కొన్ని దశాబ్దాల క్రీతం:-
పొగమంచు కమ్మిన ఒక గ్రామం, ఆ గ్రామం పేరు నల్లగూడెం.
గ్రామంలో ఒక పాత కోట ఉంది. ఆ కోటలోకి ఎవరు అడుగుపెట్టరు.
అక్కడి వారు అంటుంటారు “కోటలో ఒక స్త్రీ ఆత్మ ఉంటుంది… లోపాలికి వెల్లినా వారిని మరుసటి రోజు తెల్లవారక ముందే చంపుతంది" అని.
అ గ్రామనికి పట్టణం నుంచి హరి అనే ఒక శాస్త్రవేత్త వస్తాడు. అతనికి ఆ కోటలో పురాతన రహస్యాలు ఉన్నాయనిపిస్తుంది. గ్రామస్తులు ఆ కోటలో కి వెల్లవద్దు అని హెచ్చరిస్తారు. కానీ అతను వినకుండా కోట దగ్గరికి వెళతాడు.
హరి ఆ కోట దగ్గర టెంట్ వేసుకోని అ రాత్రి అక్కడే ఉంటాడు. రాత్రి 12 దాటిన తర్వాత మెల్లగా వీణ వాయించే శబ్దం వినిపిస్తుంది. తన రికార్డర్ ఆన్ చేస్తాడు. శబ్దం దగ్గరగా వస్తుంది. ఆ శబ్దం దుఃఖంతో నిండి ఉంది.
హరి టెంట్ నుండి బయటకి వచ్చి ఫ్లాష్‌లైట్ వెసి చుస్తాడు, ఎవరు కనపడరు.
కానీ నేలపై రక్తపు కాళ్ల ముద్రలు కనిపిస్తాయి, ఆ రక్తపు కాళ్ల ముద్రలని వెంబడిస్తు హరి కోట లోపలికి వెల్తాడు. అలా కోట లోపలికి వెళ్లిన హరి తిరిగీరాలేదు.
మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి చూస్తారు, హరి కోట ముందు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక రాతి పలక ఉంటుంది. ఆ పలకపై “నా గురించి తెలుసుకోవాలి అని అనుకోవద్దు, నా జోలికి రావొద్దు.” అని రాసి ఉంటుంది.
ఆది చూసిన గ్రామస్థులు "చెప్పిన వినకుండ కోట లోపాలికి వెళ్ళాడు, ఇప్పుడు చనిపోయాడు" అని అనుకుంటారు."
ప్రస్తుతం:-
సిటీ లో ఓక హాస్పిటల్, రిషికేశ్ (రీషి) ఒక మానసిక వైద్యుడు (సైకియాట్రిస్ట్). తన క్యాబిన్ లో కూర్చున్నాడు.
ఎదురుగా ఒక పేషెంట్ "డాక్టర్… రాత్రిళ్లు నిద్ర రావడం లేదు. ఎవరో నన్ను చూస్తున్నట్టు ఉంటుంది, భయం గా ఉంటుంది.”
రిషి (స్మైల్ చేస్తూ): మన భయాలు మనమే సృష్టిస్తాం రాజేశ్…
వాటిని బయటకి చెప్పగలిగితే అవి మన మీద ప్రభావం చూపవు. నేను మందులు ఇస్తాను ఇవి వాడండి, ఇంకా రోజూ యోగా, ధ్యానం చేయండి. ఓక 10 రోజుల తరవాత చెకప్ కి రావాలి.
నర్స్ తలుపు తట్టి “డాక్టర్, మీ నెక్స్ట్ పేషెంట్ రెడీ”
రిషి: ఐదు నిమిషాల తర్వాత పంపండి.
సిటీ కాలేజ్ క్యాంపస్:
క్యాంపస్ వాతావరణం చల విశాలంగా ఉంది, వర్షం తర్వాత తడిసిన నేల నుంచీ వచ్చే వాసన అద్భుతం గా వస్తుంది, స్టూడెంట్స్ నవ్వుతు క్లాస్‌లకు పరుగులు పెడుతున్నారు.
తెల్ల డ్రెస్ లో బంగారు దుపట్టా వేసుకుని నడుస్తు అన్వి వస్తు ఉంటుంది.
చూడటానికి అమాయకంగా ఉన్నా, కానీ కళ్ళలో ఆత్మవిశ్వాసం.
ఆ నవ్వు చీకట్లకు వెలుతురు తెచ్చేంత సున్నితమైనది.
ఫ్రెండ్ 1 (హారిక): అన్వి! ఇంకా నీ ప్రాజెక్ట్ టాపిక్ డెసైడ్ కాలేదా?
అన్వి: కాలేజీ కి ఒచ్చే దారిలో ఫైనల్ చేసుకున్నా.
ఫ్రెండ్ 2 (లాస్య): ఏమిటి అ టాపిక్?
అన్వి (సీరియస్ వాయిస్ లో): మన్నుష్యుల భయం (Human Fear). మనుష్యుల భయం సాధారణం కదా, సో అసలు ఈ భయం ఎందుకు వస్తుంది అని నా టాపిక్. మనలో చాలా మందికి దయ్యాలు అంటే భయం ఉంటుంది. అందుకే దెయ్యాల ప్రదేశాలు (హాంటెడ్ ప్లేసెస్) చూడాలి అనుకుంటున్నా. నా పైనా నేనే ప్రయోగం చేయలి అని నా ఆలోచన.
ఫ్రెండ్స్ షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటారు.
ఫ్రెండ్ 1 (హారిక): నువ్వు బాగానే ఉన్నావా? దయ్యాలా మీద ప్రాజెక్ట్ ఆహ్?
అన్వి (స్మైల్ చేస్తూ): అవును!
ఫ్రెండ్ 2 (లాస్య): అసలే నీకు దెయ్యం అంటే భయం కదా! ఎల చెస్తావ్ ఇ ప్రాజెక్ట్?
అన్వి: ఏమో నాకు తెలియదు, నా భయం పోవాలి అంటే నాకు ఈ ప్రాజెక్ట్ చేయడం ఏ సరైనది అనిపిస్తుంది.
అన్వి లైబ్రరీలో పారాసైకాలజీ, మానవ భయం, మనస్సు & భ్రమలపై పుస్తకాలు చదువుతుంది.
అన్వి (మనసులో): భయం నిజమా? లేక మనసు సృష్టించిన మాయా?
దీని జవాబు కోసం నేనొక సైకియాట్రిస్ట్‌ని కలవాలి.
అన్వి తన ప్రొఫెసర్ సలాహతో డాక్టర్ అయిన రిషిని కలవడికి వెళుతుంది.
హాస్పిటల్ బయట. అన్వి బైక్ నుంచి దిగుతుంది. హాస్పిటల్ బోర్డ్ కనిపిస్తుంది “సిటీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్”.
ఆమె ఫ్రంట్ ఆఫీస్ దగ్గర రిసెప్షనిస్ట్‌ని అడుగుతుంది.
అన్వి: డాక్టర్ రిషికేష్ గారిని కలవచ్చా? నన్ను ప్రొఫెసర్ రఘునందన్ గారు పంపించారు.
రిసెప్షనిస్ట్: అపాయింట్‌మెంట్ ఉంద అండి?
అన్వి: లేదు, ప్రాజెక్ట్ కోసం చిన్న మీటింగ్ డాక్టర్ గారికి తెలుసు.
రిసెప్షనిస్ట్ (ఫోన్ లో): సార్, ఓక స్టూడెంట్ కలవడం కోసం వచ్చింది.
రీషి: సరే ఒక 15నిమి తరవాత మన గార్డెన్ దగ్గర కి పంపించండి.
హాస్పిటల్ గార్డెన్ (సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లోపల ఉన్న చిన్న గార్డెన్)
పచ్చగా ఉన్న చెట్లు, నెమ్మదిగా ఊగుతున్న ఆకులు, పక్షులు మెల్లగా కూస్తున్నాయి. హాస్పిటల్ లోపల గందరగోళం ఉన్నా, ఈ గార్డెన్ మాత్రం ప్రశాంతంగా ఉంది.
రీషి బెంచ్ మీద కాఫీ తగుతు, పక్కన కొన్ని రీసెర్చ్ ఫైల్స్ చూస్తున్నాడు.
నెమ్మదిగా అక్కడికి అన్వి వస్తుంది.
అన్వి: డాక్టర్ రిషికేష్?
రిషి: అవును. నువ్వు అన్వి కదా? ప్రాజెక్ట్ విద్యార్థిని?
అన్వి: అవును సార్. దెయ్యాల ప్రదేశాలు మరియు మానవ భయం (Haunted places and human fear) అనే టాపిక్ మీద ప్రాజెక్ట్ చేస్తున్నాను.
రిషి కొంచెం ఆసక్తిగా చూస్తాడు.
రిషి: ఆసక్తికరమైన అంశం. కానీ దెయ్యాల ప్రదేశాలు ఎందుకు?
అన్వి (స్మైల్ చేస్తూ): అసలే... నాకు దెయ్యాల ఆంటే చాలా భయం సార్.
అందుకే... ఈ భయం ని ఎదురించలి అనిపించింది.
రీషి: అంటే… భయాన్ని తెలుసుకోవడానికి భయం వైపే వెళ్తున్నావు?
అన్వి (నవ్వుతూ): సరిగ్గా చెప్పారు.
రీషి తన కాఫీ టేబుల్ మీద పెట్టి. అన్వి ఎదురుగ కూర్చుంటుంది.
రీషి (సీరియస్ గా): భయం అనేది చాలా వ్యక్తిగతమైనది అన్వి. కొందరికి అది చీకటి, కొందరికి ఒంటరితనం, మరికొందరికి జ్ఞాపకాలు.
అన్వి (ఆసక్తిగా): జ్ఞాపకాలు?
రీషి: అవును… కొన్ని సార్లు మన మనసులో పరిష్కారం కాని భావోద్వేగాలు భయాల రూపంలో బయటకు వస్తాయి.
సరె నీ ప్రాజెక్ట్ ప్రారంభం చేయాలంటే, ముందు నీ భయం ని రికార్డ్ చేయాలి అన్వి.
అన్వి (అయోమయం గా): నా భయం ఆ?
రీషి: అవును. దెయ్యం కథలు వినగానే నీకు ఏం అనిపిస్తుందో,
ఏం ఫీల్ అవుతుందో నోట్ చేసుకో. మనం భయాన్ని విశ్లేషానా చేద్దాం.
అన్వి తల ఊపుతుంది.
రీషి: నువ్వు నన్ను సార్ అని అనకు, రిషి అని పిలువు చాలు.
అన్వి: సరే రిషి. నేను సైకియాట్రిస్ట్ అంటే పెద్ద వారు అనుకున్న మీరు చాలా యంగ్ గా ఉన్నారు. నేను ఇక వేలతాను.
అన్వి, థాంక్స్ చెప్పి అక్కనుండి వెళ్ళిపోతుంది.
ఒకరోజు అన్వీ లైబ్రరీ లో తన భయాలు ఏంటి అని నోట్ చేస్తు ఉంటుంది, అదే టైమ్ లో రీషి కాల్ చేసాడు
రీషి (ఫోన్ లో): అన్వి ని ప్రాజెక్ట్ విషయం గా నీలోని భయం ని తెలుసుకోవాలి అని చెప్పా కద, ఒక పాత సినిమా సెట్, అందులో డెవిల్ సినిమాల షూటింగ్ చేసెవారు. మనం అక్కడికి వెళ్ళాలి నువ్వు ఎప్పుడు ఫ్రీ గా ఉంటావ్.
అన్వి: శుక్రవారం ఫ్రీ రీషి వెల్దాం.
రీషి: సరే శుక్రవారం సాయంత్రం హాస్పిటల్ దగ్గరికి రా అక్కడనుండి వెల్దాం .
శుక్రవారం దెయ్యాల ప్రదేశం (షూటింగ్ సెట్)
సూర్యాస్తమయం కాంతి మెల్లగా చీకటిగా మారుతుంది.
పాత మట్టి ఇళ్ళు, తెగిపోయిన తెరలు, చెల్లాచెదురైన బల్లాలు, విరిగి పోయిన తలుపులు.
రీషి, అన్వి ఇద్దరూ టార్చెస్ పట్టుకుని నడుస్తున్నారు. అన్వి తడబడి ఒక్కసారి ఆగిపోతుంది.
అన్వి (నర్వస్‌గా): రీషి… నిజంగా ఇక్కడ షూటింగ్ చేసేవారా?
రీషి: అవును. ఇక్కడే చాల సినిమాలు షూట్ అయ్యాయి.
కానీ తరువాత ఒక టెక్నీషియన్ ప్రమాదం లో చనిపోయాడట అప్పటి నుంచి ఇక్కడ షూటింగ్ తీయడం ఆపేసారు.
అన్వి (మెల్లగా): అందుకే దెయ్యాల ప్రదేశం అంటారా…
రీషి: అవును.
అలా వారిద్దరు ఆ ప్లేస్ మొతం చూస్తారు. అన్వి ఎలా ప్రవర్తిస్తోంది అని రీషి గమనిస్తు ఉంటాడు. 1 గం ఇయ్యక ఇంటికి స్టార్ట్ అవుతారు.
రీషి కార్ డ్రైవ్ చేస్తు అన్వి తో ఇలా అంటాడు - "అన్వి నిన్ను ఈరోజు గమనించను నీకు భయం అనేది లేదు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తునవు."
అన్వి: అలా ఎం లేదు రీషి నాకు భయం ఎ నేను సింగిల్ గా ఉంటే చాలా భయం వేసేది కానీ నాకు నువ్వు తోడు గా ఉన్నావ్ కదా అందుకే నాకు భయం పోయింది.
ఇలా లైఫ్ లాంగ్ నువ్వు నా తోడు ఉంటావా రీషి?
కార్ బ్రేక్ వేస్తాడు రీషి
రీషి: ఏం అంటునావ్ అన్వి, ప్రపోజ్ చేస్తున్నావా?
అన్వి: అవును ఫస్ట్ టైమ్ నిన్న హాస్పిటల్ లో చూడగానే నచ్చావ్, అప్పుడే మనకు పరిచయం అయింది. వెంటనే చెప్తే ఎం అనుకుంటావో తెలియదు, నీకు పెళ్లి అయి ఉండోచు లేద లవర్ ఉండోచు అని ఆలోచించి నీకు ఆ రోజు చెప్పలేదు.
ఆ తర్వాత, రోజు నీతో మాట్లాడం కలవడం నీతో పరిచయం ప్రేమగా మారింది. నువ్వు సింగిల్ అని లవర్ కూడా లేదు అని తెలిసింది.
నీతో గడిపిన సమయం, నీతో మాట్లాడిన మాటలు, ఈరోజు ఇలా నీ పక్కన ఉండాడం నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నా భయం కి పరిష్కారం నువ్వే అని తెలుసుకున్నాను.
నీకు ఇష్టం అయితే సరే చెప్పు లేదు అంటే ఈ టాపిక్ ఇక్కడే మరిచిపోతాను.
రీషి: హే! అలా కాదు నువ్వు అంటే నాకు ఇష్టం. కని ముందు నువ్వు నీ చదువు పూర్తి చేయు. తరవాత మన తల్లిదండ్రులు తో మట్లాడుదాం.
అన్వీ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతోంది.
వారం రోజుల తర్వాత కాలేజ్ ఆడిటోరియం:
అన్వి స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇస్తోంది. స్క్రీన్ మీద “దెయ్యాల ప్రదేశాలు మరియు మానవ మనస్సు ఒక మానసిక అధ్యయనం.” గురించి చిత్రాలు చూపిస్తుంది.
అన్వి (నమ్మకంగా): దయ్యాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు...
కానీ భయం ఖచ్చితంగా మనలో నివసిస్తుంది. మరియు మనం భయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం దానిని అధిగమిస్తాము.
ఇల తన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చాలా కాన్ఫిడెంట్ గా ప్రాజెక్ట్ గురించి చెబుతుంది.
తను చెప్పడం పూర్తి అయ్యాక అక్కడ ఉన్నవారందరు చప్పట్లు కొడతారు.
ప్రొఫెసర్: అన్వి చాలా బాగా చేసావ్ ప్రాజెక్ట్. భయాన్ని జ్ఞానంగా మార్చావ్. అభినందనలు.!”
అన్వీ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, ఇంకా ఈ ప్రాసెస్ లో తనకి ప్రేమ కూడా దొరికింది, తనలోని భయం పోయింది.
రీషి ఇంకా అన్వి ప్రేమలో ఉన్నారు. కాఫీ షాప్స్ లో మీటింగ్స్, షాపింగ్ ఇంకా సినిమాస్ ఇలా వారిదారు జీవితం సాగిస్తున్నారు.
అలా 2 సంవత్సరాలు గడిచింది.
ఈ 2 సంవత్సరాలు లో రీషి తన సొంత క్లినిక్ ప్రారంభం చేసాడు, అన్వి కూడా తన చదువు పూర్తి చేసింది. ఇప్పుడు తను ఒక డాక్యుమెంటరీ మేకర్ దెయ్యాల ప్రదేశాలు పై రీసెర్చ్ చేస్తుంది.
అన్వీ ఇంకా రీషి తమ ప్రేమని ఇంట్లో చెప్తారు. వాళ్ల పెళ్లికి ఇంట్లో వారు కూడా ఒప్పుకుంటారు. పెళ్లి చేసుకోని ఇద్దరు సంతోషం గా ఉంటారు.
ఒకరోజు అన్వి తన డాక్యుమెంటరీ పని లో బాగంగా ఒక గ్రామనికి వెల్తుంది. తను వెళ్లిన గ్రామం నల్లగూడెం.
మంచు కమ్మిన అడవి రోడ్డులో కార్ నెమ్మదిగా వెళ్తుంది. లోపల అన్వి తను చేస్తున్న రీసెర్చ్ గురించి తన కెమెరాలో రికార్డ్ చేస్తుంది. తను వెళుతున్న ప్లేస్ గురించి కెమెరా చూసి చెబుతుంది.
అల వెల్తుండగ కారు అక్స్మతుగ ఆగిపోతుంది. దూరంలో తను వెళ్ళాలి అనుకున్న పాత కోట కనిపిస్తుంది. అక్కడికి వెళ్తుంది అన్వి.
ఆ కోట గేట్ పైనా ప్రమాదం లోపాలికి వేలకుడదు అని ఒక బోర్డు ఉంటుంది.
అది ఏమి పటించుకోకుండా అన్వీ కెమెరా రికార్డ్ చేస్తు లోపలికి వెళ్తుంది.
అలా వెల్తుండగా అన్వి కి ఒక ఆడ గొంతు వినిపిస్తుంది “ఎందుకు వచ్చావ్…?” అని అంటుంది.
అన్వి అది ఏమి పట్టించుకోకుండా ఇంకా లోపలికి వెళ్తుంది. గోడల మీద పాత రక్తపు మరకలు, గాలి చప్పుళ్లు, చీకట్లో అర్ధం కాని శబ్దాలు.
అన్వి కెమెరాలో రికార్డ్ చేస్తోంది, ఫుటేజ్‌లో “తన వెనుక ఇంకో వ్యక్తి నీడ” ఉన్నటు కనిపిస్తుంది.
వెంటనే చుట్టు మొతం టార్చ్ వేసి చూస్తుంది, తనకి ఎం కనబడాదు. అసలు ఇ కోట ఏంటి అని తెలుసుకోడం కోసం ప్రయత్నం చేస్తుంది. అలా వెతుకుతూ ఉండగ తనకి ఒక పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకం లో పెజిలు మట్టి తో ఉన్నాయ్ అక్షరాలు సరిగ్గ కనిపించడం లేదు. అన్వీ ఆ పుస్తకం ని క్లీన్ చేసి చూస్తుంది. ఆ పుస్తకంలో కోట కి సంబంధంచిన చరిత్ర ఉంటుంది. అన్వి కోట చరిత్ర ఇంకా అ కోట లో ఏం జరిగింది అని చదువుతుంది.
కొన్నీ ఏళ్ల క్రితం ఇ కోట లో భైరవి అనే వధువు పెళ్లి రోజు అన్యాయంగ చంపబడింది అని తెలుసుకుంటుంది.
అలా తను కోట రహస్యం తెలుసుకుంటుండగా కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది.
స్లోగా ఫుటేజ్‌లో ఒక తెల్ల చీరలో ఉన్న మహిళ గోడ మీద నుండి జారుతూ వస్తుంది.
అన్వి: “ఎవరవు నువ్వు…?” అని అంటుంది.
ఒక గొంతు వినిపిస్తుంది: "నీ చావుని. నువ్వు నీ చావుని వెతుకుతు ఇక్కడికి వచ్చావ్. నువ్వు తప్పించుకోలేవు” అని అంటుంది.
అన్వి కోట నుంచి బయటకు పరుగెడుతుంది. కానీ ప్రతి దారిలో ఓకే తలుపు వస్తుంది. భైరవి నీడ ఆమె వెనుకకు చేరుతుంది.
ఓకా వైపు రీషి క్లినిక్ దగ్గర ఉన్నాడు. బయట వర్షం. విండో మీద నీటి చుక్కలు పడుతున్నాయి.
రిషి రిపోర్ట్స్ క్లోజ్ చేసి, అన్వి కి ఫోన్ చేస్తాడు. నెట్‌వర్క్ లేదు అని వస్తుంది.
రిషి: ఎందుకు నెట్‌వర్క్ లేదు…సాధారణంగా రాత్రికి కంపల్సరీ కాల్ చేసేది… అని అనుకుంటాడు.
రిషి పదే పదే కాల్ చేస్తాడు “మీరు సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్‌లో ఉంది" అని వాయిస్ వస్తుంది.
రిషి అకస్మాత్తుగా లేచాడు. కోటు వేసుకుని బ్యాగ్ తీసుకుంటాడు. రిషి కళ్ళ నిండా టెన్షన్. అన్వి కి ఏమైనా జరిగి ఉంటుందా అని అనుకుంటాడు.
తన ఫ్రెండ్ ద్వార అన్వి లాస్ట్ లొకేషన్ తెలుసుకుంటాడు. నల్లగూడెం కోట అని తెలిసి అక్కడికి వెళతాడు.
కోట దగ్గర: సమయం రాత్రి 2 గం.
గాలి ధ్వని ఇంకా ఉరుములాతో కుడిన వర్షం. రిషి కోట గేట్ దగ్గరకి వస్తాడు అదే హెచ్చరిక బోర్డు కనిపిస్తుంది "ప్రవేశించవద్దు - డేంజర్ జోన్" అని.
ఎది ఎం అయిన అన్వి కోసం రీషి కోట లోపలికి వెళతాడు. అన్వి కెమెరా కనిపిస్తుంది.
రిషి తన కెమెరాను తిస్తుకుంటడు, స్క్రీన్ మీద చివరిగా రికార్డ్ చేయబడిన వీడియో ని చూస్తాడు అన్వి వెనుక ఒక నీడ కనిపిస్తుంది.
రిషి (షాక్ తో): ఓరి దేవుడా... అన్వి డేంజర్ లో ఉంది.
రిషి అన్వి కోసం వెతుకుతాడు. ఒక చోటా నేల పైనా అన్వీ బ్రాస్లెట్ కనిపిస్తుంది. అతను దానిని తీసుకుంటాడు.
రిషి (మనసులో): అన్వీ... నువ్వు బాగానే ఉంటావు... నేను నిన్ను కాపాడుకుంటాను.
అప్పుడే రీషికి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. భైరవి గొంతు ప్రతిధ్వనిస్తోంది. “తను తప్పించుకోలేకపోయింది… నువ్వు కూడా తప్పించుకోలేవు …” అని వాయిస్ వినిపిస్తుంది.
రిషి ఒక్కసారిగా వెనకి తిరిగాడు కారిడార్ చివర తెల్ల చీర కట్టుకున్న స్త్రీని చూశాడు.
రిషి: నువ్వెవరో నాకు తెలియదు… కానీ అన్విని వదిలేయ్! అని అంటాడు
భైరవి: నన్ను ఎవ్వరు కాపాడలేకపోయారు… నేనెవరినీ వదలను... అని అంటుంది.
రిషికి ఆ మాటల్లో ఉన్నా బాధ అర్థమైంది. అతను నెమ్మదిగా దగ్గరికి వెళ్తాడు.
గోడ మీద రక్తంతో రాసిన వాక్యం “న్యాయం కావాలి" అని కనిపిస్తుంది.
భైరవి ఆత్మ అన్యాయంలో చిక్కుకుందని రిషి గ్రహిస్తాడు.
అన్వి కోసం వెతుకున్న రీషికి మెట్ల దగ్గర అన్వి అపస్మారక స్థితిలో ఉన్నట్లు చూస్తాడు.
అతను పరిగెత్తి, ఆమెను మెల్లగా పట్టుకున్నాడు.
రిషి (కన్నీళ్లు పెట్టుకుంటూ): అన్వి... కళ్ళు తెరిచి చూడు నేను రీషి ని...
"అన్వి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. రీషి నువ్వు ఎంటి ఇక్కడ, నువ్వు ఎల వచ్చావ్" అని అంటుంది.
రిషి అన్విని కూర్చోబెడతాడు. అన్వి ముఖంలో భయం, కన్నీళ్లు.
రీషి: ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అన్వి? అని అడుగుతాడు
అసలు అన్వి ఇ కోట కి ఎందుకు వచ్చింది, కారణం ఎంటి అని రీషి కి చెబుతుంది.
అన్వి మట్లాడుతు: నా తాతయ్య హరి చనిపోయిన చోటు ఇది…
నేను కాలేజ్ లో ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఎ ప్రాజెక్ట్ చేయలి అని అలోచిస్తునప్పుడు మా తాతయ్య ఇ కోట దగ్గర చంపబడ్డాడు అని మా నాన్న ద్వారా తెలిసింది.
అప్పుడే ఫిక్స్ అయ్యాను మా తాతయ్య చావుకి కారణం ఏంటి తెలుసుకోవాలి అని అనుకున్నా.
నాకు భయం అని తెలిసిన కూడా ప్రాజెక్ట్ చేసాను. నీ సహాయంతో నా లోని భయానీ పొగుట్టుకున్నాను.
నేను ఈ కోట చరిత్ర చదివినప్పుడు నాకొక విషయం తెలిసింది.
ఇ కోటలోకి ఎ మొగవాడు ప్రవేశించిన భైరవి చంపేస్తుంది. ఆడవారిని పిచ్చి పటేలగా చేస్తుంది.
ఎందుకు అంటే భైరవిని పెళ్లి చేసుకున్న వాడు మంచి వాడు కాదు, తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తనని ఇ కోటలోనే చంపేసాడు.
అప్పటినుండి ఇ కోటలో ఆత్మల భైరవి ఉంది. ఎ మొగవాడు ఇ కోటలోకి ఒచ్చిన ఆ మొగవాడిలో తనని చంపిన వారిని చుస్తుంది తర్వాత వచ్చిన వారిని చంపేస్తుంది.
అలా వచ్చిన మా తాతయ్య ని కూడా భైరవి చంపేసింది.
ఇప్పుడు మన వంతు వచ్చింది రీషి. మనం భైరవికి సహాయం చేయాలి తన ఆత్మనీ ప్రశాంతం గా ఇ భూమి నుండి పంపించాలి.
ఇలా వారిదారు మాట్లాడుతుండగా పక్కన ఉన్న పెద్ద స్తంభం రీషి పైనా పడబోతుంటే అన్వీ రీషి ని పక్కకు నెటేస్తుంది.
అప్పుడు అన్వి గట్టిగ అరుస్తు "నిన్ను మోసం చేసినవాడు వెళ్లిపోయాడు, చనిపోయాడు. కానీ నీ బాధ ఇంకా ఈ కోటలో బతుకుతోంది. నీకు స్వేచ్ఛ కావాలంటే అందరిని చంపడం కాదు క్షమించాలి. నువ్వు శాతించలి అంటే ఏం చేయాలి" అని భైరవి నీ అడుగుతుంది.
అప్పుడు భైరవి వారి ముందుకు వస్తుంది.
భైరవి: నన్ను మోసం చేసిన వాడు చావలేదు నీ పక్కనే ఉన్నాడు.
అన్వి: లేదు నిన్ను మోసం చేసిన వాడు చనిపోయాడు. నువ్వు మొగవారి అందరిలో ఒక్కరినే చూస్తునావు. కొంచం శతంగా ఉండి ఆలోచించు. నిజం నీకే తెలుస్తుంది.
అన్వి ఎంత చెప్పిన భైరవి మాట వినదు.
చివరకి ఎం చేయాలో తెలియక రీషి ముందుకొచ్చి భైరవి ని మోసం చేసింది తనే అని ఒప్పుకుంటాడు. నన్ను క్షమించు అని అంటాడు.
భైరవి చూస్తు ఉండగా పక్కాన ఉన్నా నిప్పులో గుండెం లో దుకేస్తాడు. ఆ మంటల్లో కాలిపోతాడు.
ఆ దృశ్యం చూసిన భైరవి ఆత్మ శాతింస్తుంది, భైరవి ఆత్మ నెమ్మదిగా గాలిలో కలిసిపోతుంది. కోట నుండి వెళ్ళిపోతుంది. గోడ మీద “న్యాయం కావాలి” అన్న రాత “శాంతి లభించింది” గా మారుతుంది.
రీషి కోసం అన్వి ఏడుస్తు ఉంటుంది. అప్పుడే అక్కడికి రీషి వస్తాడు.
రీషిని చూసిన అన్వి ఆశ్చర్యపోతుంది. నిప్పులో కలిపోయిన రీషి ఎల వచ్చడు అని.
రీషి ఇది అంత ఎలా చేసాడో వివరిస్తాడు. అన్వి నువ్వు భైరవి తో మాట్లాడుతు ఉన్నావు, తను నీ మాట వినడం లేదు. అప్పుడే నాకు మనిషి లా ఉన్నా ఈ బొమ్మ కనిపించింది.
నిప్పులో దుకిన్నటు చేసి పక్కనే ఉన్నా బొమ్మ ని నిప్పులో వేసాను ఎవరికి కనిపించకుండా బాధపాటినట్టు అరిచను. భైరవి ని క్షమించామని అడిగాను.
ఇది అంత నా వృత్తిలో పేషెంట్స్ కి చేసే టెక్నిక్, చికిస్తా లాటిది. చూడు నాకు ఏం కాలేదు నేను బానే ఉన్నాను. నేను భైరవిని మోసం చేయలేదు తన ఆత్మకి శాంతినిచ్చాను.
భైరవి శాంతి పొందింది అన్వి… ఇక్కడా నుండీ వెళ్ళిపోయింది. అని చెప్తాడు.
అన్వి కళ్లలో కన్నీళ్లు, కానీ చిన్న చిరునవ్వు. రిషి ఆమె చెయ్యి పట్టుకుంటాడు.
రిషి: ఇప్పుడు నీ తాతయ్యకు కూడా శాంతి దొరికింది అన్వి…
అన్వి: అవును రిషి… నాకు కూడా…
ఉదయపు వెలుతురు నెమ్మదిగా పొగమంచును చీల్చుకుంటూ వెళుతుండగా పాత కోటను వదిలి ఇద్దరు కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు...

Comments