కల నిజం అయిన వేళ - # అధ్యాయం 1 — యంత్రంలా మారిన జీవితం



హైదరాబాద్ నగరంలోని ఉదయపు రద్దీ.
రోడ్లపై వాహనాల శబ్దాలు. బస్ స్టాప్‌ల దగ్గర ఉద్యోగులు.

ఆ జనసంద్రంలో ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి సాయి.
అతను బీటెక్ పూర్తి చేశాడు. కానీ కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల తన కలలన్నింటిని పక్కన పెట్టి ఒక BPO కంపెనీలో పని చేస్తున్నాడు.

అతని రోజువారీ జీవితం దాదాపు యంత్రంలా మారిపోయింది.
ఉదయం 7 గంటలకు రెడీ అవ్వడం, జనాలతో నిండిన బస్సులో ఆఫీస్‌కి వెళ్లడం. కస్టమర్ కాల్స్,నకిలీ నవ్వులు, టార్గెట్స్, ప్రెషర్. రాత్రి 8 లేదా 9 గంటలకు అలసిపోయి ఇంటికి తిరిగి రావడం.

మళ్లీ మరుసటి రోజు అదే పని.
అతని కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ తమ తమ కెరీర్స్, హయ్యర్ స్టడీస్, ఫారిన్ జాబ్స్, రిలేషన్‌షిప్స్‌తో బిజీ అయిపోయారు.

కాలేజ్ పూర్తయ్యాక కొన్ని రోజుల వరకు అందరూ టచ్‌లో ఉన్నారు... తర్వాత మెల్లగా ప్రతి ఒక్కరూ తమ పనుల్లో మునిగిపోయారు.
సాయి జీవితంలో ఎగ్జైట్మెంట్ అనే భావనను దాదాపు మర్చిపోయాడు.

కానీ, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక ప్రశ్న మాత్రం అతని మనసులో ఎప్పుడూ మిగిలిపోతుంది:

“ఇదేనా నా జీవితం…?”
“నేను ఇంకేం చేయలేనా…?”
“ఒక రోజు నేను కూడా సక్సెస్ అవుతానా…?”

సాయికి ఒక కల ఉంది.
సాధారణ జీవితాన్ని గడపడం కాదు... ఏదో ఒకటి సాధించాలి... తన కుటుంబం గర్వపడేలా చేయాలి... సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తిగా మారాలి.

కానీ ప్రస్తుత పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, డబ్బు సమస్యలు,
ఇవన్నీ అతని కలలను గొలుసుల్లా బంధించాయి.

అందుకే ఇష్టం లేకపోయినా సాయి ప్రతిరోజూ ఆ BPO ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు...

కొనసాగుతుంది…

దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments

Popular posts from this blog

Melody of Love...

Love Beyond Time...

కాలం కలిపిన ప్రేమ