ఆది వర్ష కాలం, వర్షం రాలుతున్న శబ్దం పట్టణమంతా ఒక మెలోడీలా వినిపిస్తోంది. రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా వర్షపు చినుకులు కురుస్తున్నయి, అల వర్షపు నీరు పడి వస్తున్న మట్టి వాసన చాలా బాగుంది. అప్పుడే అక్కడికి రైలు వచ్చింది. జాగ్రతగా అడుగులు వేస్తు జానాలు రైలు ఎక్కుతున్నారు.
అదే సమయంలో స్టేషన్ బయట నుండి రూప వేగంగా స్టేషన్ లోపలికి పరిగేతుకుంటు వచ్చింది.
రైల్ లో కి వెళ్లి బుక్ చేసుకున్న సీట్ ఎక్కడ అని చూస్తుంది. అదే భోగి లో ఒక చేతిలో టీ కప్పు, మరో చేతిలో “ప్రేమ నవల” అనే పుస్తకం చదువుతున్నాడు సాయి.
ఎదురుగా వస్తున్న వ్యక్తి ని రూప చూడలేదు ఆ వ్యక్తి కి రూప డికొని పడబోతుంటే సాయి తనని కింద పడకుండా పట్టుకుంటడు.
ఇద్దరి కళ్ళు కలిశాయి. ఒక క్షణం పాటు మాటలు ఆగిపోయాయి. ఆ కళ్ళలోని కాంతి ఇద్దరికీ ఒక వింత పరిచయంగా అనిపించింది.
రైలు హారన్ వినిపించగానే, వాతావరణం మెల్లిగా మళ్ళీ సాధారణమైంది.
సాయి: “అరె! జాగ్రత్త… చుసుకోవాలి కద అని రూప తో అంటాడు.”
రూప:“థ్యాంక్యూ… సీట్ కోసం చూస్తు ఎదురుగా వస్తున్న వారిని చూడలేదు.”
ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు సాయి ఇంకా రూప ఒకరినిఒకారు పరిచయం చేసుకున్నారు.
సాయి సైగలతో టీ కావాలా అని అడిగాడు. రూప ఒద్దు అని అంటుంది.
సాయి: వర్షం లో టీ ఇంకా మిర్చి బజ్జీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా అని అంటాడు.
రూప: స్మైల్ చేస్తూ తల ఊపుతూ, అవును నాకు టీ తాగడం అంటే ఇష్టం. కానీ ఇక్కడ టీ లేదు కదా అని అంటుంది.
అలా మాట్లాడుతు సాయి దగ్గర ఉన్నా బుక్ చూసిన రూప ఆశ్చర్యపోతుంది.
రూప: ఇ బుక్ నా ఫేవరెట్. ఇందులో హీరో పాత్ర బాగుంటుంది, అతను ఆడవాళ్ళని గౌరవించే విధానం నాకు చాలా నచ్చింది అని అంటుంది.
సాయి: అవును… నేను ఇందాకే చదివాను నాకు నచ్చింది.
రూప కళ్ళలో వెలుగు మెరిసింది. ఇద్దరూ ఒకరినొకరు కొత్తగా కనుగొన్నట్లు ఫీల్ అయ్యారు.
వర్షపు చినుకులు కిటికీల మీద ఇంకా పడుతూనే ఉన్నాయి… రైల్ ఓక స్టేషన్ లో అగింది. రైల్వే స్టేషన్‌లో వర్షపు వాసన ఇంకా పరుచుకుని ఉంది. ప్లాట్‌ఫారమ్ పక్కన ఉన్న చిన్న టీ షాప్ నుంచి వచ్చే టీ వాసన సాయిని ఆకర్షించింది.
సాయి వెంటనే వెల్లి “రెండు కప్పుల టీ ఇంకా ఈ మిర్చి బజ్జీ కూడా ఇవ్వండి అని అడిగాడు."
టీ ఇంకా మిర్చి బజ్జీ తీసుకొని సాయి రైల్ లోకి వెళ్ళడు. రూప ఆశ్చర్యంగా చూసింది.
రూప: అరే… నేను కొంచెం ముందు క్రితం టీ అంటే ఇష్టం అన్నా కదా?
సాయి: అందుకే… తిసుకోని వచ్చాను.
రూప సైలెంట్‌గా నవ్వేసింది. సాయి ఇచ్చిన టీ కప్పు తీసుకుంది.
ఇద్దరూ ఎదురేదురుగా కూర్చుని, చేతుల్లో టీ కప్పుని పట్టుకుని వర్షపు చినుకులను చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు.
సాయి: నీకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమా?
రూప: ఇష్టం, పుస్తకాలలో నేను నన్ను కనుగొంటాను. అవి నాకు ఒక సేఫ్ ప్లేస్.
సాయి: నిజమే! మనసు కలిగిన వాళ్ల మాటలు పుస్తకాలలో ఉంటాయి, మనల్ని అర్థం చేసుకోవాలంటే అవి చాలనిపిస్తుంది.
రూప: నువ్వు ఏమి చెస్తుంటవు సాయి?
సాయి: నేను డిగ్రీ పూర్తి చేశాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ప్రెజెంట్ నేను గిటార్ నేర్చుకుంటున్నా. ఓక ఆల్బమ్ చేయలి అని నా కల.
రూప: (ఆసక్తిగా) వావ్! నువ్వు పాటలు రాస్తావా?”
సాయి: అవును… ఇంకా సరైన పాట గా ట్యూన్ చేయలేదు. నువ్వు ఏమి చేస్తావు రూప?
రూప: నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నా, మా అమ్మ కి నన్ను ఒక డాన్సర్ లా చూడడం అంటే ఇష్టం.
నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు, అమ్మ ఇంట్లో హోమ్ ఫుడ్స్ బిజినెస్ చేస్తోంది. ఫ్రీ టైమ్ లో నేను అమ్మ కి హెల్ప్ చేస్తాను.
సాయి: హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ ఉంటావు?
రూప: నిజానికి నేను వైజాగ్ లో ఉంటాను, డాన్స్ నేర్పుకోవడం కోసం హైదరాబాద్ లో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను.
పండుగ కద అందుకే వైజాగ్ వచ్చాను, ఇప్పుడు పిన్ని దగ్గరికి వెళుతున్నా.
నువ్వు వైజాగ్ లో ఎం చేస్తున్నావు? అని రూప అంటుంది.
సాయి: ఫ్రెండ్ వల్ల అక్క పెళ్లి ఉంటే వెళ్లి ఒస్తున్నా. మా ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు. ఈ ఆదివారం మా తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను.
రైలు ప్రయాణం సాగుతుంది ఇంకా వారిద్దరి సంభాషణ కుడా.
రూప: నువ్వు చాలా సింపుల్‌గా ఉన్నావు… కానీ నీలో ఏదో ప్రత్యేకత ఉంది.
సాయి: థ్యాంక్యూ! నేను అసలు ఊహించలేదు, ఇల రైల్ లో ఒక అమ్మాయి తో మట్లాడుతాను అని. జీవితం ఆంటే ఇలానే ఉంటుందెమో, ఎవరు ఎందుకు ఎప్పుడూ కలుస్తారూ తెలియాదు.
రూప నవ్వింది.
రూప: స్కూల్ లో కాలేజీ లో నార్మల్ గా అబ్బాయిలు తో మాట్లాడాను, కానీ ఇలా ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకు ఇది ఒక కొత్త ఫీలింగ్ లా అనిపిస్తుంది.
సాయి కాసేపు ఆగి తల ఊపాడు. రూప చిరునవ్వుతో సాయిని చూసింది.
బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. వారిదరిమధ్య ఆ పరిచయం ఒక కొత్త ఫ్రెండ్షిప్ గా మారింది.
కాసేపాటికి ఇద్దరు దిగాల్సిన స్టేషన్ ఒచ్చింది. ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకొని బై చెప్పుకొని ఎవరి దారిలో వారు వెళ్ళిపోయారు.
స్టేషన్ నుండి బయటకి ఒచ్చక రూప "అరె ఫోన్ నంబర్ అడగడం మరిచిపోయానే మల్లి కలుస్తాడో లేదో" అని అనుకుంటోంది.
సాయి"కొన్ని పరిచయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి… ఈ రోజు నాకూ అలాంటి రోజు కావచ్చు" అని మనసులో అనుకున్నాడు.
రోజులు గడిచాయి…
ఒకరోజు సాయి తన మ్యూజిక్ ఆల్బమ్ విషయం గా మ్యూజిక్ డైరెక్టర్ ని కలిసి ఒస్తునాడు. అదే సమయం లో ఒక వ్యక్తి కారు యాక్సిడెంట్ చేస్తాడు. చుట్టు ఉన్నా జనం ఆ వ్యక్తి ని తిడుతు కొట్టడానికి వస్తారు.
అ సంఘటన చూసిన సాయి అక్కడికి వెళ్లి అ వ్యక్తిని కొట్టకుండా అపుతాడు, అ వ్యక్తి కారులోనే యాక్సిడెంట్ చేసిన వారిని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు.
హాస్పిటల్ లో:
అ వ్యక్తి కి సంబంధంచిన వారు తనకి ఫోన్ చెస్తారు. తన వారికి జరిగిన విషయం చెప్పి హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు అ వ్యక్తి.
కొద్ది సేపటికి అ వ్యక్తి తాలూకా మరోక వ్యక్తి హాస్పిటల్ కి వస్తారు.
ఆ వచ్చిన వారిని చూసిన సాయి ఆశ్చర్యపోతాడు, వచ్చింది ఎవరో కాదు రూప.
యాక్సిడెంట్ చేసిన వ్యక్తి రూప వాల్లా చినాన్న (రాజేంద్ర).
అ రోజు మల్లి అ కారు యాక్సిడెంట్ సాయి ఇంకా రూప ని కలుపుతుంది. సాయి ని వాళ్ళ చినాన్న కి పరిచయం చేస్తుంది రూప.
రాజేంద్ర సాయికి థాంక్స్ చెప్పి ఓక రోజు విలుచుసుకొని లంచ్ కి ఇంటికి రా బాబు అని అంటారు.
ఈసారి రూప మరిచిపోకుండా సాయి ఫోన్ నంబర్ తిసుకుంటుంది. కొద్దిసేపటికి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోతారు.
రైల్వే స్టేషన్‌లో మొదలైన చిన్న పరిచయం ఇప్పుడు ప్రతిరోజూ మాట్లాడుకునే అలవాటుగా మారింది.
సాయి, రూప ఫోన్‌లో మాట్లాడుకోవడం, మెసేజ్‌లు పంపుకోవడం, పుస్తకాల గురించి చర్చించడం… ఇలా వారి బంధం క్రమంగా పెరుగుతూ వచ్చింది.
ఒక సాయంత్రం…
రూప (ఫోన్‌లో): సాయి… నీకు తెలుసా? ఈ హైదరాబాద్ నాకు కొత్త ఈ ఆదివారం మనం బయటికి వెళ్దామా?
సాయి: తప్పకుండ వెలదాం. ఎ టైమ్ కి వెల్దాం?
రూపా: ఆదివారం నా డ్యాన్స్ క్లాస్ అయిపోయాక వెలదాం.
సాయి (స్మైల్ చేస్తూ): డీల్!
ఆదివారం వారు పట్టణంలోని పుస్తకాల దుకాణంలో కలుసుకున్నారు:
సాయి: రూప, మనం ఫ్రెండ్స్ మాత్రమేనా?
రూప ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
రూప: అది ఎమిటి అల అడుగుతునావు?
సాయి (నవ్వుతూ): ఏమీ లెదు… నీ డ్యాన్స్ క్లాసులు అయిపోయాక నువ్వు మీ ఊరికి వెలిపోతావ్ కదా నన్ను మరిచిపోతవా?
రూప (సీరియస్‌గా): నేను మర్చిపోతే, ఈ పుస్తకాలు, ఈ వర్షం నీ గురించి గుర్తు చేస్తాయి.
కొద్ది సేపు అలా టైమ్ స్పెండ్ చేసి ఇద్దారు ఇంటికి వెళతారు.
సాయికి రూపతో మాట్లాడే ప్రతి క్షణం ఒక కలలా అనిపించేది. ఆమె నవ్వు, కళ్ళలోని వెలుగు, మాట్లాడే తీరు… ఇవన్నీ అతని హృదయంలో రూప పైనా ప్రేమ ని కలిగించేలాగా చేసాయి.
అ రాత్రి… సాయి తన ఇంట్లో గది లోపల కిటికీ పక్కన కూర్చుని తన గిటార్ తీసుకున్నాడు.
సాయి (మనసులో): “ రూప నువ్వు మాట్లాడిన ప్రతిసారీ నా హృదయం కొత్త స్వరాన్ని నేర్చుకుంటోంది…
నువ్వు నవ్వినప్పుడల్లా నా కలలు రంగులు దిద్దుకుంటున్నాయి…
ఇది స్నేహమా? లేక ప్రేమా?
ఏదైనా సరే… నువ్వు నా జీవితానికి ప్రాణం రూప.”
అతని గిటార్ స్ట్రింగ్స్ మీద నుంచి వచ్చే మెలోడీ రాత్రి గాలిలో తేలింది.
ఆ మ్యూజిక్ అతని మనసులోని ప్రేమకి ప్రతిబింబం అయ్యింది.
రూప ని సర్ప్రైజ్ చేధం అని సాయి గిటార్ వాయిస్తూ రూప కోసం ఒక పాట కంపోజ్ చేస్తాడు.
ఇక రూప…
ఆమె కూడా సాయితో మాట్లాడినప్పుడు హాయిగా, సేఫ్‌గా అనిపించేది.
కానీ తనలో ఒక ప్రశ్న మెల్లగా పుడుతూనే ఉంది:
రూప (మనసులో): సాయితో మాట్లాడినప్పుడు ఎందుకు ఈ హృదయం వేగంగా కొట్టుకుంటోంది?
ఎందుకు అతని కోసం ఎదురుచూస్తున్నానో నాకు తెలియదు…
ఇది ప్రేమేనా? లేక కేవలం స్నేహమా?”
అతని కళ్ళలో ఏదో మాయ ఉంది…
అతని మాటల్లో ఒక హృదయాన్ని తాకే శాంతి ఉంది.
మరుసటి రోజు..
సాయి లైబ్రరీ దగ్గర రూప కోసం పుస్తకాలతో ఒక చిన్న సర్ప్రైజ్ తయారు చేశాడు.
ఒక పాత పుస్తకంలో చిన్న కాగితం పెట్టాడు “కొన్ని కథలు చదివాక మనసు శాంతిస్తుంది… కానీ నిన్ను కలిసాక నా హృదయం కథ రాయడం నేర్చుకుంది.”
రూప ఆ లైన్ చదివి చిరునవ్వుతో సాయిని చూసి ఇలా అంది "నీ మాటల్లో కవిత్వం ఉంది సాయి. అది నిన్ను ప్రత్యేకం చేస్తోంది."
సాయి సైలెంట్‌గా నవ్వాడు. తన ప్రేమను ఇంకా చెప్పలేడు అనుకున్నాడు…అయితే రూప కళ్ళలోనూ అదే భావం ఉన్నట్టు అతనికి అనిపించింది.
సాయంత్రం ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకుంటున్నారు.
వర్షం మొదలైంది.
రూప: వర్షంలో నడవడం, డాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం… చిన్నప్పుడు ఎవరూ అనుమతించరు. కానీ ఈరోజు ఇలా నీతో ఈ వర్షం లో నడవడం నాకు నచ్చింది. ఆ క్షణం ఇద్దరి బంధం ప్రేమ అనే పదానికి దగ్గరైంది.
అలా ఆ వర్షం లో ఒకరినొకరు చూసుకొని ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు.
సాయి, రూప ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో బిజీగా ఉన్న రోజులు.
ఒకరోజు సాయి రూప ఇంటికి లంచ్ కి వెళతాడు. రూప చిన్నన్నా సాయి ని గుర్తు పట్టి "రా బాబు ఆ రోజు నువ్వు చేసిన సహాయం కి నీకు నేను రుణపడి ఉన్నాను. నువ్వు ఆ రోజు నా పక్కాన లేకపోతె ఎం అయి ఉండేదో" అని అంటారు.
సాయి: అదీ ఎం పెర్లెదు అండి మనిషికి మనిషి సహాయం చెయ్యాలి నేను అదే చేశాను అంతే.
చిన్నన్నా (రాజేంద్ర): సరే బాబు పద లంచ్ చేధం.
అందరు సంతోషం గా లంచ్ కంప్లీట్ చేసారు. హాల్లో కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈదే కరెక్ట్ టైమ్ అని రూప తన ప్రేమ విషయం చెప్తుంది.
కొంచెం ఆలోచించి చిన్నన్నా సరే అని అంటారు. కానీ ఇది నా నిర్ణయం, మి నాన్న గురించి నీకు తెలుసు కదా మీ నాన్న ఒప్పుకుంటేనే ఈ ప్రేమ పెళ్లి సక్సెస్ అవుతుంది.
నాన్నకి నేను చెప్తాను చిన్నన్నా, మీకు సరే కద.
నాకు సరే అని చిన్నన్నా(రాజేంద్ర) అంటారు.
కొద్దిసేపటికి రాజేంద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ చేసింది తన అన్నయ జితేంద్ర.
జితేంద్ర (ఫోన్ కాల్ లో): మన రూప కి ఒక పెళ్లి సంబంధం చుసాను. అబ్బాయ్ అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఆదివారం మన ఇంటికి అమ్మాయి ని చుసుకోడనికి వస్తా అని చెప్పరు మీరందురు ఇప్పుడే బయలుదేరి ఇక్కడికిరండి చాలా ఏర్పాట్లు చేయాలి.
రాజేంద్ర: ఈరోజే బయలుదేరుతాం అన్నయ.
అదే సమయంలో సాయికి ఫోన్ వస్తుంది.
ఫోన్ లో వాయిస్ (అత్యవసరంగా): “సాయి! మి నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు…”
సాయి షాక్ అవుతాడు. రూపా అయోమయంగా సాయిని చూస్తుంది.
రూప (గందరగోళంగా): “సాయి… ఏమైంది?”
సాయి (తడబడుతూ): “నాన్న… నాన్నని పోలీసులు…” అని వెంటనే అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు.
పోలీస్ స్టేషన్ లో:
రఘురామ్ (సాయి నాన్న) కుర్చీ లో కూర్చుని ఉంటాడు. సాయి పరుగెత్తుకుంటూ లోపలికి వస్తాడు.
సాయి (కన్నీళ్లతో): “నాన్నా… ఇది ఏమిటి? మీపై కేసా?”
రఘురామ్ (నిరాశతో): “సాయి… ఇది మొత్తం కుట్ర. నా వ్యాపార భాగస్వామి, వ్యతిరేక పార్టీ వాళ్లతో చేతులు కలిపి తప్పుడు కేసు వేశారు.”
సాయి: ఇది ఎవరూ చేసినా నేను వదలను.
లాయర్ వస్తాడు. బెయిల్ సైన్ చేసి రఘురామ్‌ని బయటకు తీసుకువస్తాడు. సాయి నాన్నను ఇంటికి తీసుకువెళ్తాడు.
ఇంట్లో:
ఇంట్లో కూర్చుని ఉన్న రఘురామ్, సాయిని పక్కకు తీసుకెళ్తాడు.
సాయి: నాన్న… మనకి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు?
రఘురామ్: మనమీద ఈ దెబ్బ కొట్టింది… జితేంద్ర!
సాయి షాక్ అవుతాడు. రూప తండ్రి పేరు విన్న వెంటనే అతని కళ్ళల్లో అయోమయం.
సాయి: “ రూప నాన్న…?!”
రఘురామ్: అవును నువ్వు రూప నీ ఇష్టపడుతున్నావ్ అని తెలుసు. రూప నాన్న జితేంద్ర అని కుడా తెలుసు కానీ నీకు తెలియనీ నిజం ఒక్కటి ఉంది.
"జితేంద్ర నా సన్నిహితుడు. మేము ఒకే కాలేజీలో చదివాం. కలిసి బిజినెస్ మొదలు పెట్టాం. కానీ అతను చేసే బిజినెస్ మార్గం నాకు నచ్చక, నేను ఆ వ్యాపారం నుండి బయటకి వచ్చి వేరే వ్యాపారం పెట్టుకున్నాను. నా తెలివితో, కష్టంతో టాప్‌కి చేరాను. అదే అతనికి కక్ష అయ్యింది. ఇప్పుడు ఆ కక్షతోనే నన్ను అరెస్ట్ చేయించాడు."
సాయి మౌనంగా కూర్చుంటాడు. రూపతో తన బంధం, నాన్నపై కేసు మధ్యలో గందరగోళంలో పడతాడు.
రఘురామ్: ఇంకో విషయం చెప్పాలి సాయి… రూప కేవలం నీ ప్రేమ మాత్రమే కాదు… చిన్నప్పుడు మేము నీకు రూపకి పెళ్లి కూడా చేయలి అని అనుకున్నాం.కానీ బిజినెస్ సమస్యలతో మేము విడిపోయాం. ఇప్పుడు… నువ్వు, రూప కలిస్తే… అది మీ ప్రేమను మాత్రమే కాదు, నా స్నేహాన్ని కూడా తిరిగి కలుపుతుంది.
సాయి: “నాన్న… నేను రూపను కోల్పోను. మీ గౌరవం కోసం, నా ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే.”
సాయి ఇంకా తన స్నేహితుడు రూప వాళ్ళు ఊరికి బయలు దేరుతారు.
పెళ్లి చూపులు రోజు:
జితేంద్ర ఇంటి వాతావరణం హడావుడిగా, బంధువులతో నిండిపోయి ఉంటుంది. సాయి తన ఫ్రెండ్స్‌తో కలిసి వస్తాడు. రాజేంద్ర, జితేంద్రకి సాయిని పరిచయం చేస్తాడు.
రాజేంద్ర: ఈ అబ్బాయి సాయి… నా స్నేహితుడు కొడుకు. నేనే రమ్మని చెప్పాను
జితేంద్ర: సరే… అని ఎక్కువ ప్రశ్నలు అడగకుండా వదిలేస్తాడు.
రూప నీ చూసినా అబ్బాయి వాళ్లకు ఆమె నచ్చుతుంది.
అబ్బాయి వాళ్లు:
“ఇంకెందుకు ఆలస్యం! ఇప్పుడే నిశ్చితార్థం పెడదాం. పెళ్లి కూడా తొందరగా చేదాం.”
జితేంద్ర కొంత తొలుత సైలెంట్‌గా ఉన్నా, చివరికి “సరే” అని అంగీకరిస్తాడు. రూప షాక్ అవుతుంది. సాయి మనసు కూడా కలవర పడుతుంది.
అశోక్ (పెళ్లి చూపులకి ఒచ్చిన అబ్బాయి), రూపతో మాట్లాడటానికి అనుమతి అడుగుతాడు. ఇద్దరూ టెర్రస్ పైకి వెళ్తారు. సాయి స్నేహితుడు రహస్యంగా వెనుక వెళ్తాడు.
అశోక్ రూపతో మాట్లాడుతూ ఉండగానే, అశోక్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది, అతని ముఖంలో విచిత్రమైన మార్పు. రూప ఏమీ గమనించకపోయినా, వెనక నుంచి గమనిస్తున్న సాయి స్నేహితుడు ఆ ఫోన్ వెనక నిజం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
పదిరోజుల్లో మంచి ముహూర్తం ఉంది అది ఫిక్స్ చేయండి అని అంటారు
పెళ్లికి పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందరు కలిసి షాపింగ్‌కు వెళ్తారు. ఆ సమయంలో జితేంద్ర శత్రువు రామిరెడ్డి పై దాడి చేస్తాడు.
జితేంద్ర తన కుటుంబాన్ని రక్షించలేకపోతున్నప్పుడు, సాయి ముందుకు వచ్చి ధైర్యంగా వారిని కాపాడుతాడు. తన ప్రాణాలకే ముప్పు వచ్చినా వెనుకాడడు. ఈ సంఘటనతో సాయి అందరి మనసు గెలుచుకుంటాడు. చిన్నపిల్లలతో ఆడుతూ వారికీ స్నేహితుడవుతాడు. జితేంద్ర కూడా సాయి పట్ల గౌరవాన్ని పెంచుకుంటాడు.
పెళ్లికి రెండురోజుల ముందు సాయి స్నేహితుడు ఆ ఫోన్ వెనక నిజం కనుగొంటాడు. అశోక్ గురించి తెలిసిన రహస్యం సాయికి చెబుతాడు. సాయి షాక్ అవుతాడు కానీ వెంటనే ఏం చేయక, పెళ్లి రోజు కోసం ఎదురు చూస్తాడు.
పెళ్లి ముహూర్తానికి ఇరవై నిమిషాలు మాత్రమే ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఒక అపరిచిత యువతి లోపలికి వచ్చి ఈ పెళ్లి ఆపండి అంటుంది.
అందరూ షాక్ అవుతారు. ఆ యువతి అశోక్ భార్య అని చెబుతుంది. అశోక్ కి ఇప్పటికే పెళ్లి అయ్యి ఉండగా, ఆ విషయం దాచిపెట్టి డబ్బు కోసం రూప ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన నిజం బయటపడుతుంది.
పెళ్లి ఆగిపోతుంది. జితేంద్ర కుటుంబం అవమానంలో మునిగిపోతుంది. బంధువులు విమర్శలు చేస్తారు.
జితేంద్ర తల వంచుకుని కూర్చుంటాడు.
అప్పుడు రాజేంద్ర ముందుకొచ్చి:
అన్నయ్యా మనం చూసిన పెళ్లి కుదిరి ఉంటే రూప జీవితం నాశనం అయ్యేది. నిజానికి నేను సాయి నీ ఇక్కడికి తీసుకొని వచ్చింది సాయి ఇంకా రూప ప్రేమ విషయం చెప్పి పెళ్లి చూపులు అపాడనికి. కానీ దేవుడు రూపను కాపాడాడు. సాయి ఇంకా తన స్నేహితుడు అసలు నిజం తెలిసేలా చెసారు.
అదే సమయంలో సాయి ముందుకు వచ్చి నిజాయితీగా మాట్లాడతాడు.
సాయి:
"జితేంద్రగారు… నాకు రూప అంటే ఇష్టం. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఆ రోజు అశోక్ మొహం లో తెలియని కంగారు, తప్పు
చేస్తున్నాను అనే భయం భావన కనిపించింది అందుకే నిజం కోసం వెతికాను. ఈరోజు ఆ నిజం బయటికి వచ్చింది.
కానీ ప్రేమ అంటే మాటల్లో చెప్పడం కాదు… చూపించడం.
ప్రేమ అంటే కష్టాలను జయించడం. నిజమైన ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది. ఇప్పుడు అదే జరిగింది.
ఇంకో విషయం నేను మీ స్నేహితుడు రఘురామ్ కొడుకుని. మీరు ఇంకా నాన్న ఫ్రెండ్స్ అని నాకు ఇక్కడికి ఒచ్చే ముందే తెలిసింది.
చిన్నప్పుడు మీరు మా నాన్నకి మాట ఇచ్చారు రూపా కి ఇంకా నాకు పెళ్లి చేస్తాం అని, నాన్న ఒక్కటే చెప్పారు రూప ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ ప్రేమను మాత్రమే కాదు, నా స్నేహాన్ని కూడా తిరిగి పొందవచ్చు అని
నేను రూపని పెళ్లి చేసుకోవటం కేవలం నా కోసం కాదు… మీరు మల్లి కలిసిపోవాలి అన్నా కోరికతో కూడా.
వ్యాపారంలో మీకు, నాన్నకి సమస్యలు వచ్చినా… మీ కూతురు సంతోషం ముందు అవన్నీ చిన్నవే.
దయచేసి… మా పెళ్లికి అంగీకరించండి. ఈ పెళ్లి మీ స్నేహాన్ని తిరిగి కలపాలి.”
జితేంద్ర కళ్లలో కన్నీళ్లు. తాను చేసిన తప్పులకి సారీ చెబుతూ, చివరికి “సరే” అని అంగీకరిస్తాడు. అందరు హర్షధ్వానాలు చేస్తారు.
పెళ్లి మళ్లీ మొదలవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. జితేంద్ర, రఘురామ్ ఇద్దరు కలసి ఆశీర్వదిస్తారు. రూప, సాయి పెళ్లి బంధంతో ఒక్కటవుతారు.
రూప సాయిని కన్నీళ్లతో చూస్తుంది. సాయి ఆమె చెయ్యి పట్టుకుని సైలెంట్‌గా నవ్వుతాడు.
అలా సాయి-రూప ప్రయాణం మొదలు అవుతుంది.
వారిద్దరి ప్రేమ పరీక్షలు, కుటుంబ సమస్యలు అన్నింటినీ అధిగమించి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది.
“ప్రేమ అనేది గెలవడమే కాదు… అందరిని కలపడం, హృదయాలను కాపాడడం కూడా.”
ముగింపు...
Comments