ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 7

ఎపిసోడ్ 7: కనిపించిన రహస్యం – కనిపించని ముప్పు


ఓ పక్క కేశవ్ కడియంతో మారిపోయిన కొత్త జీవితం, మరో పక్క ఓ దురుద్దేశంతో వెతుకుతున్న వ్యాపారవేత్త విరాట్. కడియం కోసం వెతుకుతున్న వాడు.

విరాట్:- దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఓ బిజినెస్‌మేన్. వచ్చే ఏడాదిలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాలని చూస్తున్నాడు. 

కానీ అతని గుండె లోతుల్లో ఒక వ్యక్తిగత పోరాటం ఉంది. తన తాతగారు, డా. కృష్ణ మోహన్ రావు, ఒక ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త. తన డైరీలో “కాలాన్ని మించిన శక్తి ఉన్న కడియం, ఆ కడియం ధరించినవాడు కాలాన్ని ముందుగా చూస్తాడు. ఆ శక్తి చేతికి వచ్చినవాడు దేశాన్ని చలించగలడు." అని రాసి ఉంటుంది.

అలాంటి శక్తిని సంపాదించి, ప్రపంచంపై ప్రభావం చూపించాలన్నది విరాట్ అంతరాత్మలో ఉన్న కోరిక. కానీ ఆ కడియం ఎక్కడుందో తెలియదు. ఆ కడియం కోసం వేతకమనీ తన మనుషులతో విరాట్ చెబుతడు.

అదే సమయం లో కేశవ్ స్కూల్‌లో వార్షికోత్సవం జరుగుతుంది.

విరాట్ ఆ స్కూల్‌కు స్పాన్సర్‌గా, ముఖ్య అతిథిగా ఆహ్వానించబడతాడు. 

వేదికపై ప్రసంగాలు జరుగుతున్నాయి. విరాట్ దిగి వచ్చి విద్యార్థులతో మమేకమవుతుంటాడు. ఆ సమయంలో కేశవ్ చేతికి కడియంతో కనిపిస్తాడు.

విరాట్ ఒక్క క్షణం షాక్ అవుతాడు. "ఇది అదే కడియమా? తాత డైరీలో చెప్పినా కడియం లాగే ఉంది."

విరాట్ మనసులోని కోరిక ఒక్క క్షణంలో బలపడుతుంది. ఆ కడియాన్ని ఎలా అయినా తన చేతిలోకి తెచ్చుకోవాలని నిర్ణయిస్తాడు.

అప్పటి నుండి… కేశవ్ వెనక ఏదో కనిపించని నీడ తిరుగుతుంది. విరాట్ తన సహాయకులతో కలిసి:

"కేశవ్ ఇంటి దగ్గర పర్యవేక్షణ పెడతాడు", 

"డ్రోన్ కెమెరాలతో స్కూల్ గేటు పైన మానిటరింగ్", 

"స్నేహితుల ద్వారా సమాచారం సేకరణ",

అంతేకాదు… విరాట్ తన అంతర్జాతీయ లాబ్ సైంటిస్టులతో మాట్లాడి, కడియాన్ని ట్రాక్ చేయడానికి ఇలక్ట్రో మ్యాగ్నటిక్ ఫ్రీక్వెన్సీ ప్యాచింగ్ టెక్నాలజీ వాడటం మొదలుపెడతాడు.

కేశవ్ మార్పు రుక్కుకి కూడా బలంగా కనిపిస్తుంది. రుక్కు కేశవ్‌లోని ఆత్మవిశ్వాసం, అంతర్లీన గంభీరత చూసి ఆకర్షితమవుతుంది. అభి మీద ఉన్న అనుబంధం నెమ్మదిగా పెరుగుతుంది … కేశవ్ వైపు ఆమె హృదయం కదలటం మొదలవుతుంది.

రుక్కు (స్నేహితులతో): "అసలీ కేశవ్… ఇప్పుడు చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఓ స్పెషల్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది."


👉🏻 విరాట్ మొదటి ప్రయత్నం కడియాన్ని దొంగిలించేందుకు చేసిన ఎత్తుగడ కేశవ్ దాని నుంచి ఎలా తప్పించుకున్నాడు?

కడియం రహస్య శక్తి మళ్లీ కొత్త రూపంలో మేల్కొనబోతుందా?

రుక్కు నిజంగా కేశవ్‌ని ప్రేమించుతున్నదా లేక ఇంకా ఏదైనా మాయం జరుగుతోందా? 

ఎపిసోడ్ 8లో...

Comments

Popular posts from this blog

ఒక తండ్రి కన్న కల

A Journey of Love

బెంగళూరు రహస్యం