ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 4

ఎపిసోడ్ 4: శక్తి వెనుక నిగూఢం

రాజ్యంలో మళ్ళీ సంతోషం పరవళ్లు తొక్కుతున్నాయి. వర్షాలు పడతున్నాయి, పొలాలు పచ్చగా మారుతున్నాయి, ప్రజల ముఖాల్లో నవ్వులు వెలుగుతున్నాయి.

కానీ యువరాజు రణప్రతాప్ మనసులో మాత్రం ఆ కడియం వెనుక రహస్యం అల్లకల్లోలంగా మారింది. రాజగురువు చెప్పిన మాటలు అతడి గుండెల్లో ప్రతిధ్వనించుతున్నాయి:

"ఈ కడియం శక్తిని తొలగించలేదేమో… అదిప్పుడు నిద్రలో ఉంది. భవిష్యత్తులో మళ్ళీ మేల్కొనవచ్చు."

యువరాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. శివుడి గుడికి మళ్ళీ ప్రయాణం చేయాలనుకుంటాడు ఈసారి, కడియం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం కోసం.

గుడిలో తిరిగి ప్రవేశం:-

తూర్పు కొండల్లో ఉన్న ఆ మహిమాన్విత శివాలయంలోకి మళ్ళీ అడుగుపెట్టిన యువరాజు, గర్భగుడి లోపల శిలల మధ్య త్రవ్వడం మొదలుపెడతాడు. కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత… ఒక పాత బండకి క్రింద ఒక పెట్టె కనిపిస్తుంది.

ఆ పెట్టెను తెరిచినపుడు అందులో తాళపత్ర గ్రంథాలు, పురాతన శిలాచిత్రాలు, మరియు కొన్ని శివ మంత్రాలతో కూడిన గ్రంథాలు కనిపిస్తాయి. వాటితో పాటు ఒక చిన్న రత్నం వంటి పదార్థం కూడా ఉంటుంది. ఈ రత్నం కడియం లో ఉంటే ఇంకా శక్తి వంతం అవుతుంది, ఇ చిన్న రత్నం కడియం యొక్క అసలు శక్తి మూలం అని గ్రహిస్తాడు యువరాజు.

ఇంకా ఆ కడియం కలన్నీ కూడా అదుపు చేయకలదని తెలుసుకుంటాడు . ఈ శక్తి దుర్మార్గుల చేతికి దొరికితే ప్రపంచ నాసనం అవుతుందిధి అని యువరాజు కి అర్దమవుతుంది.

ఈ రహస్యాన్ని రక్షించాలన్న ఉద్దేశ్యంతో యువరాజు కడియాన్ని, తాళపత్రాలను, శివ గ్రంథాలను బంగారు పెట్టెలో పెట్టి దానిని తన వెంట తీసుకొని రాజ్యానికి బయలుదేరుతాడు.

అయితే అతడు మార్గమధ్యంలో ఉండగానే యువరాజుపై ఆకస్మికంగా దాడి జరుగుతుంది.

గట్టిగా పోరాడుతున్న యువరాజు, ఒక పర్వత దారిలో పడిపోతాడు.

దాడి తీవ్రమవుతుంది. ఆ కలవరంలో ఆయన దగ్గర ఉన్న బంగారు పెట్టె (కడియంతో సహా) ఒక పెద్ద వలయాన్ని తాకి బంగారు పెట్టె మంటల మధ్యలో ఒక అడవి లోతైన లోయలోకి జారిపడుతుంది.

యువరాజు ఆ దృష్యని చూస్తూ ఒక్క క్షణం నిశ్చలంగా నిలుచుంటాడు.

ఒక పక్కన పోరాటం, మరో పక్కన ఆ కడియం మళ్లీ కనబడని లోకాల్లోకి జారిపోవడం...


👉 ఇప్పుడు ఏమవుతుంది? కడియం మళ్లీ దొరుకుతుందా? 

వీటన్నింటికీ సమాధానం ఎపిసోడ్ 5లో!

Comments

Popular posts from this blog

Love Beyond Time...

ఒక తండ్రి కన్న కల

The Love Story of Kittu...