ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 3

ఎపిసోడ్ 3: శివానుగ్రహం

అడవులు, ప్రమాదాలు, రహస్య గుహలు, దుండగులతో జరిగిన యుద్ధం ఇవన్నీ దాటి యువరాజు రణప్రతాప్ తన వెంట ఆ మహిమ కలిగిన కడియంతో రాజ్యంలోకి తిరిగి వస్తాడు.

అతడిని చూసి ఆనందంతో ఆనందభాష్పాలతో అందరు స్వాగతం పలుకుతారు.

మల్లి రాజ్యంలో వర్షం మొదలవుతుంది, చినుకులు మొదట జాలిగా పడుతుంటే, కాసేపటికి పిడుగులు, వానలతో రాజ్యం జీవం పొందినట్టు మారుతుంది.

ఈ మార్పు చూసిన ప్రజలు “శివుని కృప ఇదే!” అంటూ నినాదాలు చేస్తారు.

మహారాజు కార్తవరాయుడు ఇప్పటికీ పడకపై పడుకోని ఉంటాడు. శరీరంలో ప్రాణం ఉన్నట్టే ఉన్నా, అతని కళ్లు మూసే ఉన్నాయి.

అప్పుడే యువరాజు గుడిలోని శివలింగం వద్ద ప్రాప్తమైన ఆ కడియాన్ని తన తండ్రి కి నెమ్మదిగా ధరింపజేస్తాడు.

అంతే… ఒక్కసారిగా గదిలోంచి ఒక ప్రకాశం వెలువడుతుంది.

మహారాజు శరీరం ఒక్క క్షణం నిశ్చలంగా ఉలికిపడుతుంది. ఆ వెంటనే అతని ముక్కు నుంచి శ్వాస ప్రవహించటం స్పష్టంగా వినిపిస్తుంది. అతని చేతులు కదలటం మొదలవుతుంది.

ప్రజలందరూ ఆనందభాష్పాలతో "మహారాజు రక్షించబడ్డారు!" అంటూ హర్షధ్వానాలు చేస్తారు.

మహారాజు ఆకాశం వైపు చూచి "ఓ పరమేశ్వరా… నా రాజ్యం నన్ను వదిలిపెట్టలేదు… నా కుమారుని రూపంలో నీవే రక్షించావు!"

తన కుమారుడిని ఆలింగనం చేస్తూ "రణప్రతాప్, నీవే నా నిజమైన వారసుడు. నీవే ఈ రాజ్యానికి భవిష్యత్తు. నీ ధైర్యం ఈ రాజ్యాన్ని మరల వెలుగులోకి తీసుకొచ్చింది."

అందరు సంబరాల్లో మునిగిపోయిన వేళ… రాజగురువు కాస్త ఆలోచనతో రాణా ప్రతాప్ తో ఇలా అంటారు:

"ఈ కడియం శాపాన్ని తొలగించిందేమో కానీ… దీనిలో ఇంకా ఒక రహస్య శక్తి ఉంది. అది భవిష్యత్ లో మళ్ళీ మేల్కొనవచ్చు… దాన్ని కాపాడటమే ఇప్పుడు ని బాధ్యత."

ఈ మాటలు విని రణప్రతాప్ ఒక్క క్షణం ఆశ్చర్యంతో నిలిచిపోతాడు. ఆ రోజు రాత్రి నిద్ర పోకుండా రాజా గురువు చెప్పిన దాని గురించి అలోచిస్తు ఉంటాడు.



👉 కడియం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?ఆ శక్తి మళ్ళీ మేల్కొంటే ఏమవుతుంది? యువరాజు ఏ నిర్ణయం తీసుకుంటాడు?

ఎపిసోడ్ 3 లో తెలుసుకుందాం!

Comments

Popular posts from this blog

ఒక తండ్రి కన్న కల

A Journey of Love

బెంగళూరు రహస్యం