కల నిజం అయిన వేళ - # అధ్యాయం 2: బస్సులో కనిపించిన అమ్మాయి



సాయి జీవితంలో సంతోషం అనే భావన దాదాపు మాయమైపోయిన రోజులు...

కానీ, ప్రతి ఉదయం ఆఫీస్‌కి వెళ్లే బస్సులో ఎక్కిన తర్వాత అతని ముఖంపై ఒక చిన్న నవ్వు.
దానికి కారణం...ఒక అమ్మాయి.

అదే రూట్... అదే బస్సు... దాదాపు అదే టైమింగ్...

మొదటిసారి ఆమెను చూసినప్పుడు సాయి పెద్దగా పట్టించుకోలేదు.

రోజులు మెల్లగా గడుస్తుండగా.. ప్రతిరోజూ ఆమెను చూడటం సాయి రొటీన్‌లో ఒక అందమైన భాగంగా మారిపోయింది.

ఆ అమ్మాయి చాలా సింపుల్‌గా, గ్రేస్‌ఫుల్‌గా ఉండేది. సాంప్రదాయ తెలుగు అమ్మాయిలా...

చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటల్లో మునిగిపోవడం... కొన్ని సార్లు ఫోన్ కాల్స్‌లో బిజీగా ఉండడం... మరికొన్ని సార్లు కిటికీ బయట చూస్తూ మెల్లగా నవ్వడం...

ప్రతి సారి సాయి ఆ నవ్వును గమనించినప్పుడు... అతని మనసులోని ఒత్తిడి నిశ్శబ్దంగా కరిగిపోయేది.

ఉదయపు రద్దీ బస్సులో సాయి పాటలు వింటూ ఆమెను నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవాడు.
ఆఫీస్ ప్రెషర్... టార్గెట్స్... ఫ్యామిలీ టెన్షన్... ఒంటరితనం కొన్ని నిమిషాలైనా సాయి ఇవన్నీ మర్చిపోయేవాడు.

ఆ అమ్మాయి పేరు కూడా అతనికి తెలియదు... ఆమె ఎక్కడ పని చేస్తుందో కూడా తెలియదు...

కానీ,

ఆమె ఉనికి సాయి నిరుత్సాహమైన జీవితంలో ఒక చిన్న వెలుగులా మారిపోయింది.

ఒక రోజు అలాగే బస్ కిటికీ దగ్గర కూర్చుని వర్షాన్ని చూస్తూ పాటలు వింటూ, 
సాయి తన మనసులో నిశ్శబ్దంగా అనుకున్నాడు.

“ఈ అమ్మాయి నా జీవితంలోకి రావాలి...”
“నాతో మాట్లాడాలి...”
“నన్ను అర్థం చేసుకోవాలి...”
“నన్ను ప్రేమించాలి...”
“మేమిద్దరం ఒక హ్యాపీ ఫ్యామిలీలా జీవించాలి...”

ఆ ఊహల్లో మొదటిసారి సాయి తన భవిష్యత్తును సంతోషంగా ఊహించుకున్నాడు.

ఆ రాత్రి... సాయి మంచంపై పడుకుని పైకప్పును చూస్తూ, ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడు.

ఆమె నవ్వు... ఆమె కళ్ళు... బస్సులో ఆమె ప్రశాంతమైన హావభావాలు...అన్నీ సాయి మనసులో తిరుగుతూనే ఉన్నాయి.

“కనీసం ఒక్కసారి అయినా ఆమెతో మాట్లాడగలిగితే బాగుండేది”
అని నవ్వుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోతాడు.

కానీ... అతనికి తెలియని విషయం ఏమిటంటే...ఆ కోరిక అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది...

కొనసాగుతుంది...

దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments

Popular posts from this blog

Love Beyond Time...

Melody of Love...

కాలం కలిపిన ప్రేమ