కల నిజం అయిన వేళ - # అధ్యాయం 8: కుటుంబంలా అనిపించడం
మరుసటి ఉదయం... సాయి ఆఫీస్‌కి వెళ్లగానే ప్రెజెంటేషన్ గురించి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు.
చెన్నై బ్రాంచ్‌లో మొదటిసారి.. సీనియర్ ఎంప్లాయీస్ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వాలి.
కానీ, ఈసారి సాయి లోపల కొంత కాన్ఫిడెన్స్ ఉంది. బహుశా శరణ్యను కలిసిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన ఆ పాజిటివ్ ఫీలింగ్ వల్ల కావచ్చు..
మీటింగ్ మొదలవుతుంది. ప్రొజెక్టర్ ఆన్ అవుతుంది. సాయి స్టేజ్ వైపు నడుస్తాడు.
మొదటి కొన్ని క్షణాలు టెన్షన్‌గా అనిపించినా కూడా, ప్రెజెంటేషన్ మొదలైన తర్వాత అతను చాలా స్మూత్‌గా కొనసాగిస్తాడు.
క్లియర్ ఎక్స్‌ప్లనేషన్... కాన్ఫిడెంట్ వాయిస్.. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్...
అందరూ శ్రద్ధగా వింటారు. ప్రెజెంటేషన్ ముగిసిన వెంటనే... మీటింగ్ రూమ్‌లో చప్పట్లు వినిపిస్తాయి.
మేనేజర్ కూడా గర్వంగా ఫీల్ అవుతాడు.
“గుడ్ జాబ్ సాయి” అని మెచ్చుకుంటాడు.
ఆ క్షణంలో మొదటిసారి సాయికి తన మీద తనకే కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది.
చెన్నైలోని పని ఊహించిన దానికంటే త్వరగా పూర్తవుతుంది.
టీమ్ హైదరాబాద్‌కి తిరిగి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది.
కానీ సాయంత్రం సాయి ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది.
From: శరణ్య --- “ఈ సాయంత్రం బీచ్ దగ్గర కలుద్దామా”
ఆ ఒక్క మెసేజ్ చూసిన వెంటనే సాయి ముఖంపై ఆటోమేటిక్‌గా నవ్వు కనిపిస్తుంది.
అతను మేనేజర్ దగ్గరకు వెళ్లి అంటాడు, “సర్… నాకు కొంచెం పర్సనల్ పని ఉంది… రాత్రికి నేరుగా బస్ స్టాప్‌కి వస్తాను”
అతను మేనేజర్ దగ్గరకు వెళ్లి అంటాడు, “సర్… నాకు కొంచెం పర్సనల్ పని ఉంది… రాత్రికి నేరుగా బస్ స్టాప్‌కి వస్తాను”
బస్ టైమింగ్ 9:30 PM కావడంతో అప్పటికి తిరిగి వస్తానని చెబుతాడు.
సాయంత్రం బీచ్. సూర్యాస్తమయం ఆకాశాన్ని ఆరెంజ్ రంగుతో కప్పేస్తుంది.
సాయి మరియు శరణ్య మాట్లాడుకుంటూ బీచ్ పక్కగా మెల్లగా నడుస్తుంటారు.
ఈసారి వారి సంభాషణలు మరింత వ్యక్తిగతంగా మారుతాయి.
సాయి తన జీవితాన్ని గురించి ఓపెన్ అవ్వడం మొదలుపెడతాడు.
“నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం… ఒక రోజు నా సొంత స్టూడియో ఉండాలి… ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వడం నా కల”
అని చెబుతాడు.
అని చెబుతాడు.
శరణ్య ఆసక్తిగా వింటుంది. “మీరు ఖచ్చితంగా అవుతారు సైనాథ్… మీలో ఆ టాలెంట్ ఉంది... మీ ఫోటోల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది” అని అతన్ని మోటివేట్ చేస్తుంది.
ఆ మాటలు సాయి హృదయాన్ని లోతుగా తాకుతాయి.
అకస్మాత్తుగా ఒక దొంగ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి శరణ్య మెడలోని గోల్డ్ చైన్ లాగడానికి ప్రయత్నిస్తాడు.
శరణ్య షాక్‌తో అరుస్తుంది.
కానీ సాయి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ దొంగను పట్టుకుంటాడు.
బీచ్ మధ్యలో చిన్న ఫైట్ జరుగుతుంది.
చివరికి సాయి ఆ దొంగను కొట్టి అక్కడే పట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అప్పగిస్తాడు.
కానీ ఆ గొడవలో శరణ్య మెడ దగ్గర చిన్న గాయం అయి రక్తం రావడం మొదలవుతుంది.
టెన్షన్‌తో సాయి వెంటనే ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు.
హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ మొదలవుతుంది.
సాయి తన మేనేజర్‌కి కాల్ చేస్తాడు.
“సర్... నేను రాలేను... ఒక చిన్న ఇష్యూ జరిగింది” అని జరిగిన విషయం చెబుతాడు.
మేనేజర్ అర్థం చేసుకుని, “టేక్ కేర్” అని చెబుతాడు.
తర్వాత సాయి శరణ్య ఫ్యామిలీకి కూడా కాల్ చేసి సమాచారం ఇస్తాడు.
కొన్ని గంటల తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ పూర్తి చేస్తాడు.
ఒక తమిళ్ నర్స్ రూమ్‌లోకి వచ్చి సాయి మరియు శరణ్యను చూసి నవ్వుతుంది.
తమిళంలో ఇలా అంటుంది:
“సర్.. మీ వైఫ్ ఇప్పుడు బాగున్నారు మీరు ఇంటికి వెళ్లొచ్చు”
సాయికి తమిళ్ అర్థం కాదు.
అతను కన్ఫ్యూజ్ ఫేస్‌తో నర్స్ వైపు చూస్తాడు.
కానీ, ఆ సీన్ చూసిన శరణ్య నవ్వడం మొదలుపెడుతుంది.
“నర్స్ ఏమన్నారు? ఎందుకు నవ్వుతున్నారు?” అని సాయి అమాయకంగా అడుగుతాడు.
తన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ శరణ్య అంటుంది,
“ఏమీ లేదు”
“ఏమీ లేదు”
కానీ ఆ క్షణం తర్వాత... సాయి పట్ల ప్రేమ భావనలు శరణ్య హృదయంలో పెరగడం మొదలవుతుంది.
కేర్, అమాయకత్వం, గౌరవం ఇవన్నీ కలిసి సాయిని ఆమెకు మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.
ఆ రాత్రి, ఇద్దరూ కలిసి శరణ్య ఇంటికి వెళ్తారు.
శరణ్య కుటుంబం కూడా సాయిని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది.
ఆ రోజు మొదటిసారి సాయి శరణ్య ఇంట్లోనే ఉంటాడు. రూమ్‌లో ఒంటరిగా పడుకుని పైకప్పును చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు.
అదృష్టం అనే దానిని ఎప్పుడూ నమ్మని సాయి మొదటిసారి తన మనసులో అనుకుంటాడు:
“బహుశా నేను కూడా అదృష్టవంతుడినేమో”
ఒక రోజు తర్వాత ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. అతన్ని హైదరాబాద్‌కి తిరిగి రావాలని చెబుతారు.
శరణ్య కూడా అంటుంది,
“నా లీవ్స్ కూడా అయిపోయాయి… నేను కూడా ఆఫీస్‌కి తిరిగి వెళ్లాలి”
ఇద్దరూ కలిసి హైదరాబాద్ ప్రయాణం మొదలుపెడతారు.
రాత్రి బస్సులో... పక్కపక్కనే సీట్లు.... కిటికీ దగ్గర చల్లని గాలి... నిశ్శబ్దమైన వాతావరణం....
కొనసాగుతుంది...
దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments