శివశక్తి
ఆ ఉదయం శివ ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది.
శివ లెటర్ ఓపెన్ చేసి చూసాడు.
"కాంగ్రాట్స్ శివ… యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ పోలీస్ సర్వీస్" అని ఆ లెటర్ లో ఉంది.
ఆ క్షణంలో శివ కి మాట రాలేదు. కళ్ళలో నీళ్లు తిరిగాయి.
"ఏమైంది రా?" అని అమ్మ అడిగింది.
"అమ్మ… నేను పోలీసు ఉద్యోగం కి సెలెక్ట్ అయ్యాను" అని శివ చెప్పగానే, అమ్మ కళ్ళలో ఆనందం పొంగింది.
నాన్న గర్వంగా అన్నాడు "ధర్మంగా పని చెయ్ నాన్న. అదే మా కోరిక" అని.
శివ మనసులో ఒక్కటే మాట, "ఇది నా జీవితానికి ఆరంభం". కాని అతనికి తెలియదు… ఇది అతని జీవితానికి కాదు, ఒక కథకి ఆరంభం అని.
పోలీస్ జాబ్ వచ్చిన ఆనందం లో శివ కేదార్ నాథ్ దర్శనం కి బయలుదేరుతాడు.
మంచు కొండలు… ఆకాశాన్ని తాకే శిఖరాలు… హిమగాలిలో శివ నామస్మరణ. ప్రతి అడుగులో ఏదో తెలియని ఆకర్షణ శివని ముందుకు నడిపింది.
యాత్ర మధ్యలో ఒక చోట శివ ఆగాడు. రోడ్డు పక్కన ఏడుస్తున్న ఓ చిన్న పాప ని చూసాడు.
చుట్టూ ఎవరు లేరు. చలితో వణుకుతూ ఉంది ఆ పాప.
"ఎందుకు ఏడుస్తున్నావు తల్లి?" అని శివ అడిగాడు. పాప మాటలేకుండా ఏడుస్తూనే ఉంది.
ఆమెను ఎత్తుకుని శివు ఓదార్చాడు. తన ఇల్లు ఎక్కడ అని అడిగి ఇంటివరకు తీసుకెళ్లాడు.
పాప తల్లి కన్నీళ్లతో శివని చూసి, "శివ… నువ్వు దేవుడు పంపినవాడివి, మా పాపని ఇంటికి తీసుకొని వచ్చావ్" అని అంది.
ఆ మాటలు శివ గుండెల్లో బలంగా నిలిచిపోయాయి.
యాత్ర చివరి రోజు… శివకి అక్కడ ఉన్నా అడవి లోపల నుంచి ఏదో పిలుపు వినిపించినట్టు అనిపించింది.
శివ లోపలికి వెళ్ళాడు. అడవిలో ఒక పురాతన గుహ. లోపల అడుగుపెట్టగానే నిశ్శబ్దం. మధ్యలో వెలుగుతున్న ఒక మహిమాన్విత శివలింగం.
శివకి తెలియకుండానే అతని చేతులు ముందుకు వెళ్లాయి. లింగాన్ని తాకాడు.
ఆ క్షణంలోనే శివ కి భవిష్యత్తు కళ్ళ ముందు కదిలింది. మంటలు… ప్రమాదాలు… ఓ గ్రామం వినాశనం…
"ఇది ఏమిటి?" అని శివ గుండె దడపడింది. నిజమో, కలో అర్థం కాలేదు.
శివ ఆ గుహ నుండి బయటకి ఒచ్చేసాడు. ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు.
తిరుగు ప్రయాణంలో బస్ స్టాప్ దగ్గర శివ బస్సు కోసం చూస్తు ఉన్నాడు.
అప్పుడే శివ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి సహాయం చెయ్యండి, నన్ను వాళ్ళు ఏడిపిస్తున్నారు అని అంటుంది.
ఆ అమ్మాయి కళ్ళలో ప్రశాంతత. ముఖంలో దైవకాంతి.
ఆ అమ్మాయి కి సహాయం చేయడనికి, శివ ఆ అమ్మాయిని తనతో తీసుకెళ్లి బస్సు ఎక్కాడు.
తను ఎవరు, పేరు ఏంటి అని శివ అడిగాడు.
"నా పేరు భ్రమరాంబ, హైదరాబాద్ నుండి వచ్చాను. నేను ఒక బ్లాగర్, నా కేదార్ నాథ్ ట్రిప్ నీ రికార్డ్ చేసి బ్లాగ్ చేయడనికి వచ్చాను" అని ఆమె చెప్పింది.
భ్రమరాంబ: సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు ఎక్కడకి వెళతారు.
హైదరాబాద్ అని శివ చెప్తాడు.
భ్రమరాంబ: నేను మీతో రావోచా. నేనూ హైదరాబాద్ వెల్లాలి.
సరే అని శివ అంటాడు.
ప్రయాణంలో శివ ఇంకా భ్రమరాంబ ఎప్పటి నుంచో కలిసి ఉన్నా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. తనకి అమ్మ నాన్న ఎవరు లేరు అని హాస్టల్ లో ఉన్నా అని భ్రమరాంబ అంటుంది.
తన ఇంటికి రమ్మని శివ, భ్రమరాంబ తో అంటాడు.
సరే అని భ్రమరాంబ, శివతో ఇంటికి వెళుతుంది.
ఇంటి దగ్గర:-
శివ తో భ్రమరాంబ ని చూడగానే అమ్మ షాక్ అవుతుంది.
ఎవరు ఈ అమ్మయి అని అడుగుతుంది. శివ జరిగింది చెప్పి భ్రమరాంబ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది అని చెప్తాడు.
అమ్మా నాన్న కూడా సరే అని చెప్తారు.
భ్రమరాంబ ఇంట్లో అమ్మాయి లాగా అమ్మ నాన్నతో కలిసిపోయింది. ఉదయం అమ్మతో కలిసి వంటింట్లో పని చేయడం… ఇంట్లో పని చూసుకోవటం.
మరోవైపు, శివ పోలీస్ స్టేషన్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యాడు. యూనిఫాం వేసుకున్న రోజు నాన్న కళ్ళలో గర్వం, అమ్మ కళ్ళలో ప్రార్థన.
"ఇప్పటినుంచి నీది ఒక్క జీవితం కాదు,ప్రజల జీవితాలు కూడా నీ భాధ్యత." అని నాన్న అన్నాడు.
"ధర్మం తప్పను నాన్న" అని శివ నిశ్చయంగా చెప్పాడు.
ఒక రోజు… వర్షం పడుతున్న సాయంత్రం. శివ, భ్రమరాంభ మేడపై నిలబడి ఉన్నారు.
"నీకు ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు కదా?" అని శివ అడిగినప్పుడు,
"ఇక్కడ ఇబ్బంది లేదు… కానీ వెళ్లాల్సిన బాధ ఉంది" అని భ్రమరాంబ నెమ్మదిగా అంది.
శివ ఆ మాట అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఆమె మాటల్లో ఏదో దూరమవుతున్న బాధ కనిపించింది.
"నువ్వు పోలీస్ అయ్యాక భయమేమీ అనిపించలేదా?" అని భ్రమరాంబ అడిగింది.
"భయం వేసింది… కానీ ధర్మం కోసం నిలబడితే భయం కూడా దారి ఇస్తుంది" అన్నాడు శివ.
తర్వాత రోజు భ్రమరాంబ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆ రాత్రి నుంచే శివ జీవితంలో అనుకోని పరిస్థితులు మొదలైయాయి.
శివకి ఒక కల వచ్చింది, ఆ కలలో అమ్మ నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోతారని కనిపించింది.
ఉదయం అమ్మ నాన్న బయటకి వెలదాం అని రెడీ అవుతారు "ఈ రోజు బయటికి వెళ్లొద్దు" అని శివ గట్టిగా చెప్పాడు.
శివ ఎం చెప్తున్నాడు, అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని ఎవరికి అర్దం కాదు.
కొన్ని గంటల తరువాత అదే రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగిందన్న వార్త వచ్చింది.
శివ కళ్ళలో కన్నీళ్లు,"దేవుడా… కాపాడావు," అని మనసులో అనుకున్నాడు.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత శివ కి మళ్ళీ ఒక కల ఒస్తుంది. మంటల్లో ఒక పాఠశాల ఉన్నటు.
స్కూల్ లో అగ్ని ప్రమాదం జరగబోతోంది అని స్కూల్ వారికి హెచ్చరించాడు. కని స్కూల్ వాళ్ళు ఎవరు నమ్మారు.
కొద్ది గంటలోనే స్కూల్లో మంటలు అని అగ్నిమాపక కేంద్రం ఇంకా పోలీస్ స్టేషన్ ఫోన్ వస్తుంది.
శివ అక్కడికి వెళ్ళి మంటల్లోకి దూకి "భయపడొద్దు… నేను ఉన్నాను," అని పిల్లల్ని ఒక్కొక్కరిని బయటకు తిసుకోస్తాడు.
ఆ రోజు శివ ఒక పోలీస్ మాత్రమే కాదు… రక్షకుడయ్యాడు.
"ఈ కలలు ఎందుకు వస్తున్నాయ్, ఇది సంకేతమా లేదా ఏదైనా శక్తి ఆ" అని శివ ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడే శివ కి భ్రమరాంబ ఫోన్ చేసి ఒక్కసారి కలవాలి, కాఫీ షాప్ లో కల్లుదామ అని అడుగుతుంది.
శివ సరే అని అంటాడు
కాఫీ షాప్ లో:
శివ ఇంకా తనకి ఆ కలలు ఎందుకు వస్తున్నాయ్ అని ఆలోచిస్తూనే ఉంటాడు.
ఏమైంది శివ అని భ్రమరాంబ ఆమె అడిగినప్పుడు, శివ తనకీ ఒచ్చే కలలు గురించి చెప్తాడు.
"నీతో ఒక విషయం చెప్పాలి" అని భ్రమరాంబ అంటుంది.
భ్రమరాంబ మట్లాడుతు:
నాది హైదరాబాద్ కాదు, కేదార్ నాథ్ లో ఒక చిన్న గ్రామం. మా గ్రామం శివభక్తి కి ప్రసిద్ధి. కొన్ని సంవత్సరాల క్రితం మా గ్రామం పెద్ద, తన అహంకారంతో శివాలయాన్ని అవమానించాడు.
అలయలు ద్వంసం… భక్తుల అవమానం… ధర్మ విరోధం చేసాడు. అప్పటినుండి మా గ్రామానికీ శాపం తగిలింది. ఆ గుడి ఒక గుహ లా మారిపోయింది. ఆ గుహ లోకి ఎవరు వెళ్ళలేక పోయారు.
ఆ శాపం వల్ల వరుసగా వరదలు… వ్యాధులు… మరణాలు. గ్రామం ఖాళీ అవుతు వచ్చింది.
'ధర్మాన్ని తిరిగి నిలబెట్టే ఒక మానవుడు వచ్చే వరకు, ఈ గ్రామం కష్టాల నుంచి బయటపడదు' అని ఒక మహా సదువు చెప్పారు, సమయం వచ్చినప్పుడు రక్షకుడిని ఆ శివయ్య పంపిస్థాడు అని చెప్పారు.
ఆ రోజు నువ్వు గుహ నుండి బయటికి రావటం నాతో పాటు మా గ్రామస్తులు కూడా చూసారు. అ సదువు చెప్పిన రక్షకుడివి నువ్వే అని, నిన్ను ఎలా అయినా మా గ్రామం కి తీసుకొని వెళ్ళాలి అని నీతో పాటు నేను వచ్చాను.
ఈ మహా శివరాత్రికి మా గ్రామం గుహలో ఉన్నా శివయ్య కి శివాభిషేకం జరగకపోతే మా గ్రామం అక్కడ ఉండదు. శాపం వల్ల గ్రామానికీ సంబంధం ఉన్న వారు అందరు చనిపోతారు. మీ అమ్మ గారితో సహా.
శివ షాక్ అయ్యాడు అతనికి ఏమీ అర్థం కాలేదు! మా అమ్మ?
మీ అమ్మ కూడా మా గ్రామానికీ సంబంధించిన వారు. ఈ విషయం మీ ఇంటికి వచ్చాక అమ్మ తో మట్లాడాక నాకు నాకు అర్థమైంది.
మీ అమ్మ ఎవరో కాదు మా గ్రామం పెద్ద కూతురు, అంటే అలయలు ద్వంసం చేసిన గ్రామ పెద్ద కూతురు. మా గ్రామం పెద్ద చనిపోయాక మా గ్రామస్థులు అందరు కలిసి మీ అమ్మ ని గ్రామానికీ దూరం గా పంపించారు.
ఇ మాట వినగానే శివ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగింది అని అమ్మ ని అడిగాడు.
అమ్మ మాట్లాడుతు "తను చెప్పింది నిజమే శివ నేను అ గ్రామం నుండి వెలివేయబడిన దానిని. ఎ దిక్కు తోచక ఉన్నా నన్ను మీ నాన్న చుసారు. అప్పటికే నేను మీ నాన్నతో నా పెళ్లి కాయం చేసారు. నా పరిస్థితి అర్థం చేసుకోని నన్ను వివాహం చేసుకున్నారు మీ నాన్న.
నేను ఆ గ్రామం గురించి మరిచిపోయి నువ్వు ఇంకా మీ నాన్న ప్రపంచం గా బ్రతుకుతున్నాను..
కని మా నాన్న చేసిన తప్పు సరిదిదడానికి నువ్వు నాకు జన్మించావ్ అంటే ఇది అంతా ఆ శివయ్య లీల.
నీ ధర్మాన్ని నెరవేర్చడానికి నువ్వు ఎంచుకోబడ్డావు శివ" అని అమ్మ చెప్తుంది.
చివరికి శివ కి నిజం తెలిసింది. ఆ గుహ లో ఉన్నా శివలింగమే అతనికి ‘శివశక్తి’ని ప్రసాదించింది. అది జీవాన్ని రక్షించడానికి ఇచ్చిన దైవశక్తి.
కానీ ఆ శక్తికి ఒక నియమం ఉంది తన చివరి లక్ష్యం నెరవేరే వరకే అది పనిచేస్తుంది అని.
అందరు కలిసి ఆ గ్రామానికి వేలాతారు. శివ రాత్రి రోజు, శివ ఒక్కడే ఆ గుహలోకి వెళతాడు. నిష్టగా ఆ శివయ్య కి అభిషేకం చెస్తాడు.
శివ చేసిన పూజ, త్యాగం, ధర్మబలం కలిసి ఆ శాపాన్ని శాంతింపజేశాయి.
ఆ రోజు గ్రామం మళ్లీ జీవించింది, రక్షించబడింది. ఆ రోజు రాత్రి… గ్రామ శివాలయంలో దీపారాధన. గ్రామం మొతం శివ భక్తితో వెల్లు విరిసింది.
శివ కళ్ళు మూసుకుని నమస్కరించాడు. భ్రమరాంబ అతని పక్కనే నిలబడి ఉంది.
గ్రామం శాపం తొలగించబడింది అదే సమయం లో భ్రమరాంబ తన మనసులో ఉన్న ప్రేమ విషయం శివ కి చెప్పింది.
అప్పుడే శివానుగ్రహం లాగా వర్షం మొదలైంది. ఆ వర్షపు చుక్కలు వారి ప్రేమకు సాక్ష్యమయ్యాయి.
శివ జీవితం ఆమె అయ్యింది. ఆమెకు శివే లోకం అయ్యాడు.
అమ్మ నాన్నల ఆశీర్వాదం. గ్రామస్తుల ఆనందం.
ఆకాశంలో మేఘాలు తొలగిపోయాయి. శివలింగం నుండి ఒక్క వెలుగు కిరణం భూమిపై పడింది.
దైవశక్తి నెమ్మదిగా శివను విడిచింది… కానీ శాంతి మాత్రం అతని హృదయంలో మిగిలింది. అతను తన ధర్మాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు.
శివ మనసులో ఒక మాట మాత్రమే మిగిలింది.
శక్తి రావడం గొప్ప కాదు… ఆ శక్తిని ధర్మం కోసం వాడటమే గొప్ప.
...ఓం నమః శివాయ...
Please Share Like and Comment.
Your feedbacks are precious to me.

Comments