ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 5
ఎపిసోడ్ 5: మారో కొత్త అధ్యాయం
సంవత్సరం 2025 – వర్తమాన కాలం.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక ప్రైవేట్ హైస్కూల్. అక్కడే చదువుతున్నాడు కేశవ్, ఓ సాధారణ కుర్రాడు. తన పాఠశాలలో అతను ఎక్కువగా తనదైన లోకంలో ఉండే వాడు. బయట చూస్తే సైలెంట్, కానీ మనసులో ఎన్నో కలలు.
రుక్కు, తన తరగతిలో చదివే అమ్మాయి. చక్కని చిరునవ్వు, తెలివి, ఓపిక కలిగిన అమ్మాయి. కేశవ్‌కు ఆమె అంటే ఎంతో ఇష్టం. అయితే అది ఒక్కసారి కూడా ఆమెకి చెప్పలేదు. ఆమె అభి అనే క్లాస్‌మేట్‌తో చాలా దగ్గరగా ఉండటం చూస్తూ మౌనంగా ఉండిపోయేవాడు.
పాఠశాల యాజమాన్యం డే పిక్‌నిక్ కార్యక్రమం ప్రకటిస్తుంది. ఓ పాత కోటల దగ్గర ఉన్న అడవి ప్రాంతంకు తీసుకెళ్తామని చెబుతారు.
విద్యార్థులు అంతా సంబరపడిపోతారు. కేశవ్ కూడా అంతకంతకూ ఉత్సాహంతో ఉంటాడు.
పిక్‌నిక్ కి వెల్తున్న రోజు:
బస్సు అడవుల మధ్య ప్రయాణం చేస్తూ ఓ పాతగుట్ట ప్రాంతం దగ్గర ఆగుతుంది. అక్కడ చిన్నగా ఓ అరణ్యం, చుట్టూ పచ్చటి చెట్లు, కొండలు.
పిక్‌నిక్ స్పాట్‌కి చేరుకున్న స్టూడెంట్స్ అడవిలో అల్లరి మీద అల్లరి చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ హ్యాపీ గా పిక్నిక్ ని ఎంజాయ్ చేస్తు ఉంటారు.
కేశవ్, రుక్కుతో మాట్లాడటానికి అవకాశం కోసం చుస్తు ఉంటాడు.
అప్పుడూ అక్కడ పెద్ద వర్షం. అందరు స్టూడెంట్స్ బాస్ దగ్గరికి రావాలి అని టీచర్స్ చెప్తు ఉంటారు.
కేశవ్ ఒక కొండ పైనా ఉంటాడు. తిరిగీ ఓస్తుండగ కలుజారి లోయలోకి పడిపోతాడు.
కేశవ్ కళ్ళు తెరిచి చూసే సరికి ఎక్కడ ఉంటాడో తెలియదు. అలా ముందుకి వెల్తు ఉంటాడు, మట్టిలోంచి చిన్నగా మెరుస్తూ ఒక పెద్ద రత్నంతో కూడిన బంగారు పెట్టె కనిపిస్తున్నది.
👉 కేశవ్ ఏం కనుగొంటాడు? ఆ బంగారు పెట్టె ఏమిటి? అదే కడియమా? అతని జీవితంలో ఏ మార్పు వస్తుంది?
వీటన్నింటికీ సమాధానం ఎపిసోడ్ 6లో!.
Comments