కల నిజం అయిన వేళ - # అధ్యాయం 8: కుటుంబంలా అనిపించడం
మరుసటి ఉదయం... సాయి ఆఫీస్‌కి వెళ్లగానే ప్రెజెంటేషన్ గురించి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు. చెన్నై బ్రాంచ్‌లో మొదటిసారి.. సీనియర్ ఎంప్లాయీస్ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. కానీ, ఈసారి సాయి లోపల కొంత కాన్ఫిడెన్స్ ఉంది. బహుశా శరణ్యను కలిసిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన ఆ పాజిటివ్ ఫీలింగ్ వల్ల కావచ్చు.. మీటింగ్ మొదలవుతుంది. ప్రొజెక్టర్ ఆన్ అవుతుంది. సాయి స్టేజ్ వైపు నడుస్తాడు. మొదటి కొన్ని క్షణాలు టెన్షన్‌గా అనిపించినా కూడా, ప్రెజెంటేషన్ మొదలైన తర్వాత అతను చాలా స్మూత్‌గా కొనసాగిస్తాడు. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్... కాన్ఫిడెంట్ వాయిస్.. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్... అందరూ శ్రద్ధగా వింటారు. ప్రెజెంటేషన్ ముగిసిన వెంటనే... మీటింగ్ రూమ్‌లో చప్పట్లు వినిపిస్తాయి. మేనేజర్ కూడా గర్వంగా ఫీల్ అవుతాడు. “గుడ్ జాబ్ సాయి” అని మెచ్చుకుంటాడు. ఆ క్షణంలో మొదటిసారి సాయికి తన మీద తనకే కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. చెన్నైలోని పని ఊహించిన దానికంటే త్వరగా పూర్తవుతుంది. టీమ్ హైదరాబాద్‌కి తిరిగి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. కానీ సాయంత్రం స...