కల నిజం అయిన వేళ - # అధ్యాయం 6: విధి



ఒక రోజు ఆఫీస్ మీటింగ్‌లో... మేనేజర్ అకస్మాత్తుగా సాయి పేరు అనౌన్స్ చేస్తాడు.

“చెన్నై బ్రాంచ్‌లో కొత్త ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ ఉంది... ఈసారి ప్రెజెంటేషన్ సాయి ఇస్తాడు.”

సాయి షాక్ అవుతాడు... ఆఫీస్‌లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉండగా... తనను సెలెక్ట్ చేయడం అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది.

ఆరు రోజుల పాటు... సాయి మరియు అతని మేనేజర్ చెన్నైకి బయలుదేరుతారు.

సాయికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అందుకే తన కెమెరాను కూడా తీసుకెళ్తాడు.

ప్రెజెంటేషన్ రోజు అనుకోకుండా చెన్నై ఆఫీస్‌లో నెట్‌వర్క్ ఇష్యూస్ వస్తాయి. దాంతో ప్రోగ్రామ్ రెండు రోజులు పోస్ట్‌పోన్ అవుతుంది.

ఫ్రీ టైమ్ దొరకడంతో సాయి మరియు అతని టీమ్ సాయంత్రం బీచ్‌కి వెళ్తారు. సముద్ర అలలు... చల్లని గాలి... ఆ మొత్తం వాతావరణం సాయికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

తన కెమెరాతో రాండమ్ కాండిడ్ ఫోటోలు తీస్తూ ఉంటాడు.
సాయి ఫోటోగ్రఫీ చూసిన తర్వాత అతని టీమ్ మెంబర్స్ మరియు అక్కడున్న ఇంకొందరు అతన్ని చాలా ప్రశంసిస్తారు.

“బ్రో, నీ షాట్స్ సినిమాటిక్‌గా ఉన్నాయి” అని మెచ్చుకుంటారు.

ఆ కాంప్లిమెంట్స్ విన్నాక చాలా రోజుల తర్వాత కాన్ఫిడెన్స్ అనే భావన మళ్లీ సాయి హృదయంలో పెరగడం మొదలవుతుంది.

సాయంత్రం మెల్లగా చీకటిగా మారుతుంది... సాయి సముద్రం వైపు చూస్తూ బీచ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. 

అప్పుడే... అకస్మాత్తుగా... అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది.

సినిమాల్లో చూపించినట్టుగా... స్లో గాలి... అందమైన పర్ఫ్యూమ్ వాసన... సముద్ర అలల శబ్దం... ఆ జనసంద్రంలో 
తెల్లటి డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ వస్తుంది.

ఆ మొత్తం క్షణం సాయికి స్లో మోషన్‌లో కనిపిస్తుంది. గాలిలో ఎగిరే జుట్టు ముఖంపై అందమైన నవ్వు ఆ అమ్మాయి నేరుగా సాయి వైపే వస్తుంది.

ఆమెను చూసిన క్షణంలోనే సాయి కళ్ళు పెద్దవవుతాయి. ఎందుకంటే ఆ అమ్మాయి మరెవరో కాదు శరణ్య.

శరణ్య కూడా బీచ్‌లో సాయిని చూసి నిజమైన ఆనందాన్ని ఫీల్ అవుతుంది.

“సాయినాథ్ కదా...? చెన్నైలో ఏమి చేస్తున్నారు...?” 
అని ఎగ్జైటెడ్‌గా అడుగుతుంది.

సాయి నవ్వుతూ సమాధానం ఇస్తాడు, “ఆఫీస్ పని.. ఒక ప్రెజెంటేషన్ ఉంది... ఆరు రోజులు చెన్నైలో ఉండాలి... నెట్‌వర్క్ ఇష్యూస్ వల్ల ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది..”

ఓహ్...ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?” అని శరణ్య అడుగుతుంది.

“ఆఫీస్ ఒక హోటల్ అరేంజ్ చేసింది... అక్కడే ఉంటున్నాను...” అని సాయి సమాధానం ఇస్తాడు.

శరణ్య ఎగ్జైటెడ్‌గా అంటుంది -- “అసలు చెన్నై మా హోమ్‌టౌన్... మా నానమ్మ ఇక్కడే ఉంటుంది... మేము హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాం”
అని చెప్పి అకస్మాత్తుగా “ఒక పని చేయండి... ఈ వీకెండ్ మా ఇంటికి తప్పకుండా రావాలి... నేను అడ్రెస్ పంపిస్తాను...”  అంటుంది.

ఆ ఆహ్వానం సాయికి ఊహించని ఆనందంలా అనిపిస్తుంది.
“ష్యూర్...” అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు.
“సరే... మీ నెంబర్ చెప్పండి...” అని శరణ్య అంటుంది.

ఇద్దరూ తమ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కొన్ని నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు.

కానీ, ఈసారి సాయి హృదయంలో ఒక భిన్నమైన ఫీలింగ్ ఉంటుంది. బస్సులో మొదలైన ఆ చిన్న కథ ఇప్పుడు విధిలా అనిపించడం మొదలైంది.
కొనసాగుతుంది...

దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments

Popular posts from this blog

Love Beyond Time...

Melody of Love...

కాలం కలిపిన ప్రేమ