ఆయుధ్...
“దేశాన్ని కాపాడే సైనికులు ఉంటారు…
ప్రాణాలను కాపాడే వైద్యులు ఉంటారు…
కానీ మరణం లాంటి వైరస్ ప్రపంచాన్ని తాకితే…
గన్ కూడా సరిపోదు…
ఆ సమయంలో…
ఒక డాక్టర్… ఒక సైనికుడి ప్రాణాన్ని కాపాడే ఆయుధంగా మారితే…
కథ ప్రారంభం:
భార్గవ్, కార్తిక్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఒకే స్కూల్… ఒకే బెంచ్… పక్కపక్కనే ఇళ్లు. వాళ్ల కాలనీలో ఇద్దరూ క్రికెట్ ఆడుతున్నారు.
భార్గవ్: “కార్తిక్… ఫాస్ట్ బాల్ వేయ్ రా!”
కార్తిక్: “ఫాస్ట్‌గా వేస్తే నువ్వు సిక్స్ కొడతావ్, అది మళ్లీ శర్మ అంకుల్ ఇంటి విండోకి తగిలి బ్రేక్ అవుతుంది రా.”
భార్గవ్: “పర్లేదు రా నువ్వు బాల్ వేయ్!”
కార్తిక్ బాల్ వేస్తాడు. భార్గవ్ బలంగా షాట్ కొడతాడు. బాల్ డైరెక్ట్‌గా శర్మ అంకుల్ విండోకి తగిలి గాజు పగిలిపోతుంది.
కార్తిక్: “అయ్యో! చెప్పా కదా రా!”
శర్మ అంకుల్ బయటకి వస్తారు.
శర్మ అంకుల్: “మళ్లీ మీ ఇద్దరే కదా!”
భార్గవ్: “సారీ అంకుల్… నెక్స్ట్ టైమ్ జాగ్రత్తగా ఆడతాం.”
భార్గవ్ (నెమ్మదిగా): “నెక్స్ట్ టైమ్ అంటే రేపు మళ్లీ ఆడతాం అన్నమాట.”
శర్మ అంకుల్ సీరియస్‌గా చూస్తారు…
కొన్ని సంవత్సరాల తర్వాత…
భార్గవ్, కార్తిక్ ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. ఒక రోజు టీ స్టాల్ దగ్గర కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
భార్గవ్: “కార్తిక్… లైఫ్‌లో ఒకసారి అయినా హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలి రా… అదీ కూడా బైక్ మీద.”
కార్తిక్: “బైక్ ఆ? వేల కిలోమీటర్లు రా.”
భార్గవ్: “లైఫ్‌లో కొన్ని జర్నీలు డిస్టెన్స్ కోసం కాదు… మెమరీస్ కోసం వెళ్తారు రా.”
కార్తిక్: “ఓకే రా… నేను రెడీ. కానీ మనం ఇక్కడి నుంచి బైక్ మీద కాదు… అక్కడికి వెళ్లాక బైక్ రెంటల్ తీసుకుని ఎంజాయ్ చేద్దాం రా.”
భార్గవ్: “సరే రా… నువ్వు ఒప్పుకున్నావ్ అంటే నాకు హ్యాపీ.”
కొన్ని రోజులు తర్వాత ఇద్దరూ ట్రిప్‌కి బయలుదేరుతారు.
లాంగ్ రోడ్స్… కొండలు… చల్లని గాలి. భార్గవ్ చాలా ఎగ్జైటెడ్‌గా చూస్తాడు.
భార్గవ్: “లైఫ్‌లో బెస్ట్ ట్రిప్ ఇదిరా!”
టీ స్టాల్ దగ్గర బైక్ ఆపుతారు.
అక్కడ కొంతమంది ఆర్మీ సైనికులు కనిపిస్తారు.
భార్గవ్ వాళ్లను చూస్తూ సైలెంట్‌గా ఉండిపోతాడు.
కార్తిక్: “ఏమైంది రా?”
భార్గవ్: “వాళ్లను చూస్తుంటే చాలా గౌరవంగా అనిపిస్తుంది.”
కార్తిక్: “అవును రా… వాళ్లు దేశం కోసం ప్రాణాల్ని రిస్క్ చేస్తారు. ఇన్‌స్పైరింగ్ పీపుల్.”
భార్గవ్: “దేశం కోసం సర్వ్ చేయాలి అనిపిస్తుంది… నాకు కూడా అలాంటి లైఫ్ కావాలి అనిపిస్తుంది రా.”
కార్తిక్: “ఆర్మీ ఆ?”
భార్గవ్: “అవును.”
కార్తిక్ కొంచెం సైలెంట్ అవుతాడు… తర్వాత స్మైల్ చేస్తాడు.
కార్తిక్: “ట్రై చేయ్ రా… నేను ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తా.”
భార్గవ్ ఆర్మీ సెలెక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతాడు. రెండు సంవత్సరాల తర్వాత…
భార్గవ్: “కార్తిక్! ఆర్మీలో సెలెక్ట్ అయ్యా!”
కార్తిక్: “నిజంగా ఆ?!”
భార్గవ్: “అవును రా!”
రెండు ఫ్యామిలీస్ చాలా సంతోషపడతాయి. భార్గవ్ ఆర్మీ కి వెళ్తాడు.
సెండ్ ఆఫ్ టైమ్…
భార్గవ్: “నా ఫ్యామిలీని చూసుకో రా.”
కార్తిక్: “ఇది మన ఫ్యామిలీ రా… నేను చూసుకుంటా. నువ్వు జాగ్రత్త.”
భార్గవ్ ఆర్మీలో చేరిన తర్వాత… కార్తిక్ రెండు కుటుంబాలకు అండగా ఉంటాడు.
శిక్షణ పూర్తి అయ్యకా, భార్గవ్ హిమాచల్ ప్రదేశ్‌లోని త్రిశూల్ మౌంటైన్ బేస్‌లో పోస్టింగ్ అవుతాడు.
మంచుతో కప్పుకున్న కొండల మధ్య ఉన్న సీక్రెట్ ఆర్మీ బేస్.
కమాండర్: “త్రిశూల్ మౌంటైన్ బేస్‌కి స్వాగతం సైనికులారా… ఇది హిమాచల్ ప్రదేశ్‌లో మన అత్యంత స్ట్రాటజిక్ బేస్.”
కొన్ని నెలాల తర్వాత భార్గవ్ ఒక స్పెషల్ మిషన్‌కి సెలెక్ట్ అవుతాడు.
కమాండర్: “సోల్జర్ భార్గవ్… మీకు ఒక స్పెషల్ మిషన్ అసైన్ చేస్తున్నాం. మిషన్ పేరు ‘డేర్ డెవిల్స్’.”
“హిమాచల్ కొండల్లో ఒక అబాండండ్ ప్లేస్ ఉంది. అక్కడ ఒక డేంజరస్ క్రియేచర్ ఉంది. అక్కడికి వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి రాలేదు.”
భార్గవ్: “క్రియేచర్ ఆ సర్?”
కమాండర్: “అవును. ప్రభుత్వానికి ఆ ప్రదేశం చాలా ముఖ్యమైనది. అక్కడ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్లానింగ్ ఉంది. కానీ ఆ క్రియేచర్ వల్ల ఎవరూ అక్కడ సర్వైవ్ అవ్వలేకపోతున్నారు.”
కమాండర్ (సీరియస్‌గా): “మీ టీమ్ ఆ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించాలి.”
భార్గవ్: “Yes sir!”
భార్గవ్ తన టీమ్‌తో కలిసి కొండల్లో ఉన్న ఆ అబాండండ్ ప్లేస్‌కి బయలుదేరుతాడు.
లొకేషన్‌కి చేరుకున్నాక, భార్గవ్ టీమ్‌తో నడుస్తూ ఉండగా ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తుంటాయి…
ఒక సైనికుడు: “ఈ ప్రదేశం చాలా డేంజరస్‌గా ఉంది.”
ఒక గేట్ కనిపిస్తుంది. గేట్ మీద బోర్డు:
“Biotech Research Facility” అని ఉంటుంది.
లోపలికి వెళ్తారు. లైట్లు ఫ్లికర్ అవుతుంటాయి. రక్తపు మరకలు… పగిలిన గాజు… రీసెర్చ్ ఫైల్స్ కనిపిస్తాయి.
ఒక సైనికుడు: “ఇక్కడ ఏమి జరిగిందో అర్థం కావడం లేదు.”
ప్రదేశం మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. భార్గవ్ అక్కడ ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న రీసెర్చ్ పేపర్స్, డాక్యుమెంట్స్ చూసాక విషయం తెలుస్తుంది.
ఒక సైంటిస్ట్ అక్రమంగా బయోలాజికల్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తాడు.
ఎక్స్‌పెరిమెంట్ తప్పిపోవడంతో సైంటిస్ట్ ఒక మాన్స్టర్‌లా మారిపోతాడు.
ఆ రీసెర్చ్ పేపర్స్, డాక్యుమెంట్స్ తీసుకుని భార్గవ్ బయటకి వస్తాడు.
ప్రదేశం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అకస్మాత్తుగా డార్క్ కార్నర్ నుంచి ఒక క్రియేచర్ అటాక్ చేస్తుంది.
భార్గవ్: “ఫైర్! ఫైర్!”
రెండు క్రియేచర్స్ పడిపోతాయి.
కానీ వెనుక నుంచి ఇంకా క్రియేచర్స్ వస్తాయి… అవి జాంబీస్‌లా ఉంటాయి.
ఫైరింగ్ మధ్యలో సైంటిస్ట్ రికార్డ్ చేసిన ఒక వీడియో ప్లే అవుతుంది.
సైంటిస్ట్ రికార్డింగ్:
“మనం విఫలమయ్యాం.”
“ప్రయోగం విఫలమైంది.”
“ వైరస్ సోకిన మనుషులు దూకుడు స్వభావం గల జీవులుగా మారతారు.”
“జీవి కరిస్తే వ్యాపిస్తుంది.”
అది చూసిన టీమ్ షాక్ అవుతుంది.
అకస్మాత్తుగా ఒక జాంబీ భార్గవ్‌ను చంపడానికి దూసుకొస్తుంది. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. చివరికి భార్గవ్ ఆ జాంబీని చంపేస్తాడు. కానీ ఆ ఫైట్‌లో జాంబీ భార్గవ్‌ను స్వల్పంగా కొరుకుతుంది. అది భార్గవ్ గమనించడు.
భార్గవ్ ఎక్స్‌ప్లోజన్ సెట్ చేస్తాడు. తన ప్లాన్ ప్రకారం అన్ని జాంబీలను ఆ ఎక్స్‌ప్లోజన్ దగ్గరికి తీసుకువస్తాడు.
పెద్ద పేలుడు జరుగుతుంది. అన్ని జాంబీలు చనిపోతాయి.
మిషన్ సక్సెస్ అవుతుంది. కానీ అసలు ప్రమాదం భార్గవ్ శరీరంలో ప్రారంభమవుతుంది.
మిషన్ సక్సెస్ అయిన తర్వాత భార్గవ్ మరియు టీమ్ త్రిశూల్ మౌంటైన్ బేస్‌కి తిరిగి వస్తారు.
కమాండర్ టీమ్‌ను అభినందిస్తాడు.
కమాండర్: “గుడ్ జాబ్ సైనికులారా. మిషన్ డేర్ డెవిల్స్ సక్సెస్.”
అందరికీ రిలీఫ్‌గా అనిపిస్తుంది.
రాత్రి సమయం.
భార్గవ్ బ్యారక్స్‌లో కూర్చొని తన చేతిని చూస్తాడు.
అకస్మాత్తుగా చేతిలో ఉన్న చిన్న గాయం నొప్పి మొదలవుతుంది.
భార్గవ్: “వింతగా ఉంది…”
అతను అద్దం దగ్గరకు వెళ్తాడు. కళ్లలో కొంచెం ఎరుపు కనిపిస్తుంది.
భార్గవ్: “మిషన్‌లో స్క్రాచ్ అయిందనుకుంటా…” అని అనుకుంటాడు.
మరుసటి రోజు భార్గవ్ ఇంటికి వెళ్తాడు.
మొదటి నాలుగు రోజులు నార్మల్‌గా ఉంటాడు. తర్వాత రోజు నుంచి గాయం నొప్పి పెరుగుతుంది. ఎందుకు నొప్పి వస్తుందో అతనికి అర్థం కాదు. అద్దం ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు.
అకస్మాత్తుగా అతని మనసులో ఫ్లాష్‌బ్యాక్.
జాంబీ అటాక్ సీన్… జాంబీ పళ్ళు తనను తాకిన క్షణం గుర్తుకు వస్తుంది.
భార్గవ్ షాక్‌లో: “Oh no…”
తన చేతిలో ఉన్న గాయాన్ని చూస్తాడు.
ఆ గాయం నల్లగా మారడం ప్రారంభమవుతుంది.
అతని శ్వాస వేగంగా మారుతుంది.
భార్గవ్ శరీరంలో మార్పులు మొదలవుతాయి.
జ్వరం… కళ్లలో మార్పులు… కోపం అదుపులో ఉండదు… శరీర నొప్పులు.
అద్దంలో చూసి భార్గవ్ షాక్ అవుతాడు. వెంటనే కార్తిక్ దగ్గరకు వెళ్లి చెబుతాడు.
భార్గవ్: “కార్తిక్… నాకు సమస్య మొదలైంది.”
కార్తిక్: “ఏమైంది? ఏ సమస్య రా?”
భార్గవ్ జరిగిన విషయం చెబుతాడు. కార్తిక్ సీరియస్‌గా పరీక్షిస్తాడు.
కార్తిక్: “ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతోంది.”
భార్గవ్: “నాకు టైమ్ ఎక్కువగా లేదు అనిపిస్తోంది.”
కార్తిక్: “నువ్వు కంగరుపడకు… నేను నిన్ను కాపాడుతాను.”
కార్తిక్ ఒక ఆయుర్వేద డాక్టర్. తన ఆయుర్వేద జ్ఞానం మొత్తం ఉపయోగిస్తాడు.
పుస్తకాలు చూస్తాడు… మందులు ట్రై చేస్తాడు.
తర్వాత తన తాతగారి గదిలో ఉన్న తాళపత్ర గ్రంథాలు చూస్తాడు.
కొన్ని గంటల తర్వాత ఒక పరిష్కారం దొరుకుతుంది.
కార్తిక్ భార్గవ్ దగ్గరకు వస్తాడు.
కార్తిక్: “గుడ్ న్యూస్.”
భార్గవ్: “ఏమైంది?”
కార్తిక్: “ఇది ఎర్లీ స్టేజ్‌లో ఉంది. క్యూయర్ సాధ్యం.”
భార్గవ్: “ఎలా?”
కార్తిక్: “కేరళకి వెళ్లాలి. నా గురువు గారు హెల్ప్ చేస్తారు. కానీ ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మందు తీసుకోవాలి.”
వెంటనే ఇద్దరూ కేరళకి వెళ్తారు.
అడవి మధ్యలో ఉన్న ఆయుర్వేద ఆశ్రమంలో కార్తిక్ తన గురువుగారిని కలుస్తాడు.
“గురువుగారు… నా ఫ్రెండ్ లైఫ్ డేంజర్‌లో ఉంది” అని చెబుతాడు.
గురువు భార్గవ్‌ను పరీక్షిస్తారు.
కొన్ని రోజులు స్పెషల్ ట్రీట్మెంట్ ప్రారంభమవుతుంది.
హెర్బల్ మెడిసిన్స్… డిటాక్స్ థెరపీ… ప్రాచీన చికిత్సలు జరుగుతాయి.
మెల్లగా భార్గవ్ శరీరం నార్మల్ అవ్వడం ప్రారంభమవుతుంది.
కొన్ని వారాల తర్వాత భార్గవ్ పూర్తిగా కోలుకుంటాడు.
భార్గవ్ భావోద్వేగంగా కార్తిక్‌ను చూస్తాడు. ఇద్దరూ మళ్లీ ఇంటికి తిరిగి వస్తారు.
కొన్ని రోజుల తర్వాత భార్గవ్ మళ్లీ ఆర్మీకి వెళ్తాడు.
జీప్ స్టార్ట్ అవుతుంది.
భార్గవ్ కార్తిక్‌ను చూసి స్మైల్ చేస్తాడు.
కార్తిక్ కూడా స్మైల్ చేస్తాడు.
ముగింపు...

Comments