కిట్టు గాడి ప్రేమ ప్రయాణం...
ఆపరేషన్ థియేటర్ తలుపు మూసి ఉంది. లోపల భాగ్యలక్ష్మి పురిటి నొప్పులతో అరిచే స్వరాలు వినిపిస్తున్నాయి.
కొద్దిసేపటికి ఓ నర్స్ నవ్వుతూ బయటకి వచ్చింది. "సార్... మీకు బాబు, ఇంకా పాప పుట్టారు... ట్విన్స్!" అంది నర్స్.
ఆ మాట వినగానే ప్రభాకర్ నిలబడలేకపోయాడు. తన భార్యను చూడాలనే ఉత్సాహం, తన బిడ్డలను చూసి ముద్దాడాలనే తపనతో లోపలికి పరుగెత్తాడు.
ప్రభాకర్ ఇంకా భాగ్యలక్ష్మి హ్యాపీగా ఉంటారు. హాస్పిటల్ నుండి ఇంటికి వెళతారు.
ఇల్లు అంతా అల్లరి తో నిండిపోయింది, పడిపోతున్న బొమ్మలు, పాకుతున్న చిన్నచిన్న చేతులు. కిట్టు, చిన్ని – రెండు కళ్ళలో రెండు ప్రకాశాలు లాంటి బిడ్డలు.
కొన్ని సంవత్సరాల తర్వాత...
కృష్ణను అందరూ ఇంట్లో “కిట్టు” అని పిలిచేవారు. తన తోడపుట్టిన స్వేతాతో ఎప్పుడూ ఓ చిన్న గొడవ. “నువ్వు పెద్దవాడివి కదా!” అనగానే – “కాదు, ముందు నువ్వే జన్మించావు!” అంటూ చిన్న చిన్న మాటల యుద్ధాలు. కానీ ఆ చిన్న గొడవల్లోనే ఓ ప్రేమ దాగి ఉండేది.
ఆరోజు పదో తరగతి ఫలితాలు వచ్చాయి. స్వేతాకు A గ్రేడ్ వచ్చింది, కానీ కిట్టు మాత్రం మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు.
కోపం, బాధ, నిరాశ అన్నీ ప్రభాకర్ రావు ముఖంలో స్పష్టంగా కనిపించాయి.
“ఇదేనా నీ చదువు? ఇంతకంటే జంతువు మేలు!” అంటూ ఆయన కిట్టును గట్టిగా మందలించాడు.
అమ్మ భాగ్యలక్ష్మి ఎప్పటిలానే అడ్డుపడింది. “వాడు పిల్లాడు... కోపంతో కాదు, ప్రేమతో చెప్పాలి.” అని చెప్పినా, ప్రభాకర్ వినలేదు.
ఆ సంఘటన తర్వాత కిట్టు ఇంటి నుండి వెళ్లిపోతాడు... రాత్రి 9 అవుతుంది… కిట్టు ఇంకా ఇంటికి రాలేదు. బయట చిమ్మ చీకటి… ఇంట్లో అమ్మ గుండెల్లో ఒత్తిడి. తన భర్త ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వమని చెప్తుంది. ప్రభాకర్ రావు స్టేషన్‌కి వెళ్తుండగా, దారిలో గుడి పూజారి శాస్త్రిగారు కనిపిస్తారు.
శాస్త్రి గారు ప్రభాకర్ తో ఇలా అంటారు “సాయంత్రం నుండి మీ కృష్ణ గుడిలోనే ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు… తలదించుకొని గుడి మెట్లపై కూర్చొన్నాడు. నేను గుడికి తాళం వేస్తున్నానన్నా, రాలేదు…” అని ఆవేదనగా చెప్పిన పూజారి మాటలు ప్రభాకర్‌ను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
గుడికి వెళతాడు ప్రభాకర్. మెట్లపై కూర్చొని మౌనంగా ఉన్న కిట్టును చూస్తాడు. ప్రభాకర్ వెళ్ళి కిట్టుని ఓదారుస్థాడు.
కిట్టు మాట్లాడుతాడు "నాకు ఈ చదువు బుర్రకి ఎక్కడం లేదు నాన్న. నాకు అనిమేషన్స్, 3D గ్రాఫిక్స్ అంటే చాలా ఇష్టం. నేను ఆ కోర్స్ చేస్తా నాన్న!" అని చెబుతాడు.
ప్రభాకర్ రావు మాట్లాడుతాడు "సరే కిట్టు, ముందు నీవు నీ పదో తరగతి క్లియర్ చేయు. ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంటికి వెళదాం పద. అమ్మ ఎదురు చూస్తూ ఉంది." ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు.
కిట్టు పదో తరగతి పరీక్షలు మళ్లీ రాస్తాడు. ఫలితాలు వస్తాయి ఈసారి కిట్టు పాస్ అవుతాడు. వెళ్లి తన నాన్నతో మాట్లాడతాడు తన డ్రీమ్ గురించి.
కానీ ఈసారి కూడా వాల్ల నాన్న అనిమేషన్ కోర్స్ చేయడానికి ఒప్పుకోరు. “నువ్వు ఇంటర్మీడియట్ పూర్తిచేయాలి. ఆ తర్వాత నేనే నిన్ను కోర్సులో జాయిన్ చేస్తా.” అని చెబుతాడు. కిట్టుకి వేరే దారి లేక… “సరే” అంటాడు.
ఆ రాత్రి భాగ్యలక్ష్మి, ప్రభాకర్‌తో ఇలా మాట్లాడుతుంది:
భాగ్యలక్ష్మి “ఎందుకు అండి, కిట్టుని కోర్సులో జాయిన్ చేయడం లేదు? వాడు మునాపాటి లా ఇప్పుడే లేడు. వాడిని ఆ కోర్సులో జాయిన్ చేయొచ్చు కదా…”
ప్రభాకర్ “మన కిట్టు ఆ పిచ్చి కోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంటర్మీడియట్ చేసి, ఇంజనీరింగ్ చేస్తే వాడికి పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. హ్యాపీగా ఉంటాడు. ఇవన్నీ నీకు తెలియవు… నేను చూసుకుంటా లే.” అని అంటాడు.
కాలం సాగుతుంది… నాలుగు నెలలు దాటిపోతాయి. కళాశాల ఫ్రెండ్స్ కిట్టుని తక్కువ చేయడం మొదలుపెడతారు.
“అనిమేషన్ కోర్స్ ఏంటి రా? కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చేస్తూ గ్రాఫిక్స్‌లా నడవద్దురా!” అంటూ మాటలతో గాయపరుస్తారు.
ఆ రోజు మాట మాట పెరిగి పెద్ద గొడవ అవుతుంది. కాలేజ్ మేనేజ్‌మెంట్ “పేరెంట్స్‌ని పిలవండి… లేకపోతే TC ఇష్యూ చేస్తాం…” అంటుంది.
తర్వాత రోజు కాలేజ్‌కి పేరెంట్స్ వెళతారు. మేనేజ్‌మెంట్ కౌన్సిలింగ్ ఇస్తుంది… కానీ ప్రభాకర్ వదలడు. ఆ రాత్రి ఇంట్లో కిట్టుపై కోపంగా –
స్వేతను చూపిస్తూ: “తనను చూసి నేర్చుకో… ఏంటి నీ వేషాలు!”
ఆ రాత్రి కిట్టు మౌనంగా తనలో తానే ఇలా అనుకుంటాడు "అంతే... ఇకపై నాకు నచ్చినట్టు ఉంటా. నచ్చిన పని చేస్తా..." అలాగే ఉంటాడు కూడా…
కిట్టు ఇలా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉన్న టైమ్‌లో అనుకోకుండా వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అవుతుంది. 2 నెలల విశ్రాంతి తీసుకోవాలి అని డాక్టర్స్ చెబుతారు.
ఆ యాక్సిడెంట్ కిట్టు లైఫ్‌ని మార్చేస్తుంది. ఇంట్లో ఫైనాన్షియల్‌గా సమస్యలు మొదలవుతాయి. ఇవన్నీ చూస్తూ… కిట్టు ఉండలేక, ఈవెనింగ్ పార్ట్ టైం జాబ్‌లో జాయిన్ అవుతాడు. మోర్నింగ్ పాలు, పేపర్ వేసే పని స్టార్ట్ చేస్తాడు.
అలా ఫైనాన్షియల్‌గా కిట్టు ఫ్యామిలీకి సపోర్ట్ అవుతడు. అంతే కాదు… కాలేజ్‌కి రెగ్యులర్‌గా వెళ్లి, క్లాస్ టాపర్ అవుతాడు. ఇప్పుడు… తనకన్నా ఎక్కువ తన కుటుంబం కోసం బ్రతుకుతున్నాడు.
ఒక రోజు రాత్రి, తండ్రి సడెన్‌గా కిట్టు గదిలోకి వచ్చి, అతని ముందు కూర్చుంటాడు. “అనిమేషన్ కోర్స్‌కి అడ్మిషన్ డిటైల్స్ తీసుకురా…
చూద్దాం ఏం చేయాలో…” అని అన్నప్పుడు… కిట్టు కన్నీళ్లతో తడిసిన ముఖంతో, “నాన్నా…” అని అంటాడు. ప్రభాకర్ కిట్టు భుజం మీద చేయి వేసి నవ్వుతాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత…
కిట్టు అనిమేషన్ కోర్స్‌తో పాటు, ఫొటోగ్రఫీ స్కిల్స్ కూడా నేర్చుకుంటాడు.
తాను నేర్చుకున్న అనిమేషన్ స్కిల్స్‌తో ఒక షార్ట్ అనిమేషన్ మూవీ క్రియేట్ చేస్తాడు. మూవీస్ డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు.
అదే టైమ్‌లో ఇంట్లో స్వేత పెళ్లి గురించి డిస్కషన్స్ జరుగుతుంటాయి, ప్రభాకర్ ఇంకా భాగ్యలక్ష్మి కలిసి అదే విషయాన్ని స్వేతతో చెబుతారు.
స్వేత “వినయ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను” అని చెబుతుంది. కాని ప్రభాకర్ దానికి ఒప్పుకోడు. కిట్టుకి స్వేత ప్రేమ విషయం ముందే తెలుసు.
వినయ్‌కి అమ్మ, నాన్న లేరు…చిన్నప్పుడే యాక్సిడెంట్‌లో వాళ్ళిద్దరూ చనిపోయారు. తను స్వేత వాళ్ళ కాలేజ్ హోస్టల్‌లో ఉంటూ చదువుకున్నవాడు. ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ కంపెనీలో పని చేస్తున్నాడు.
అమ్మ, నాన్నను కిట్టు కన్విన్స్ చేసి, స్వేత పెళ్లిని వినయ్‌తో జరగడానికి ఒప్పిస్తాడు.
స్వేత పెళ్లి… ఇంట్లో రంగుల దీపాలు… డప్పుల శబ్దాలు… బంధువుల హడావుడి.
రిసెప్షన్ రోజు కిట్టు కెమెరా యాంగిల్ సెటప్ చేస్తూ ఉంటాడు. వచ్చిన గెస్ట్‌లు స్టేజ్ మీదికి ఒక్కరొకరు వెళుతూ, స్వేత, వినయ్‌కి అభినందనలు చెబుతుంటారు.
అప్పుడే అక్కడికి ఓ అమ్మాయి వస్తుంది… ఆమెను చూసి కిట్టు అలానే ఉండిపోతాడు. రెప్పపాటులో ఆ అమ్మాయి స్టేజ్ మీదనుంచి దిగిపోతుంది.
కిట్టు రిసెప్షన్ హాల్ అంతా, బయట అంతా చూస్తాడు. అయినా ఆ అమ్మాయిని కనిపెట్టలేడు.
కిట్టు బయట వెతుకుతూ ఉండగా, ఆ అమ్మాయి డిన్నర్ హాల్‌లో ఎవరితోనో మాట్లాడుతుంది కనిపిస్తుంది . కిట్టు వెంటనే వెళ్లి చూస్తాడు… అయితే, ఆ అమ్మాయి పార్కింగ్ ఏరియాకు వెళుతుంది. అలా కిట్టు ఆ అమ్మాయిని ఆ రోజు మళ్లీ చూడలేకపోతాడు…
కిట్టు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు… స్వేత రిసెప్షన్ ఫోటోలు అన్నీ చూస్తూ ఉంటాడు. కాని… ఆ అమ్మాయి మాత్రం కనిపించదు.
పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎవరో తెలియదు… ఫోటో కూడా లేదు.
అలా నాలుగు నెలలు గడిచిపోతాయి. కిట్టు వాళ్ళ ఫ్యామిలీ అన్నవరం టెంపుల్‌కి వెళతారు. టెంపుల్ దగ్గర రూమ్స్ కోసం చూస్తూ ఉంటారు వాళ్ళ నాన్న మరియు వినయ్.
కిట్టు పక్కనే ఉన్న వాష్‌రూమ్ కి వెల్లి ఒస్తుండగా, అప్పుడు తను ఒక షాప్ దగ్గర ఓ అమ్మాయిని చూస్తాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి చూస్తాడు… కాని కిట్టు వెతుకుతున్న అమ్మాయి కాదు ఇప్పుడూ తాను చూసిన అమ్మాయి వేరే.
నిరాశతో కిట్టు వెనక్కి వెల్లిపోతాడు. దర్శనం లైన్‌లో కిట్టు తన మనసులో ఇలా అనుకుంటాడు "దేవుడా… ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ఒక్కసారి అయినా చూపించు… చూసి మాట్లాడాలి. వేరే అమ్మాయిని చూసిన కలగని ఫీలింగ్… ఆ అమ్మాయిని చూసే సమయంలో ఎందుకు కలిగింది? తను నా లవ్ ఆఫ్ లైఫ్ ఆ, నా కోసమే పుట్టిన అమ్మాయి అని అర్థం కావడం లేదు.
ప్లీజ్ దేవుడా, ఒకసారి ఆమెను చూపించు…"
దర్శనం అయ్యిపోతుంది. వాళ్ళ కుటుంబం ఇంటికి బయలుదేరుతుంది.
సాయంత్రం 4:30కి ఓ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగుతుంది. ట్రైన్‌లో ఉన్న కిట్టు వాటర్ బాటిల్ కోసం దిగుతాడు. అక్కడ అనుకోకుండా… కిట్టు మళ్లీ ఆ అమ్మాయిని మరో ట్రైన్‌లో చూస్తాడు!
ఈసారి ఎలా అయినా తనని మిస్ అవ్వకూడదు అనుకుని, ఆమెను చూసేందుకు పరిగెతుకుంటు వెల్తాడు కని వెళ్ళే సరికి రైలు వెళ్ళిపోతుంది. ఈసారి కూడా ఆమె మిస్ అవుతుంది…
ఇంటికి వచ్చాక కిట్టు మౌనంగా ఆమెను వెతుకుతున్నాడు. పెళ్లి వీడియోలు, వాయిస్ క్లిప్స్, క్యాండిడ్ షాట్స్ అన్నింటినీ క్లియర్‌గా చూస్తాడు. చివరికి ఆమె ఉన్న ఒక ఫోటోని గుర్తుపడతాడు.
ఆ ఫోటోలో ఆమె ఒక బ్యాగ్‌తో కనిపిస్తుంది. ఆ బ్యాగ్ పైన ఒక చిన్న లోగో అది ఒక హాస్పిటల్‌కి చెందిన లోగో. కిట్టు ఆ హాస్పిటల్ వెతుకుతాడు. తన ఫ్రెండ్స్‌కి కూడా వెతకమని చెబుతాడు. ఫైనల్‌గా హాస్పిటల్ గురించి తెలిసి అక్కడికి వెళతాడు…
హాస్పిటల్‌లో ఆ అమ్మాయి ఫోటో చూపించి అడుగుతాడు. “ఎవరు తెలియదు…” అని చెబుతారు. ఎట్టకేలకు ఒక నర్స్ గుర్తుపడుతుంది“ఆమె పేరంటో తెలుసు… Dr. తన్మయి… సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్‌గా పని చేశారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిపోయారు!” అని నర్స్ చెబుతుంది.
తన అడ్రస్ ఏమైనా తెలుసా? అని నర్స్‌ని అడుగుతాడు. “ఢిల్లీలో కూడా ఈ హాస్పిటల్ బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్లి అడగండి” అని నర్స్ చెబుతుంది.
ఇంట్లో వాళ్లకి చెప్పి కిట్టు ఢిల్లీకి వెళతాడు.
అసలే కొత్త ఊరు… కిట్టుకి అయోమయంగా ఉంటుంది. ట్రైన్ దిగి స్టేషన్ బయటికి వస్తాడు. అక్కడ ఉన్న టాక్సీ అతనితో తనకి ఓచ్చిన హిందీలో మాట్లాడి, హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతాడు.
టాక్సీ దిగగానే… ఒక దొంగ కిట్టు బ్యాగ్ తీసుకుని పారిపోతాడు!
ఆ దొంగను వెంబడిస్తూ కిట్టు వెళతాడు… దొంగను పట్టుకోవాలని వేగంగా పరిగెత్తిన కిట్టు ఎదురుగా వస్తున్న కారు ధికొడుతుంది!
కిట్టు రోడ్‌పైన పడిపోతాడు తలనుండి రక్తం వస్తుంది. అక్కడ చుట్టూ ఉన్న వారు అంబులెన్స్‌కి కాల్ చేసి కిట్టుని హాస్పిటల్‌కి పంపిస్తారు.
6 గంటల తర్వాత కిట్టుకు స్పృహ వస్తుంది. కిట్టు “తన్మయి… డాక్టర్ తన్మయి…” అని కలవరిస్తాడు.
అది చూసిన నర్స్ Dr. తన్మయిని పిలుస్తుంది. కిట్టు జాయిన్ అయిన హాస్పిటల్‌నే తను వెతుకుతున్న అమ్మాయి తన్మయి పని చేస్తోంది!
తన్మయి, కిట్టు ఉన్న రూమ్‌కి వస్తుంది… కిట్టు ఆమెను చూస్తాడు. తన ఎదురుగా తను వెతుకుతున్న అమ్మాయి ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు.
కానీ…తన్మయి, కిట్టుని చూసి షాక్ అవుతుంది. ట్రీట్మెంట్ చేసి, తన్మయి అక్కడినుంచి వెళ్లిపోతుంది…
తన్మయి మనసులో ఒక్కటే ప్రశ్న… కిట్టు తను ప్రేమించిన అమర్‌లాగే ఎందుకు ఉన్నాడు అని?
ఫ్లాష్‌బ్యాక్…
అమర్ కిక్‌బాక్సింగ్‌లో చాంపియన్ అవ్వాలనుకున్న వాడు.
దానికి తగ్గట్టుగానే చదువుతో పాటు కిక్‌బాక్సింగ్ కుడా ప్రాక్టీస్ చేసేవాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో పాల్గొనేవాడు.
తన కాలేజ్ నుండే అమర్ ఆ కిక్‌బాక్సింగ్‌కి రిప్రజెంటేషన్‌గా ఉండేవాడు.
తనకు పోటీగా కాలీ అనే వ్యక్తి ఉండేవాడు. అమర్ అంటే కాలీకి ఇష్టం ఉండదు. ఎప్పుడు గొడవ పెట్టుకుందాం అని చూస్తూ ఉండేవాడు.
అలా ఒకరోజు గొడవ పడుతూ మెడికల్ కాలేజ్ - గర్ల్స్ హాస్టల్‌లోకి వెళతారు..అక్కడే అమర్, తన్మయిని చూస్తాడు.
చూడగానే తన్మయిని ఇష్ట పడతాడు. ఒకరోజు వెళ్లి తన్మయిని కలుస్తాడు అమర్ తన ప్రేమ విషయం చెప్తాడు. తన్మయి ఒప్పుకోదు కాని తనకి కూడా అమర్ నచ్చుతాడు. కొన్నీ రోజులు ఫ్రెండ్స్ గా ఉందం అని తన్మయి, అమర్ తో చెప్తుంది .
మెల్లిగా వారిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. కొద్దిరోజుల్లో వారి స్నేహం ప్రేమగా మారుతుంది.
తన అమ్మా నాన్నకి తన్మయి ని పరిచయం చేస్తాడు అమర్. తన్మయి వాళ్ళ పేరెంట్స్ కి కూడా వల్ల ప్రేమ విషయం చెప్తారు. అందరు వల్ల ప్రేమను అంగీకరిస్తారు.
అలా రెండు సంవత్సరాలు గడుస్తాయి…
తన్మయి Dr. తన్మయి సైకియాట్రీ స్పెషలిస్ట్ అవుతుంది. అమర్ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్ అవుతాడు.
అన్నీ హ్యాపీగానే ఉన్నయి… పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయమని తన్మయి, అమర్ అనుకుంటారు. పెరెంట్స్ కూడా ఒప్పుకుంటారు.
సరిగ్గా పెళ్లికి 10 రోజులు ముందు… అమర్‌కి హార్ట్ అటాక్ వస్తుంది.
అమర్ చనిపోతాడు.
అన్ని మెడికల్ రిపోర్టుల ప్రకారం స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్‌లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందని చెబుతారు డాక్టర్లు.
అమర్ లేని జీవితం తన్మయిని ఒంటరిదానిగా మార్చుతుంది. సూసైడ్ ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ… ఆమె తల్లిదండ్రులు ఆ పని చేయకుండా ఆపుతారు.
తన్మయి పనిచేస్తున్న హాస్పిటల్ వారు హైదరాబాద్‌లో వాలంటీర్ అవసరం ఉంది, ఒక 4 నెలలు ప్రోగ్రాం అని చెబుతారు.
తన్మయికి ఈ మార్పు అవసరమే అని అమర్ తల్లిదండ్రులు, తన తల్లిదండ్రులు కూడా చెబుతారు. అలా హైదరాబాద్‌కి వస్తుంది తన్మయి.
స్వేత ఫ్రెండ్స్‌లో ఒక డాక్టర్ ఫ్రెండ్ కూడా ఉంది. తనతో కలిసి తన్మయి, స్వేత పెళ్లికి వస్తుంది. అక్కడే కిట్టు తన్మయిని చూస్తాడు…
ప్రస్తుతం…
తన్మయి ఇంకా షాక్ లోనే ఉంటుంది. అమర్ పేరెంట్స్‌కి కాల్ చేసి హాస్పిటల్‌కి రమ్మని చెబుతుంది.
అమర్ పేరెంట్స్ హాస్పిటల్‌కి వస్తారు. తన్మయి, కిట్టుని చూపిస్తుంది.
కిట్టుని చూసిన వెంటనే అమర్ వాల్లమ్మ వెళ్తుంది… అతడిని హగ్గ్ చేసుకుని ఏడుస్తుంది.
అక్కడ ఏం జరుగుతోంది? కిట్టుకి అర్థం కాదు… అప్పుడు తన్మయి శాంతంగా అంటుంది "నేను ఉన్నాను" అని సైగలతో చెబుతుంది.
కిట్టు సైలెంట్ అవుతాడు. ఒక 2 గంటల తర్వాత, పేరెంట్స్ వెళ్తారు.
“కిట్టు మరో 2 రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలి.”అని డాక్టర్స్ చెబుతారు
2 రోజులు తర్వాత…
తన్మయి, అమర్ ఫోటోని కిట్టుకి చూపిస్తుంది.
కిట్టు షాక్ అవుతూ అంటాడు – “నా ఫోటో మీ దగ్గర ఎందుకు ఉంది? ఇధి నేనేనా? నాకు ఈ డ్రెస్ లేదు… ఫోటో ఏమైనా ఎడిట్ చేశారా?”
తర్వాత… అమర్‌తో తన్మయి కలిసి ఉన్న ఫోటో చూపిస్తుంది.
కిట్టు షాక్ అవుతూ… ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోతాడు.
“నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను…” అని మీకు ముందే తెలుసా? అని తన్మయి ని అడుగుతాడు కిట్టు.
అలా తన ప్రేమ గురించి చెప్తాడు కిట్టు. అమర్ పైన తన్మయి కి ఉన్న ప్రేమ, అమర్ ఇక లేడన్న విషయం, వచ్చిన వారు అమర్ పేరెంట్సే అని తన్మయి చెబుతుంది.
కిట్టుకి మొత్తం పరిస్థితి అర్థం అవుతుంది…
కిట్టు మాట్లాడుతూ “దేవుడికి ట్విస్ట్‌లు అంటే ఇష్టం అనుకుంటా అండి. లేకపోతే – ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ఢిల్లీ… మీరు హైదరాబాద్ రావడం ఏంటి? అసలు ప్రేమ ని నమ్మని నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? మిమ్మల్ని వెతుకుతూ ఢిల్లీకి రావడం ఏంటి? అమర్ లా నేను ఉండటం ఏంటి?
ఇదంతా దేవుడు ఆడిన ఆట తన్మయిగారు. కానీ… నేను మిమ్మల్ని నన్ను ప్రేమించమాని చెప్పాను.
మీరూ కొంచెం టైమ్ తీసుకొని ఆలోచించండి. మీరు ఇంకా అమర్ ని మరిచిపోలేదు అని అర్దం అవుతుంది కానీ మీరు ఆ బాధ నుండి బయటకి రావాలి. నా ప్రేమను ఒప్పుకుంటారు అని నేను వేచి ఉంటాను.
మీకు ఎప్పుడైతే ఓకే అనిపిస్తుందో…ఆ రోజు మనం పెళ్లి చేసుకుందాం. మీ పేరెంట్స్‌తో పాటు, అమర్ పేరెంట్స్‌తో కూడా మాట్లాడి ఒప్పిస్తాను.
మీరు హ్యాపీగా ఉండటం నాకు కావాలి. దాని కోసం నేను ఏమైనా చేస్తాను.
నేను ఒక మూవీ తీయాలి అని స్టోరీ రాసుకున్నా. ప్రొడ్యూసర్స్ గారితో మాట్లాడి షూటింగ్‌ను ఢిల్లీకి షిఫ్ట్ చేస్తా. ఒక 6–7 నెలలు ఇక్కడే ఉంటను…
మీరూ టైం తీసుకొని ఆలోచించండి చెప్పండి" అని కిట్టు, తన్మయి తో చెప్తాడు
షూటింగ్ జరుగుతున్న సమయంలో… కిట్టు, తన్మయిని ఇంకా వాళ్ల ఫ్యామిలీస్ ని కలుస్తాడు. కిట్టుని చూసిన అమర్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు.
షూటింగ్ అయిపోయే సమయానికి… తన్మయి, కిట్టు ప్రేమను అంగీకరిస్తుంది.
చివరగా హైదరాబాద్ కిట్టు, ఢిల్లీ అల్లుడు అవుతాడు!
సుఖాంతం... 😊
Please Share Like and Comment.
Your feedbacks are precious to me.
Comments