రచన
ఇప్పుడూ మీరు చదవబోయే, చూడబోయే కథ చాలా భావోద్వేగంతో కూడిన, హృదయాన్ని తాకే కథ. ఇందులో ప్రేమ, నమ్మకం, త్యాగం, బాధ, బాధ్యత అన్నీ ఒకే గమనంలో ఉంటాయ్.
ముఖ్యంగా కథానాయకి పాత్ర బలంగా నిలుస్తుంది "చిన్న వయసులోనే తల్లిదండ్రుల తల్లితండ్రులను కోల్పోయి తర్వాత అక్క చేత పెరిగి, ప్రేమలో పడిన తర్వాత ఎదురైన మోసాన్ని అధిగమించి, చివరకు తల్లి కాబోతున్న స్థితిలో కూడా జీవితం కోసం పోరాడే ధైర్యవంతురాలి కథ.
డబ్బు, పరువు కన్నా మనుషుల విలువ గొప్పది అన్న సందేశాన్ని అందిస్తుంది ఇ కథ".
కథ ప్రారంభం:-
రచన MBBS చదువుతు, హైదరాబాద్ హాస్టల్‌లో ఉంటోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రచనను ఆమె అక్క రాణి ఎంతో ప్రేమతో చూసుకుంటూ చదివిస్తుంది.
వేసవి సెలవుల సమయంలో రచన తన అక్క ఇంటికి వస్తుంది.
అక్క ఇంట్లో:
రచన: “నమస్కారం బావగారూ! ఎలా ఉన్నారు?” అని అడుగుతుంది.
శరత్: “హే! రచన! బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు?”
రచన: “నేను బాగున్నాను!”
అక్కను గురించి అడగబోయేలోపు, రాణి వస్తుంది.
రచన: “అక్కా! నువ్వు బాగున్నావా?”
రాణి: “బాగున్నా. నీ చదువు ఎలా సాగుతోంది? హాస్టల్లో ఇబ్బందులేమీ లేవుగా?”
రచన: "ఏమీ ఇబ్బంది లేదు. ఆనందంగా చదువుతున్నాను."
రాణి: “ఓహ్! బాగుంది. రా, నీ గదిని చూపిస్తా.”
అధే రాత్రి రాణి, శరత్‌తో మాట్లాడుతూ “మనకు పిల్లలు లెరు, రచనని మన కూతురిలా చూసుకుందాం అండి.”
శరత్: “నువ్వు చెప్పింది నేనెప్పుడూ అంగీకరిస్తాను. ని ఇష్టం ఏ నా ఇష్టం.”
మరుసటి రోజు:
రచన: అక్క, ఈసారి నువ్వు నాకు వంట నేర్పించాలి. ప్రతి సరి నువ్వు చిన్న పిల్లవి నేను ఉన్న కదా నీకు ఎందుకు ఈ పనులు అని నాకు ఏ పని చెప్పావు ఈ సరి నువ్వు నాకు నేర్పిస్తున్నావు నేను నేర్చుకుంటాను.
రాణి: “సరే, ఈసారి ఖచ్చితంగా నేర్పుతాను.”
రచన: “అయితే ఈరోజు నేను వంట చేస్తాను!”
అక్కచెల్లెళ్ళు కలిసి వంట మొదలెడతారు. రచన నెమ్మదిగా అన్ని పనులూ నేర్చుకుంటుంది.
ఒక వారం గడుస్తుంది:
ఒకరోజు వంట చేస్తుండగా రచన ఒక్కసారిగా వాంతి చేస్తుంది. రాణి వెంటనే శరత్‌కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెబుతుంది.
శరత్ ఇంటికి వచ్ఛక ముగ్గురు కలిసి ఆసుపత్రికి వెళతారు.
డాక్టర్ పరీక్షించి “రచన గర్భవతిగా ఉంది,” అంటారు.
డాక్టర్ చెప్పింది వినీ రాణి, రచనను కొడుతు 'హాస్టల్ లో ఉండి బుద్దిగా చదువుకుంటున్నావ్ అనుకుంటే నువ్వు చేసిన పని ఇదా, నాకు పిల్లలు లేకపోయినా నువ్వు ఉన్నావ్ అని సరిపెట్టుకున్న నాకు నువ్వు చేసేది ఇదా అని' రాణి రచనతో అంటుంది.
శరత్ ఆమెను ఆపుతాడు. ముగ్గురూ ఇంటికి తిరిగి వస్తారు.
ఇంట్లో:
శరత్: “ఎవడు వాడు? ఏమైందో చెప్పు.”
రచన: “తానా పేరు వరుణ్. మా సీనియర్. మా కాలేజీలో బెస్ట్ స్టూడెంట్. మొదటిసారి కాలేజీ వెల్కమ్ ప్రోగ్రాంలో చూసా.”
“ఒక రోజు స్పెషల్ క్లాస్ వల్ల లేటయ్యాను. ఆ సాయంత్రం కొంతమంది నాతో ఇంకా నా ఫ్రెండ్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు. అప్పుడే వరుణ్ వచ్చి మమ్మల్ని రక్షించి హాస్టల్‌కి తీసుకెళ్లాడు. అప్పుడే మా మధ్య స్నేహం మొదలైంది.”
“మెల్లిగా ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒకాసారి సీనియర్స్, జూనియర్స్ కలసి అరకు ట్రిప్‌కు వెళ్లాం.”
“ఆ రాత్రి పార్టీ చేసుకున్నం. నా ఫ్రెండ్ జ్యూస్ ఇచ్చింది. తాగిన తర్వాత నాకేమీ గుర్తు లేదు. ఉదయం లేచి చూశాను వరుణ్, నేను ఒకే రూంలో ఉన్నాం.”
“సాయంత్రానికి హాస్టల్‌కి వచ్చాం.”
“ఒకరోజు వరుణ్ గుడికి వెళదాం అని చెప్పాడు. మేము గుడికి వెళ్ళాక వరుణ్ నాకు తాళి కట్టాడు. అలా మేము పెళ్లి చేసుకున్నాము. ఎందుకు ఇలా చేశావని అడిగితే 'నాన్న ఒప్పుకోడు, అరకు లో జరిగినదాని తర్వాత ఇదే సరైనదని అనిపించింది' అన్నాడు.”
“ఇంకా రెండు నెలల తర్వాత మన కాలేజీ హాలిడేస్ నువ్వు ఇంటికి వెళ్లి మన పెళ్లి విషయం మీ అక్క బావ కి చెప్పు నేను మా నాన్నకి చెప్తాను'. అని వరుణ్ నాతో చెప్పడు. నేను నరే అని ఒప్పుకున్నా.”
“సెలవులు వచ్చాయి, నేను ఇక్కడికొచ్చాను, వరుణ్ తన ఇంటికి వెళ్లాడు.
మీకు జరిగింది చెప్పేలోపే ఇలా అయింది.”
శరత్: “వరుణ్ తల్లిదండ్రుల ఎక్కడ ఉంటారు? నేను మాట్లాడతాను.”
రచన అడ్రెస్ ఇస్తుంది. శరత్ వెళ్లి వారికి విషయం చెబుతాడు.
వరుణ్ తండ్రి: “అవును, వరుణ్ నాతో చెప్పడు. ఫైనల్ ఇయర్, సెలవులు కావడంతో ముంబైలోని తన మామ దగ్గర ప్రాక్టీస్‌కి వెళ్లాడు. వారం రోజుల్లో వస్తాడు. అప్పుడు మేము మీ ఇంటికి వస్తాము.”
ఒక నెల గడుస్తుంది. వరుణ్ నుంచి ఫోన్, వార్త ఏమీ లేదు. శరత్, రచన మళ్లీ వెళ్లి చూస్తారు.
వరుణ్ తండ్రి: “వరుణ్ ఇంకా రాలేదు.”
రచన:- ఫోన్ నెంబర్, లేదా ముంబై అడ్రెస్ ఇవ్వమని అడుగుతుంది.
అతను నెంబర్, అడ్రెస్ ఇస్తూ “వరుణ్ వాళ్ళా మామ బిజీ డాక్టర్. వెళ్లాక కాల్ చేయి” అంటాడు.
రచన అక్క, బావను ఒప్పించి ఒంటరిగా ముంబైకి వెళ్తుంది.
ముంబైకి వెళ్లి వరుణ్ వల్ల నాన్న ఇచ్చిన నంబర్ కి కాల్ చేస్తుంది రచన. “వరుణ్ క్లాసులో ఉన్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర వేచి ఉండండి. అరగంటలో వస్తాడు,” అని ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి అంటారు.
రైల్వే స్టేషన్ బయట వేచి ఉండగా కొంతమంది వ్యక్తులు రచనపై దాడి చేస్తారు. రచన పరుగెత్తుతుంటుంది, కానీ గర్భవతిగా ఉండటం వల్ల పరుగెత్తలేక ఎదురుగా వస్తున్న ఒక కారును ఆమె ఢీకొడుతుంది.
ఆ కారు లో ఉన్న వ్యక్తి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళతాడు. ఆమెకి స్పృహ వస్తుంది.
ఆ కారు లో ఉన్న వ్యక్తి ఏం జరిగింది అని అడుగుతాడు. రచన ముంబై ఎందుకు ఒచ్చింది, వచ్చాక ఏం జరిగింది అన్ని విషయాలు కాపాడిన వ్యక్తి కి చెప్తుంది.
మీకు ఏం భయం లేదు అ అడ్రస్ ఏంటో చెప్పండి నేను కనుకుంటాను అప్పటి వరకు మీరు మా ఇంట్లో ఉండండి.
నా పేరు అభిరామ్ మా ఇంట్లో మా అమ్మ , చెల్లి ఉంటారు మీకు తోడుగ ఉంటారు అని రచన తో చెప్తాడు.
రచన అడ్రెస్ చెబుతుంది. అభిరామ్ ఆ అడ్రెస్ వెతికితే ముంబైలో అలాంటి అడ్రెస్ లేదని తెలుస్తుంది.
అభిరామ్ అక్క సలహా మెరాకు ఒక మిత్రుని సహాయంతో ఫోన్ నెంబర్ ద్వారా అడ్రెస్ ట్రాకింగ్ చేస్తారు.
రచన, అభిరామ్ ఆ అడ్రెస్ కి వెళతారు. వెళ్లిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తే అ ఇంటి లోపలి వెళ్తారు. ఇంటి లోపల గదులు అన్ని చూస్తూఉండగా, ఒక గదిలో వరుణ్ ని చూసి రచన ఆశ్చర్యపోతుంది. వరుణ్ దగ్గరకి వెళ్లి గట్టిగా కౌగిలించుకుంటుంది తను తల్లి కాబోతున్నానని వరుణ్ తో రచన చెప్తుంది.
ఇంతలో ఇంటి లోపలికి వరుణ్ ని దాచిపెట్టినవారు ఓస్తు ఉంటారు.
అది చుసిన అభిరామ్ ఇక్కడికి ఎవరో వస్తున్నారు మనం వెళ్ళాలి అని చెప్తాడు.
ముగ్గురు కలిసి అ ఇంటినుండి పారిపోతుండగా దాచిపెట్టిన వారిలో ఒకరు చూసి పారిపోతున్న రచన వాళ్ళని పట్టుకుందాం అని మిగితా వాళ్ళకి చెప్తాడు. ఆ రౌడీలు అందరు రచన వాళ్ల వెంట పడతారు.
వెంట పడుతున్న వారిని గమనించిన అభిరామ్ వాళ్ళకి కనబడకుండా అక్కడే దాకుంటారు.
అప్పుడు రచన వరుణ్ తో మాట్లాడుతూ "ఎక్కడికి వెళ్లిపోయావ్ వరుణ్ నీకు ఎన్ని సార్లు ఫోన్ చేసా నీ నుండి సమాధానం లేదు మీ ఇంటికి వెళ్తే మీ నాన్న మా అబ్బాయి ముంబై లో ఉన్నాడు అని చెప్పారు అడ్రస్ తీసుకొని నీకోసం ముంబై వస్తే ఎవరో నన్ను చంపడానికి చూసారు.
సమయానికి అభిరామ్ గారు నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లరు. అభిరామ్ గారి సహాయం తోనే నువ్వు ఇక్కడ ఉన్నావ్ అని తెలుసుకున్న అని రచన వరుణ్ తో అంటుంది".
వరుణ్ మాట్లాడుతూ "నన్ను క్షమించు రచన అ రోజు నువ్వు ఇంటికి వెళ్ళాక నేను మా ఇంటికి వెళ్ళాను మన పెళ్లి విషయం మా నాన్న తో చెప్పను నాన్న మన పెళ్లి ఒప్పుకోలేదు.
అప్పటికే అయన బిజినెస్ పార్టనర్ కూతురితో నా పెళ్లి ఫిక్స్ చేసారు నేను ఒప్పుకోలేదు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకొను అని చెప్పను దానితో నాన్నకు కోపం ఒచ్చి మా నాన్న దగ్గర పనిచేస్తున్న వారితో నన్ను కిడ్నప్ చేయించి ఇక్కడ దాచిపెట్టారు.
నువ్వు ఇంటికి వస్తావ్ అని నాన్న ఊహించివుండరు నిన్ను అడ్డుతొలగించడానికి ముంబై కి రప్పించి చంపాలి అని అనుకున్నాడు అనుకుంట.
మా నాన్నకి ప్రాణం కంటే పరువు, డబ్బు ముఖ్యం. నేను ఒచ్చేసాను కదా మనం మీ ఇంటికి వెళ్లి అక్కడే ఉందాం.
నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఐపోయాయి జాబ్ కోసం ట్రై చేస్తాను మనం సంతోషంగా ఉండొచ్చు మీ అక్క బావ ఇంకా మనకు పుట్టబోయే బిడ్డతో”అని వరుణ్ అంటాడు.
అభిరామ్‌కు ధన్యవాదాలు చెబుతూ బయటకు వెళ్తారు. కానీ వాళ్లను బందీలుగా పెట్టినవారు చూడగానే వరుణ్ రచన పరుగు తీస్తారు. ఓ వాహనం వారిని ఢీకొడుతుంది.
వరుణ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోతాడు.
రచనకు చికిత్స జరుగుతుంది. వరుణ్ తండ్రికి సమాచారం చేరుతుంది.
వరుణ్ తండ్రి ఏడుస్తూ: “ఈ డబ్బంతా నీ కోసమే సంపాదించాను. నువ్వు సంతోషం గా ఉండాలి అని అనుకున్నాను కానీ ఇలా జరిగింది ?” అని విలపిస్తాడు.
రచన: “నేను కూడా చచ్చిపోతాను.”
వరుణ్ తండ్రి:- “నా కొడుకు లేడు. కానీ అతని ప్రతిబింబం నీలో ఉంది. ఆ బిడ్డని చంపకు.”
రచన బిడ్డ కోసం జీవించాలనే నిర్ణయానికి వస్తుంది.
ఒక వారం తర్వాత...
వరుణ్ తండ్రి: “వరుణ్ లేడు. కానీ అతని కల చచ్చిపోవద్దు. అతడు డాక్టర్ అయ్యి ఆసుపత్రి నిర్మించాలని కలగన్నాడు. ఆ కల నువ్వు నెరవేర్చాలి. నీ చదువులకు ఖర్చు నేను భరిస్తాను. ఆసుపత్రి కూడా నేనే కడతాను. అతని కలలు నీవల్ల జీవించాలి.”
అతని మాటలు రచనకు కొత్త ఆశను నింపుతాయి.
కొన్ని నెలల తర్వాత...
రచన ఒక అందమైన పాపకు జన్మిస్తుంది. ఆ పాపను తనకు పిల్లలే లేని అక్క రాణి చేతుల్లో పెట్టి “ఇ పాప నాది కాదు అక్కా... మనిద్దరిదీ!” అంటూ ప్రేమగా అంటుంది.
నాలుగేళ్ల తర్వాత...
రచన తన MBBS పూర్తి చేసి, తన మామ నిర్మించిన ఆసుపత్రిలో డాక్టర్‌గా పని మొదలెడుతుంది. ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేస్తూ, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తుంది.
ఈ విధంగా రచన వరుణ్ కలను నెరవేర్చింది…
ముగింపు...
Comments