ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 8
ఎపిసోడ్ 8: గడిచిన సమయం – వచ్చిన భవిష్యత్
విరాట్ చక్రం మొదలయ్యింది. తన దగ్గరున్న హైటెక్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా కేశవ్ వేసుకున్న కడియం స్థానాన్ని లాక్ చేస్తాడు. ఒక రాత్రి, స్కూల్‌కి దగ్గరగా, దొంగలతో కూడిన బృందం కేశవ్‌పై దాడి చేస్తుంది.
అయితే అదే సమయంలో కేశవ్, తప్పించేందుకు ప్రయత్నిస్తూ కడియాన్ని గట్టిగా తిప్పుతాడు.
కడియంలో ఉన్న పాత సంస్కృత శ్లోకాల మధ్యలో ఉన్న ఒక చిన్న డయల్ దాన్ని తను తెలియకుండానే తిప్పుతాడు.
ఆ డయల్‌పై “సమయ సీమ” అనే పదాలు సంస్కృతం లో చెక్కబడి ఉంటాయి. కేశవ్ చేతి మీద నుంచి ఓ ప్రకాశవంతమైన వలయం వెళ్తుంది.
ఒక క్షణంలో… గాలి, వెలుగు, శబ్దం అన్నీ మింగేస్తూ… అతను భూమి మీద కనిపించడు.
కళ్ళు తెరిచి చూశాడు, సంవత్సరం 2035 – భవిష్యత్!
గంటల తరబడి స్పష్టత లేకుండా ఉన్న కేశవ్… ఓ పక్కవైపు మెల్లగా లేచినపుడు, సమీపంలో హోవరింగ్ బస్సులు, స్మార్ట్ డ్రోన్లు, హోలో స్క్రీన్స్ కనిపిస్తాయి.
అక్కడ ఉన్న బిల్డింగ్ పై “శ్రీ సత్య ఫ్యూచరిస్టిక్ హై స్కూల్ – బ్యాచ్ 2035” అని రాశి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన కేశవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
తను ఇప్పుడు ఓ టీచర్! తన మెడలో ఐడీ కార్డ్ – Mr. Keshav – Science Faculty. చేతికి ఇంకా అదే కడియం అలానే ఉంది..
కేశవ్ మనసులో:-
"నేను ఎలా వచ్చాను ఈ లోకానికి? నేనింకా 15 ఏళ్ళవాడినే కదా… కానీ నా రూపం ఎందుకు పెద్దవాడిలా ఉంది? నా చేతికి కడియం... కానీ ఇది నన్ను ఎందుకు ఇక్కడికి తెచ్చింది?"
కేశవ్ ఇంటికి బయలుదేరుతాడు, వెల్లే దారిలో ఒక న్యూస్ చూస్తాడు విరాట్ సీఎం కా పోటి చేస్తున్నాడు అని.
కేశవ్ మనసులో ఎన్నో ప్రశ్నలు, విరాట్ కి కడియం దొరికింద అలా జారిగి ఉంటే ప్రపంచ మోతం విరాట్ చెప్పింది చేస్తుంది. అల జరగకుడదు. నేను 2025 కి వెల్లలి.
అతను తన రూం లోపల ఉన్న పెట్టి తీసి చూస్తాడు అందులో తాళపత్రాలు ఇంకా ఉన్నాయి. వాటిని అనువదించేందుకు ప్రయత్నిస్తాడు. పాత సంస్కృతంలో ఉన్నాయి కొన్ని రాసిన తేదీలు:
"1957, మాఘ పౌర్ణమి, రాహుకాల యోగం కాల మార్గ ద్వారం"
అయితే వీటిని డికోడ్ చేయాలంటే… ఒక ప్రత్యేకమైన మంత్రదండకం/తంత్ర వేదం కావాలి. అది ఇప్పటి కాలంలో ఎక్కడా దొరకడం లేదు.
ఇంటర్నెట్‌లో వెతికినా, డిజిటల్ లైబ్రరీస్‌లో చూసినా వాటికి అర్థం చెప్పగల ఒకడు కూడా కనిపించడు.
అతని ఆలోచనలు "నాకిప్పుడు తలపత్రాల్లోని రహస్యాలే మార్గం. మళ్లీ 2025కి తిరిగి వెళ్ళాలి అంటే కాల ద్వారం ఎక్కడ తెరుచుకుంటుందో, ఏ టైంలో తెరుచుకుంటుందో అంతా ఈ కడియం మాత్రమే చెబుతుంది."
👉🏻 కేశవ్ ఈ రహస్యాన్ని ఎలా చేధిస్తాడు? వేగంగా మారుతున్న కాలంలో – తలపత్రాలు డికోడ్ చేయగలిగితే మాత్రమే తను తిరిగి 2025కి వెళ్లగలడా? లేదా...?
ఎపిసోడ్ 9లో...
Comments