ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 9

ఎపిసోడ్ 9: చివరి యుద్ధం 

కేశవ్ ఇప్పుడొక ఉపాధ్యాయుడు. ఇప్పుడు తన ముందున్న ముఖ్య లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి:

1) రుక్కు - తన మొదటి ప్రేమ. ఆమెకు తన మనసులోని ప్రేమను చెప్పకుండానే వదిలేశాడు. ఆమె తన కోసం ఎంతగానో బాధపడి ఉంటుంది. ఆమెకి నిజం చెప్పాలి.

2) కడియం - ఇది బలమైన శక్తి ఉన్నదైనా, విరాట్ వంటి వాళ్ల చేతికి దొరకకుండా దాన్ని శాశ్వతంగా దాచేయాలి.

3) తాళపత్రాలను ఉపయోగించి తిరిగి 2025కి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలి.

తలపత్రాలలో అతను గతంలో గమనించిన ఒక మాట ఇప్పుడు అర్థమవుతుంది:

"కాల మార్గం మళ్లీ తెరుచుకునేది శరన్నవరాత్రుల తొమ్మిదవ రాత్రి రాహుకాలంలో మాత్రమే."

అంటే ఇంకో 3 రోజుల్లో అలాంటి సమయానికి అవకాశం ఉంది.

అతను అనువదించిన పాఠాలను కడియంలో ఎంచుకుని, సమయాన్ని 2025 కి సెట్ చేస్తాడు. మంత్రాలను పలుకుతాడు…

ఒకసారి మళ్లీ ప్రకాశ వలయం కేశవ్ తన అసలు కాలమైన 2025కి తిరిగి వస్తాడు.

2025 – ప్రేమ, పరిష్కారాలు, పోరాటం:-

కేశవ్ మళ్లీ 2025 కి చేరాడు. కడియం నీ ఎలాయినా సముద్రం లో వేయాలి అని బైక్ తీసుకొని వెళతాడు.

విరాట్ ఆఖరి ప్రయత్నం:-

విరాట్ తన బృందంతో కలిసి చివరి ప్రయత్నం చేస్తాడు. సముద్రతీరానికి దగ్గరగా కేశవ్‌ను అడ్డుకుంటాడు.

చివారికి విరాట్ మట్లాడుతు "ఆ కడియం నాకు దక్కాలి. అది నా శక్తి. అది నా భవిష్యత్తు."

కేశవ్: "ఇది ఎవరికోసం కాదు". 

కేశవ్ కడియాన్నీ సముద్రంలో వేస్తాడు. ఒక పెద్ద మెరుపు… ఆ కడియం నీటిలోకి వెళ్తూనే ప్రకాశించి మాయమవుతుంది.

విరాట్, ఆ క్షణం ఒళ్లు ముక్కలై పోయినట్లు కూలిపోతాడు. అతడు కూడా సముద్రం లోకి దోకుతాడు. అంతా ముగుస్తుంది.

కేశవ్ స్కూల్ కి తిరిగి ఒస్తాడు:-

స్కూల్ చివరి రోజు. కేశవ్, తన ప్రేమని రుక్కుతో పంచుకుంటాడు. 

ఆమె ఆశ్చర్యపోతుంది… కానీ చిరునవ్వుతో ఇలా అంటుంది:

"నిజంగా నేను నిన్ను ఎప్పుడో కోల్పోతానేమో అనుకున్నా. కానీ ఇప్పుడు నీ మనసు నాపై ఉందని తెలిసి చాలా సంతోషంగా ఉంది."

ఆరోజు సాయంత్రం... కేశవ్ తన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. దానిలో రుక్కు వేసిన చిన్న లేఖ:

"ప్రతి జీవితంలోనూ, ప్రతి క్షణంలోనూ నీకోసం ఎదురు చూస్తున్నాను. – రుక్కు" ❤️

కేశవ్ చిరునవ్వుతో రుక్కున్ని చూస్తాడు.

ముగింపు...

Comments

Popular posts from this blog

ఒక తండ్రి కన్న కల

A Journey of Love

బెంగళూరు రహస్యం