమ గురించి చెప్తాడు. 


నీరా మాత్రం ప్రేమను అంగీకరించలేదు. “ప్రేమ బతకడానికి సరిపోదు" అని మధుతో అంటుంది. 


అతడు నవ్వి ఓపిగ్గా మౌనమయ్యాడు.


ఒక రోజు...

నీరా తన తమ్ముడి నోట్‌బుక్ చూస్తూ ఉంది. అందులో ఒక ఫోటో స్టైల్ చూస్తే మధుదే అని ఆమెకి తెలుస్తుంది. అప్పుడు నీరా కి తనకి సహాయం చేస్తుంది మధు అని అర్దం అవుతుంది.


ఆమె వెంటనే మధు ఉంటున్నా చోటుకి వెల్తుంది.


"ఇన్ని రోజులు నన్ను నువ్వే ఆదుకున్నావా?" అని మధునీ నీరా ప్రశ్నిస్తుంది.


"నీవు నన్ను ప్రేమించాలని సహాయం చేయలేదు. నీవు ఒంటరిగా ఉన్నావ్ అనిపించి చేశాను," అన్నాడు మధు.


"నేను ప్రేమను తిరస్కరించా ఎందుకంటే…స్వాచమైనా ప్రేమానీ కోల్పోతే ఆ బాధనీ భరించలేను," అని నీరా నెమ్మదిగా చెప్పింది.

మధు చిన్నగా నవ్వి నీరా నీ కౌగిలించుకుంటాడు. 


ఒక సంవత్సరం తర్వాత

మధు జీవితంలో వెలుగు వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న అవకాశం లభించింది. ఫోటోలు వైరల్ కావడం ద్వారా ఒక చిన్న చిత్రానికి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గానే అవకాశం వచ్చింది.


ఇదే సమయంలో నీరా కూడా తన జీవితం చక్కబెట్టుకుంటోంది. ఆమె అకౌంటింగ్ కోర్స్ చేరింది, ఉద్యోగం మెరుగైందీ, తల్లి ఆరోగ్యం నిలకడైంది.


ఒకరోజు… ఒక ఆర్ట్ గ్యాలరీలో మధు ఫోటో ప్రదర్శన జరుగుతోంది. "Faces of Resilience" అనే పేరుతో.


ఒక ఫోటో ముందు నీరా ఆగింది— ఫోటో కింద ఇలా రాశి ఉంది:

“నవ్వుతూ బరువు మోసే అమ్మాయి.”


నీరా మధు వైపు చూసింది. “ఇది నీ ప్రపోజల్ అని అర్థం కాదా?” అంది చిరునవ్వుతో.

మధు ఏమి చెప్పకుండా చిన్నగా నవ్వాడు.


నీరా ఎమి అనలేదు. మధు చేయి పట్టుకుంది.

ఆమె కలలు… అతని కలలు… కలిసి ముందుకు సాగాయి.


సుఖాంతం

Comments

Popular posts from this blog

A Journey of Love

ఒక తండ్రి కన్న కల

బెంగళూరు రహస్యం