కల నిజం అయిన వేళ - # అధ్యాయం 5: శరణ్య
“నా పేరు శరణ్య రాజేశ్వరన్... మీ పేరు ఏమిటి...?” అని అడుగుతుంది.
ఆ క్షణం సాయికి ఒక కలలా అనిపిస్తుంది. ప్రతిరోజూ చూసే ఆ అమ్మాయి... ఇప్పుడు తన పక్కన కూర్చుని... తన పేరు చెప్పి తనతో మాట్లాడుతోంది.
సాయి టెన్షన్‌తో నవ్వుతూ అంటాడు... “నా పేరు సాయినాథ్”
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడుస్తాయి.
తర్వాత శరణ్య మళ్లీ మాట్లాడటం మొదలుపెడుతుంది.
“మీ ఆఫీస్ రూట్ కూడా ఇదే అనుకుంటా… ఎక్కడ పని చేస్తున్నారు…?” అని అడుగుతుంది.
“నేను TSCS లో BPO ఎంప్లాయీగా పని చేస్తున్నాను ‘Cillo’ వెండర్ కోసం” అని అతను సమాధానం ఇస్తాడు.
“నా ఫ్రెండ్ కూడా అదే కంపెనీలో పని చేస్తోంది” అని శరణ్య ఎగ్జైటెడ్‌గా అంటుంది.
సాయికి కొంచెం కంఫర్ట్ ఫీలింగ్ రావడం మొదలవుతుంది.
“మీ రూట్ కూడా ఇదే అనుకుంటా... మీరు ఎక్కడ పని చేస్తున్నారు?” అని సాయి అడుగుతాడు.
శరణ్య సమాధానం ఇస్తుంది, “నేను ‘Simply Soft’ లో ట్రైనీ HR గా పని చేస్తున్నాను... గత ఏడాది నా స్టడీస్ పూర్తయ్యాయి.”
సాయి నిశ్శబ్దంగా ఆమెను చూస్తూనే ఉంటాడు. ఆమె మాట్లాడే తీరు ఆమె సింప్లిసిటీ ఆమె నవ్వు...
ప్రతి చిన్న విషయం సాయి హృదయంలో మరో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది. బస్ ప్రయాణం ఎప్పుడు మొదలైందో... ఎప్పుడు ముగియబోతుందో కూడా తెలియకుండా... సమయం చాలా వేగంగా గడిచిపోతుంది...
అప్పుడే శరణ్య స్టాప్ వచ్చేస్తుంది... “సరే సాయినాథ్... బై..” అని నవ్వుతూ బస్సు దిగిపోతుంది.
ఆ సాయంత్రం సాయి ముఖంపై ఆటోమేటిక్‌గా ఒక నవ్వు కనిపిస్తుంది.
“శరణ్య..” అని ఆ పేరును తన మనసులో మళ్లీ మళ్లీ తాలుచుకుంటు సాయి తనలో తానే నిశ్శబ్దంగా నవ్వుకుంటాడు.
ఆ చిన్న సంభాషణ సాయి నిరుత్సాహమైన జీవితంలో మొదటి రంగుల జ్ఞాపకంగా మారిపోతుంది.
ఆ సంభాషణ తర్వాత సాయికి తన జీవితం కొంచెం రంగులమయంగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది.
కానీ, మరుసటి రోజు నుంచి శరణ్య బస్సులో ఎక్కడా కనిపించదు.
“బహుశా లీవ్ తీసుకుందేమో” మొదటి రోజు అతను లైట్‌గా తీసుకుంటాడు. రెండో రోజు... మూడో రోజు... ఒక వారం గడిచిపోతుంది...
అయినా శరణ్య కనిపించదు.
సాయి నిశ్శబ్దంగా కిటికీ బయట చూస్తూ.. ఒక చిన్న నవ్వుతో తన మనసులో అనుకుంటాడు:
“నాకు నచ్చినవి నా జీవితంలో ఎప్పుడూ ఈజీగా రావేమో అనుకుంటా”...
ఆ నవ్వులో నిరాశ ఉంది బాధ ఉంది ఒప్పుకోవడం ఉంది...
పది రోజులు గడుస్తాయి.
సాయి కూడా మెల్లగా శరణ్య గురించి ఎక్కువగా ఆలోచించడం మానేస్తాడు.
జీవితం మళ్లీ రొటీన్‌లోకి వెళ్తుంది. ఉదయపు బస్ ప్రయాణాలు మళ్లీ ఖాళీగా అనిపించడం మొదలవుతుంది.
కొనసాగుతుంది...
దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments