ఒక తండ్రి కన్న కల

శివ ఉదయం ఉత్సాహంగా నాన్న వద్దకు వచ్చాడు.

శివ: నాన్నా! ఈరోజు నా పదో తరగతి ఫలితాలు వస్తున్నాయి. నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న!

నాన్న: ఓహ్! మంచి వార్త చెప్పావు శివ. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఫస్ట్ క్లాస్ రావాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎప్పుడూ బాగా చదువుకో, తెలివి పెంచుకో అన్నాను.

శివ: అది ఎందుకు నాన్న?

నాన్న: ఫస్ట్ క్లాస్ అన్నది మార్కులతో వస్తుంది. కానీ నిజమైన విజయం తెలివితేటలతో వస్తుంది. మార్కులు ఒకసారి రాకపోయినా, తెలివిని పెంపొందించుకోవడం ముఖ్యం.

శివ: సరే నాన్న!

నాన్న: నీ చదువు విషయంలో నాకు నమ్మకముంది, కానీ నీ రన్నింగ్ రేస్ సంగతేంటి? ఎంత వరకు వచ్చావు?

శివ: వచ్చే నెలలో ఒక ముఖ్యమైన రేస్ ఉంది నాన్న. దాన్ని గెలిస్తే… ఇంటర్ స్టేట్ రన్నింగ్ కాంపిటీషన్‌కు సెలెక్ట్ అవుతాను.

నాన్న: బాగుంది నాన్నా… నీ లక్ష్యం దేశం కోసం పరిగెత్తడం!

శివ: తప్పకుండా నాన్న, మీ కోరిక నెరవేర్చుతాను.

8 సంవత్సరాల తర్వాత...

స్టేట్ లెవెల్ రన్నింగ్ కాంపిటిషన్. గ్రౌండ్‌లో వేడి వాతావరణం. అందరూ సిద్ధంగా ఉన్నారు.

కోచ్: శివా! ఈ రేస్ గెలిస్తే నేషనల్ లెవెల్‌ కి నీ అడుగు పడుతుంది. గత మూడు రేసుల్లో నువ్వే గెలిచావు. ఈసారి కూడా అదే జరగాలి!

శివ: అవును కోచ్… గెలవడం ఖాయం!

కోచ్: నీవు కొంచెం డల్‌గా ఉన్నావు. అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నావా? వాళ్లు లేరన్న సంగతి నిజం. కానీ నీవు గెలిచే ప్రతీసారి వాళ్ల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది… వల్లా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుంది.

శివ: ఓకే కోచ్. ఐదు నిమిషాల్లో వస్తాను. మీరు వెళ్ళండి.

అంతలో ఉమ స్నేహితురాలితో స్టేడియం కి వచ్చింది.

ఉమ: సినిమాకి వెళ్దాం అంటే, రన్నింగ్ రేస్‌కి తీసుకురావడం ఏంటి?

స్నేహితురాలు: మన కావ్య అన్నయ్య ఈ రేస్‌లో ఉన్నాడు ఉమ. ఒక్కసారి ఈ రేస్ అయిపోతే వెంటనే సినిమా వెళ్దాం.

ఉమ: నీవు చెప్పావు కాబట్టి ఓకే, చూద్దాం.

రేస్ మొదలైంది. ఆటగాళ్లంతా ఉత్సాహంగా పరిగెత్తుతున్నారు. చివర్లో అనిరుధ్, శివ ఇద్దరూ పోటీగా ఉన్నాయి.

ఒక్క సెకండ్ తేడాతో శివ విజేతగా నిలిచాడు!

కోచ్: వావ్ శివా! నీవే గెలుస్తావని నాకు తెలుసు. అభినందనలు!

శివ: ధన్యవాదాలు కోచ్!

ఉమ: రేస్ అయిపోయింది పదండి… ఇప్పుడు సినిమాకి వెళదాం.

శివ విజయం అనంతరం...

రేస్ ముగిసిన తర్వాత శివ అభిమానులతో, కోచ్‌తో, మీడియాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్లడానికి సిద్దపడుతున్న ఉమ, ఒక్కసారి వెనక్కి తిరిగి శివ ని చూస్తుంది. 

మరుసటి రోజు – గ్రౌండ్ దగ్గర…

శివ ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఉమ అక్కడకు వస్తుంది.

ఉమ: హాయ్… 

శివ: హాయ్… మీరు ?

ఉమ: అభినందనలు నువ్వు నిన్న రేసులో గెలిచినందుకు.

శివ: ధన్యవాదాలు.

అలా శివ ఇంకా ఉమ ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకొని మాట్లాడుకుంటారు. కొంత సమయం తర్వత….... 

ఉమ: సరే నువ్వు ఫ్రీ గా ఉన్నపుడు కాలుదాం. మనం స్నేహేతులామే కదా?

శివ: ఖచ్చితంగా. స్నేహం నుంచే నిజమైన పరిచాయలు మొదలవుతాయి కదా.

కొన్ని రోజులు తర్వాత...

శివ నేషనల్ లెవెల్ పోటీకి ప్రిపేర్ అవుతున్నాడు, ఉమ తరచూ అతన్ని కలుస్తూ, ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది.

వాళ్లిద్దరి మధ్య తేలియాని ఒక బంధం ఏర్పడుతుంది. శివ జీవితంలో తల్లిదండ్రులు లేనప్పటికీ, ఉమ అతనికి ఓ తోడు గా సహచారిణి గా మారుతుంది.

ఉమ, శివ జీవితంలో ఓ వెలుగులాంటిదిగా మారింది. ఆమె మాటలు, నవ్వు, ప్రోత్సాహం ఇవన్నీ అతడి ఒంటరితనాన్ని దూరం చేసాయీ.

ఒక రోజు సాయంత్రం... గ్రౌండ్ లో శివ ఇంకా ఉమ కూర్చున్నారు

ఉమ: నీతో ఇలా రోజూ మాట్లాడటం, నీ కోసం ఎదురు చూడడం, నీకు సపోర్ట్ చెయ్యడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి శివ...

శివ (నిశబ్దంగా నవ్వుతూ): నాకూ అలాగే అనిపిస్తోంది ఉమ…

కానీ... 

ఉమ: ఎమైంది?

శివ: నేడు నా దృష్టి అంతా నా లక్ష్యంపై.  

ఉమ (సున్నితంగా): నాకు తెలుసు శివ, నీకు తోడుగా నేను ఎప్పటికి నీతోనే ఉంటాను.

శివ మౌనంగా ఆమె కళ్లలోకి చూస్తాడు. ఆ క్షణం ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతోంది.

కానీ… ఇ క్షణం తర్వాత వారి జీవితం మారిపోతుందని వాళ్లెవ్వరూ ఊహించలేదు.

నేషనల్ పోటీకి ముందు రోజు శివ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్ కి గురి అవుతాడు. గాయం చిన్నదే అనుకుంటాడు, కానీ...

డాక్టర్ "ఆయన కాలికి లిగమెంట్ ఇంజరీ వచ్చింది. రేపటి పోటిలోనే కాదు ఇంకా రేస్ లో పాల్గొనడం ప్రమాదకరం. పాదం పూర్తిగా బలహీనమవుతుంది." అని చెప్తారు. 

శివ (కోచ్‌కి): "నేను ఆగలేను కోచ్. ఇదే నాకున్న చివరి అవకాశం. నా నాన్న కల… నా స్వప్నం."

ఉమ (కనీనీళ్ళతో): "శివ… నేను నీతో ఉన్నాను. కానీ ఇది మనసుతో గెలిచే పోటీ కాదు… శరీరంతో కూడా పోరాడాలి. నువ్వు ఓడినా సరే, నీ ఆరోగ్యం ముఖ్యం."

శివ: "నువ్వు నా జీవితంలో ఉన్న తర్వాతే ఈ గెలుపు విలువ తెలిసింది ఉమ… కానీ ఇప్పుడు ఓడిపోవాలంటే… నేనే కాదు, నా తండ్రి కల కూడా ఓడిపోతుంది."

తర్వత రోజు రేస్ జరిగే స్టేడియంలో. నాలుగువేల మంది చూస్తూ ఉండగా శివ ఓస్తాడు.

అందరూ ఆశ్చర్యపోతారు.

కోచ్ గట్టిగా "శివ వచ్చాడు!" అని అంటారు.

శివ ఒక కాలికి బాండేజ్‌తో స్టేడియంలోకి వస్తాడు. అతడి కళ్లలో తండ్రి, కోచ్, ఉమ ముగ్గురి రూపాలే కనిపిస్తున్నాయి.

ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతారు. కామెంటేటర్లు ఆశ్చర్యంతో మాట్లాడతారు:

కామెంటేటర్: “ఇది మనం చూడదలిచింది కాదు… ఇది మనం చూసి గర్వపడే దృశ్యం. శివ… తన కల కోసం, తన తండ్రి స్వప్నం కోసం… నొప్పిని అధిగమిస్తూ స్టార్టింగ్ లైన్ వద్దకు వచ్చాడు.”

రేస్ ప్రారంభం:

గంట మోగింది. ఆటగాళ్లు పరిగెత్తడం మొదలుపెట్టారు. శివ కూడా పరిగెడుతున్నాడు. మొదటి 100 మీటర్లు… అతని ముఖంలో గెలవాలి అని తపన కానీ కాలి నొప్పి క్రమంగా పెరుగుతుంది.

అప్పుడు శివకి తండ్రి మాటలు గుర్తొస్తాయి:

“ఫస్ట్ క్లాస్ రాకపోయినా పరవాలేదు శివా… తెలివి పెంచుకో… ఓటమిలో గెలుపు చూడగలిగితే నిజమైన విజేత నువ్వే.”

ముందు ఇద్దరు ఆటగాళ్లు పరిగెడుతున్నారు. శివ చివరినుంచి వస్తున్నాడు. గెలవడం అసాధ్యంగా కనిపిస్తుంది… కానీ అతని కళ్లలో ఒకటే లక్ష్యం "ఆఖరి వరకు పరిగెత్తాలి!"

ఆఖరి 10 మీటర్లు… అతని కాలు ఒరిగిపోతుంది… శివ పడిపోతాడు… రేస్ ముగిస్తుంది.

ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లు కొడుతున్నారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

శివ పోటీలో మూడవ స్థానం సంపాదిస్తాడు.

కాని అతనికి వచ్చిన ప్రశంస, మీడియా ఫోకస్, జాతీయ అథ్లెటిక్స్ అకాడమీ ఆఫర్ ఇవన్నీ అతని పోరాటానికి గౌరవం ఇచ్చేవి.

కామెంటేటర్ చివరి మాటలు:

“ఈరోజు మనం ఓ చాంపియన్‌ని కాదు… ఓ జ్యోతి ని చూశాం. 

మూడు నెలల తర్వాత…

శివ కోచ్ అవుతాడు..

పిల్లల్ని ట్రైనింగ్ ఇస్తూ … పక్కన ఉమ ఉంటుంది.

ఉమ: “నువ్వు గెలిచావ్ శివ… ఇప్పుడు గెలిపించే కోచ్ అయ్యావు.”

శివ: అవును ఉమా. నేను నా దేశం కోసం పరిగెతలేకపోయాను. కానీ నాకు బాధ లేదు. నేను శిక్షణ ఇచ్చిన నా ట్రైనర్ నీ దేశం కోసం పరిగెతేలగా చేస్తాను.”

శివ చేతిలో వల్లా నాన్న ఫోటో ఉంటుంది, డానిపైనా ఇలా రాసి ఉంటుంది: 

“నీ కల నాతో ఉంది నాన్నా… ఇప్పుడు వందల కలలు నాతో నడుస్తున్నాయి.”

నూతన ప్రయాణం మొదలు... 

Comments

Popular posts from this blog

పెళ్లిగోల

నీతోనే ఉంటాను .... ఎప్పటికైనా

Leelabhinaya

A Journey of Love

నేను నిన్ను ప్రేమిస్తాను

ఉత్కంఠ

అమ్మాయిలు అబ్బాయిలు

Life with Wife

Life with Wife - Chapter 2

లీలాభినయా