కాలం కలిపిన జంట...



రాత్రి సమయం…

గది అంతా నిశ్శబ్దంగా ఉంది. టేబుల్ మీద పుస్తకాలు, నోట్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి.
సంజయ్ తన ఫోన్‌లో స్టడీ మెటీరియల్ కోసం సెర్చ్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

అలా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండగా ఓక వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది.

తెలియని నంబర్ నుంచి ఒక మెసేజ్: “హలో...!”

సంజయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు.

“ఎవరు ఇది? కొత్త నంబర్‌ లా ఉంది?” అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేశాడు. 

ప్రొఫైల్ ఫోటో చుస్తాడు ఒక అమ్మాయి తన హెయిర్‌ తో ఫేస్ కవర్ చెసిన ఫోటో ఉంటూంది. 

కొంచెం ఆలోచించి… “తెలియని నంబర్… తప్పు గా వచ్చి ఉంటుంది” అనుకుని రిప్లై ఇవ్వకుండా వడిలేస్తాడు.

ఒక గంట తర్వాత… మళ్లీ ఫోన్ వైబ్రేట్ అయ్యింది.

అదే నంబర్ నుంచి మెసేజ్: “మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదేంటి?”

ఇప్పుడు సంజయ్ కి కొంచెం ఆసక్తి వచ్చింది.

అతను రిప్లై చేశాడు: “హాయ్… నేను మీకు తెలుసా?”

వెంటనే రిప్లై వచ్చింది: “ఆహ్… నువ్వు రోషన్ కద… మా స్కూల్ మేట్?”

సంజయ్ నవ్వుతూ టైప్ చేశాడు: “నేను సంజయ్. రోషన్ కాదు.”

కొంచెం గ్యాప్ తర్వాత రిప్లై వచ్చింది: "ఓహ్... క్షమించండి... తప్పు నంబర్ అయ్యి ఉంటుంది .”

సంజయ్ చాట్‌ను క్లోజ్ చేయబోతున్నాడు… కానీ కొన్ని సెకన్లు స్క్రీన్ వైపు చూస్తూ ఉండి… మళ్లీ టైప్ చేయడం ప్రారంభించాడు.

సంజయ్: “తప్పు నంబర్… కానీ కన్వర్సేషన్ మాత్రం కరెక్ట్‌గా ఉంది..”

కొన్ని సెకన్లు…. తరువాత రిప్లై వచింది: “హాహా మంచి లైన్… కానీ తప్పు వ్యక్తి కదా.." 

సంజయ్ నవ్వుకున్నాడు.

సంజయ్: “సరే… కానీ ఇప్పుడు చాట్ స్టార్ట్ అయ్యింది కదా… ఇక్కడే ఆపేయడం వేస్ట్ అనిపించట్లేదా?”

అమ్మాయి: “మీరు అందరితో ఇలానే మాట్లాడుతారా… లేక స్పెషల్ కేసా?”

సంజయ్: “డిపెండ్స్… మీరు రోషన్‌ని వెతుకుతున్నారు… నేను టైమ్ పాస్ చేస్తున్నా ”

అమ్మాయి: “హాహా…"

సంజయ్: " DP లో ఫోటో బాగుంది మీ పేరు అప్సర నా?"

అమ్మాయి: "కాదు.. నా పేరు ప్రియ".

సంజయ్: “మీతో ఇ కన్వర్సేషన్ బగుంది, ‘తప్పు నంబర్ ప్రియ’ .”

ప్రియ: “తప్పు నంబర్ ప్రియ ఆ? నిజంగా?”

సంజయ్: “సరే సరే… ‘సరైన నంబర్ ప్రియ’...!”

ప్రియ: “ఇది బాగుంది..” “సరే Mr. దాదాపు సరైన నంబర్… ఆలస్యమైంది. గుడ్ నైట్”

సంజయ్: “గుడ్ నైట్, తప్పు నంబర్ ప్రియ”

కొంచెం నిశ్శబ్దం… కన్వర్సేషన్ నెమ్మదిగా ముగిసింది. ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయింది…

రెండు రోజులు గడిచాయి…

మధ్యాహ్నం సమయం. సంజయ్ ఆఫీస్‌లో పని చేస్తూ ఉండగా వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది..

మళ్లీ అదే నంబర్.

ప్రియ: “హలో… ఇంకా తప్పు నంబర్ నేనా?”

సంజయ్ (నవ్వుతు): “ఇప్పుడైతే సరైన వ్యక్తిలా అనిపిస్తోంది...”

ప్రియ: “హాహా… బిజీ పర్సన్ కి ఇంకా గుర్తున్నానా?”

సంజయ్: “కొన్ని మిస్టేక్స్ మర్చిపోలేం… ఈ తప్పు నంబర్ లాంటివి...”

కన్వర్సేషన్ మళ్లీ ప్రారంభమైంది….

ప్రియ: “సరే అయితే…నీ గురించి చెప్పు,  నువ్వు ఏమి చేస్తావు?

సంజయ్: “నేను జాబ్ చేస్తున్నాను… ఇంకా మాస్ కమ్యూనికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. మీడియా సైడ్ జాబ్ చెయాలి అని నా కల...”

ప్రియ: “ఓహ్ నైస్… ఏ కాలేజ్?”

సంజయ్: “OU.. డిస్టెన్స్‌లో ప్రిపేర్ అవుతున్నాను….”

సంజయ్: “మరి నువ్వు? ఇంకా రోషన్‌ని వెతికే జాబ్ లోనే ఉన్నావా?”

ప్రియ: “హాహా..చాలా ఫన్నీ.... నేను ఫైనల్ ఇయర్ డిగ్రీ చెస్తున్న.”

సంజయ్: “ఓహ్ ఫైనల్ ఇయర్ ఆ… నైస్... నెక్స్ట్ ప్లాన్ ఏంటి?”

ప్రియ: “కొంచెం కన్ఫ్యూజ్‌లో ఉన్నాను… MBA చేయాలా? లేక జాబ్ చేయాలా? అని క్లారిటీ లేదు.”

సంజయ్: “సింపుల్‌గా చెప్తా… పాసిబుల్ అయితే… జాబ్ చేస్తూ MBA చేయ్.”

ప్రియ: “అలా ఎందుకు?”

సంజయ్: “ఎక్స్‌పీరియెన్స్ + స్టడీస్ కలిసివస్తే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫైనాన్షియల్‌గా కూడా ఇండిపెండెంట్ అవుతావు.”

ప్రియ: “హ్మ్మ్… నేను దాని గురించి ఆలోచిస్తాను .”

ఆ కన్వర్సేషన్ నెమ్మదిగా అర్థవంతమైన దిశలోకి వెళ్లింది…ఇద్దరి మధ్య ఇప్పుడు కేవలం ఫన్ మాత్రమే కాదు… అర్థం చేసుకోవడం మొదలైంది.

ప్రతి రోజు… “గుడ్ మార్నింగ్”..“తిన్నావా?” “పని ఎలా ఉంది?” “ఆలస్యంగా గా పడుకోకు…” అల ప్రియ తన విషయలు ఇంకా సంజయ్ తన విషయాలు ఒకరికి ఒకరు షేర్ చెసుకోవడమ్ స్టార్ట్ చేసారు..... మాటలు చిన్నవే… కానీ భావాలు పెద్దవయ్యాయి.

ఒక రోజు సంజయ్ అడిగాడు “ప్రియ… మనం కలుద్దామా?” అని

కొంచెం సైలెన్స్…

ప్రియ: “ఇప్పుడే కాదు… తర్వాత చెప్తా.”

సంజయ్: “సరే… నీకు కంఫర్ట్ ఉన్నప్పుడు కలుద్దం.”

ప్రియ: “నాకు MBA చడువుతు జాబ్ చేస్తే మేనేజ్ చేయగలనో లేదో అని కొన్నిసార్లు భయం వేస్తుంది…”

సంజయ్: “భయం సహజం… కానీ ప్రయత్నించకపోతే బాధ ఎక్కువగా ఉంటుంది. నీకు నేను సహాయం చేస్తా.."

ప్రియ: “నాకు క్లారిటీ ఇచ్చిన మొదటి వ్యక్తి నువ్వే.”

సంజయ్: “మనకి సమాధానం ముందే తెలిసి ఉంటుంది… కొంచెం ప్రోత్సాహం అవసరం అంతే.”

అలా…సంజయ్ ప్రియకి ఒక గైడెన్స్ ఇచ్ఛే వ్యక్తి అయ్యాడు....ప్రియకి…అతను ఒక కంఫర్ట్ ప్లేస్ అయ్యాడు.

స్నేహం… నెమ్మదిగా…కేర్‌గా మారింది. కేర్…నెమ్మదిగా…భావాలుగా మారడం మొదలైంది.

అలా…తెలియకుండానే…ఇద్దరూ…ఒకరి జీవితంలో ఒకరు ముఖ్యమైన భాగమయ్యారు. చిన్న చిన్న జ్ఞాపకాలు… అన్ని సంతోషకరమైన క్షణాలు…అలా కొన్ని నెలలు పూర్తయ్యాయి...

ఇప్పటి వరకు ఒకరికి ఒకరు చూసుకోలేదు, కలవలేదు కేవలం ఫోన్ కాల్స్ మరియు మెసేజ్లు మాత్రమే...

ఒక రోజు…సంజయ్ తన కమ్యూనిటీ లో ఉన్నా కిరాణా దుకాణం కి వెళ్లాడు.

అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర గొడవ జరుగుతోంది.....ఒక కస్టమర్ చిన్న విషయం కోసం పెద్దగా అరుస్తూ షాప్ ఓనర్ తో వాగ్వాదం చేస్తున్నాడు.

ఆ కస్టమర్, ఓనర్ ని కొట్టడానికి ముందుకు వెళ్లాడు. అప్పుడు సంజయ్ ముందుకు వచ్చాడు...

అన్నా… చిన్న విషయం కోసం ఇలా రియాక్ట్ అవ్వడం సరైంది కాదు.” అని సంజయ్ కూల్ గా మాటలతో సిట్యుయేషన్ ని కంట్రోల్ చేశాడు...

కస్టమర్ బిల్లు చెల్లింపు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. షాప్ లో నిశ్శబ్దం… ఓనర్ రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాడు.
ఓనర్ పక్కన ఒక అమ్మాయి నిల్చుంది. ఆమె కళ్లలో కృతజ్ఞత.

ఓనర్: “Thanks బాబు… నువ్వు లేకపోతే ఏం జరిగేదో తెలీదు.”

సంజయ్: “పర్లేదు అంకుల్…”

ఆ అమ్మాయి కూడా “Thank you…" అని చెబుతుంది..

సంజయ్ సింపుల్ గా నవ్వి తనకి అవసరం ఉన్నా వస్తువులు కొనుకోన్ని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అదే రోజు రాత్రి…

ప్రియ: “ఈరోజు మా షాప్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది…కాని ఒక వ్యక్తి వచ్చి సిట్యుయేషన్ హ్యాండిల్ చేశాడు…” ఆమె జరిగిన విషయం వివరంగా చెప్పింది.

“అతను మంచి వ్యక్తి అనిపిస్తున్నాడు…నాన్న కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు.”

సంజయ్ నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. 

సంజయ్: " ఆ వ్యక్తి రెడ్ టీ షర్ట్....బ్లూ జీన్స్ వెసుకున్నాడా?"

ప్రియ: " అవను..! నీకు ఎలా తెలుసు."

సంజయ్: " ఆది ఎవరో కాధు నేనే."

ప్రియ: " అవూనా! నువ్వు జోక్ చేయడం లేదు కదా?"..

సంజయ్: "నేను నిజం చెబుతున్నాను...డెస్టినీ చుసావా నేను కలుద్దం అని అడిగా కాని డెస్టినీ మనల్ని చుసుకోనెల చెసింది" . 

ప్రియ: "అవును! చాలా వింత గా ఉంది. ఇంతకాలం మనం ఒకటే కమ్యూనిటీ లో ఉన్నా ఒకారిని ఒకారు చుసుకున్నా, నువ్వు సంజయ్ అని నాకు తెలియదు.....నేను ప్రియ అని నీకు తెలియదు.... 

నీ బ్లాక్ ఎంటి?

సంజయ్: “నేను B Block లో ఉంటాను.”

ప్రియ: “ఏమిటి?? నేను B Block లో ఉంటాను!” ఏ ఫ్లోర్?.

సంజయ్: " నేను 15వ ఫ్లోర్ లో ఉంటాను."

ప్రియ: "మాది 3వ ఫ్లోర్.." 

నిన్ను చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.. రేపు మనం కలుస్తునమ్ కన్ఫర్మ్"...

మరుసటి రోజు:

ఒక చిన్న కేఫే… మొదటి సారి సంజయ్ ఇంకా ప్రియ face to face కలిసారు....

సంజయ్: “హాయ్… తప్పు నంబర్ ప్రియ?”

ప్రియ: “హాయ్… దాదాపు సరైన వ్యక్తి సంజయ్?”

ప్రియ ఇంకా సంజయ్ ప్రేమ మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు కలవని రోజు లేదు. 

ఒక “తప్పు నంబర్ ” తో మొదలైన పరిచయం…రెండు మనసులను కలిపింది.

ప్రియ తన డిగ్రీ పరీక్షలు పూర్తి చెసి జాబ్ ట్రయల్స్ లో ఉంది. సంజయ్ తన డ్రీమ్ జాబ్ మీడియా లో జాయిన్ అవుతడు. 

ముగింపు...

"కొన్నిసార్లు తప్పుడు మలుపులు సరైన గమ్యాలను సృష్టిస్తాయి" .

“కొన్ని పరిచయాలు యాదృచ్ఛికం గా అనిపిస్తాయి…
కానీ అవే జీవితాంతం ఉండే బంధాలు అవుతాయి..అదే డెస్టిని.”


Please Share Like and Comment. Your feedbacks are precious to me.

Comments

Popular posts from this blog

Love Beyond Time...

Melody of Love...

కాలం కలిపిన ప్రేమ