కల నిజం అయిన వేళ - # అధ్యాయం 4: మొదటి సంభాషణ


సాయి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తాడు... అతని ముందున్నది...
ఆ అమ్మాయి.

సాధారణమైన చుడిదార్... చెవుల్లో ఇయర్‌ఫోన్స్... ముఖంపై చిన్న నవ్వు...
“ఎక్స్క్యూజ్ మీ... సైడ్ ప్లీజ్...” అని మెల్లగా అంటుంది.

ఒక్క క్షణం పాటు సాయి మెదడు పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. వెంటనే పక్కకు జరిగి ఆమెకు దారి ఇస్తాడు.

ఆమె ముందుకు నడుస్తూ... ఒకసారి సాయిని చూసి క్యూట్‌గా నవ్వుతుంది. ఆ ఒక్క నవ్వుతో, సాయి గుండె వేగం వంద రెట్లు పెరిగినట్టవుతుంది.

బస్సులోని శబ్దం... జనాలు... ట్రాఫిక్... అన్నీ అతనికి మ్యూట్ అయినట్టుగా అనిపిస్తాయి.

ఆ రోజు తర్వాత, ప్రతి సారి సాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి చిన్నగా నవ్వడం మొదలుపెడుతుంది.

సాయి జీవితంలో మొదటిసారి, ఒకరి నవ్వు అతని రోజులో అత్యంత సంతోషకరమైన భాగంగా మారింది.

అలా కొన్ని రోజులు గడుస్తాయి...

ఒక ఉదయం, బస్సు పూర్తిగా రద్దీగా ఉంటుంది. అదృష్టవశాత్తూ సాయికి ఒక సీట్ దొరుకుతుంది.

కానీ, ఆ అమ్మాయికి మాత్రం సీట్ దొరకదు. రాడ్ పట్టుకుని అతని దగ్గర నిలబడుతుంది.

సాయి మనసులో ఒక్క ఆలోచనే తిరుగుతుంది “ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి”

నాలుగు స్టాప్‌ల తర్వాత, సాయి పక్కన కూర్చున్న వ్యక్తి దిగిపోతాడు.

సీట్ ఖాళీ అవగానే సాయి గుండెల్లో ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది “ఇదే ఛాన్స్”
అని అనుకుని టెన్షన్‌తో ఆ అమ్మాయిని పిలవడానికి ప్రయత్నిస్తాడు.

కానీ, అదే సమయంలో ఆమె స్టాప్ కూడా వచ్చేస్తుంది... ఆమె బస్సు దిగి వెళ్లిపోతుంది.

సాయి ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది “ఛాన్స్ మిస్ అయిపోయింది” అని కిటికీ బయట చూస్తూ నిశ్శబ్దంగా ఉంటాడు.

చిన్న నవ్వులు... నిశ్శబ్ద భావాలు... చెప్పని మాటల మధ్య... సాయి ప్రేమకథ ముందుకు సాగుతూనే ఉంటుంది.

కానీ ఒక సాయంత్రం అన్నీ మారిపోతాయి.

ఆఫీస్ నుంచి అలసిపోయి తిరిగి వస్తున్న సాయి... బస్సులో ఎక్కగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు... ఎందుకంటే...!

ఆ అమ్మాయి ఇప్పటికే బస్సులో ఉంది. సాయి పక్కనున్న సీట్ ఖాళీగా ఉంది. సాయి ఆమెను పిలవాలనుకుంటాడు...

కానీ అతనికి అంత ధైర్యం ఉండదు. అతను నిశ్శబ్దంగా కూర్చుంటాడు.

కానీ... మన అదృష్టం మన వైపు తిరగడం మొదలైతే… కొన్ని మన జీవితంలో వాటంతట అవే వచ్చేస్తాయి. ఈ క్షణం కూడా అచ్చం అలాంటిదే...

ఆ అమ్మాయి నేరుగా వచ్చి సాయి పక్కన కూర్చుంటుంది. సాయి పూర్తిగా ఫ్రీజ్ అయిపోతాడు.

వేగంగా కొట్టుకునే గుండె, చెమట పట్టిన చేతులు, బ్లాంక్ అయిన మైండ్..

నవ్వుతూ ఆ అమ్మాయి అంటుంది “హాయ్...” సాయి నుంచి ఎలాంటి స్పందన రాదు. 

మళ్లీ “హలో...” అని ఆ అమ్మాయి అంటుంది... ఇంకా  సాయి నుంచి స్పందన లేదు.

మూడోసారి “హలో మిస్టర్...” అని నవ్వుతూ అంటుంది.

అప్పుడు సాయి ఈ లోకంలోకి తిరిగి వస్తాడు “హా... హాయ్...” అని టెన్షన్‌తో సమాధానం ఇస్తాడు.

ఆ అమ్మాయి నవ్వుతుంది.

ప్రతిరోజూ చూసే ఆ అమ్మాయితో సాయి మాట్లాడిన మొదటి క్షణం.


కొనసాగుతుంది...

దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

Comments

Popular posts from this blog

Love Beyond Time...

Melody of Love...

కాలం కలిపిన ప్రేమ