కల నిజం అయిన వేళ - # అధ్యాయం 3: స్పర్శ



మరుసటి ఉదయం...
అలారం శబ్దంతో లేచి... ఎప్పటిలాగే ఆఫీస్‌కి రెడీ అవుతాడు. బయట అదే ట్రాఫిక్…అదే పొల్యూషన్… అదే బిజీ జీవితం...

కానీ, సాయి మనసులో మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంది... బస్ స్టాప్‌కి చేరుకుని బస్సులో ఎక్కగానే అతని కళ్ళు ఆటోమేటిక్‌గా ఆ అమ్మాయిని వెతకడం మొదలుపెడతాయి.

ముందు సీట్లు... కిటికీ వైపు... లేడీస్ సెక్షన్... అతను ప్రతిచోటా వెతుకుతూనే ఉంటాడు.

“ఆమె కనిపించడం లేదు”...

అని ఒక చిన్న నిరాశ ఫీల్ అవుతాడు. బస్సు కొంచెం రద్దీగా ఉంది.

రాడ్ పట్టుకుని నిలబడి... మళ్లీ ఆమె కోసం వెతుకుతూనే ఉంటాడు.

అప్పుడే... అకస్మాత్తుగా... వెనక నుంచి ఎవరో సాయి భుజంపై చెయ్యి వేస్తారు.

ఆ స్పర్శతో సాయి శరీరం ఒక్కసారిగా షాక్ అయినట్టవుతుంది.

అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది.

మెల్లగా అతని ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది. నుదుటిపై చెమట బిందువులు...

చేతులు స్వల్పంగా వణుకుతాయి. స్లో మోషన్‌లో...

సాయి నెమ్మదిగా వెనక్కి తిరగడం ప్రారంభిస్తాడు, అతని మనసులో ఒక్క ఆలోచనే తిరుగుతోంది...
“ఎవరు అది…?”
కొనసాగుతుంది...

దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments