కల నిజం అయిన వేళ - # అధ్యాయం 7: గందరగోళం
వీకెండ్ వచ్చేస్తుంది.
శరణ్య పంపిన అడ్రస్‌ను మళ్లీ మళ్లీ చెక్ చేస్తూ.. సాయి చెన్నై వీధుల గుండా ప్రయాణిస్తాడు.
అతని హృదయంలో ఎగ్జైట్మెంట్ ఉంది, కొంచెం టెన్షన్ కూడా ఉంది...
“మొదటిసారి ఆమె ఇంటికి వెళ్తున్నాను” అని అనుకుంటూ ఒక చిన్న నవ్వు నవ్వుకుంటాడు.
చివరికి అతను ఆ అడ్రస్‌కి చేరుకుంటాడు.
కానీ, అక్కడి వాతావరణం చూసి ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అవుతాడు.
మొత్తం ఇల్లు లైట్లతో అలంకరించబడి ఉంది, బయట కార్లు, లోపల ఫుల్ క్రౌడ్... అందరూ సంప్రదాయ దుస్తులు వేసుకుని తమిళంలో మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు.
సాయికి ఒక్క మాట కూడా అర్థం కావడం లేదు.
“ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది” అని అనుకుంటూ మెల్లగా లోపలికి నడుస్తాడు.
కానీ అతని కళ్ళు మాత్రం ఆ జనసంద్రంలో శరణ్య కోసం మాత్రమే వెతుకుతుంటాయి.
అప్పుడే అకస్మాత్తుగా అందరూ స్టేజ్ వైపు తిరుగుతారు. సాయి కూడా ఆటోమేటిక్‌గా అక్కడికి చూస్తాడు.
ఆ క్షణంలో అతని గుండె ఆగిపోయినట్టవుతుంది.
ఎందుకంటే శరణ్య అందమైన చీరలో సింపుల్ అండ్ ఎలిగెంట్ జ్యువెలరీతో నవ్వుతూ మెల్లగా స్టేజ్ వైపు నడుస్తోంది.
చుట్టూ కుటుంబ సభ్యులు, బంధువులు, సంతోషకరమైన వాతావరణం ఆ మొత్తం సీన్ చూసి సాయి మెదడు పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది.
వెంటనే సాయి:
- నా అదృష్టం నిజంగా ఇంత దారుణమా?
- నచ్చిన అమ్మాయి నిశ్చితార్థం చూడటానికే హైదరాబాద్ నుంచి చెన్నై వరకు వచ్చానా?
- ఎందుకు ఎప్పుడూ నాకే ఇలా జరుగుతుంది?
అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది.
కొన్ని క్షణాల పాటు, సాయికి సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి.
కానీ, అకస్మాత్తుగా స్టేజ్ మీదకి వధూవరులను పిలుస్తారు. కన్ఫ్యూజ్ అయిన సాయి మళ్లీ జాగ్రత్తగా చూస్తాడు.
అప్పుడు అతనికి అర్థమవుతుంది, అది శరణ్య నిశ్చితార్థం కాదు.
వేరొకరి ఎంగేజ్‌మెంట్. ఆ విషయం అర్థమైన వెంటనే సాయి గాఢంగా ఊపిరి తీసుకుంటాడు.
అతని హృదయంలోని భారమైన బాధ ఒక్కసారిగా తగ్గిపోతుంది.
స్టేజ్ మీద నుంచి సాయిని చూసిన శరణ్య వెంటనే ఆనందంగా కిందకు వస్తుంది.
స్టేజ్ మీద నుంచి సాయిని చూసిన శరణ్య వెంటనే ఆనందంగా కిందకు వస్తుంది.
“హే సాయినాథ్... ఫైనల్లీ వచ్చేశారు!” అని ఎగ్జైటెడ్‌గా అంటుంది.
సాయి నవ్వుతూ సమాధానం ఇస్తాడు, “కొంచెం లేట్ అయింది”
శరణ్య అతన్ని తన కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకెళ్తుంది.
“డాడ్ ఇతను సాయినాథ్ నా ఆఫీస్ కలీగ్” అని పరిచయం చేస్తుంది.
“డాడ్ ఇతను సాయినాథ్ నా ఆఫీస్ కలీగ్” అని పరిచయం చేస్తుంది.
శరణ్య కుటుంబం కూడా అతన్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేస్తుంది. తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ కలిపి మాట్లాడుకుంటూ
సాయికి కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేలా ప్రయత్నిస్తారు.
ఆ సాయంత్రం ఆ ఫంక్షన్ జనసంద్రంలో, సాయి మరియు శరణ్య మధ్య ఎన్నో అందమైన క్షణాలు జరుగుతాయి.
ఫుడ్ కౌంటర్ దగ్గర ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, ఫోటోలు క్లిక్ చేయడం, చిన్న చిన్న నవ్వులు, కళ్ళతో మాట్లాడుకోవడం, నిశ్శబ్దమైన చిరునవ్వులు...
వారి ప్రపంచం అందరి నుంచి వేరుగా అనిపిస్తుంది.
మొదటిసారి జీవితం అంత చెడ్డది కాదేమో అని సాయికి అనిపిస్తుంది.
కానీ, ఆ సమయంలో సాయికి తెలియదు... మాయలాంటిది అనిపించిన సాయంత్రం అతని జీవితాన్ని ఎంతగా మార్చబోతుందో అని...
కొనసాగుతుంది...
దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments